Previous Page Next Page 
అభిలాష పేజి 27

    "ఒరేయ్ చిరంజీవి! హొటల్ లో  తింటూ తింటూ మధ్యలో తుమ్మొస్తే మనసారా తుమ్మటానికి భయపడేవాడివి_ చావుని ఇంత జోకుగా ఎలా తీసు కోగాల్గుతున్నావ్ రా!"
   
    "చావే తుమ్ములాటిదిరా. వచ్చేవరకూ భయపెడ్తూ౦ది. వచ్చేసేక హాయిగా వుంటుంది. "
   
    స్పూర్తికి మతిపోయింది. కళ్ళు పెద్దవిచేసి చిరంజీవివైపు చూస్తూ వుండిపోయాడు. చిరంజేవి స్వామిఅరవిమ్డ ఘోష్ లా విశాలంగా నవ్వేడు.
   
                               12
   
    అర్చన తన గదిలో అటూ, ఇటూ తిరుగుతూంది. మనసునెంత డితవుపర్చుకుందామన్నా కుదరటంలేదు. మాటిమాటికీ చిరంజీవి జ్ఞాపకంవస్తున్నాడు. చాలా సులభంగా గుడ్ బై చెప్పేసి వచ్చేసింది గానీ, అది అమ్తమమూలుగా జరిగిపోయే విషయంగా కనిపించటంలేదు.
   
    __తన కళ్ళముందు నవ్వుతూ తిరిగినవాడు__ హుషారుగా మాట్లాడినవాడు__ ఇంకో రెండు మూడు రోజుల్లో ఏ లోకం నుంచి నిష్క్రమించబోతున్నాడన్న నిజాన్ని ఆమె భరించలేకపోతున్నది. అనారోగ్యంతో మంచంమీద తీసుకుని, తీసుకుని పోతే అదివేరు __అకస్మాత్తుగా కాచ్చిపోతున్నాడని తెలిస్తే __ ఆ భావాల్ని __ ఆ అవస్థానీ వర్ణించటానికి మాటలు చాలవు.
   
    ఆమె మళ్ళీ ఇంకోసారి చిరంజీవి దగ్గరకు వెళ్ళింది. అప్ఫీలు కాకపోయినా కనీసం మెర్సీ పితిశిన్ (క్షమాబీక్ష )కోసం ప్రయత్నం చేస్తానన్నది . అతడు ఒప్పుకోలేదు. అరగంట వాగ్వివాదం ఇఅరిగేక ఆమె హతాశూరాలై వెనక్కీ రావాల్సి వచ్చింది.
   
    ఆమెని చూసి శర్మ మాత్రం థ్రీల్లైపోయేడు.
   
    "ఎవరు గురూగారూ ఆ అమ్మాయి?"
       
    "నా ఫీయాన్సీ."
   
    "అంటే ?"
   
    "మేం ఇద్దరం వివాహం చేసుకోవాలనుకున్నాం."

    "మరింత అప్సరస నుంచుకుని ఆ సుశీల వెనుక పడ్డారెందుకు సార్?"
       
    చిరంజీవికి ఓ బూతు జోకు వచ్చిందిగానీ, చెప్తే బావోదనివూరుకున్నాడు.
   
    శర్మ అన్నాడు, "అదే సార్ గ్రాహాపాటు అంటే....? మా బామ్మా చెప్తూవుమ్డేది. జారకంలో వున్నది దేముడైనా మార్చాలేదని. ఉదాహారణకి మీ మరణం సంగతే తీసుకుండి. ఇంకో రెండ్రోజుల్లో మరణం. ఎవరాపగలరు దాన్ని?"
   
    "తథాస్తు" అన్నాట్టు జైలు గంట కొట్టడం ప్రారంభమయింది.
   
    చిరంజీవి నవ్వి వూరుకున్నాడు.
   
                     *    *    *    *   
   
    మధ్యాహ్నం రెండయినా చల్లటిగాలి వీస్తూనే వుండి. ఆకాశంనిండా మబ్బులు పట్టి వున్నాయి. సర్వోత్తమారవు కారు ప్రెసిడెంట్ విడిది చేసిన అతిథి గృహంలోకి ప్రవేశించింది.
   
    అయిదు తర్వాత ప్రెసిడెంట్ ని అతడు కలుసుకున్నాడు.
   
    సాదారంగా ఆహ్వానిస్తూ "బ్వున్నవా" అని అడిగేడు రాష్ట్రపతి అయన కూడా తెలుగువాడె. కొంతకాలం హైకోర్టు ప్రాక్టీసు పెట్టాడు కూడా. తరువాత రాజకీయాల్లో చేరి,ఒక్కో మెట్టూ ప్రాక్టీసు పెట్టాడు కూడా. తరువాత రాజకీయాల్లో చేరి, ఒక్కో మెట్టూ ఎక్కి భారతదేశం అత్యున్నత పదవి చేరుకోగాలిగేడు.
   
    మిత్రులిద్దరూ లోకాభిరామాయణం మాట్లాడుకున్నారు.
   
    "ఇప్పట్లో పెళ్ళి చేసుకోవా?"
   
    సర్వైత్తమరావు బిగ్గరుగా నవ్వి, "ఇప్పుడీ వయసులో పెళ్ళేమిటో అన్నాడు.
   
    ఇంతలో పి.యస్. వచ్చి "సమయం అయిపోయిందని" చెప్పే రాష్ట్రపతి చెయ్యి వూపుతూ "ఫర్లేదులే" అన్నాడు. కనీ సర్వోత్తమరావు లేస్తూ "వద్దు, నె వెళ్ళొస్తాను. అసలు నె వచ్చిన పని వేరు" అన్నాడు
   
    "ఏమిటిది?"
   
    "ఉహూ,ఇప్పుడు చెప్పను. రేపు నాలుగింటికి వస్తాను. నాకు అప్పాయింట్ మెంట్ కావాలి."
   
    "నీకు ఆ ఫార్,మాలితీస్ అన్నీ ఎందుకు? ఎలాగూ నేను విశ్రాంతి కోసమే వచ్చాను, అ సమయానికి రా."
   
    కాని సర్వోత్తమరావు వప్పుకోలేదు. రాష్ట్రపతి విశ్రాంతి కోసం వచ్చినా,ఆయన్ని కలుసుకోవటానికి ఎవరో ఒకరు వస్తూనే వుంటారని అతడికి తెలుసు.
   
    అందువల్లే అధికార పరంగా కలుసుకోవటానికి అనుమతి తీసుకున్నాడు. అప్పాయింట్ మెంట్ పుస్తకంలో నాలుగింటికి అతడి పేరు వ్రాయబడింది... తరువాత కొంచెంసేపు పిచ్చాపాటీ ఇంటికి వచ్చేసెడు.
   
    అప్పుడు నాలుగాయింది చలిగాలి మరింత ఉద్బాటమమ్యిమ్ది.
   
    ఇంటికి రాగానే అయన ఓ డినపత్రిక ఆఫీసుకి ఫోన్ చేసేడు. చిన్న చిన్న వార్తల్ని గోరిమ్తలు కొండంతలుచేసి వ్రాసే ప్రత్రికలవి__ ప్రేఅతిరోజూ ఏదో ఒక హత న్యూస్ వేసో,లేక మనశుల్ని కలవర పరిచే వార్తా వేసో సర్క్యూలేషన్ పెంచుకునే పేపర్లు.
   
    "ఎల్లుండి పొద్దున్న సుశీల హర్యకేసులో నిందితుడు చిరంజీవిని ఉరితీస్తున్నారు. ఈ వార్తా కావాలంటే నిర్ధారణ పరచుకుని, ప్రకటించండి." అన్నాడు సర్వోత్తమరావు.
   
    "ఎవరు మాట్లాడుతున్నారు?" అట్నుంచి అడిగిందో కంఠం.
   
    "అదంతా ముఖ్యమా?"
   
    "కాదులెండి."
   
    "ప్రచురిస్తారా?"
   
    "సాధారణంగా అలాంటి వార్తలు ప్రచురించి ప్రజల్ని భయపెట్టడం మ నియమం కాదు. ప్రత్రికలు అలాటి వార్తలు ప్రచురించకూడదు కూడా.కానీ మాపత్రిక మాత్రం ఇలాటి నిజాల్ని బైట పెట్టేది. తప్పక ప్రచురిస్తాం....థాంక్సు."
   
    __ ఆ మరుసటి రోజున పేపర్లో వచ్చింది ఆ వార్త. "రేపే చిరంజీవిఉరి"అని చదివి అర్చన వణికిపోయింది. ఆ రోజంతా ఇక గది వదలి రాలేదు. అయితే రోదించడం లేదు. వేదన కన్నా నిర్వేదం భయంకరమైన స్థితి.

 Previous Page Next Page