Previous Page Next Page 
అమ్మో! అమ్మాయిలు పేజి 17

    " అనను లేవోయ్ అబ్బులూ! వరస కలిపితే తప్పు ఏం మనుషులో ఏమిటో?"

    " మికు వరసలు కలపటం తప్ప మరేం పనిలేదు. మికు మి ఆవిడకు అందరూ అల్లుళ్ళే . మి కన్యకి అందరూ పతిదేముళ్ళే.

    " అల్లుడికి యిప్పుడేకదా వచ్చింది. కాసేపు వాళ్ళని సర్దుకొనిస్తారా? తర్వాత పంచభక్ష్య పరవాన్ణాలతో అల్లుళ్ళని విందుకి ఆహ్వానిద్దురు గాని వెళ్ళండి" అంది జయచిత్ర.

    " అల్లడిని చూడబోతే ఏ అమ్మాయో వచ్చి ముందే గద్దలా వాలుతున్న దాయే. పద... పద..." కోపంగా జయచిత్రను చూసి పెళ్ళాన్ని, కన్నె పిల్లని తోలు కెళ్ళాడు సుందర్రామయ్య.

    జయచిత్ర ముఖం కోపంతో, సిగ్గుతో ఎర్రపడింది.

    " డోంట్ వర్రి" అన్నాడు అబ్బులు భూతద్దాల్లోంచి.

    జయచిత్ర ముఖం మరింత కందిపోయింది. అప్పుడే ఈనిన ఆడవులిలా గుర్రమంటూ చూసింది అబ్బులి వైపు.

    వాతావరణం వేడిగా వుందని గ్రహించి వ్యాకర్ణ వేడిగాల్పు వీచకముందే తెలివి తెచ్చుకుని నిట్లో వేలుంచుకుని గట్టిగా వేలు కొరుక్కుని " అబ్బా!" అన్నాడు.

    " ఏమయిం దేమయిందంటూ" అబ్బులు, జయచిత్ర ఆదుర్దాపడి వ్యాకర్ణ వద్దకొచ్చారు.

    ఏదో చెప్పేశాడు నోట్లో నాలుకున్న వ్యాకర్ణ.

    వ్యాకర్ణ, అబ్బులు ఉన్న కొద్దిసామాను నీట్ గా గదిలో సర్దుకున్నారు.

    ఓ పదినిమిషాలు అక్కడే నుంచిని ఆ తర్వాత బామ్మగారితో బైటికి నడిచింది జయచిత్ర.

    " ఎలా వుందిరా అబ్బాయ్ మనిల్లు?" తీరుబడిగా చాపమిద జార్లపడి వ్యాకర్ణ అడిగాడు.

    " ఒరేయ్ వ్యాకర్ణం! మాటలు సరీగా రానియ్యి. బతికి బట్ట కాట్టాలని లేదా? నాలుగు కాలాలపాటు బతకాలని లేదా?" అంటూ కోప్పడ్డాడు అబ్బులు.

    " కారణం చెప్పికళ్ళెర్ర చేయరా అబ్బూ!"

    " బుర్ర లేకుండా మాట్లాడుతూ యింకా కారణం చెప్పాలా? మనిల్లట మనిల్లు. నీ తాతానా తాతా కలిసి కట్టిచ్చినట్లు మాట్లాడుతున్నావు.

    ఆ పిల్ల రాక్షసి విన్నదంటే వీళ్ళేవరో తిన్న యింటి వాసాలు లెక్కపెట్టే రకం అనుకుని వెంటనే రూమ్ ఖాళీ చెయమంటుదిరా బాబు."

    వ్యాకర్ణ ముఖంలో చిరునవ్వు చిందులాడింది అబ్బులు మాటలు విని. " చూడబ్బూ! మనిల్లంటే తప్పొచ్చిందా? యిప్పుడు నువ్వన్న మాటే?

    ఆ జయచిత్రా దేవి విన్నంటే మక్కెలు, కొంకులు బొమికలు విరగ్గొట్టి వీధి గుమ్మానికి తోరణంలా తగిలిస్తుంది" అన్నాడు.

    " నేనేం కానిమాటన్నారా కర్ణా?" అన్నాడు అబ్బులు అయోమయంగా.

    " ఏను మనిల్లు అన్నాను. ఆ మాటని ఎలాగో అలా సమర్ధించుకోవచ్చు. నీవేమన్నావ్! జయచిత్రను పిల్ల రాక్షసి అన్నావ్. బాగుందా?"

    " ఊ అలా వప్పుకో, బాగుపడిపోతావ్! మనం ఈ యింట్లో నాలుగు కాలాలపాటు చల్లగా వుండాలంటే ముందు కాకా పట్టాల్సింది బామ్మాగారిని కాదు. జయచిత్రని. అవునా?"

    " ఎస్" అని యింగ్లీషులో వప్పేసుకున్నాడు అబ్బులు.

    " నీవూ వప్పుకున్నావు కాబట్టి ఉపాయం చెపుతాను విని ఆచరించు. నీ అంతటి వాళ్ళు లేరంటే ఎవరైనా బూరె లాగా పొంగి బుట్టలో పడతారు.

    మనం జయచిత్రను, అప్పుడప్పుడు మాటల మధ్యలో జయచిత్ర కళ్ళు, వళ్ళు వగైరా అవయవాలను వర్ణిస్తూ పొగుడుదాము.

    ఎలా అంటే జయచిత్రా! నీ మాటలు భలే బాగుంటాయి. నీవు నవ్వితే ముత్యాలు రాలినట్టే వుంటారు, అలా  అన్నమాట." 

 Previous Page Next Page