Previous Page Next Page 
కాంక్రీట్ జంగిల్ పేజి 23

    "శుభం...."

    "కానీ ఆ అమ్మాయికి నా ప్రేమను ఎలా చెప్పాలో తెలియడం లేదు"

    "చాలా షింపులండీ...."

    "ఎలా?"

    "ఆ అమ్మాయిని పిలిచి....నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనెయ్యండి"

    "ఆ వెధవ ఆలోచన నాకు లేకపోలేదు. కానీ అదంత తేలికకాదు"

    "ఎందుకూ....ఆ ఆమ్మాయేమన్నా అప్సరసా...."

    "అవును.అప్సరాసే. ఆ లేత పెదవులు, ఆ లేడి కళ్ళు....వారెవ్వా....ఎంత మత్తు ఎక్కించే అందం...." జగపతి దీర్ఘాలోచనలో పడిపోయాడు"

    "పోనీ....ఇంకోటి సెప్పండి"

    "ఏంటి?"

    "ఆ అమ్మాయి వయసెంత?"

    "ఉంటాయ్....ఇరవై రెండు లేదా ఇరవై మూడు...."

    "అబ్బో సగానికి సగం...." బాసును పోల్చుకుంటూ అన్నాడు వర్మ.

    తన వయసుతో ఆమె వయసు పోల్చడంతో జగపతికి కోపం ముంచుకొచ్చింది.

    "చాలుచాల్లేవయ్యా....ముగ్గురు పెళ్ళాల మొగుడివి. అందులోనూ ఇద్దరిని ప్రేమించి మరీ పెళ్ళిచేసుకున్నావు. నువ్వేదో అమ్మాయిల విషయంలో సీనియర్ వికదా....ఏదయినా మంచి సలహా ఇస్తావని పిలిస్తే నన్నే ఎగతాళి చేస్తావా?"

    "అలా కోపగించుకోకండి బాసూ....మీకసలు అమ్మాయిల మనసెలాంటిదో తెలుసా?"

    "ఎలాంటిది?"
  
    "మల్లెపువ్వులా వుంటుంది"

    "ఇంకా నయం. కనకాంబరంలా వుంటుంది అనలేదు. ఈ మాట నువ్వు చెప్పేదేమిటి? పెద్ద పెద్ద రైటర్లు కలాలతో విదిల్చి మరీ చెప్పారు"

    "ఓ పని చెయ్యండి బాసూ...."

    "ఏమిటి?"

    "ఆ అమ్మాయి వంటరిగా వున్న సమయంలో ఒక పువ్వు ఇవ్వండి....బస్....ఆ అమ్మాయి పువ్వుతీసుకుంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు...."

    "ఉహూ....అది నాకు నచ్చలేదు"

    వర్మ కొద్దిసేపు ఆలోచించాడు.

    "ఓ పని చేయండి"

    ఏమిటనట్టు అతనివైపు విసుగ్గా చూశాడు.

    "మీరు ఏదో పనిమీద గెస్ట్ హౌస్ కు ఆ అమ్మాయిని పిలిపించండి. టీ కప్పు ఇస్తున్నట్టు ఆ అమ్మాయి చీరమీద టీ వంపేయండి. కోపగించుకోకుండా ఆమె చిరునవ్వు నవ్వి బాత్ రూమ్ కి వెళుతుంది. తరువాత ఆమె వెనుకనే టవల్ తీసుకుని మీరూ వెళ్ళండి. ఒక్కసారిగా తలుపు నెట్టండి....? అంటూ ఏదో సినిమా సీన్ గుర్తుకు తెచ్చుకుంటూ నోటికి ఇష్టం వచ్చినట్టు చెప్పుకుపోతున్నాడు వర్మ.

    జగపతికి ఆ ఆలోచన నచ్చింది.

    "ఇది ఒక విధంగా బాగానే వున్నట్టుందోయ్ చెయ్యవచ్చంటావా?"

    "తప్పకుండా సక్సెస్ అవుతుంది....మీరు అమాంతం ఆమెను వాటేసుకుని షవర్ క్రింద ఆమెను తడిపేయాలి. తడిచిన అందాలతో మీరు ఆమెను లొంగదీసుకుంటుంటే ఆమె మీకు ఎదురుచెప్పలేదు...."

    వర్మ చెప్పినట్టు ఎంత తొందరగా ఆ ప్లాన్ ను అమలుపరుద్దామా అన్నంత ఆతురతగా వున్నది జగపతికి.

    ఆ ప్లాన్ ఏ విధంగా సక్సెస్ చేయాలో ఊహించుకుని కారు డ్రయివర్ ను పిలిచి వర్మను ఇంటిదగ్గర వదిలిన తరువాత శ్రీప్రియను తీసుకుని రమ్మని చెప్పాడు జగపతి.

    కానీ....          

    ఆ గదిలో వర్మ, జగపతిల మధ్య జరిగిన సంభాషణనంతా విండో ప్రక్కనే నిలిచి శ్రీప్రియ విన్నదన్న సంగతి జగపతికి తెలియదు....

    తనలో తను నవ్వుకుంటూ ఆఫీసువైపు వెళ్ళిపోయింది శ్రీప్రియ.



                          *    *    *


    "హల్లో...."

    "చక్రీ...." అంది ఫోన్ లో ప్రియ.

    "అవును నేనే ప్రియా...."

    "హమ్మయ్య__నేను గుర్తున్నానన్నమాట....నన్నేకాదు న పేరుకూడా మర్చిపోయి వుంటారులే అనుకున్నాను"

    "మర్చిపోవడం కాదుకానీ....మన విషయం మా బాస్ కు తెలిసింది."

    "ఏమన్నాడు?"

    "వార్నింగ్ ఇచ్చాడు."

    "ఏమని?"

    "నేను నిన్ను మరొకసారి కలిస్తే మొదటనువ్వు_తరువాత నేను....అని"

    "అంటే...."

    "నా నోటితో నేనేమీ చెప్పలేను....ప్లీజ్ ప్రియా నా మాట విను నన్ను మర్చిపో"

    "చక్రీ....మీరు ఇంత పిరికివారని అనుకోలేదు."

    "అవును పిరికివాడినే.... అందుకే చెబుతున్నాను దయచేసి నన్ను మరచిపో"

    "అది కలలోకూడా జరగని పని....నేను చనిపోవడమంటూ జరిగినా మీ కోసమే చచ్చిపోతాను తప్ప మన ప్రేమను ఎవరూ సమాధి చేయలేరు...."

    "నిజమే....కాని నేను నీకోసం చావడానికి సిద్దంగా వుండాలిగా?"

    "అంటే మీరు నన్ను ప్రేమించడంలేదా చక్రీ...."
     

 Previous Page Next Page