ఛైర్మన్ ని, క్షణకాలంలో సవాలక్ష అనుమానాలు, ఆలోచనలు చుట్టుముట్టాయి.

 

    అలా అని రాఘవేంద్రనాయుడ్ని అడిగే ధైర్యం చేయలేకపోయాడు.

 

    ఇంటర్ కమ్ నొక్కి సర్వేయర్ ని, ఆర్.డి.ఓని జరూర్ గా పిలిపించమని ఆజ్ఞలు జారీ చేసాడు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్.

 

                           *    *    *    *    *

 

    "అవును! నేనే కావాలని నిన్ను రెచ్చగొట్టించి మా బార్ ని ముప్ఫై లక్షలకు నీతో కొనిపించాను. అందులో నీ అహం, వెర్రిబాగులతనం ఎంతున్నాయో గమనించావా?" మహతి కావాలనే పెంకిగా సమాధానమిచ్చింది మధుకర్ కి.

 

    అతనికేం చేయాలో క్షణకాలంపాటు పాలుపోలేదు. చుట్టుప్రక్కలున్న స్టూడెంట్స్ ఊపిరి బిగబట్టి, కనురెప్ప వేయటం మర్చిపోయి, శిలాప్రతిమల్లా బిగుసుకుపోయి చూస్తున్నారు.

 

    క్షణాలు భారంగా, బరువుగా కదిలి, కరిగిపోతున్నాయి.

 

    జీవితంలో ఎప్పుడూ ఎదురవ్వని ఘోరమైన అవమానం. అదీ తనని ఎంతగానో ప్రేమించిన మహతి ద్వారా. మధుకర్ లో ఆ షాక్ కి గడ్డకట్టిన రక్తం ఒక్కసారి ఉవ్వెత్తున పెనుతుఫానులా రేగి అతన్ని కుదిపివేసింది. ఆగ్రహావేశాలతో ఊగిపోయాడు. కళ్ళు రక్తం చిమ్ముతున్నట్లుగా ఎర్రబారాయి.

 

    ఎంతో ఆరోగ్యంగా, దృఢంగా ఉండే మధుకర్ శరీరం ఉద్రేకంతో, ఉద్వేగంతో వణికిపోతోంది.

 

    అక్కడ ఆ క్షణాన భూకంపమే పుడుతుందో, అగ్నిపర్వతమే బ్రద్ధలయిలావాని వెదజిమ్ముతుందో అని ప్రతి ఒక్కరూ తీవ్రమైన ఉద్రిక్తతకి గురయ్యారు.

 

    అన్ని వందలమంది అక్కడున్నా నిశ్శబ్ద గంభీరత ఆ ప్రాంతాన్ని దుప్పటిలా కప్పేసింది.

 

    ఒక్కసారి నిర్జీవ పదార్థానికి చలనం వచ్చినట్లయింది.

 

    మధుకర్ పెనువేగంతో కదిలి రెండంగల్లో మహతిని సమీపించి, పట్టరాని ఆగ్రహావేశాల్ని ప్రదర్శిస్తూ, ఆమె కళ్ళలోకి చూసాడు.

 

    మహతి భయపడలేదు.

 

    అంతకు ముందు ఎలా వుందో అలాగే నిశ్చలంగా, అదే స్థాయి నిబ్బరంతో మధుకర్ కళ్ళలోకి చూసింది.

 

    ఏదో చేయాలి. తనకి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి. అదేమిటి? ఎలా? అనే సందిగ్థత నడుమ కొద్ది క్షణాలూగిపోయాడు మధుకర్.

 

    మహతిని ఎప్పటికయినా తన భార్యగా చేసుకు తీరాలి. అదే నిశ్చయమనుకున్నప్పుడు తనప్పుడు ఏ అవమానం చేసినా, తిరిగి అది తనమీదే రిఫ్లెక్ట్ అవుతుంది.

 

    మహతి భవిష్యత్ తనకక్కర్లేదని అనుకుంటే తనిప్పుడు ఏమిచేసినా తనలో రేగిన పగ, ప్రతీకారం చల్లారిపోతాయి. అవమానభారం ఉపశమింప బడుతుంది. కానీ తను ఆమెను కోరుకుంటున్నాడే?

 

    ఎలా? ఏం చేయాలి? అని అతడు మీమాంస అంచుల్లో కొట్టుమిట్టాడుతుంటే- కోట్లకు కోట్లు సంపదకు వారసుడయిన మధుకర్ తలచుకుంటే ఆమెని అక్కడికక్కడ ముద్దు పెట్టుకోగలడు, రేప్ చేయగలడు. కానీ అలాంటివి చేసే ప్రయత్నంలో లేనట్లుగా వున్నాడే అని చాలామంది బాధపడిపోతున్నారు.   

 

    మధుకర్ భౌతికపరమైన ప్రతిస్పందన ఎలా వుంటుందనేది ఎవరికీ అర్థం కావటం లేదు. అనూహ్యంగా కూడా వుంది.

 

    మరికొద్ది క్షణాలు...

 

    మధుకర్ ఆమె భుజాన్ని పట్టుకున్నాడు.

 

    ఒక్కక్షణం ఆమెను కుదిపివేసాడు నిలదీస్తున్నట్లుగా. అందుకామె ముఖంలో ఎలాంటి ప్రతిస్పందన కనిపించలేదు. నో రియాక్షన్! నిర్వికారంగా, నిర్లక్ష్యంగా కనిపించింది.

 

    అప్పుడు... ఆ క్షణాన మధుకర్ తలుచుకుంటే ఏదయినా చేయగలడే! అతనికి అడ్డువచ్చే వారెవరూ లేరే! మరేమిటామే తెగువ? ధైర్యం?

 

    సంగీతా బిజ్ లానీ షేప్ లో తీర్చిదిద్దినట్లుండే అందమైన మహతి, ఆమె అందమైన బరువైన హిమోన్నతాలు, ఆమె వేసుకున్న చోళీ మాటున వూగిపోయాయి. మధుకర్ ఆమె భుజాల్ని పట్టుకుని కుదిపిన చర్యకు లేత పసుపు పచ్చ రంగులో ఒకింత పారదర్శకంగా వున్న ఆమె చోళీ లోపల వున్న బ్రాసియర్ అస్పష్టంగా కనిపిస్తోందందరికీ. క్లీవేజ్ లో సన్నని బంగారపు గొలుసు శంఖంలాంటి మెడ. పేల్ ఎల్లో కలర్ బంగారంతో కలిసినట్లుండే ఆమె మెడ నిర్మలంగా, ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా మెరుస్తోంది.

 

    ఆ మాత్రమైనా ఆమెను ముట్టుకున్న మొట్టమొదటి మగవాడు మధుకర్ కావటం, అక్కడున్న చాలామందిలో అసూయని రగిలించింది.

 

    ఆ ప్రాంతం నుంచి సాగిపోతున్న చిరుగాలి మెత్తటి ఒత్తిడికి నల్లటి మేఘంలా ఆమె వీపంతటినీ పర్చుకున్న పట్టుకుచ్చులాంటి మృదువయిన ఆమె జుత్తు పచ్చటి పైరు చివర లేత చిగురుల్లా అలల్లా కదిలిపోతున్నాయి. బాపూ కుంచె చివర నుంచి జారిన నండూరి ఎంకిలా వున్న మహతికేసి చూస్తున్నారు అక్కడ గుమికూడిన విద్యార్ధులు కన్నార్పటం మర్చిపోయి.

 

    అంతలో అన్నాడు మధుకర్ బిట్టర్ గా-

 

    "ఇదే నీకిస్తున్న ఆఖరి అవకాశం! మరోసారి నన్ను అవమానించే ప్రయత్నం చేస్తే, ఫలితం దారుణంగా వుంటుంది. ఇకపై నీ జోలి నా కనవసరం. నా జోలి నీకనవసరం అని గుర్తుంచుకో" అని అంటూనే ఆమె భుజాన్ని విసురుగా వదిలేసి వడివడిగా ఆ ప్రాంతం నుంచి అదృశ్యమయిపోయాడు.

 

    ఏదో అవుతుందని కొంతసేపు, ఏమీ అవ్వకుండానే దృశ్యం చప్పబడి పోయిందే అని ఆ తరువాత అనుకొని వాపోతూ ఎవరిదారిన వాళ్ళు వెళ్ళి పోయారు చుట్టూ గుమికూడినవాళ్ళు.

 

                              *    *    *    *    *

 

    క్రా ఫోర్డ్ సెంటర్ లో సడెన్ గా నాలుగు కార్లు, రెండు జీపులు వచ్చి ఆగాయి.

 

    ఒక కారులోంచి రాఘవేంద్రనాయుడు దిగి, నలువైపులా క్రితం కన్నా, మరింత పరిశీలనగా చూసాడు. ఆ వెనకే అర్బన్ డెవలప్ అథారిటీ ఛెయిర్ మెన్ దిగాడు ఆదరాబాదరాగా.

 

    స్థలం ఇప్పించమని ఏదయినా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మీకు అప్లికేషన్ పెట్టుకుందా?" రాఘవేంద్రనాయుడు ప్రశ్నించాడు.

 

    "పెట్టుకున్నాయి."

 

    "ఏ ఏ సంస్థలు?"

 

    "ఫిషరీస్ డిపార్ట్ మెంట్ వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కట్టుకోవటం కోసం రెవెన్యూ డిపార్ట్ మెంట్ వాళ్ళు- ఒ.ఎన్.జి.సి. వాళ్ళు అడిగారు.

 

    "మీరేమన్నారు?"

 

    "ఇంకా ఏమనలేదు. అయినా మా చేతిలో స్థలం వుండాలిగదా?"

 

    "కుడివైపు స్థలం ఇస్తేపోలా?"

 

    "కుడివైపు స్థలమా? అది మా సంస్థది  కాదే!"

 

    "అయితే డ్రామా ఏముంది? మీది కాని స్థలాన్ని ముందు మీ స్థలంగా చేద్దాం. ఆపై ఒ.ఎన్.జి.సి.కి ఇచ్చేయండి. గొప్ప భవిష్యత్ వున్నది ఒ.ఎన్.జి.సి.కే- దాంతో ఈ ఏరియాకి డిమాండ్ పెరుగుతుంది."

 

    రాఘవేంద్రనాయుడు అన్నదేమిటో ముందు అర్బన్ డెవలప్ ఛైర్మన్ కి అర్థంకాలేదు. కొద్దిక్షణాలకు అర్థం చేసుకుని ఒక ప్రశ్న వేశాడు-                          

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra