Home » Yandamuri veerendranath » ధ్యేయం


     అవినాష్ కి అంతా షాకింగ్ గా వుంది. ఇంతా చేసి అది పెళ్ళిచూపుల తతంగం అన్నమాట. మాటవరసకైనా ఒక్కమాట చెప్పలేదు. మొదటి సారిగా తల్లీ, తండ్రీ తనను బొమ్మని చేసి కుట్ర  పన్నుతున్నట్లుగా అనుమానం వచ్చిందతడికి.

    "ఇంతకీ అబ్బాయేమంటాడో!" అంటున్నాడు శంకరం.

    "వాడి మొహం  వాడికేం  కావాలో వాడికే తెలియదు. అన్నీ మనమే చూసి  పెట్టాలి. అయినా  ఆ అమ్మాయికేం తక్కువని ఒప్పుకోలేకపోవడానికి".

    అవినాష్ అక్కడ నిలబడలేక లోపలకు  వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఆఫీసుకి వెళ్ళినా కూడా అతడికి మనసు మనసులో లేదు. ఎప్పుడూ పని తప్ప మరింకేమీ పట్టనట్టు వుండే బాస్ అలాచిరాకుగా  వుండటం చూసి అతని పర్సనల్ సెక్రటరీ  కూడా ఆశ్చర్యపోయింది. మరో పది నిమిషాలు ఆగి  అతడిక వుండబట్టలేనట్టు నిఖితకి ఫోన్ చేశాడు.

    "హలో" అని అటునుంచి ఒక మగగొంతు చిరాకుగా వినిపించింది.

    "నిఖిత కావాలండీ".

    "మీరెవరు?"

    "ఆమెకి మీరేమవుతారు?"

    అవినాష్ కి ఏం చెప్పాలో తోచలేదు. "నేను ఆమె ఫ్రెండ్ ని. ఆమెతో  అర్జంటుగా మాట్లాడాలి."

    "ఆమె బిజీగా  వుంది. ఇంకెప్పుడూ ఇలా పర్సనల్ కాల్స్ చేయకండి". ఫోన్  కట్ అయింది. అవతలివైపు నుంచి వినిపించిన నిర్లక్ష్యానికీ వెటకారానికీ అవినాష్  బాధపడ్డాడు. అతనున్న  పొజిషన్ కి ఇలాంటి  పరిస్థితిని ఎదుర్కోవలసిన స్థితి  ఎప్పుడూ రాలేదు. కొన్ని నిముషాలపాటు అలాగే బల్లమీద  మోచేతులు వుంచుకొని, అరచేతుల మధ్య మొహం దాచుకొని వుండిపోయాడు. అతడి చిరాకు  మరింత ఎక్కువైంది. కొన్ని నిమిషాల తర్వాత అతడు బెల్  కొట్టాడు. లోపలికొచ్చిన ప్యూన్ తో  సెక్రటరీని పిలవమని  చెప్పాడు. పర్సనల్ సెక్రటరీ లోపలి కొచ్చింది. ఆమెకి ఇరవై రెండేళ్ళు వుంటాయి. "కూర్చోండి" అన్నాడు.

    ఆమె ఎదుటి కుర్చీలో కూర్చొని ప్యాడూ, పెన్సిలు తీసుకొని సిద్ధమైంది.

    "డిక్టేషన్ ఏమీలేదు" అని మౌనంగా వుండిపోయాడు. ఆమెకి అర్థంకాలేదు. పొద్దుననుంచీ అతను చిరాకుగా వుండటం గమనించిందేమో కొంచెం చొరవ తీసుకొని "ఎనీ ప్రాబ్లం సర్ ?" అడిగింది నమ్రతగా.

    "ఒక ఫోన్ చేయాలి" అన్నాడతను. ఆమె ఆశ్చర్యం మరింత ఎక్కువైంది. "నన్ను...... నన్ను చేయమంటారా?" అని అడిగింది. అప్పటికి అవినాష్  తనేం మాట్లాడాడో  అర్థమై సిగ్గేసింది. కానీ ఆమె అలా అడగటంతో అతనికి కొంచెం  దారి దొరికినట్లయింది.

    గిల్టీ నిండిన స్వరంతో నెమ్మదిగా అన్నాడు. "నిఖిత అని ఒకమ్మాయి. ఆ అమ్మాయితో మాట్లాడాలి. వాళ్ళు ఫోన్ ఇవ్వటంలేదు."

    సెక్రటరీ మనసులోనే నవ్వుకుంది. ఇలాంటి వ్యవహారాల్లో తన బాస్  చిన్నపిల్లాడిలా కనపడ్డాడు. చొరవగా ఫోన్ దగ్గరికి లాక్కొని "నెంబర్ చెప్పండి సార్" అంది. అవినాష్ చెప్పాడు. ఆమె డయల్ చేసింది. అవతలినుంచి "హలో" అని అని వినిపించగానే, "నా పేరు స్పందనండి. నిఖిత వాళ్ళ పక్కింట్లో వుంటాను. వాళ్ళ తాతమ్మగారికి యాక్సిడెంట్ జరిగింది. కొంచెం అర్జంటుగా పిలుస్తారా?" అంది కంగారు ధ్వనిస్తున్న స్వరంతో.

    అవినాష్ తల మునకలయ్యేటంత ఆశ్చర్యంతో ఆమెవైపు చూశాడు. అటునుంచి నిఖిత రాగానే ఆమె చిరునవ్వుతో ఫోన్ అతనికిచ్చింది. అటునుంచి నిఖిత "హలో.....హలో" అంటోంది. అవినాష్ "థాంక్యూ" అన్నాడు. కృతజ్ఞత  నిండిన  స్వరంతో. సెక్రటరీ లేచి బయటికెళ్ళి పోయింది.

    అటునుంచి నిఖిత. అవినాష్ ని" అన్నాడు.

    ఈసారి ఆశ్చర్యపోవటం నిఖిత వంతయింది. ఇంతవరకెప్పుడూ అవినాష్ ఇలా ఫోన్ చేయలేదు. "ఏమిటి విషయం అవినాష్?" అంది.

    "నువ్వు అర్జంటుగా బయటికిరా. నేను ఐదు నిమిషాల్లో మీ ఆఫీసు  దగ్గరుంటాను".

    ఈసారి నిఖిత  వంతయింది. ఇంతవరకెప్పుడూ అవినాష్ ఇలా ఫోన్  చేయలేదు. "ఏమిటి విషయం అవినాష్?" అంది.

    "నువ్వు  అర్జంటుగా  బయటికిరా. నేను ఐదు నిమిషాల్లో  మీ ఆఫీసు దగ్గరుంటాను".

    ఈసారి నిఖిత కంగారుపడింది. "ఏమైంది అవినాష్? ఏమన్నా" అని ఏదో  అనబోతూంటే "నువ్వొస్తావుగా. వచ్చిన తర్వాత చెప్తాను" అని ఫోన్ పెట్టేయబోయాడు.

    "నాకు పర్మిషన్ ఇవ్వరు అవినాష్".

    "ఇవ్వకపోతే శలవు పెట్టు. శెలవుకూడా యివ్వకపోతే ఉద్యోగానికి రాజీనామా చెయ్. నేను వచ్చేస్తున్నాను" అని ఫోన్ పెట్టేసేసి బయటికొచ్చాడు.

    తలవంచుకొని గబ గబా  హాలు బైటకి నడుస్తున్న అవినాష్ ని చూసి సెక్రటరీ  మనసులోనే నవ్వుకుంది. ప్రేమ తాలూకు తీవ్రత ఎంత వుంటుందో ఆమెకి మూడు  సంవత్సరాల క్రితం నుంచీ  తెలుసు.

    "నువ్వు ఫోన్ చెయ్యటమే ఒక సర్ ప్రెయిజ్ . ఇలా హొటల్లో కలిసి మాట్లాడాలనటం ఇంకా పెద్ద ఆశ్చర్యం. అప్పుడే అనుకున్నాను ఇలాంటి విషయం ఏదో వుందని. ఇంతకీ  అమ్మాయి బావుందా? కట్నం  ఎన్ని లక్షలు?" నవ్వుతూ అడిగింది నిఖిత.

    "దీన్నంతా నువ్వు  నవ్వులాటగా తీసుకున్నట్టున్నావ్?" అన్నాడు అవినాష్ సీరియస్ గా.

    "మీ తల్లిదండ్రులు యింటికొచ్చి ఈ విషయం మాట్లాడుకునేంత వరకూ నీ కసలు అనుమానం రాలేదంటే, నువ్వు పెళ్ళి చూపులకి వెళ్ళావన్న విషయం కూడా తెలియదంటే నవ్వు రాకుండా వుంటుందా చెప్పు మరి?"

    అవినాష్ నిజాయితీగా చెప్పాడు. "నాకలాంటి ఆలోచనలు రావు. ఆలోచించటం అంటూ జరిగితే అది నీ గురించే నిఖితా!"

    నిఖిత మొహంలో నవ్వు మాయమైంది. "నా విషయం నేను స్పష్టంగా చెప్పాను కదా అవినాష్. మరో రెండేళ్ళు నా దగ్గర ప్రేమ, పెళ్ళి విషయం తెచ్చి లాభం లేదని".

    "కానీ వాళ్ళు నా పెళ్ళి నిశ్చయం చేయబోతున్నారు".

    "అటువంటప్పుడు నువ్వు నీ అభిప్రాయం వాళ్ళకి చెప్పి వుండవలసింది".

    "చెప్పి ప్రయోజనం లేదు నిక్కీ. నా మంచీ చెడూ ఏమిటో నాకు తెలీదని, వాళ్ళు చేసేదంతా  నా మంచికోసమే అని కొట్టిపడేస్తారు".

    నిఖితకి అతన్ని చూస్తే జాలేసింది. దాదాపు పాతికేళ్ళుగా ఆలోచనలను రిమోట్ కంట్రోల్ లో పెట్టినట్లు తమ అధీనంలో వుంచుకున్నారు. 'మా వాడికి బంగాళదుంప వేపుడంటే ఇష్టం. అరటికాయ వేపుడంటే అస్సలు ఇష్టం వుండదు' అని పదిసార్లంటే అరటికాయ వేపుడు రుచి చూడటానికి కూడా అవినాష్  ఇష్టపడడు. అలా పెంచారు అతన్ని.

    తమ కిష్టం లేనివి పిల్లలకి అందకుండా చేసి, వాటిపట్ల పిల్లలకి అయిష్టాన్ని పెంచి, మా పిల్లలకి  మా  పోలికలే వచ్చాయని సంతోషించే తల్లిదండ్రులు కూడా అనుకుంది నిఖిత. 'పాతికేళ్ళొచ్చినా మా వాడికేం తెలియదు. అన్నీ మేమే  చూసుకోవాలి' అని పదిమందికీ చెప్పుకొని గర్వపడే తల్లిదండ్రులు, ఆ పదిమంది దృష్టిలో తమ కొడుకును ఒక చేతకాని దద్దమ్మగా సృష్టిస్తున్నారని ఆలోచించరు. తమలోని ఈగోని సంతృప్తి పరుచుకోవటానికి బిడ్డల్ని బలిపశువులుగా చేసే తల్లిదండ్రులు ఈ సమాజంలో అసలైన శిక్షార్హులు.

    "ఏమిటి నిక్కీ ఆలోచిస్తున్నావ్? ఇప్పుడు నేనేం చెయ్యాలి?" అవినాష్ గొంతు దీనంగా పలికింది.

    "ఏం చేస్తే బావుంటుందని నీకనిపిస్తుంది?" ఎదురుప్రశ్న వేసింది నిఖిత.

    "ఒకసారి మీ నాన్నగారు కానీ, అమ్మగారుగానీ వచ్చి మాట్లాడితే".

    "ఎవరితో?" అతని మాటలు పూర్తికాకుండానే కటువుగా అడిగింది.

    "మా పేరెంట్స్ తో".

    "రెండేళ్ళవరకూ మన పెళ్ళి జరగదని తెలిసినప్పుడు మా వాళ్ళని ఏం మాట్లాడమని చెప్తాను".

    అవినాష్ మొహం మరింత దీనంగా పెట్టుకుని కూర్చున్నాడు.

    "పోనీ  నేనే వచ్చి చెప్తాను" అంది నిఖిత.

    "ఏమని?" ఆశ్చర్యంగా అడిగాడు.

    "మీ అబ్బాయి రెండేళ్ళదాకా  పెళ్ళి చేసుకోడట. అప్పటివరకూ ఎలాంటి సంబంధాలూ ఖాయం చేయకండి అని చెబుతాను".

    అవినాష్ అదిరిపడి "మైగాడ్! నువ్వు చెప్తావా? అసలు నువ్వు  స్పృహలో వుండి మాట్లాడుతున్నావా?" అన్నాడు.

    నిఖితకి బాగా కోపమొచ్చింది. "స్పృహలో లేనిది నేనుకాదు అవినాష్ నువ్వు. నీకేది నచ్చుతుందో ఏది నచ్చదో నువ్వాలోచించుకోలేవు. మొట్టమొదటిసారి నా  విషయంలో అలా ఆలోచించావు. అయినా కూడా నీ ఇష్టాయిశ్తాల గురించి నీ  తల్లిదండ్రులకి చెప్పలేవు. స్పృహలో లేనిది  నువ్వా? నేనా?"

    అవినాష్ మాట్లాడలేదు.

    "తల్లిదండ్రుల్ని ఎదిరించమని, వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా నడుచుకోమని చెప్పటం నా ఉద్దేశ్యం కాదు అవినాష్. ఇది నీ జీవిత సమస్య. ధైర్యంచేసి నీ  అభిప్రాయాన్ని బయటపెట్టుకో, లేకపోతే నష్టపోయేది నువ్వే. అందుకే ఇది  నీకో  పరీక్ష అనుకో. ఇందులో విజయం సాధించగలిగితే సుఖపడతావన్న నిజం గ్రహించు. లేదూ, ఇదంతా అక్కర్లేదు. నేను నా తల్లిదండ్రులు చెప్పినమాటే వింటాను' అని నువ్వనుకున్నట్లయితే నన్ను మర్చిపో. వాళ్ళు చూపించిన సంబంధం చేసుకో. నేను చెప్పేదల్లా ఏదో ఒక నిర్ణయం తీసుకో. ఆ నిర్ణయాన్ని అనుసరించు. ఆనందించు".

    "అంటే..... అంటే నన్ను ప్రేమించడం లేదా నిఖితా?" తిరిగి జాలిగా అడిగాడు.

    "ప్రేమిస్తున్నాను అవినాష్. కానీ ఈ ప్రేమ పెళ్ళిలోకి మారక పోతే..... దాని గురించి నేను నా మిగతా  జీవితాన్నంతా విషాదంతో గడిపేయదలచుకోలేదు. వ్యక్తిత్వం .. వ్యక్తిత్వం కావాలి అవినాష్" అంటూ లేచింది.

    "మరి కొంచెంసేపు కూర్చో నిఖితా. ప్లీజ్!" అన్నాడు అవినాష్.

    "మనం ఎంతసేపు మాట్లాడుకున్నా ఆ సంభాషణ ఈ పాయింట్ చుట్టే తిరుగుతుంది. నువ్వు ఆలోచించు. నువ్వు చెప్తానంటే సరే, లేదంటే నేనొచ్చి  మాట్లాడమంటే మాట్లాడతాను. అంతేకాని ఈ విషయంలో నా తల్లిదండ్రులను మాత్రం ఇబ్బంది పెట్టను".

    అవినాష్ కూడా బిల్ పే చేసి లేచాడు.

       

                          *    *    *

    "నిఖితా" నెమ్మదిగా పిలిపించి కౌసల్య. పుస్తకం చదువుతున్న నిఖిత తలెత్తి తల్లివైపు చూసింది.

    "త్వరలోనే నీ పెళ్ళి జరిగితే బావుంటుందనిపిస్తూంది. నీ అభిప్రాయం ఏమిటి?"

    తండ్రి కూడా దూరంనుంచి సంభాషణ విని వీల్ ఛెయిర్ జరుపుకుంటూ దగ్గరికి వచ్చాడు.

    "ఈ పరిస్థితిలో నాకు పెళ్ళేమిటమ్మా! ఇంకో ఏడాది దాటితే అన్నయ్య సొంత ప్రాక్టీసు పెట్టుకోవటమో ఏదో చేస్తాడు. అప్పుడాలోచిద్దాం" అంది.

    దశరధ్ కల్పించుకుంటూ" అదికాదు నిక్కీ నాకు త్వరలోనే సయమవుతుందని మనందరం ఆశపడుతున్నాం తప్ప నా అసలు పరిస్థితేమిటో నీకు కూడా తెలుసు. సరైన వయసులో పెళ్ళి చేశామన్న తృపైనా నాకు మిగలనీ" అన్నాడు.

    అతనికి కిడ్నీ ఒకటి పూర్తిగా డామేజ్ అయ్యింది. రెండోది కూడా ఎప్పుడు ఫెయిలవుతుందో తెలీని పరిస్థితి. ఒకవేళ అదికూడా ఫెయిలయితే కనీసం ఒకసారి డయాలసిన్ చేయించటానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బుల్లేవు. వెన్నుముక దెబ్బతిన్న అతను తనకోసం మిగతా వాళ్ళ జీవితాన్ని పాడుచేయటానికి ఇష్టపడటంలేదు.  

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra