Previous Page Next Page 
రెడిమేడ్ మొగుడు పేజి 3

    "నేనెప్పుడు వూశాను సార్....?అయోమయంగా అడిగాడు రాంపండు.

    "అదే... ఇందాకా నేనిక్కడికి వచ్చినప్పుడు థూ...థూథూ...థూథూథూ.... అంటున్నావే? ఆ వ్యవహారం గురించి అడుగుతున్నా...." అన్నాడు కళ్ళేగరేస్తూ సర్వోత్తమరావు.

    "ఓ... అడ.. అంతే... మరేమో నా దగ్గర చాలా ఫైల్స్ న్నాయ్ కదండీ... ఒక్క ఫైలు కూడా పెండింగ్ లేకుండా చేయాలని నా వుద్దేశ్యం అండీ... కానీ మొత్తం ఫైల్స్ క్లియర్ చెయ్యగానే మళ్ళీ ఏవో ఫైల్స్ వస్తూనే వుంటాయండీ.... నా దగ్గర ఏ ఫైలు క్లియర్ చెయ్యగానే మళ్ళీ ఏవో ఫైల్స్ వస్తూనే వుంటాయండీ.... నా దగ్గర ఏ ఫైలు కూడా అయిదు నిమిషాలు మించి పెండింగ్ వుండటం నాకిష్టం లేదండీ... ఈ వేళ మీటింగ్వుండటం వలన కంపల్సరీగా వాటిని పెండింగ్ పెట్టాల్సి వచ్చిందండీ... ఆ బాధతో అలా థూ...థూథూ... అని వుంటానేమోనండీ"అని వినయంగా చెప్పాడు రాంపండు.

    "వెరీగుడ్....కీపిటప్."

    "థూ...థూథూ... థూథూథూ..."

    "నేను కీపిటప్ అన్నది థూ...థూథూ.... అని అనటం గురించి కాదు... పెండింగ్ లేకుండా ఫైల్స్ క్లియర్ చెయ్యటం గురించి!" సీరియస్ గా అన్నాడు సర్వోత్తమరావు.

    "సారీ సార్.... అలాగే సార్..."

    "ఊ! నాకు బయట కాస్త వ్యవహారం వుంది. అందుకే మీటింగ్ ని ఇప్పుడు కాన్సిల్ చేసి నాల్గంటలకి ఆ వ్యవహారాన్ని పెట్టా.... నేను లేను కదా అని పిచ్చికలలు పోకుండా ఆఫీసు వ్యవహారాలు శ్రద్దగా చూసుకోండి... మళ్ళీ నాలుగ్గంటలకివస్తా."

    "అలాగే సార్!" రామ్పండూ, బ్రహ్మాజీ యిద్దరూ కోరస్ గా అన్నారు.

    సర్వోత్తమరావు వీసా విసా అక్కడ నుండి బయటకి వెళ్ళిపోయాడు.

    రాంపండు నెత్తిన చేతులు పెట్టుకుని సీట్లో కూర్చుండిపోయాడు.

    "నా కొంప మునిగిపోయింది" అన్నాడు.

    "ఏం_ఏం జరిగింది?" అడిగాడు బ్రహ్మాజీ తన సిఇట్లావు కూర్చుంటూ.

    "ఈ వేళ త్వరగా యింటికొచ్చి నిన్నేక్కడకయినా తీస్కేళ్తన మా ఆవిడతో చెప్పా."

    "నన్నా?.... ఎక్కడికి... ఎందుకు?!" ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు బ్రహ్మాజీ.

    "అబ్బా! నిన్ను కాదయ్యా బాబూ మ ఆవిడకే చెప్పాను మా ఆవిడ్ని ఆలస్యంగా వెళ్ళేలా వున్నాను ఏ ఉపద్రవం ముంచుకోస్తుందో ఎంటో?"

    "ఓ పని చెయ్యి... ఇంటి కేళ్ళాగానే నువ్వు కృష్ణుడివైపో....అలిగిన మీ ఆవిడని సత్యబామగా వూహించుకుని కాళ్ళు పట్టేస్కావు..." నవ్వుతూ అన్నాడు బ్రహ్మాజీ.

    "ఛీ...ఛీ...నేనా? ఆయనదే దేవుడు గనక పెళ్ళాం కాళ్ళు పెట్టేసుకున్నాడు. మరి నేను మగాణ్ణిగా!!" కళ్ళు చిట్లించాడు రాంపండు.

    "పోనీ ఓ పని చెయ్... ఓ చెలీ... కోపమా...అంతలో తాపమ అని అదేదో సినిమాలో కృష్ణుడి పాట వుంది.... ఆ పాత పాద్తూ చేతులుపట్టుకో...."

    "ఆ... ఇదేదో కాస్త బాగానే వున్నట్టుంది!" అన్నాడు రాంపండు.
   
                                            *    *    *    *

    డోర్ బెల్ నొక్కాడు రాంపండు.

    అప్పుడు సరిగ్గా రాత్రి తొమ్మిది గంటలయింది.

    మీటింగ్ అయ్యి యింటికేళ్ళేసరికి ఎనిమిదీ, ఎనిమిదింపావు అవుతుందని అనుకున్నాడు గానే తొమ్మిది అయిపోతుందని అనుకోలేదు లోపల్నుండి ఏ విధమైన అలికిడీ వినపడకపోవడంతోమళ్ళీ బెల్ నొక్కాడు.అర నిమిషం పాటు ఆగాడు.... తలుపు తెరుచుకోలేదు.... మళ్ళీ బెల్ నోక్కుదామని అనుకుంటుండగా తలుపులు తెరుచుకున్నాయి.

    "అర్రే!... నువ్వు మేలుకువగానే వున్నావా? వెంటనే తలుపులు తెరుచుకోకపోతే ఏంటబ్బా ఇంట త్వరగా నిద్రపోయిండీ అనుకున్నా..." లోపలకి అడుగుపెడుతూ అనవసంగా నేవ్వేస్తూ అన్నాడు రాంపండు.

    రాజీ ఏమీ మాట్లాడకుండా గోడ గడియారంవంక ఓసారి కళ్ళు చిట్లించి చూసి బెడ్ రూమ్ లోకి వెళ్ళింది.

    ఆమె వెనకాలే రాంపండు అదిరే గుండెలతో వెళ్ళాడు.

    "ఎంటో... ఈ వేళే గమ్మత్తయింది.... నేను యింటికి త్వరగా వద్దామని అనుకున్నానా... కానీ ప్రావుద్దున్నా పెట్టాల్సిన మీటింగ్..."

    గబగబా చెప్పబోయాడు రాంపండు.

    కానీ రాజీ అతని మాటల్ని పట్టించుకోకుండా మంచం మీదకి దూకి దుప్పటి నిండుగా కప్పుకుంది.

    రాంపండు గొంతులో వచ్చి వేలక్కాయ్  పడింది.

    "ఎంటో.... మీటింగ్ లో వున్నంతసేపూ నువ్వే గుర్తొచ్చావనుకో_హిహి...పాపం...నా  కోసం....నా రాజీ ఎంతగా ఎదురుచూస్తుందో అని తెగ యిడాయి పోయా హిహిహి..." అన్నాడు మంచం మీద కూర్చుని.

    "డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దిపెట్టా.... మొహం కడుక్కుని పోయి గుర్తుకోచ్చాడు. అతను చెప్పిన పాత కూడా గుర్తుకొచ్చింది.

    "ఓ చెలీ కోపమా.... అంతలో తాపమా" అంటూ గొంతులో అనేక అపస్వరాలను పలికిస్తూ ఆమె భుజం మీద చేయ్యేశాడు.

    అంతే!.... మెరుపువేగంతో దుప్పట్లొంచి రెండు గాజుల చేతులు అతన్ని బలంగా ఓ తోపు తోశాయి.

    ఆ దెబ్బకి రాంపండు ఎగిరి గది గుమ్మం దగ్గర వేలకితల పడ్డాడు.

     తనను ఇప్పుడు తోసింది రాజీయేనా లేకపోతే ఎవదయినా స్టంట్ మాస్టారా అన్నా విషయం అతనికి అర్ధం కాలేదు.

    "ఒరేయ్ బ్రహ్మాజీ... నీ మొహం మండా_" కసిగా తిట్టికున్నాడు రాంపండు.

    బ్రహ్మాజీ అనవసరంగా తిట్టుకున్నానే అని అతనికి అనిపించలేదు.

                                         *    *    *    *

    ట్రింగ్... ట్రింగ్...

    డోర్ బెల్ మోగింది.

    చదువుతున్నా నవలని మంచం మీద పడేసి విస్సుగా లేచిళ్ళి తలుపు తీసింది రాజీ.

    ఎదురుగా పక్కింటి సత్యవతి!

    "ఓ... సత్య... నువ్వా... రారా" అంది రాజీ రాని చిరునవ్వును పేదల మీదకు బలవంతంగా తెప్పించుకుంటూ . సత్యవతితో చిరునవ్వును పెదాల మీదకి బలవంతంగా తెప్పించుకుంటూ. సత్యవతితో మాట్ల్డాలంటే రాజీకి చచ్చేంత బోరు. కూర్చున్నాంతసేపూ కోతలు కోసి పోతుంటుంది ఆ కోతలు వినలేక చావాలి.

    ఇద్దరూ లోపలకెళ్ళి హాల్లో కూర్చున్నారు.

    "ఏం చేస్తున్నావు రాజీ? పడుకున్నావా?" అడిగింది సత్యవతి.

    "అబ్బే... పగలుపూట పడుకోవడం నాకలవాటు లేదు... నవలేదో వుంటే చదూతున్నా"సమాధానం చెప్పింది రాజీ.

    "ఎవర్రాసిన నవలా?"

    "ఎవరో ఈ దశాబ్దపు రచయిత తింగరి శంకర్రావట!"

    "వీళ్ళమ్మా కడుపు మాడ....ఈ పత్రికవాళ్ళు ప్రతి రచయితికి ముందూ ఇలానే రాస్తున్నారు. ఈ మధ్య ఈ దాశబ్దపు రచయిత, ఈ శతాబ్దపు రచయితా అని... అయినా ఏ మాటకామాటే చెప్పుకోవాలి.... ఆ తింగరి శంకర్రావున్నడే.... వాడమ్మకడుపు మాడ.... చాల బాగా రాస్తా డోయ్...." అంది సత్యవతి.

    "అవును... నవల చూడుతుంటే బాగానే వున్నట్టుండి" చెప్పింది రాజీ.

    "ఇంతకీ ఆ శంకరరావు ఎవడనుకున్నావు? మా పెద్దమ్మ తోటి కోడలకి కొడుకు... మా వాడే..." అంది గర్వంగా.

    "ఓహొ అలాగా?" లోపల్లోపల పళ్ళు నూరుతూ అంది రాజీ.

 Previous Page Next Page