Home » Mainanpati bhaskar » వేగు చుక్క


    'నిశ్శబ్దం!' అన్నట్లు సైగ చేశాడు సాగర్ ఆ చెట్టుని పరిశీలనగా చూశాడు. తెల్లటి కొమ్మలతో, బలహీనంగా కనబడుతున్నా చెట్టు అది తను కూడా పైకి ఎక్కితే అది విరిగి పడవచ్చు.

    అనూహ్యని చూడగానే ప్రాణాలను లెక్కచెయ్యకుండా అక్కడికి వచ్చేశాడతను. ఇప్పుడు ప్రాణాలు దక్కించుకోవడానికి మళ్ళీ దూరంగా పోతే అలికిడికి పెద్దపులులు గమనించవచ్చు.

    అందుకని శిలావిగ్రహంలా కదలకుండా అలాగే నిలబడి పోయాడు.

    భయకంపితురాలై అతని పెద్దపులులనీ మర్చి మర్చి చూస్తోంది అనూహ్య. క్షణమొక యుగంలాగా గడుస్తోంది ఆమెకు.

    పులులు అతన్ని ఇంకా గమనించలేదు. ఒకదాన్ని ఒకటి తరుముతూ ఆ చెట్టుని కేంద్రంగా చేసుకుని పరిగెడుతున్నాయి.

    "అవి ఎందుకు అలా పోట్లాడుకుంటున్నాయి?" అంది అనూహ్య అతి నెమ్మదిగా.

    "పోట్లాట కాదు! సరసాలాడుకుంటున్నాయి. సినిమాల్లో హీరో హీరోయిన్లు డూయెట్లు పాడుతూ చెట్టుచుట్టూ పరిగెత్తారూ? అలా" అన్నాడు సాగర్ వినీ  వినబడనట్లు.

    "అన్నీ అబద్దాలు."

    "కాదు! నిజంగానే! అర్ధరాత్రప్పుడు పిల్లులు నానా గొడవా చేస్తూ సరాగాలాడుకుంటాయి, విన్నావా ఎప్పుడన్నా. భయంకరంగా గుర్రు గుర్రుమని శబ్దాలు చేస్తాయే, అంతకు వెయ్యిరెట్లు బీభత్సం చేస్తాయి పెద్దపులులు!"

    "రోమాన్సుని నైస్ గా ఎన్ జాయ్ చెయ్యక వీటికదేం రోగం! మీరు పైకి రండి."

    అతను మాడ్లాడకుండా నవ్వాడు.

    చాలాసేపటి తర్వాత, మగపులి ఆడపులిని ఆక్రమించుకుంది.

    అనూహ్య చెంపలు ఎర్రబడ్డాయి, మొహం పక్కకి తిప్పుకుంది.

    ఆ సీన్ ని ఆసక్తిగా  చూస్తోంది కోతి.

    యుగాలు గడిచినట్లు ఆనిపించిన తర్వాత, పులుల గాండ్రింపులు సర్దుమణిగాయి. కూడబలుక్కున్నట్లు ఒక్కసారిగా పొదల్లో అదృశ్యమయ్యాయి ఆ రెండూ.

    వాళ్ళు తేలిగ్గా ఊపిరి తీసుకోకముందే__

    మరోవైపు పొదలలో నుంచీ బయటికి వచ్చాడు డ్రాకులా చాంగ్. అతని వళ్ళంతా రక్తసిక్తమై ఉంది.

    అతన్ని చూడగానే తనకి కలిగిన ఆగ్రహాన్ని అతి కష్టం మీద అణచుకున్నాడు సాగర్. 'శత్రువుని కూడా మిత్రుడిగా చూడు' అన్నపాలసీ అతనిది.

    "హలో చాంగ్!" అన్నాడు ముక్తసరిగా. "వంటిమీద  ఆ రక్తమేమిటి ? గాయాలయ్యాయా?"

    వికటంగా నవ్వాడు చాంగ్.

    "గాయాలయ్యాయి! కానీ నాకు కాదు! నన్ను చుట్టేసి మింగేద్దామని దురాశపడిన ఆ కొండచిలువకి సామిరంగ, దాన్ని లాగేసి గట్టిగా సాగదీసేసరికి రెండు ముక్కలుగా తెగింది" అన్నాడు భీమబలుడు చాంగ్. "ఇప్పుడింక మీ దుంప తెంపుతాను. ఏదీ? ఆ పిల్లేది? వార్నీ చెట్టెక్కి కూచున్నావా? రావే పిల్లా .దిగిరా!"

    వెన్నులోనుంచి చలి పుట్టుకొచ్చింది అనూహ్యకి.

    "మిస్టర్ చాంగ్" అన్నాడు సాగర్ స్థిరంగా. "వెధవ్వేషాలు వెయ్యకు. ఇప్పటిదాకా జరిగినదానికి క్షమార్పణ చెప్పి మాతో కలిసిపో. నిన్ను సురక్షితంగా మాతో తీసుకెళతాను. లేకపోతే......"

    "లేకపోతే......" అన్నాడు చాంగ్ వెక్కిరింపుగా.  "లేకపోతే డోక్కచింపి డోలు కడతావేమిటి, బయల్దేరాడోయ్ మహా బలశాలి ఒకడు.

    "చాంగ్. ఇది నీకు చివరి వార్నింగు!"

    "పోరా సన్నాసీ " అంటూ అమర్యాదగా అతన్ని విదిలించికొట్టి "రావే పిల్లా" అంటూ చెట్టువైపుకి నడిచాడు చాంగ్. కాళ్ళున్న కొండ ఒకటి నడుస్తున్నట్లు ఉంది అతను నడుస్తుంటే.

    పరిస్ధితి అర్ధం చేసుకున్న కోతి ఆత్రంగా దిక్కులు చూసింది.

    ఒకవైపున వందల ఎకరాల  మేర ముళ్ళపొదలు ఉన్నాయి. ఒక్కొక్క ముల్లూ నాలుగేసి అంగుళాల పొడుగున దబ్బనంలా ఉన్నాయి.

    అనూహ్య చేతిని దొరకబుచ్చుకొని కిందికి కోతి. ఆమెని బరబర లాక్కుంటూ పరిగెత్తి ముళ్ళపొదలను సమీపించింది. అతి చాక చక్యంగా ముళ్ళ చెట్ల కొమ్మలను పక్కకు నెడుతూ అది ముందు దారి తీస్తుంటే, వెనకే వెళ్ళింది అనూహ్య.

    వాళ్ళు ముందుకి వెళ్ళిపోతుంటే, వెనక ఆటోమాటిక్ డోర్సులా మూసుకుపోతున్నాయి పొదలు.

    ఈలోగా, చాంగ్ ని ఎదుర్కొన్నాడు సాగర్.

    అతన్ని అవలీలగా పక్కకి నెట్టేసి, ముందుకు వెళ్ళిపోయాడు చాంగ్. ముళ్ళపొదల దగ్గరకు రాగానే ఆగిపోయాడు. వాటిని చొచ్చుకుని వెళ్ళడం అతనికి చేతకాలేదు.

    పొదల మధ్య సురక్షితంగా నిలబడిన అనూహ్యని చూస్తుంటే అతనికి వెర్రి కోపం వచ్చింది. అటూ ఇటూ చూశాడు.

    దగ్గరలోనే కనబడ్డాయి, కణకణ లాడుతున్న నిప్పు కణికెలు! పులి గాండ్రింపు వినబడగానే నిప్పు ఆర్పకుండానే అక్కడి నుంచీ పారిపోయారు.

    అదే ఇప్పుడు చాంగ్ కి ఆయుధమయింది.

    ఆ నిప్పుని పోగుచేసి, ముళ్ళపొదల మధ్యకి విసిరాడు చాంగ్.

    ఆలోగానే సాగర్ పరిగెత్తుకుంటూ వచ్చి, గాలిలోకి ఎగిరి, రెండు కాళ్ళతో చాంగ్ ఎదురు రొమ్ముమీద తన్నాడు.

    ఆ విసురుకి తూలి వెనక్కిపడ్డాడు చాంగ్.

    కానీ, అప్పటికే ఆలస్యమయిపోయింది.

    ఎండు పొదలు భగ్గున అంటుకున్నాయి.

    మంటలు ఎగిసిపడ్డాయి.

    ఆ మంటల మధ్య చిక్కుకుపోయి నిస్సహాయంగా చూస్తోంది అనూహ్య, కోతి గాభరాగా కిచకిచమని అరుస్తోంది.

    మంటలు నాలుకలు చాపుతూ ఆమెని సమీపిస్తున్నాయి.


                                                                  13


    ఈసారి నిజం తోడేళ్ళ ప్రత్యక్షమయేసరికి, అదురు పుట్టింది స్వరూపరాణికి. ముచ్చెమటలు పోశాయి.

    తోడేళ్ళు భయంకరంగా నోళ్ళు తెరిచి, కోరలు బయట పెట్టి ఆమె మీద పడబోయాయి. మరో క్షణంలో వాటి వాడి కోరలు ఆమె శరీరంలో దిగబడి, ఆమెని ఖండ ఖండాలుగా చీల్చేసి ఉండేవే.

    కానీ, తోడేళ్ళలా ప్రవర్తిస్తున్నా ఆ అమ్మాయీ, అబ్బాయీ అదో రకంగా అరిచారు. వాటిని వారిస్తున్నట్లు ఉంది ఆ అరుపు.

    సందేహంగా ఆగిపోయాయి ఆ తోడేళ్ళు.

    పిల్లలు ఇద్దరూ అంగుళం, అంగుళం చొప్పున ముందుకి వస్తూ ఆమెని సమీపించారు.వాళ్ళు మనుషులని ఎప్పుడూ చూసి ఉండలేదు. కానీ ఏదో ఇన్ స్టింక్టువల్ల, స్వరూపరాణి తం జాతికి చెందిన ప్రాణే అని కనిపెట్టారు వాళ్ళు.

    అభిమానం చూపిస్తున్నాట్లు చిత్రమైన శబ్దాలు చేస్తూ మరింత దగ్గరగా వచ్చారు.

    అదేకంగా వాళ్ళనే చూస్తోంది స్వరూప.

    అప్పుడే నూనూగు మీసాలు వస్తున్నాయి అతనికి. మొహంలో పాలబుగ్గలు పోయి మొగతనం చోటు చేసుకుంటోంది. రాతిపలకలా ధృడంగా ఉంది ఛాతీ. కొదమ సింహం జూలులా విశృంఖలంగా మెడమీద పడుతోంది పొడుగాటి జుట్టు. సింహానికి ఉన్నట్లే సన్నగా, బలంగా ఉన్న నడుము.

    ఆ అమ్మాయి మృదువైన  కేశాలు బంగారం కరిగి జలపాతంలా ప్రవహిస్తున్నట్లు నేలని తాకుతున్నాయి. నోరు తెరచి, గులాబి మొగ్గలా ఉన్నా నాలుకని బయటపెట్టి, కొద్దిగా రొప్పుతుంది తను. పచ్చిమాంసం తినే ఆ అమ్మాయి పళ్ళు తెల్లగా మెరుస్తున్నాయి. కఠినంగా, పిరమిడల్లా రూపు దిద్దుకుంటున్న ఆమె రొమ్ములు ఎగిరెగిరి పడుతున్నాయి.

    వాళ్ళని చూస్తుంటే చెప్పలేనంత ఎగ్జయిట్ మెంట్ కలుగుతోంది స్వరూపకి.

    తోడేళ్ళుఆమెనీ తాముసాకిన ఆపిల్లలనీ మార్చిమార్చిచూస్తున్నాయి.

    ధైర్యం చేసి, మోకాళ్ళమీద కూర్చుంది స్వరూప.

    వెంటనే వాళ్ళిద్దరూ కొద్దిగా వెనక్కి వెళ్ళిపోయారు.

    దగ్గరకు రమ్మన్నట్లు నెమ్మదిగా చేతులు జాచింది స్వరూప.

    సందేహిస్తూ మెల్లిగా  దగ్గరికొచ్చారు మళ్ళీ.

    తోడేళ్ళ లాంటి తమ అభిమానాన్ని చూపడానికి ఒళ్ళంతా నాకుతాయి.

    అచ్చం తోడేళ్ళలాగే పెరిగిన ఆ పిల్లలిద్దరూ నాలుకలు జాపి స్వరూప చెంపలని తడిచేస్తూ తమ అభిమానాన్ని ప్రదర్శించారు.

    రక్తం వడివడిగా ప్రవహించింది-స్వరూప ఒంట్లో.

    ఈ పిల్లలని మచ్చిక చేసుకోవడం ఏమంత కష్టంలా కనబడటం లేదు.

    ఆ తర్వాత.....

    ఆమె ఊపిరి వేడెక్కింది.

    అచ్చం జంతువుల్లాగా ప్రవరిస్తూ, ఆప్యాయంగా ఆమె వంటిని నాకుతున్నారు ఆ పిల్లలిద్దరూ.

    కానీ, వాళ్ళకు ఇంకా తెలియదు. జంతువుల కంటే కూడా హీనమైన ప్రవర్తన మనుషులదనీ, కుటిలమైన బుద్దికల స్వరూపమీద అభిమానం చూపించబోయి, తాము ఉచ్చులో చిక్కుకుని, చిక్కుల్లో పడబోతున్నామనీనూ.

    పరవశంగా కళ్ళు మూసుకుంది స్వరూప.


                                 *    *    *

   
    మంటలు ఉడుకెత్తించేస్తూ తనని చుట్టు ముట్టేస్తున్నా, తన క్షేమం గురించి అసలు భయపడటం లేదు అనూహ్య. మానవ రూపంలో ఉన్న మహా పర్వతం లాంటి చాంగ్ ని సాహసంగా ఎదుర్కొంటున్న సాగర్ వైపే ఆదుర్దాగా చూస్తోంది.

    ఉరాంగ్ ఉటాన్ కోతి కిచకిచలాడుతూ, మంటలోనుంచీ బయట పడే మార్గం కోసం అన్వేషిస్తోంది.

    సాగర్ వేగంగా పరిగెత్తుతూ వచ్చి, ఎగిరి, తన ఎదురు రొమ్ము పగిలేలా కాళ్ళలో తన్నగానే, బాలన్స్ తప్పి, వెనక్కి విరుచుకు పడ్డాడు చాంగ్. ఆ తాకిడికి అతను  సిద్దంగా లేడు. తన ఆకారాన్నీ, తన బలాన్నీ, తన క్రౌర్యాన్నీ చూసి ఎదుటి వాళ్ళు గజగజ వణుకుతూ సాగిలపడి పోవడమే అనుభవం డ్రాకులా చాంగ్ కి.

    తనని ఎదుర్కొనే ధైర్యం ఇంకో నర మానవుడిలో ఉంటుందని కలలో కూడా ఊహించలేదు అతను.

    పైగా.

    సాగర్ కొట్టిన దెబ్బ సామాన్యమైనది కాదు.

    విసురుగా ముళ్ళ పొదల మీద పడ్డాడు చాంగ్.

    మరుక్షణంలో వేలకి వేల ముళ్ళు అతని శరీరంలో ఖస్సున దిగబడి పోయాయి. అంపశయ్య మీద పడుకున్న వాడిలా ఉన్నాడు. డ్రాకులా చాంగ్. దుర్భరమైన బాధతో వెర్రి కేకలు పెట్టి అటూ ఇటూ కదిలాడు. కలుతున్న కొద్దీ ముళ్ళు మరింత లోపలికి చొచ్చుకు పోయాయి. మరికొన్ని వందల ముళ్ళూ, పిన్నులాంటి ముళ్ళూ, అతన్ని అన్ని వైపుల నుంచీ పొడుస్తూ, గీరుతూ, చర్మాన్ని చీల్చేస్తూ ఉంటే, నరక యాతన అనుభవిస్తూ, మృగంలా పెద్దగా మూలుగుతున్నాడు డ్రాకులా చాంగ్.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra