Home » Yandamuri veerendranath » అగ్నిప్రవేశం

  

       శైలజ నెమ్మదైన స్వరంతో "ఈ మగాళ్ళని ఆట పట్టించటమనే గుణం నాలో ఎప్పటికి పోతుందే ఏమోనే..... చాలా చెడ్డ గుణం కదూ" అంది.
   
    "అసలేమైందో చెప్పు?" అంది పావని కంగారుగా.
   
    "అబ్బే! నువ్వు భయపడేటంత ఏమీ కాలేదులే. మీ ఆయన అంత 'ధీరోదాత్తుడు' కాదు."
   
    "అసలేం జరిగింది?" రెట్టించింది.
   
    "రెండ్రోజులుగా మీ ఆయన్ని గమనిస్తున్నాను. ఏదో గమ్మత్తుగా అనిపించాడు. కొంచెం బాగా మాట్లాడేసరికి బాగా చనువయ్యాడు. తనని నువ్వు జీవితంలో యిక అర్ధం చేసుకోలేవన్నాడు. తన జీవితం భ్రష్టుపట్టి పోయిందన్నాడు."
   
    పావని పెదవి పంటి క్రింద నలుగుతోంది. అంత ఇరిటేషన్ ఆమె కెప్పుడూ రాలేదు. రెండ్రోజుల పరిచయంతో "తన" గురించి ఆమెకు చెప్పటం!? తన ప్రాణ స్నేహితురాలికి కూడా తను అతని 'లోపం' గురించి చెప్పలేదు. అటువంటిది అతను....
   
    శైలజ అంది.... "....ఈమాత్రం ఓదార్పు కోసం ఎదురు చూశానన్నాడు, అతని మాటల్లో సెక్సుగానీ, మిగతా వాళ్ళలాగా నన్ను హుక్ చేద్దామన్న ప్రయత్నంగానీ లేదు. అతను కోరుకునేదల్లా సానుభూతి మాత్రమే. సుదర్శనం గురించి చెప్పుకుని.....నా వళ్ళో తల పెట్టుకుని ఏడ్చాడు."
   
    "ఏ....మి....టీ" వణికే స్వరంతో అంది పావని. "ఇంత కొద్ది పరిచయంలో...."
   
    ఆమె మాటలు కట్ చేస్తూ, "భాస్కరరామ్మూర్తిలాంటి వాళ్ళకి ఏ 'వడి' అన్నది అప్రస్తుతం. తల పెట్టుకుని ఏడవటానికి ఏదో ఒక వాడి కావాలంతే" అంది శైలజ. "అసలిదంతా నీకు చెప్పకూడదనుకున్నాగానీ, మళ్ళీ నా మీద నాకే అసహ్యమేసింది. స్నేహితురాలిన నీకు చెప్పకపోతే అది పోయేలా కనబడలేదు. ఐయామ్ సారీ!"
   
    ట్రైన్ కదిలింది.
   
    పావని మాట్లాడకుండా కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చుంది. ".....భాస్కరరామ్మూర్తి లాంటి వాళ్ళకి ఏ వడి అన్నది అప్రస్తుతం. ఏదో ఒక వడి తల పెట్టుకుని ఏడవటానికి కావాలంతే" అన్న శైలజ మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి.
   
    పెళ్ళయిన కొత్తలో అతడి గురించి తెలుసుకోవాలని చాలా ప్రయత్నం చేసింది. తన బాల్యం నుంచి పెళ్ళయ్యే వరకు జరిగినవన్నీ ఒకటొక్కటిగా రోజంతా కబుర్లు చెపుతుండేది. కానీ అతడు మాత్రం ఏదీ చెప్పేవాడు కాదు. అతడేధైనా చెపితే అది వాసంతి గురించి, వాళ్ళిద్దరి మధ్యా అనుబంధం గురించీ, లేదా భవిష్యత్తులో తాము గడపబోయే విలాసవంతమైన జీవితం గురించీ! అతని మాటలు, వాళ్ళ చేతలు చూస్తుంటే వాళ్ళిద్దరి మధ్యా ఉన్నది కేవలం అన్నాచెల్లెళ్ళ బంధమేనా, లేదా ఆ ముసుగులో ఆడే నాటకమా అని  అనుమానం కూడా రాకపోలేదు. కానీ మూర్తికి ఆ ధ్యాస ఎప్పుడూ లేదు.
   
    "ప్రతి మనిషిలోనూ లోపాలుంటాయి. అల్లుడులో కూడా వుండవచ్చు. వాటిమీద దృష్టి కేంద్రీకరించి, అతడిని బాధపెట్టక అతడిలోని మంచితనాన్నే గుర్తుపెట్టుకో" అని అప్పగింతలప్పుడు తండ్రి చెప్పిన మాటలను యధాతధంగా ఆచరణలో పెట్టుకుంది. కానీ ఈ రోజు అతను మంచివాడో....చెడ్డవాడో నిర్ణయించుకోలేకపోతూంది.
   
                               *    *    *
   
    అనుకోకుండా భాస్కరరామ్మూర్తి అక్క, బావ, పిల్లలు దిగారు. ఆ సమయానికతడు ఇంట్లో లేడు. పావని వాళ్ళకేలోటూ కలగకుండా అన్నీ సమకూర్చింది. సకల మర్యాదలూ చేసింది. ఒకందుకు ఆమె సంతోషించింది కూడా! భర్త ప్రవర్తన గమనించి ఆవిడ మందలిస్తుందని ఆశ. ఆవిడ అంత ఆప్యాయంగా మాట్లాడింది. "తల్లి లేని పిల్లవి..... నువ్వు సంతోషంగా వున్నావు కదమ్మా?" అంది ఆప్యాయంగా.
   
    "బాగానే వున్నాను వదినా! నాకేలోటూ లేదు."
   
    "వాడు హాస్పిటల్లో వున్నాడని తెలిసినా రాలేకపోయాను. ఎంత అవస్థపడ్డావో ఏమో!"
   
    "ఫర్వాలేదు వదినా!" అంది పావని. ఆవిడ ఇల్లంతా పరికించి చూస్తూ "అయితే ఇంట్లోకి వీడు వస్తువులేమీ కొనలేదా? ఓ ఫ్రిజ్ లేదు. సోఫా సెట్ లేదు రానీ అడుగుతాను" అంది.
   
    'నాక్కావలసింది అవేమీ కాదు వదినా! కాస్తంత ప్రేమా, ఆప్యాయతా అవి ఇవ్వమనండి చాలు' అందామనుకుంది. కనీసం ఆవిడైనా తన బాధ అర్ధం చేసుకుని వాసంతి విషయం మందలిస్తే చాలు. పిల్లలిద్దరూ పావనితో బాగా కలిసిపోయారు. ఇల్లు సందడిగా వుంది.
   
    అయితే భాస్కరరామ్మూర్తి రాగానే వాతావరణం పూర్తిగా మారిపోయింది. వాళ్ళు వచ్చారని వినగానే వాసంతి కూడా వచ్చేసింది. అంతా గదిలోనే కూర్చుని బయటకు రానేలేదు. ఆ మర్నాటి నుంచి వదినగారి మాటల్లో పూర్తిగా మార్పు వచ్చేసింది.

    "ఏంటమ్మాయ్! మావాడు కట్నం వద్దన్నాడు సరే. మీ నాన్న అంతే చాలనుకున్నాడా, ఇంట్లోకి వస్తువులన్నా కొనివ్వలేక పోయాడా? మరో పెళ్ళికొడుక్కయితే యాభైవేలదాకా ఖర్చుపెడదామనుకున్నాడు గదా! అదే మరో రకంగా యివ్వొచ్చుగా?"
   
    "మీ తమ్ముడు ఏమీ ఇవ్వద్దని భీష్మించుకున్నారుగా వదినా- అందులోనూ అమ్మ పోయిన దుఃఖంలో ఉన్నారు నాన్న."
   
    "అయితే మాత్రం శుభకార్యం చేశాడా లేదా? ఏదో వాడు ముచ్చట పడ్డాడని మేమూ ఏదీ అడగలేదు. అది కూడా తప్పయి పోయిందన్నమాట" ఆవిడ రోజంతా సాధిస్తూనే వుంది. వాసంతి ఆవిడకు ప్రాణం అయిపోయింది. వాసంతి వాళ్ళను ఊరంతా తిప్పి చూపించింది. సినిమాలకు తీసుకెళ్ళింది. వాళ్లొచ్చేసరికి పావని వంట చేసి వుంచేది. తిని మళ్ళీ వెళ్ళిపోయేవారు.
   
    వాళ్ళున్న నాలుగురోజులు పావని నరకమే అనుభవించింది. పిల్లలు మాత్రం ఆమెకు బాగా దగ్గరయ్యారు.
       
    ఆ రోజు ఎగ్జిబిషన్ కి ప్రోగ్రాం వేసుకున్నారు వాళ్ళంతా. పిల్లలు బలవంతం చేయడంతో పావనిని కూడా రమ్మని పిలవక తప్పలేదు. ఎగ్జిబిషన్ లో వాసంతి, భాస్కరరామ్మూర్తి చేతులు పట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ నడుస్తుంటే పావని బిక్కచచ్చిపోయింది. పక్కనే అక్కా, బావా వున్నారన్న ధ్యాసే లేదు వాళ్ళకు. అతడు ఐస్ క్రీం కొని వాసంతికి స్వయాన తినిపించాడు. ఆమె అతడిని బలవంతంగా జెయింట్ వీల్ ఎక్కించింది. పావని ముభావంగా ఉండడం చూసి మరింత అతిగా చేశారు.
   
    ఇంటికొచ్చాక.....
   
    "మీ ప్రవర్తన నాకు బాగా లేదు. అంతమందిలో సిల్లీగా ప్రవర్తించడం అసహ్యంగా వుంది. ముఖ్యంగా మీ అక్కయ్య పిల్లలు వయసులో వున్నవాళ్ళు" అంది పావని.
   
    "ఏమిటే నువ్వనేది? నా ప్రవర్తనలో లోపాలు ఎంచుతున్నావా? నా చెల్లెలితో కాస్త సరదాగా ఉంటే నీకెందుకే అంత కుళ్ళు?" భాస్కరరామ్మూర్తి అరుపులకి అందరూ గదిలోకి వచ్చేశారు.
   
    "ఏమిటి? ఏమిటంటోంది?"
   
    "నాకు నీతులు నేర్పిస్తోందక్కయ్యా! పెళ్ళికాకముందు ఎవడితోటో ప్రేమలో పడింది. ట్రైన్ లో సిగ్గులేకుండా సరసాలాడింది. చెల్లితో నేను చనువుగా ఉండటం పొరపాటట! నీతులు వల్లిస్తోంది"
   
    అక్కయ్య, బావ గయ్యిమని లేచారు. "నేను మొదటే చెప్పాను, ఈ సంబంధం మనకొద్దని. ఆస్థి కలిసి వస్తుందంటూ ఆరాటపడ్డాడు. ఎందుకూ పనికిరాని మేళం" అన్నారాయన. ఇద్దరు ఆడపిల్లలు అందునా వయసులో ఉన్న వాళ్ళను పెట్టుకుని ఆయనలా మాట్లాడటం అసభ్యంగా అనిపించింది పావనికి. "మీరు నాకు అన్నయ్య! నా కష్టసుఖాలు తెలుసుకుని అండగా నిలబడవలసినవారు. మీరే ఇలా మాట్లాడటం భావ్యంగా లేదు" అంది.
   
    "ఏమిటీ మా బావగారిని, ఇంటికొచ్చిన అతిధిని అవమానిస్తావా? నీకెంత ధైర్యం?" అంటూ భాస్కరరామ్మూర్తి ఆమె చెంప చెళ్ళు మనిపించాడు. ఆ తర్వాత ఎవరు పెద్దగా అరిచారో తెలియదు. అర్దరాత్రి చుట్టుప్రక్కల ఇళ్ళ వాళ్ళంతా తలుపులు తీసుకుని బయటికి వచ్చారు. పావనికి ఆ నలుగురూ మనుష్యుల్లా అనిపించలేదు. అంతమందిలో కొట్టాడన్న అవమానం ఫీలవలేదు.
   
    ఒంటరితనపు సముద్రంలో తను అడుగడుక్కు జారిపోతోంది అని తెలుస్తూనే వుంది. పైకి లాగే ఒక చెయ్యి కావాలి. ఒక్క చిన్న ఓదార్పు..... తనకి కావాలి. తనకి దాని అవసరం చాలా వుంది. ఊబినుంచి తన నెవరయినా పైకి లాగితే ఎంత బావుణ్ణు అనుకుంది.
   
    అలాంటి చెయ్యి ఆమెకి త్వరలోనే లభించింది.
   
   
                                 --* * * *--

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra