Previous Page Next Page 
లేడీ కమెండో పేజి 2

"చేతులు ముడుచుకుని కూర్చోవడం నావల్లకాదు వీరూ... ఏమయినా తేడాలు వస్తే పంబ రేగ్గొట్టడం మాత్రమే  తెలుసు..."
"ధీరజా... అన్ని రోజులూ ఒకేలా వుండవు. ఏదో ఒక సమయంలో నువ్వు ఏమరిపాటుగా వున్నప్పుడు నీకు ఏదయినా అపకారం తల పెట్టవచ్చు. క్రిమినల్స్ మెంటాలిటీ నీకు సరిగా తెలియదు. వాళ్ళ మనసుల్లో పగ ప్రతీకారాలు పాతుకుపోయివుంటే వాళ్ళు ఎంతకు అయినా తెగిస్తారు. నీ హాబీ అయిన ఫోటో గ్రఫీతో తంటాలు పడక ఇలా ప్రమాదాలు కొనితెచ్చుకోవడం ఎందుకు చెప్పు?" ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు వీరేష్.
పెట్రోలింగ్ స్క్వాడ్ రావడంతో వాళ్ళకు ఆ యువకులను అప్పగించాడు.
"నువ్వు ఎన్నయినా చెప్పు వీరూ-నాకు ఆ పిరికితనం రమ్మన్నారాదు... అయినా నాకు ఏమీ జరగకుండా చూసుకొనడానికి నువ్వు వున్నావుగా" చిలిపిగా అంది.
"ఆఁ.."
"అవునుమరి నా కలల సుందరుడివి... పై పెచ్చు నాకు కాబోయే మొగుడువి నాకు అండగా వుంటే నాకు ఎందుకు భయం? కమాన్... ముందు నన్ను ఇంటిదగ్గర డ్రాప్ చేయి..." అంటూ ధీరజ కారులో అతని పక్కనే కూర్చుంది.
వీరేష్ మౌనంగా కారు స్టార్ట్ చేశాడు.
   
                                                     *    *    *    *
చిక్కని చీకటి.
ఫవర్ కోత కారణంగా రాష్ట్ర రాజధానిలో సయితం ఆ సమయంలో లైట్ల్టు వెలగడంలేదు.
జనసంచారంతో సంబంధం లేనట్టు దూరంగా విసిరివేసినట్టు వున్నది ఆ కాలనీ.
ఆ కాలనీలోచివరగా ఒకే ఒక పాడుబడిన భవంతి. నిజానికి అది పాడుపడ్డ భవనంకాదు. ఒకప్పుడు ఇన్ డోర్ ఘాటింగ్ లతో ఎంతో  బిజీగా వున్న స్టూడియో... కానీ నేడు సినిమా షూటింగ్ లకు నోచుకోలేక... అసలు స్టూడియో నడపడమే కష్టమైన సంకట పరిస్థితులలో మూతపడి పోయిందది.
వాస్తవానికి మూతబడిందే తప్ప శిధిలమై పోలేదు.
ఆ భవంతి ఆవరణలో వున్న చెట్లకింద అంత చీకటిలో సయితం నలుగురు వ్యక్తులు కూర్చుని వున్నారు. వాళ్ళు మాటిమాటికీ గేటు వైపే తొంగి చూస్తున్నారు.
తెల్లటి సూట్ వేసుకున్న వ్యక్తి సూట్ కేస్ తో నింపాదిగా నడచి రావడం గమనించి అ నలుగురూ లేచి అతనికి ఎదురు వెళ్ళారు.
"అంతా సిద్దంగానే వుందికదా" అడిగాడు సూట్  వాలా.
"ఎలాంటి ట్రబుల్ లేదు బాస్... అంతా సవ్యంగానే వుంది... మీ కోసం పావుగంటనుంచీ పార్టీ ఎదురు చూస్తుంది" అన్నాడు వాళ్ళలో ఒకడు.
మారూ మాట్లాడకుండా లోనికి నడిచాడతను.
బూజు పట్టిన సినిమా సెట్టింగ్ ల మధ్య కూర్చుని వున్న ముగ్గురు వ్యక్తుల చూపులు లోనికి వస్తున్న సూట్ వాలాపై పడ్డాయి.
అంతవరకూ వాళ్ళలో తొంగిచూస్తున్న ఆదుర్దా మాయమైంది.
"ఆయియేసాబ్... ఆయియే... మీతో మేం చేసే వ్యాపారం నాలుగునోట్లు, ఎనిమిది కట్టల్లా దినదినాభివృద్ది చెందాలనుకుంటున్నాను" ముగ్గురిలో మధ్యలో నున్నతను అన్నాడు_
మిగిలిన ఇద్దరూ అతని బాడీగార్డ్స్!
"ఇట్స్ ఆల్ రైట్... మధ్యలో కారు ట్రబుల్ ఇవ్వడం వలన కొద్దిగా ఆలస్యం అయింది" అంటూనే తన చేతిలోని సూట్ కేస్ ని అనుచరుల చేతికి ఇచ్చాడు.
ఒకడు తెరచి చూపించాడు...
మరొకడు టార్చ్ ఫోకస్ చేశాడు....
అందరికళ్ళు జిగేల్ మన్నాయి....
అన్నీ వందరూపాయల నోట్లు... ఫెళఫెళలాడే కొత్త కరెన్సీ నోట్లు... వాటిని చూడగానే ముగ్గురి ముఖాలు మాటా బుల్లా వెలిగి పోయాయి... తమ దగ్గర వున్న సూట్ కేస్ ను కూడా తెరచి, వాళ్లలానే లైట్ ఫోకస్ చేసి చూపించాడు.
అన్నీ వందరూపాయల నోట్లు... ఫెళఫెళలాడే కొత్త కరెన్సీ నోట్లు....వాటిని చూడగానే ముగ్గురి ముఖాలు మతాబుల్లా వెలిగిపోయాయి.... తమ దగ్గర వున్న సూట్ కేస్ ను కూడా తెరిచి, వాళ్ళలానే లైటు ఫోకస్ చేసి చూపించాడు.
అవీ వందరూపాయల నోట్లే....కాకపోతే కొత్తవికావు... బాంక్ నుంచి డ్రా చేసినట్టు బాంక్ లేబుల్స్ వున్న పాత నోట్ల కట్టలు... అంతే తేడా!
రెండు సూట్ కేసులూ చేతులు మారాయి.
పాత నోట్లువున్న సూట్ కేస్ ఇచ్చి కొత్త నోట్లు వున్న సూట్ కేసుని తీసుకున్నవాళ్ళ ముందుకు అడుగు వేయబోతున్నంతలో... ఛక్ మంటూ ఫ్లడ్ లైట్లు ఒకటి వెలిగింది.
అసలు ఆ వెలుతురు ఎక్కడనుంచి వచ్చిందో....ఎలా వచ్చిందో ఎవరు వెలిగించారో... ఎందుకో తెలియకపోయినా... ఇరు పక్షాలవాళ్ళు ఖంగారుపడ్డారు.
"మైగాడ్... ఎవరో మనలను వాచ్ చేస్తున్నట్టు వున్నారు..." అన్నాడు సూట్ వాలా.
మరుక్షణంలోనే ఎవరి సూట్ కేసులను వాళ్ళు గట్టిగా పట్టుకుని పరుగులాటి నడకతో బయటకు పరుగుదీయపోయారు.
కానీ ఎన్నో అడుగులు పడలేదు...
ఒక చేతిలో టార్చ లైట్... రెండోవ చేతిలో రివాల్వర్ తో వాళ్లకు ఎదురుగా యమదూతలా నిలబడి వున్నాడు ఒకతను...
అతనిని చూడగానే అదిరిపడ్డారంతా!
"చతుర్వేది...." సూట్ వాలా అసంకల్పితంగానే అన్నాడు__
"ఎస్... చతుర్వేది.... ఇన్ స్పెక్టర్ చతుర్వేదీనే.... ఇన్నాళ్ళకు నిన్ను రెడ్ హాండెడ్ గా పట్టుకోగలిగాను జయచంద్రా_ వీధిగుండా స్థాయి నుండి నువ్వు నడిపే రౌడీయిజం పెరిగి పెద్దదై ఈనాడు దొంగనోట్లు సరఫరా చేసే  స్థాయికి ఎదిగిందంటే ఇంకా నిన్ను ఉపేక్షించకూడదు. ప్రతిసారీ ఎవరో చలవవల్ల కేసులు లేకుండా బయటపడుతున్నావు. ఈసారి నిన్ను ఎవరు నిర్దోషిగా విడిపిస్తారో చూస్తాను..." ఇన్ స్పెక్టర్ చతుర్వేది పట్టుదలగా అన్నాడు.
అప్పుడే జరిగి పోయింది ఒక సంఘటన....
ఇన్ స్పెక్టర్ ఒక్కడే వచ్చాడనీ... వెనుక పోలీసులు ఎవరూలేరని అర్ధం కావడంతో మిగిలిన అనుచరులతో ధైర్యం వచ్చి అందరూ ఒక్కసారిగా చతుర్వేదిపై కలపడ్డారు.
ఊహించని ఆ ఎదురుదాడికి చేతిలోని టార్చ్ లైట్ దూరంగా పడిపోయింది. దాని వెలుతురు ఎటో పడుతుంది. రివాల్వర్ తో ఘట్ చేయక ముందే అతనిని చుట్టుముట్టి అన్నివైపుల నుంచి దాడి చేశారు.
చతుర్వేది చేతిలోని రివాల్వర్ చీకట్లో జారి పడిపోయింది. చీకటిలోనే తమ పనులను దిగ్విజయంగా పూర్తి చేయగలం అన్నట్టు ఎంతో నేర్పుగా చతుర్వేదిని చితక కొడుతున్నారు.
ఎంతో ధైర్యం కలిగినవాడు... ఒట్టి చేతులతో నలుగురిని మట్టి కరిపించ గలిగిన వాడుగా పేరు పడిన చతుర్వేది ఆ చీకటి పోరాటంలో వాళ్ళ ముందు నిలువలేక నెత్తురు ఓడుతున్న శరీరంతో నిస్సత్తువుగా నేలమీదకు జారిపోయాడు.
జయచంద్ర దూరంగా పడి ఉన్న టార్చ్ లైట్ ను తీసుకుని అతనిపైకి ఫోకస్ చేశాడు.
"మైడియర్ ఇన్ స్పెక్టర్... నేను ఇంతవరకూ రాజకీయనాయకునిలానే తెలుసు తప్ప దొంగ నోట్ల రాకెట్ ను నడిపే విషయం ఎవరికీ తెలియదు. ఇప్పుడు నన్ను గురించి తెలిసిన ఏకైక పోలీస్ అఫీసర్ వి నువ్వే... అందుకే నువ్వు బ్రతికి వుండటానికి వీలులేదు.యూ ఆర్ ఫినిష్ డ్..." రక్తపు ముద్దలా పడివున్న  చతుర్వేదిని వినోదంగా చూస్తూ అన్నాడతను.
చతుర్వేది తెల్లముఖం వేశాడు.
అతనిని ఏం చేయాలో అనుచరులకు సూచనలు ఇచ్చి కారులో వెళ్ళిపోయాడు జయచంద్ర.

 Previous Page Next Page