"రేండ్రోజుల్నుంచి వంట్లో బావోటం లేదని పోద్దున చెప్పింది బాబూ! పొద్దున్న జోరం బాగా ఎక్కువైందనుకుంటా, నేను చూసినప్పుడు మూలుగుతుంది. 'డాక్టరుకు చూపించుకోపిల్లా ' అని చెప్పి వెళ్ళిపోయాను. రాత్రి పదింటికి దీపం ఎలాగటం లేదేమో అని చూస్తే సచ్చిపోయి వుంది. పాపం, చాన మంచిపిల్ల బంధువులు ఎక్కాడున్నారో తేలేదు. ఓటులేసుని పిల్చి చూపించిన ."
మిగతాది అర్ధమయింది. చిరంజీవికి. ఆ ఓటులేసు వచ్చి ఇతడికి చెప్పడాన్నమాట .
అతడు ఏ విధమైన లోసుగులూ వుంచదల్చుకోలేదు. ఆమెకు రెండురోజుల్నుంఛీ వున్నది మామూలు జ్వరమేననీ, ఏడాక్టరూ వచ్చి చూడలేదనీ నిర్ధారణ చేసుకున్నాడు. ఎందుకంటే ఆ తరువాత పోలీసులు పేపర్లో పోటో ప్రకటించటం లాటిదిచేస్తే మళ్ళీ డాక్టరువఛిఉ అది సహజ మరణంగా చెప్పకూడదు. టెంపరేచర్ యెక్కువై, కోమాలోకి వెళ్ళి, పట్టించుకునే నాధుడులేక చచ్చిపోయినా ఆ అనాధ అమ్మాయి! తనకి కావాల్సింది అలాటి చావే.
ఆ తరువాత అవ్వని వప్పించటం కష్టంకాలేదు. ఆవిడ ఒకరకంగా సంతోషించింది కూడా. ప్రొద్దున్నే జనం మూగతం శవాన్ని తీసుకెళ్ళ ఇళ్ళు పడుపెట్టాలీ అంటే అద్దే పోతుంది, అది మరీ బాధిస్తుంది ఆవిడని. దాన్ని గుర్తించాడు. చిరంజీవి యాబై రూపాయలు చేతులు మారేసరికి అవ్వతొం మారిపోయింది. "తీసుకేల్లుబబూ. పాపం బతికున్ననన్నిరోజులూ ఎవరూ పట్టించుకోనేలేదు. ఇన్నాళ్ళకి నువ్వోచ్చావు. " అంది.
అ తరువాత పని చకచకా జరిగిపోయింది.
ఏ పనికోసమే వేరుగా తీసిపేట్టి వుంచిన డబ్బు దారాసింగుకి ఇచ్చేసేడు. అతడు సలాం చేస్తూ "మళ్ళీ ఏదైనా శవం కావల్సోస్తే చెప్పండి సాబ్. ఈ వూళ్ళో యిట్లా౦టి చావులెన్నో" అన్నాడు.
"ఊరేమిటి__ దేశంలోనే ఎన్నెనో" అనుకున్నాడు చిరంజీవి మనసులో పైకిమాత్రం "అక్ఖర్లేదులేవోయ్ " అన్నాడు. అతడు వెళ్ళిపోయాక సర్వోత్తమరావుకి ఫోన్ చేసి నిద్రపోలేడు.
శవం గురించి చెప్పగానే అయన నిద్రమత్తు వదలిపోయింది. చిరంజీవి తనెక్కడ వున్నదీ గుర్తులు చెప్పాడు. పడుహేను నిముషాల్లో అయన కారేసుకుని వచ్చాడు.ఇద్దరూ తిరిగి ఆ ఇంటికొచ్చారు. శవం అలాగే వుండి.
శవాన్ని తీసుకొచ్చి కార్లో పడుకోబెట్టారు. గూట్లో వున్న ఆమె బెడ్తున్నప్పుడూ అయన పోటోలు తీసేడు.
వెనుక సీట్లో శవాన్ని వేసుకొని కారులో వూరి చివరికి వేళ్ళారు ఇద్దరూ.
సత్రం వెనుక పాడుబడిన బావి వుంది. కొంచెం దూరంగా తుప్పులున్నాయి.కారు బోయినేట్ మీద కాగితం పేట్టి చిరంజీవి ఒకుత్తరం వ్రాసేడు.
ఆ కాగితాన్ని సుశీలా! మన సమస్యలు చాలా చర్చించాలి. సాయంత్రం అతిమ్తికి సత్రం దగ్గరికి రా__ చిరంజీవి"
ఆ కాగితాన్ని ఆమె హండ్ బ్యాగ్ లో పేట్టి దూరంగా తుప్పుల్లోకి విసిరేసాడు.
ఆ తరువాత శవాన్ని కార్లోంచి దింపేరు. బావిపక్కగా పడుకోబెట్టి చిరంజీవి గొంతు నులిమేడు. అతడా పనిచేస్తూ వుండగా అయన బెట్టి చిరంజీవి గొంతు నులిమేడు. అతడా పని చేస్తూ వుండగా అయన ప్లాష్ తో ఫోటోలు తీస్డు. ఆ తరువాత శవాన్ని బావిలోకి తోస్తూ వుండగా -మరోసారి పోటోలు తీయపడ్డాయి.
ఆ తరువాత చిరంజీవి తనతోపటుతెచ్చిన సిగరెట పాకెట్ విప్పి నాలుగైదు సిగరెట పీకలు తుప్పుల్లో _ ఆమె పర్సు విసిరేసిన చోట పదేసేడు. బావి గట్టుమీదా, అంచుమీదా ముద్రలు పడేటట్టు వెళ్ళు అద్దేడు.
ఇదంతా చేస్తున్నప్పుడు ఇద్దరూ మౌనంగా ఎవరిపని వాళ్ళు చేసుకోబోయే రోదసీ యాత్రికుల్లా రాజ్యంగంలో ఒక గొప్ప మార్పుకోసం వారు చేస్తున్నా అద్భుత ప్రయత్నాన్ని ముండుముండుదేశంగుర్తించవచ్చుగాక_ లేకపోవచ్చుగాక. కాని వాళ్ళు దానికోసం తీసుకుంటున్న రిస్కు మాత్రం అభినందనీయం.
అయితే ఆ రిస్కులోఏ మాత్రం లోసుగులూ లేకుండా చూడటానికి ఆ ప్లాన్ వెనుకల సర్వోత్తమరావు మేదడువుంది. అందుకే చిరంజీవి "నన్ను యింటిదగ్గరదింపేసి మీరు వెళ్ళిపొండి" అన్నప్పుడుయన నవ్వేడు. "అప్పుడే మన పని పూర్తీకాలేదు" అన్నాడు.
"ఇంకేముందీ? రేపు పోలీసులు వచ్చి నన్ను అరెస్టు చేయటమెగా" అన్నాడు చిరంజీవి.
"ఈ పోటోలు నాలుక్కర్చుకొని, "అవును. అంత ముఖ్య విషయమే మర్చిపోయాను" అన్నాడు ఇద్దరూ కార్లో లాయరుగారింటికి వెళ్ళారు. కార్లో అయన అన్నాడు_ "ఒకవేళ ఈ పోటోలుగాని సరీగ్గా రాకపొతే మనం తిరిగిబావి దగ్గరకి వెళ్ళాల్సి వుంటుంది."
అయితే ఆ అవసరం రాలేదు.
సర్వోత్తమరావు ఇంట్లోనే డెవలపింగ్ పరికరలున్నాయి. లైట్ ఆఫ్ చేసి, ట్రేలో డెవలప్సర్ వేసి నెగిటివ్ కదిగేడు. అది ఆరగానే కట చేసి ఎన్ లర్జార్ లో ఫిక్స్ చేసి లైటు వేసేడు. క్రింద ప్రింటుమీద బొమ్మ పడింది. లెన్స్ కదిపేకొద్దీ బొమ్మ పెద్దదవాసాగింది. ప్రింట్లన్ని కడగటానికి అరగంట పట్టింది.
మెదటి ఫోటో..... గదిలో ఒక మూలగా శవం. షుశీలడని స్పష్టంగా తెలుస్తూంది.
రేండో ఫోటో ఆ అమ్మాయి శరీరాన్ని చిరంజీవి కార్లో పెట్టటం.
మొత్తం పోటోలన్నీ వరసుగా ఎన్ లార్జ్ చేసేరు. జరిగిన కథంతా మరెవరూ చెప్పనవసరం లేకుండా అవే చెబ్తున్నాయి.
వాటిని భద్రంగా దాచిన తర్వాత చిరంజీవి ఇంటికి వెళ్ళిపోయాడు.
అప్పుడు రాత్రి మూడయింది.
* * * *
మరుసటిరోజు చిరంజీవికి మెలుకువ వచ్చేసరికి తోమ్మిదయింది. తొందర తొందరగా పక్కింటికివెళ్ళి పేపరడిగి తిరిగేసేడు. మొత్తం అంతా చూసినా ఎక్కడా ఏమీ న్యూస్ కనబడలేదు.