వంటింట్లో భోజనం చేస్తున్న ప్రకాశానికి నవ్వుతో పొలమారింది.
"భోకనానికిరా నాన్నా, ఒంటిగంటయింది."
"రెండు నిముషాల్లో వచ్చేస్తాను స్నానంచేసి, వడ్డించెయ్."
సిత పెరట్లోకి వెళ్ళింది. ప్రకాశం భోజనం ముగించి చెయ్యి కడుక్కొని లేచేడు.
ముందు గదిలో సుబ్బులు కంఠం వినిపిస్తోంది. "ఎక్కడ కెళ్ళేవ్ బాబాయ్" అని అడుగుతోంది. పరందామయ్య చెబుతున్నాడు.
ప్రకాశం దండెంమీద నుంచి ఫేంట్ తిసి వేసుకొన్నాడు. తల దువ్వుకొంటూ వుండగా ముందు గదిలో మాటలు వినిపించినయ్.
ఈ చీరే ఎంతక్కోన్నాడే మీ నాన్నా?" పరందామయ్య అడుగు తున్నాడు. సుబ్బులు చెప్పింది.
"మొన్న 'కొరడారాణి' ఎలా వుంది?"_ఇంకో ప్రశ్న.
ప్రకాశానికి ఇదంతా మామూలే. అందులో మేటర్ ఏవి వుండదు. అమాయకుల్తేన ఆడపిల్లలు ఈ ముసలాయన తమ మీద చూపించేదంతా అభిమానం అనుకొంటారు.
ప్రకాశం ముందు గదిలోకి వచ్చాడు.
అతనిని ఆ సమయంలో ఊహించనందువల్ల ఆయన క్షణం బిత్తరపోయేడు-సర్దుకొని -ఎరా ,లంచ్ కోచ్చేవా ,లేకపోతే కంగారుపది నువ్వూ సెలవు పెట్టావా?" అడిగాడు.
సుబ్బులు లోపలికి వెళ్ళిపోయింది.
ప్రకాశం మాట్లాడకుండా బ్తేటికి నడిచాడు. ఆడవాళ్ళంత అమాయకంగా యెందుకు బ్రతుకుతారో అతనికి అర్ధంకాలేదు. మొగవాడి అఫేన్సుని గుర్తించనట్టు నటించడంలో వాళ్ళకి ఆనందం ఉందేమో, కాని ఈ అత్మవంచనతో చివరికి నష్టపోయేది ఎవరు? పురుషుడు కాదు- అనుకొంటాం కాని స్త్రి కూడా కాదు. స్త్రి తన జీవితాన్ని చాలాసార్లు ప్రెష్ గా మొదలు పెడుతుంది? చప్టర్లు....ఒకో ఆరలో ఒకో చాఫ్టరు.
తనని చూడగానే అయన మొహంలో కనబడిన గిల్టీకాన్షస్ నీ గమనించలేనంత చిన్న వయసు కాదు ప్రకాశానిది. చిత్రమేమిటంటే ప్రకాశానికి తెలుసునని ఆయనకీ తెలుసు, తెలియనట్టు నటిస్తాడు. అసలు పట్టించుకోడు.
....పరంధామయ్య స్నానానికి వెళ్ళిన తరువాత రహస్యంగా సుబ్బారావు విషయం సుబ్బుల్ని అడిగింది సిత.
"అది చెప్పటానికే వచ్చాను...." అంటూ అటూ ఇటూ చూసింది ఆమె.
"అబ్బా.తొందరగా చెప్పమారి" తొందర చేసింది.
ఆమె చెప్పటం ప్రారంభించింది_____
17
సాయంత్రం అంతా సుబ్బులికి ద్రిల్లింగ్ గానే గడిచింది. ఆ చిన్న ఉత్తరాన్ని దాదాపు యభయ్ సార్లు చదివింది. మేటర్ అంతా ఆమెకి ఎప్పుడో కంఠత వచ్చేసింది.
"మీ యిద్దరి జంటా చూడముచ్చటగా వుంటుందే_____" అన్న సిత మాటలు పదేపదే జ్ఞాపకం తెచ్చుకొని సంబరపడింది. అతని చదువు ఏప్రిల్ లో పూర్తవుతుంది. ఆ తరువాత యింకో నెలకి___ అంటే ఇంకో మూడు నెలల్లో తమ పెళ్ళి .... ఒక్క సారిగా ఆమెకి సిగ్గు ముంచుకొచ్చింది.
ఈ అయిదు నెలల్లో ____అయిదు నెలల అనుభవం? పెళ్ళి కాక ముందే ప్రేమ....ఏదో నవల్లోలా ....అందమ్తెన సాయంత్రాలు- పబ్లిక్ గార్డెన్స్ లో - ఆ తరువాత పెళ్ళి _____కాని కట్నంలేకుండా__ తన కోసం త్యాగం చేసిన సుబ్బారావు తన హిరో ....తన భుజాన్ని గుచ్చిపట్టుకొని, దగ్గరగా లాక్కొని, తన కళ్ళలోకి చూస్తూ.....
ఆ ప్తెన ఊహించలేకపోయింది.
కిటికీలోంచి చూస్తే అతనిగది కిటికీ తెరిచేవుంది. అతను లేడు.
"....ఈ లెటర్ కి జవాబు వ్రాయకపోతే నాక్కోపం వస్తుంది-" అన్న అతని లెటర్ లోని వాక్యం జ్ఞాపకంవచ్చి తనలో తను నవ్వు కోంది. లోపలికి పరుగెత్తుకువెళ్ళి టేబుల్ ముందు కూర్చొని నోట్స్ లోంచి ఒక కాగితం చింపింది-ఆమె గుండె వేగంగా కొట్టుకొంటుంది. నాన్నా ఇంటిలో లేడు. గబగబ రెండు వాక్యాలు రాసింది.
__"నాకూ మీతో చాలా మాట్లాడాలని వుంది, కాని చాలా భయంగా వుంది. క్షమించండి. మీ __"అని సంతకం పెట్టకుండా వదిలేసింది. ఆ చిన్న కాగితాన్ని యింకోసారి చదువుకొని జాకెట్ లో దోపుకొని బయటకు వచ్చింది.
అంతలో వాళ్ళమ్మ యెదురుగావచ్చి "ఎక్కడికి వెళ్తున్నావే" అంది. ఉలికిపాతుని సర్డుకోంటూ "సితా వాళ్ళింటికి" అని మరి అక్కడో క్షణం కూడా వుండకుండా బయటకు పరుగెత్తింది.
ఉత్తరం జాగ్రత్తగా తిసి, కిటికీలోంచి విసరపోయి చప్పన ఆగి పోయింది. లోపల ఇంకేవరిదో కంఠం వినిపిస్తూంది. కొద్దిగా వంగి లోపలికి చూసింది. ఇంకెవరో స్నేహితుడితో మాట్లాడుతున్నాడు సుబ్బారావు. తన ప్రయత్నం విరమించుకొని వెనక్కి తిరగబోతూ హఠాత్తుగా ఆగింది తన పేరు వినిపిస్తుంది.
"ఇవన్న ప్రోగ్రెస్ వుందా గురూ?"
"ఇవ్వాళ తెలుస్తుంది__" అతని కంఠం.
"....తొందరగా లాగించాయ్ గురూ"
"కష్టంరా ___ ఇంతకుముందేవి అనుభవం లేనట్టుంది."
సుబ్బులు మరి వినలేదు. ఆ పదహారేళ్ళ అమ్మాయి మొహంలో రక్తం పూర్తిగా యింకిపోయి తెల్లగా పాలిపోయింది. హఠాత్తుగా కళ్ళు తిరగటం ప్రారంభించేయి. తూలి పడబోయి గోడని ఆసరాగా చేసుకుని నిలబడింది.