Home » Yandamuri veerendranath » అగ్నిప్రవేశం

                                            

                         నాలుగు
   
    తన తల్లి రెండో భర్త తాలూకు రెండో భార్య ఇంటినుంచి అవమానంతో తిరిగి వచ్చాక, సాహితి తన గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకుంది.
   
    ఘోరమైన అవమానపు తుఫానులో చిక్కుకుందామె మనసు. ఎంత మర్చిపోదామన్నా రాజ్యలక్ష్మి మాటలు ఆమె చెవుల్లో గింగుర్లెత్తున్నాయి. మమ్మీకి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడుతుంది? ఆమె పరమహంసని అతి గాఢంగా ప్రేమిస్తుందనడంలో సందేహంలేదు. కానీ ఇలాంటి అవమానాన్ని తట్టుకోగలదా? "సాహితి, తలుపు తియ్యమ్మా! ఏం జరిగిందో చెప్పు" నిర్మల బయటనుంచే బ్రతిమాలుతుంది.
   
    "ఏం లేదమ్మా! అంకుల్ సాయంత్రం వస్తానన్నాడు. అప్పుడు మాట్లాడుకుందాం లే" అంది.
   
    సాయంత్రమే కాదు.....మధ్యాహ్నమే వచ్చాడు పరమహంస. సాహితి అతడిని చూసి కూడా పలకరించలేదు.
   
    నిర్మల మాత్రం "మీరు రారేమో, నా మీద బాగా కోపం వచ్చిందేమో అనుకున్నాను" అంది కన్నీళ్ళతో.
   
    "నాకు కోపమా?" నవ్వాడతను."దేవుడికి భక్తుల మీద కోపం రాదు. అప్పుడప్పుడు ఓ గుణపాఠం చెప్పాలని చిన్న చిన్న శిక్షలు వేస్తుంటాడంతే! నేను వచ్చేవరకూ నువ్వు భోజనం చెయ్యవని నాకు తెలుసు. ఏదీ అమ్మాయిని కూడా పిలువు. అందరం కలిసి భోజనం చేద్దాం!"
   
    నిర్మల సంతోషంతో వెళ్ళి సాహితిని పిలిచింది.
   
    "నాకు వద్దు మమ్మీ! ఆకలిగా లేదు. మీరు తినెయ్యండి" అంది సాహితి.
   
    "అమ్మాయికి నా మీద కోపం తగ్గినట్లు లేదు. పిచ్చితల్లి.... నువ్వు భోంచెయ్యకపోతే నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. నేను తినకపోతే మీ మమ్మీ ఎన్నాళ్లయినా పస్తులుంటుంది. నా గురించి మీ అమ్మను బాధపెట్టడం న్యాయమేనా సాహితీ?"
   
    నిర్మల మొండితనం సాహితికి బాగా తెలుసు. ఆ విషయం తెలిసి అతడలా బెదిరిస్తున్నాడని అర్ధమైంది.
   
    నిర్మలకు మాత్రం 'నువ్వు భోంచెయ్యకపోతే నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను' అన్న అతడి మాటలే చెవిలో గింగుర్లు తిరుగుతున్నాయి. "చూశావా సాహితీ! అంకుల్ బాధపడుతున్నారు. నీ కోసం వస్తుంటారట. ఎంత ప్రేమో చూడు..... పద!"
   
    ఆమెకి లేవక తప్పలేదు. ఆమె భోజనం ముగించి లేవబోతుంటే "కాస్సేపలా కూర్చో సాహితీ మాట్లాడాలి" అన్నాడు పరమహంస. ఆమె మళ్ళీ కూర్చుంది.
   
    "ఈ మధ్య నీకు కోపం ఎక్కువవుతోంది. ఏం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో నీకే తెలియడం లేదు. అనవసర విషయాల గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నావు కదూ?"
   
    సాహితి మాట్లాడలేదు.
   
    "ఏం చేసింది?" నిర్మల భయంగా అడిగింది.
   
    "అనవసరంగా లక్ష్మి మీద కోపం తెచ్చుకొని వచ్చింది. లక్ష్మి ఉదయంనుంచీ ఒకటే ఏడుపు. ఏమీ తినకుండా కూర్చుని ఏడుస్తోంది."
   
    "నిజమా.....నేను ఎంత అడిగినా చెప్పలేదు. ఎందుకంత కోపం తెచ్చుకొన్నావ్?" నిర్మల తినడం మానేసి అడిగింది.
   
    "నేనేమీ అనలేదు. అన్నీ ఆవిడే అంది. అనరాని మాటలు అంటుంటే సహించలేక వచ్చేశాను."
   
    "లక్ష్మి ఏమీ అనలేదుట.... కూర్చోపెట్టి కాస్సేపు చదువు గురించి అడుగుదామనుకొందట. 'అమ్మాయి మొదటిసారి వచ్చింది పొంగిపోయాను. ఇంట్లో కొత్త చీరయినా లేదు. ఒట్టి చేతులతో ఎలా పంపేది?' అని ఆవిడ బాధపడుతుంటే సాహితి కోపం తెచ్చుకొని చెప్పకుండా వచ్చేసింది. మనసుకి ఎంత కష్టం కలిగుంటుంది?"
   
    "అ.....బ....ద్దం" అరవబోయింది ఆమె. నోట మాట రాలేదు.
   
    "సాహితీ! నువ్వు.....నువ్వు యిలా చేశావా?" నిర్మల ఏడుస్తూ పళ్ళెంలో చెయ్యి కడిగేసుకొంది.
   
    "చూశావా మీ మమ్మీని ఎంత బాధపెడుతున్నావో! చాలా తప్పు చేస్తున్నావు సాహితీ" అన్నాడు పరమహంస.
   
    "కాదు అంకుల్! ఆ ఆంటీ మమ్మీ గురించి అసహ్యంగా మాట్లాడింది నిజం" ఆమెకి దుఃఖం ముంచుకొస్తోంది.
   
    "లేదమ్మా! నువ్వు అపార్ధం చేసుకునుంటావు. వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పింది. నీకు ఫోన్ చేస్తానంటే నేనే వద్దన్నాను. నువ్వామెకు క్షమాపణ చెప్పుకోవాలి."
   
    "నేనేం తప్పు చేశానని?"
   
    "చేసింది తప్పేనమ్మా! అనవసరంగా యింతమందిని బాధ పెట్టటం తగదు. ఇప్పుడు నాకూడా రా. నువ్వు మళ్ళీ వస్తే తప్ప లక్ష్మి భోజనం చెయ్యదు."
   
    ఈ భోజనాలు చేయకపోవడం అన్న సర్కిల్ ఎప్పుడు పూర్తవుతుందో ఆమెకి తెలియలేదు. నిర్మల అంది.... "తప్పకుండా వస్తుంది. అదా పని చేస్తే తప్ప నా మనసు శాంతించదు. ప్లీజ్ సాహితీ వెళ్ళు. నా కోసం....
   
    తల వంచుకొని ఆమె పరమహంసతోపాటు వెళ్ళి లక్ష్మికి క్షమాపణ చెప్పుకొంది. తనని చూడగానే ఆవిడ కనీళ్ళతో దగ్గరకు వచ్చి కౌగిలించుకొంటుంటే అనుమానం వచ్చింది.
   
    నిజంగానే తను సైకిక్ అయిపోయిందా? అనవసరంగా అపోహ పడుతోందా? ఆ రాత్రి ఆలోచనలతో నిద్రపట్టక ఆమె స్లీపింగ్ పిల్స్ వేసుకుంది.
   
                              *    *    *
   
    ఆ మరుసటి రోజు ఆమె ఆలస్యంగా నిద్ర లేచింది. మనసంతా ఫ్రెష్ గా, హాయిగా వున్నట్టు అనిపించింది. బాగా నిద్రపోవటం వల్ల వచ్చిన ఫ్రెష్ నెస్ అది.
   
    ఆ రోజు కాలేజీలో స్నేహితురాలు సాహితిని అదేమాట అడిగింది. "కొంచెం నీరసంగా కనిపిస్తున్నా, ఫ్రెష్ గా వున్నావు. ఏమిటి సంగతి?" అని కన్నుకొట్టి నవ్వి "అదేనా విషయం?" అంది.
   
    "విషయం ఏమిటి?" ఆశ్చర్యంగా అడిగింది సాహితి.
   
    "తెలియనట్టు మొహం పెట్టకు....."
   
    "నిజంగా తెలీదు. చెప్పు!"
   
    "గంజా?"
   
    "గంజా ఏమిటి?"
   
    "గంజా తాగావు కదూ?"
   
    "అదేమిటో నాకు తెలీదు."
   
    అప్పుడా అమ్మాయి చెప్పింది. కాలేజీకి వందగజాల దూరంలో, అతి సాధారణంగా కనపడే చిన్న కిళ్ళీ కొట్టులో రహస్యంగా గంజాయి దొరుకుతుంది. సిగరెట్టులా చేసి, దాన్ని పీలిస్తే మనసు ఎక్కడెక్కడికో ఎగిరిపోతుంది. కాలేజీలో కొంతమందికి ఆ అలవాటు వుంది. మరికొంత మంది దానివైపు ఆకర్షితులవుతున్నారు.
   
    ఆమెకి ఆశ్చర్యంతోపాటు భయం కలిగింది. డ్రగ్స్ గురించి చదివింది కానీ..... అదేదో మాఫియా అనీ, చీకటి బజార్లో దొరుకుతుందనీ, కేవలం రౌడీలూ, స్మగ్లర్లూ మాత్రమే దానిని వాడతారనీ ఇప్పటివరకూ అనుకుంటూ వచ్చింది తన బెంచీలో కూర్చునే పక్క స్టూడెంటూ, తన క్లాస్ మేట్స్ కూడా సిగరెట్టు (?) కాలుస్తారంటే నమ్మశక్యం కాలేదు.
   
    "ఏం తాగుతావా?"
   
    "అమ్మో వద్దు."
   
    "మొదట్లో భయంగా వుంటుంది. ఒక్కసారి అలవాటయితే...."
   
    "ప్లీజ్! నన్ను వదిలెయ్. నాకిలాటివి ఇష్టం వుండవు" అని సాహితి అక్కన్నుంచి వచ్చేసింది. ఆమె యింటికి వచ్చేసరికి తల్లి మావయ్యతో మాట్లాడుతోంది. ఆమె ఆ సంభాషణ గురించి పట్టించుకోలేదు గానీ, 'కుర్రవాడు మంచివాడు' అని వినిపించేసరికి ఆ మాటలు తన గురించే అని తెలిసిపోయింది.
   
    మిగతా అమ్మాయిల్లాగా, "ఈ వయసులో నాకు పెళ్ళేమిటి? ఛా..... నేను అసలు పెళ్ళే చేసుకోను. అమ్మను వొదిలి వుండలేను" వగైరా అనుకోలేదు. ఎప్పుడైతే మెడిసిన్ చదవలేదో, అప్పుడే ఆ అమ్మాయికి విరక్తిలాటిది వచ్చేసింది. పరమహంస మెడిసిన్ చదవొద్దని చెప్పినప్పుడు అతను చెప్పిన వాదన బాగానే వుందని ముందు అనిపించినా, బియస్సీలో చేరాక, తన ఒకప్పటి క్లాస్ మేట్స్, కాలేజీలో తనకన్నా చదువులో వెనకబడి వుండే వాళ్ళు కూడా మెడిసిన్ చదువుతూ వుండేసరికి, తను చేసిన తప్పు గుర్తొచ్చేది. పరమహంస మీద కోపం రాదు. తనమీద తనకే కోపం, ఎందుకు ఎప్పుడూ తనొక నిర్ణయం తీసుకోవటం, తరువాత అది బావోలేదని బాధపడటం జరుగుతోంది? ఎప్పుడూ అంతే....ఇది తన తప్పో, తన చుట్టూ వున్న వాతావరణం తప్పో ఆమెకి అర్ధంకాలేదు. "కట్నం కావలసినంత ఇద్దాం. కుర్రాడు మంచివాడయితే చాలు" అంటోంది అమ్మ.
   
    సాహితికి 'కట్నం' మీద స్పష్టమైన ఆలోచన లేదు. ఆ అమ్మాయికున్న ఆస్థికి అసలు అది సమస్యే కాదు. ఉన్నది ఒక్కతే కూతురు కాబట్టి ఆ ప్రసక్తే రాదు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra