Home » Vasundhara » Pelli Chesi Chudu


    "ఈసారి మాతో భువనేశ్వర్ రండత్తయ్య - మంచి మందిప్పిస్తాను ...." అంది వసుంధర.
    అదే అనుకుంటున్నానే ....కానీ .....బాధ్యతలు . ఒకళ్ళా ఇద్దరా పదిమంది పిల్లలు .ఇప్పటి కిద్దరు తెరిపిన పడ్డారు. ఒక్కొక్కళ్ళనే సరి నేత్తుకు రావాలంటే పెద్దదాన్ని నేను దగ్గర లేకుండా ఎలా కుదుర్తుంది ?" అంది పార్వతమ్మ.
    'అవున్లేడత్తయ్యా- మీది చల్లని చెయ్యి. మీరు దగ్గరుంటే కానీ...."
    వసుంధర మాటలకు పార్వతమ్మ ముఖంలో వెలుగు కనిపించింది -----' అదేంటే ....పురిటి బాలింత్రాలివి. ఇంతసేపూ ఇక్కడ కూర్చుండి పొతే నేనే గమనించలేదు. నువ్వెప్పుడూ నీగది వదలకు" అంటూ స్వయంగా నడిపించుకుని కోడల్ని గదిలోకి తీసుకు పోయింది. వాళ్ళ వెనకాలే బాబు నెత్తుకుని పార్వతమ్మ కూతురూ వచ్చింది.
    "ఇంట్లో అందరూ పెళ్ళి పనులలో హడావుడి గా తిరుగు తుంటే నాకోక్కత్తికి కూర్చోడానికేదోలా ఉందత్తయ్యా - నేనూ ఏమైనా చిన్న పనులు చేస్తాను ...." అంది వసుంధర.
    "బాగుందేవ్ - నువ్వు పని చేస్తే కానీ అవదనుకుందుకు మనకే మన్నా మనుషులకు తక్కువా - అందరూ తలో పనీ తీసుకుంటే మనుషులే కానీ పన్లు మిగలవు ....' అంది పార్వతమ్మ.
    ఈలోగా రాజారావు అక్కడికి వచ్చాడు - చేత్తో ఒక శుభలేఖ తీసుకుని ....' ఇది మన లక్ష్మీ పెళ్ళి శుభలేఖ వసూ!" అంటూ అతనామెకు అందించాడది.
    ఎన్నో రకాల అనుభూతులతో వసుంధర ఆ శుభలేఖను చూసింది.
    ఆ ఇంట్లో అత్మీయతలే వేరు. మనుషుల మనస్తత్వాలే వేరు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఏ ముహూర్తాన విరజ, వసుంధర ఆ ఇంట్లో అడుగు పెట్టారో కానీ ఆ ఇంట్లో ని అందరికీ అత్యంతాప్తులై పోయారు.  
    "లక్ష్మీ ....." పిలిచింది వసుంధర కాస్త గట్టిగా . లక్ష్మీ పరుగెత్తుకుంటూ వచ్చి ---' ఏం వదినా ...." అనడిగింది .
    లక్ష్మీ వసుంధర కంటే నెలలు చిన్న. అయినా వివాహం ఆడపిల్లలకు వయసునూ మనసునూ పెంచుతుంది. వసుంధర ఒక వదినగా మాట్లాడినప్పుడూ వయసులో బాగా పెద్దదానిలా ఫీలవుతుంది. అందులోనూ ఆమె ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లి . వసుంధర లక్ష్మీని దగ్గరగా తీసుకుని -----' నీ పేరు కూడా కార్డు మీద అచ్చయింది----' అంది.
    లక్ష్మీ సిగ్గుపడి ఆమెను వదిలించుకుంది. ఇంచుమించు ఇదే రకపుటనుభవం నిన్నటి రోజున విరజ వద్ద పొందిందామే.
    వసుంధర కళ్ళకు రాజారావు కనబడి గది గుమ్మం వరకూ వచ్చింది. రాజారావు మండువాలో వున్నాడు. అతను భార్యను చూడలేదు. మోహనరావుతో మాట్లాడుతున్నాడు.
    "శుభలేఖలు అచ్చేయించడమైపోయింది. సోమవారం నాడు పీకల మీద కూర్చుని ఫ్రూఫ్ రీడింగు కూడా పూర్తి చేయించేశాను. మన ఫ్రెండ్స్ సర్కిల్లో ఇవ్వడానికి కొన్ని ఇంగ్లీషు లో వేయించాను. ఇంగ్లీషులో వంద. తెలుగులో అయిదు వందలు ......బ్లాక్ డిస్టర్బ్ చేయవద్దని చెప్పాను. అవసరమయే పక్షంలో మరికొన్ని వేయించాల్సుంటుంది గదా...."
    'అయితే మనమిప్పుడు బంధువర్గం లిస్టు తయారుచేయాలి. పెళ్ళి కొచ్చినా రాకపోయినా శుభలేఖ అందకపోతే మాత్రం నిష్టూరం వేసేవాళ్ళు చాలా మందుంటారు. మనకు ముఖ్యులైన వారందరికీ అందాలి శుభలేఖలు.....అన్నాడు" రాజారావు.
    "ముందు మన బంధు వర్గాన్నేరాలి---" అని ----"విరూ--" అని పిలిచాడు మోహనరావు.
    విరజ వచ్చింది. అంతా వసుంధర వున్న గదిలోకి వెళ్ళారు. నలుగురూ కలిసి తమకు ముఖ్య బంధువుల పేర్లన్నీ రాశారు. మిగతా వాళ్ళు చెబుతుంటే రాజారావు రాశాడు. ఇంగ్లీషు శుభలేఖల గురించి వేరే ఒక ప్రత్యేకమైన లిస్టు తయారుచేశాడు. విరజ వసుంధర తమతమ భర్తలకు - ఆఫీసు మిత్రుల పేర్లు గుర్తు చేసుకోవడంలో సహకరించారు.
    "నాన్నగారు లిస్టు తయారుచేస్తానన్నారు గానీ ఆలశ్యం చేసేస్తారు. మనకు గుర్తున్న బంధువుల పేర్లన్నీ వ్రాసి అయన దగ్గరకు పట్టుకెడితే - మరిచిపోయిన పెర్లుంటే ఆయనే చెబుతారు " అన్నాడు మోహనరావు.
    రాజారావు శ్రీకాంత్ ని పిలిచాడు ---' మనం ఇల్లు వదిలిపెట్టి చాలా కాలమై పోయింది. శ్రీకాంత్ గాదిప్పుడు మంచి టచ్ లో వున్నాడు...." అన్నాడతను.
    శ్రీకాంత్ రాగానే వేరే కాగితం మీద బంధువుల పేర్లన్నీ లిస్తుగా రాశారు. పూర్తికాగానే . "ఇది నాన్నగారికి చూపించు. ఇంకా ఏమైనా పేర్లుంటే చెబుతారు " అన్నాడు రాజారావు.
    'లక్ష్మీని కూడా పిలవండి. తన కాలేజీ స్నేహితురాళ్ళ పేర్లు చెబుతుంది" అంది విరజ.
    మొత్తం మీద అన్ని రకాల పేర్లూ లిస్టులో రాయడమయింది. వెంకట్రామయ్య లోపలకు వచ్చి "మిగతా పేర్లు కూడా ఇందులో రాశాను. ఒక రెండువందలు తెలుగు శుభలేఖలు మాత్రం వేరే అట్టే పెట్టండి. నేనూళ్ళో రైతులకిచ్చుకోవాలి ....'అన్నారు.
    తర్వాత మోహనరావు డ్యూటీలు అప్పగించాడు. ఆ ప్రకారం ఆఖరి చెల్లెళ్ళు ఇద్దరూ శుభలేఖలకూ , కవర్ల కూ నాలుగు పక్కలా పసుపు వ్రాయాలి. పసుపు రాసిన కవర్లకు శ్రీకాంత్, వెంకటరమణ (శ్రీకాంత్ తమ్ముడు) అడ్రసులు వ్రాస్తారు.
    "రేపటికి శుభలేఖలన్నీ పోస్టులో - వెళ్ళిపోవాలి " అన్నాడు రాజారావు.
    "మరి ఈ రోజుకింకా కార్యక్రమమేమిటి?" అన్నాడు మోహనరావు.
    'కూర్చోకోవడానికింకా వీలు పడదండి . ఈరోజు పెళ్ళి ఆవకాయ పెడుతున్నాం" అంది విరజ.
    ఆరోజు ఉదయమే మామిడికాయలు కొని నీళ్ళలో వేశారు. మధ్యాహ్నం వాటిని ఒకరు తుడుస్తుంటే - ఆవకాయ ముక్కలు కొట్టడంలో స్పెషలిస్టుగా పేరు కాంచిన ఆ ఊరు గ్రామ మంగలి వేంకటేశు- ముక్కలు కొట్టేస్తాడు. ఆ ముక్కల్ని విడదీసి - జీడిని తొలగించి ఒక పక్కన వేయడం కొంతమంది చేస్తారు. అలా ముక్కలన్నీ రెడీ అయేక - కారము, నూనె, ఆవపిండి, ఉప్ప వగైరాలతో ఆడవాళ్ళు గుచ్చేత్తిపోస్తారు. అదో పెద్ద తతంగం.
    రాజారావుకూ మోహనరావుకూ చిన్ననాటి స్నేహితుడు బాబు ఇప్పుడా ఊళ్ళోనే పనిచేస్తున్నాడు. అతను హైస్కూల్లో టీచరు. పెళ్ళి పనుల్లో సాయం చేయడానికి అతనూ యధాశక్తి ప్రయత్నిస్తున్నాడు. ఆవకాయ పెడుతున్నారని తెలిసి మధ్యాహ్నం సాయం చేయడానికి అతనూ వచ్చాడు.
    అన్నింట్లోకి సులభంగా ఉంటుందనిపించి మోహనరావు, రాజారావు మామిడికాయలు చ=తుడిచే పని తీసుకున్నారు. బాబు కూడా వాళ్ళతో కలిశాడు. అయితే అది వాళ్ళనుకున్నంత సులువుగా లేదు. కాయ కెక్కడా ఇంత పిసరు కూడా తడి ఉండకుండా శుభ్రంగా తుడవాలి. అందులోనూ ఈ విద్యలో బాబు చాలా సమర్దుడిలా ఉన్నాడు. అతను తను మామిడికాయలను తుడవడం మాత్రమే కాక - రాజారావు మోహనరావులు సరిగా పనిచేస్తున్నారో లేదో అజమాయిషీ కూడా చేస్తున్నాడు.
    'అలాగేనట్రా తుడవడం- స్వంత పనిలో కూడా శ్రద్ధ లేదు నీకు ------' అంటూ మోహనరావు]నీ, రాజారావునీ మధ్యలో దెబ్బలాడుతుండేవాడు. ఒక చిన్న గుడ్డతో బాబయితే చాలా మామిడికాయలు తుడిచేస్తున్నాడు. కానీ - రాజారావుకీ, మోహనరావుకీ ఒకో మామిడి కాయ తుడిచేసరికి గుడ్డ పూర్తిగా తడిసి పోతోంది.
    "ఇలాగై తే - అయిదారు తాన్లసైను గుడ్డ కావాల్సుంటుంది-" అంది విరజ.
    బాబు ఉపాయం చెప్పాడు. గుడ్డను తడికాయను తుడవడానికి కుపయోగించాలి కానీ తడి చేత్తో ముట్టుకునేందుకు వీలు కాదట. ఈ ఉపాయాన్ని రాజారావు అర్ధం చేసుకున్నాడు కానీ మోహనరావుకి పట్టుబడలేదు. అతను చిరాగ్గా ----"నేనో బట్టలషాపు పెట్టేస్తాను -- ఆవకాయ కాయ తుడవడానికి పోగా మిగిలిన గుడ్డల్ని - ఈ నష్టం కూడా పూడుకు పోయే ధరకి అమ్మేస్తాను ---' అన్నాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra