Home » Yandamuri veerendranath » రక్త సింధూరం


    నేను కదల్లేదు.
    అలాగే కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాను.
    మైకులోంచి భగవద్గీత దూరంగా వస్తూనే వుంది.
    అతడి ఒక్కొక్కమాట వచ్చి శూలంగా గుండెల్లో గుచ్చుకుంది. లక్షలకొద్దీ అద్దాలు నా ముందు పెట్టి, నేనెంత మూర్ఖుణ్ణో చూపిస్తున్నట్టు అనిపించింది. నేను సాధించినది ఏముంది? ఏమీ లేదు. నేను కొత్తగా కనుక్కున్నది కూడా ఏమీలేదు.
    చెప్పు గోపీనాథ్!....చెప్పు! అత్యంత ప్రతిభావంతంగా కర్తవ్య నిర్వహణ నెరవేర్చిన ప్రెసిడెంట్ అకాడమీ అవార్డ్ విన్నర్ మిస్టర్ గోపీనాథ్... చెప్పు!! ఖైదీల గుండెల్లో సింహస్వప్నమైన జైలర్ సాబ్, చెప్పు. ఒక గర్భిణీ స్త్రీ వచ్చి తన కడుపుమీద చేయి వేయించుకుని ఆశీర్వదించమంటుంది. ఎందుకు? ఒక కొత్త పెళ్ళికూతురు తనలాటి మరికొందరి కడుపు పంట ఇంకొకరి సొత్తు కాకూడదని ఈ పెద్దన్న కోసం ప్రాణత్యాగం చేస్తుంది. దేనికి? 
    దూరంనుంచి భగవద్గీత ఇంకా వినిపిస్తూనే వుంది. చిన్నప్పుడు అమ్మ చదివి వినిపించిన భగవద్గీత. అతడు నాకా క్షణం అలాగే కనపడ్డాడు.
    ఎక్కడ చూసినా అసంఖ్య వదనాలు. అనంత నయనాలు. తళతళలాడే సర్వ ప్రహరణాయుధాలు. ఎటునుంచి చూసినా ఆ రూపం మనల్నే చూసినట్టు తోస్తుంది. ఒకేసారి వెయ్యి సూర్యులు ప్రకాశించినట్టు ప్రసరించే ప్రచండ కాంతి. సామగానంలోని వేదనాదంలో చెవుల కింపయిన బృహత్ సౌమ్యాన్ని నేను. వేద మంత్రాల్లో వేద మాత అయిన గాయత్రీ మంత్రాన్ని నేను. మాసాలలో మార్గశిర మాసాన్ని నేను. మోసం చేసే వాటిల్లో జూదాన్ని నేను. అప్పుడు అర్జునుడు అంటాడట - "దేవ దేవా! దేవాలయంలాటి నీ దేహ గేహంలో నాకు సమస్తం కనబడుతూ ఉన్నది. సర్పాలూ, పర్వతాలు, ఆయుధాలు ఒకటేమిటి- శాంతి కూడా తీక్షణమవుతున్నది" అని.
    అతడి ముందు నేను నిలబడలేకపోయాను.
    తల వంచుకుని వెనుదిరిగాను.
    "ఒక్కమాట ఆఫీసర్..."
    ఆగాను.
    అతడు తన జీవితపు చివరి ప్రశ్న అడిగాడు.
    "భీమరాజుని చంపినప్పటి నుంచీ నాలో ఉత్పన్నమైన అనుమానం నువ్వు తిరిగివచ్చి చెప్పిన సమాధానంతో సమసిపోయింది. నీలో ఇప్పుడు నువ్వు చేసిన పనిపట్ల పెరిగిన నమ్మకం, నేను మరణించే లోపులో మరే విధంగానైనా తప్పని అనిపిస్తే, ఈ సమస్యకి పరిష్కారం గొడ్డలి కాక మరో మార్గం వుందని అనిపిస్తే ఉరికంబం మీద ఎక్కబోయే ముందైనా నాకు చెప్పు. ఆ సమయంలోనైనా నేను నా అభిప్రాయం మార్చుకోవటానికి సిద్ధమే...."
    నా ఆలోచన్లలో నేనుండి- అస్పష్టంగా తలూపాను.
    సమాధానం అంత సులభంగా దొరకదని నాకు తెలుసు.
                       12
    నేను ఇంటికి చేరుకునే సమయానికి బాగా చీకటిపడింది.
    ఘనాపురం నుంచి సరాసరి జైలుకి వచ్చెయ్యటంతో ఇంటికి వెళ్ళే వీలు కలుగలేదు. బహుశా నేను సాధించిన విజయం తాలూకు వివరాలు గండ్రగొడ్డలికి ముందు చెప్పాలన్న దుగ్ధతో కావొచ్చు! అక్కడ అమ్మ నా కోసం ఎంత కంగారుపడుతూ వుందో.
    మెట్లెక్కి లోపలికి వెళ్ళాను.
    కరెంట్ లేదనుకుంటాను. అంతా చీకటిగా వుంది. అమ్మ హరికెన్ లాంతరు తుడుస్తూంది. అలికిడికి "ఎవరిదీ" అని అడిగింది.
    "నేనే" అని సమాధానం ఇచ్చాను నా గదివైపు వెళ్తూ.
    ఈలోపులో ఆమె లాంతరు వెలిగించింది.
    "చెప్పా పెట్టకుండా ఇన్నాళ్ళూ ఎక్కడికి వెళ్ళావురా" అని ప్రేమగా చివాట్లు పెడుతుందనుకున్నది కాస్తా అలా మౌనంగా వుండేసరికి ఆమెవైపు తిరిగాను.
    లాంతరు దీపపు మసక వెలుతుర్లో ఆమెని చూసి నిర్విణ్ణున్ని అయ్యాను. ఒకేసారి పది సంవత్సరాల వయసు పైబడ్డట్టు కనిపించింది. విషాదం ఛాయలు వృద్దాప్యం మొహంమీద చిరునవ్వుని మసకబార్చాయి. చప్పున దగ్గిరకెళ్ళి మోకాళ్ళ మీద పక్కనే కూర్చుంటూ, "అలా వున్నావేమమ్మా" అని కంగారుగా అడిగాను.
    "ఏం లేదురా"
    "కాదు, ఏదో వుంది."
    "ఏం లేదన్నానా-" అంది. వాతావరణాన్ని తేలిక చేయటానికి ప్రయత్నిస్తూ అన్నాను-
    "అమ్మా! ఇంతకుముందే ఒకసారి చెప్పాను. పోలీసు ఆఫీసర్లకి అవతలి వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవటం అంత కష్టం కాదని.... నువ్వెందుకో బాధపడుతున్నావు. చెప్పనా అదేమిటో..."
    "పనికి రాజీనామా ఇచ్చాన్రా...." ఆమె తల వంచుకుని నెమ్మదిగా అంది.
    ఆమె చెప్పింది వెంటనే అర్ధంకాలేదు. అయ్యాక అపరిమితమైన సంతోషం వేసింది. ఎన్నాళ్ళనుంచో నేను పోరుతూంటే ఇప్పటికి సాధ్యపడింది- ఇది.
    అయినా ఇంత అకస్మాత్తుగా ఎందుకీ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది? అన్నది అర్ధంకాలేదు. అదే అడిగాను. ముందు చెప్పలేదు. రెట్టించగా చెప్పింది-
    "కాలి నడకనా, బళ్ళు కట్టించుకునీ మరీ వస్తున్నార్రా గండ్రగొడ్డలిని చూడటానికి. అటువంటి మనిషిని ఉరి తీసేచోట నేను పని చెయ్యలేకపోయాను."
    ఈ వార్త అంతగా షాక్ ఇవ్వలేదు నాకు.
    అమ్మని చూస్తే జాలేసింది. ఇంత సున్నిత మనస్కులు జైల్లో పని చెయ్యటానికి పనికిరారు. ఈ పని ఎప్పుడో చేయవలసింది.
    "సర్లే అమ్మా. ఇప్పటికైనా చేశావు. అంతే చాలు..." అంటూ లేచాను. అమ్మ ఎందుకు బాధ పడుతూందో అర్ధమైంది. ఎవరికోసం ఇంతమంది తీర్ధ ప్రజల్లా వస్తున్నారో- అటువంటి వాడి ప్రాణాలు పోతున్నాయంటే ఎవరికైనా- ముఖ్యంగా ఆడవాళ్ళ మనసు ఎంత క్షోభిస్తూందో నేను అర్ధం చేసుకోగలను.
    నేను లేస్తూ ఉంటే అమ్మ అంది- "జవాను ఏదో కవరు తెచ్చి పెట్టాడ్రా. చూసుకో-"
    గదిలోకి వెళ్ళి బల్లమీద వున్న కవరు అందుకొని, లోపలున్న కాగితం చింపి చదివాను.
    అప్రయత్నంగా చేతులు వణికాయి. ఒక సుడిగాలి నిలువునా వూపేసిన భావం.... ఈ సమయంలో వస్తుందని తెలుసుగానీ, ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు. మళ్ళీ జైలుకు వెళ్ళాలి.
    కవరు జేబులో పెట్టుకుని బయటకు నడవబోతూవుంటే "ఎక్కడికిరా మళ్ళీ" అంది. ఆమె కంఠం నూతిలోంచి వచ్చినట్టు వుంది.
    "ఈ కవరు ఎప్పుడొచ్చిందమ్మా."
    "నిన్న ప్రొద్దున్న...నువ్వు లేవని బల్ల మీద పెట్టాను. ఇంతకి ఏమిటది?"
    "గండ్రగొడ్డలిని ఉరి తీసే సమయాన్ని రేప్రొద్దున్న ఏడింటికి ఫిక్సు చేస్తూ ఆర్డరమ్మా"
    చిన్న చప్పుడుతో అమ్మ ముందుకు తూలిపోయింది. చటుక్కున ముందుకు వెళ్ళి ఆమెని పట్టుకున్నాను. అప్పటికే ఆమె హిస్టీరియా వచ్చినట్టు- అప్పటివరకూ బిగపట్టిన దుఃఖం ఉబికి ఉబికి వచ్చేస్తూంటే తమాయించుకోలేక పోతూంది.
    "అమ్మా - అమ్మా" అన్నాను కంగారుగా.
    ఆమె మాట్లాడలేదు.
    "ఏమైందమ్మా. ఎందుకిలా అయిపోయావు? .... ఏమైంది?"
    ఆమెనుంచి జవాబు లేదు. ఇంకా రోదిస్తూనే వుంది.
    "చెప్పమ్మా!"
    ఆమె ఒక్కసారిగా బావురుమని "ఏం చెప్పమంటావురా? ఏం చెప్పను?" అని అక్కణ్ణుంచి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. చిన్న అనుమానం నాలో ప్రవేశించింది.
    "నాకంతా తెలుసమ్మా" అన్నాను.
    "తెలుసా..."
    "ఆఁ. అంతా తెలిసిపోయింది. గండ్రగొడ్డలిద్వారా-"
    "చెప్పేశారా! నన్ను చెప్పొద్దని వాగ్దానం తీసుకుని అంతా తనే చెప్పేశారా?"
    పత్తి చివర సరసరా పాక్కుంటూ వస్తూన్న మంటలా రహస్యం శోధింప బడుతూంది.
    "చేప్పారమ్మా" అన్నాను.
    "అయ్యో!మరింకా ఎందుకురా అడుగుతావు? అయినా కన్న తండ్రిని ఉరితీస్తూ కూడా ఇంత నిబ్బరంగా ఎలా ఉండగల్గుతున్నావురా?"
    అంతే! భయంకరమైన ఊహ నిజమైంది!!!
    ఒక విస్పోటనం గుండెల్ని వెయ్యి వ్రక్కలు చేసింది.
    ప్రశాంతమైన సరస్సును మదపు టేనుగు పిచ్చిగా కలచివేసినట్టు... వృక్షాలు వ్రేళ్ళతోసహా ఫెళ ఫళా విరిగి గాలిలోకి ఎగిరినట్టు... కదిలిపోయాను.
    "అ... మ్మా.... అమ్మా"
    ఆక్రోశం ఆకాశాన్ని తాకింది. ఆవేదన పాతాళానికి వ్యాపించింది. మనసు త్రిశంకువులా వూగిపోయింది. నేను వేసిన ట్రిక్ నన్ను పరిహసిస్తూంది.
    వర్తమానం ఆనందాన్నీ, భవిష్యత్తు దుఃఖాన్నే కలుగజేస్తూంది.
    "అమ్మా. ఈ విషయం నాకప్పుడే ఎందుకు చెప్పలేదమ్మా? తనని నువ్వు కలుసుకున్న రోజే నాకెందుకు చెప్పలేదు? నీలో నువ్వే యెందుకు దాచుకున్నావు?"
    దుఃఖం నుండి బయటకొచ్చి మాట్లాడటానికి ఆమెకి చాలా కష్టమైంది.
    "వద్దని నాతో ఒట్టు వేయించుకున్నార్రా" అంది.
    "ఎందుకు? ఎందుకు ??"
    "అనవసరంగా వాడి మనసు బాధపెట్టటం తప్ప చెప్పి లాభం ఏమిటి అన్నారు. పాతిక సంవత్సరాలుగా లేని తండ్రి గురించి ఈ రోజు చెప్పి వాడిని నొప్పించటం దేనికన్నారు. అందులోనూ ఉరి తీసేది నువ్వేనని తెలిసి నా దగ్గిర ఈ మాట తీసుకున్నారు."
    స్తబ్దుడనయ్యాను. హిమాలయాలకన్నా ఎత్తుగా ఎదిగిపోయిన ఆ వ్యక్తిత్వాల ముందు ఒక విపీలికనయ్యాను. ఆ రోజు ఘనాపురం వెళ్ళే తొందర్లో అమ్మ మొహాన్ని సరీగ్గా గమనించలేదు. పెద్ద పోలీసాఫీసర్లాగా రహస్యంగా పట్టుకోబోయాను. రెండుసార్లూ విజయం సాధించాననుకున్నాను.
    ఈ విజయం నన్నింత బాధ పెడుతుందనుకోలేదు.

                                              *    *    *
    "నాన్నా..."

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra