"అందమైన ప్రకృతికి వెండి పట్టీలు, బంగారపు వడ్రాణంతో ముస్తాబు చేసినట్లుగా వుందా క్షణంలో మహతి.

 

    తన ఫ్రెండ్స్ తో కూర్చుని ఏదో పిచ్చాపాటి.

 

    "మధుకర్ అలాగే మధ్యలో అర్థాంతరంగా వచ్చేశాడు- నువ్వు అలా వచ్చేశావు. ఏమయింది మీకు? వాళ్ళెంతలా బాధపడతారో?" ఒక యువతి అంది మహతిని ఉద్ధేశించి.

 

    మహతి సమాధానమివ్వలేదు.

 

    తొలకరి వానకు పరవశించే ప్రకృతిలా మృదువుగా, మెత్తగా నవ్వి వూరుకుంది.

 

    "పొగరు, అహంభావం, ఆస్తీ, అభిజాత్యం వున్న ఒక యువకుడ్ని రెచ్చగొడితే నష్టం ఏ రూపంలో ఎలా కబళించుకుపోతుందో నీకు తెలీదనుకోను. దేన్నీ తెగేదాక లాగవద్దు" అని ఒకరన్నారు.

 

    కాలేజీ క్యాంపస్ అంతా హడావిడిగా వుంది.

 

    క్లాసులకు వెళ్ళేవాళ్ళు, క్లాసులయిపోయి వస్తూ, గూట్లోంచి ఎగిరి వచ్చే పక్షుల్లాంటి రంగు రంగుల సీతాకోక చిలుకల్లా భ్రమింపజేసే స్టూడెంట్స్, నవ్వుతూ, త్రుళ్ళుతూ, రకరకాలుగా స్పందిస్తూ కేంపస్ కి వింత శోభను తెస్తున్నారు.

 

    ఏ మూలగా పున్నాగ చెట్టుక్రింద వున్న సిమెంట్ బెంచ్ మీద కూర్చున్న మహతి, ఆమె ఫ్రెండ్స్ ఒకింత ఉద్విగ్న క్షణాల్ని పంచుకుంటున్నారు.

 

    అప్పటికే మహతి మధువన్ బార్ ని మధుకర్ మత్తులో పడి ముప్ఫయ్ లక్షలకు కొన్నాడనే వార్త కాలేజ్ అంతా గుప్పుమంది.

 

    "ఏం చేస్తాడంటావ్?" పొగరుగా అంది మహతి.

 

    "ఏదైనా చేయగలడేమో?"

 

    మహతి గలగలా నవ్వింది. మంచి ముత్యాల్లాంటి తెల్లటి ఆమె పలువరస వెన్నెల్ని వెదజల్లింది.

 

    అటుగా కావాలని పాస్ అయి వెళుతున్న విద్యార్ధులు ఓరగా మహతిని చూస్తూ, తియ్యటి ఉద్వేగపు క్షణాల్ని అనుభూతిస్తూ వెళుతున్నారు.

 

    సరిగ్గా ఇదే సమయంలో మరోచోట-

 

    మధుకర్ తన మిత్రబృందంతో వేడి వేడి చర్చల్లో మునిగి వున్నాడు.

 

    "నిన్ను పిచ్చివాడ్ని, వెర్రిబాగులవాడ్ని చేసి, పది లక్షల ఖరీదు కూడా చేయని బార్ ని ముప్ఫై లక్షలకు కొనిపించింది. ఏదో ఆవేశంలో నువ్వే దాన్ని కొన్నాననుకుంటున్నావేమో! కాదు. అది మహతి తండ్రి వ్యాపారమైనా, ఆమె పేరుమీదే వుంది. డ్రామా అంతా ఆడింది మహతే అని నాకు తెలిసింది. ఎలా అంటావేమో! అందులో పనిచేసే మేనేజర్ ఇల్లు మా ఇంటి పక్కనే వుంది. అతనికి పది లక్షలు వచ్చాయట. ఆ ఆనందాన్ని పట్టలేక క్రితం రాత్రి బాగా తాగి వచ్చి మా ఇంటి తలుపు కొట్టాడు. అందుకు మా నాన్నగారు కోపగించుకున్నారు. అందుకతను రెచ్చిపోయి, "నిన్నూ, నీ ఇంటిని కొనవతల పడేస్తాను. ఇప్పుడు నా దగ్గర పది లక్షలున్నాయి. జాగ్రత్త" అని అరుస్తూ తన ఇంటికి వెళ్ళిపోయాడు.

 

    నాకు ఆశ్చర్యం, అవమానం కలిగి ఆరా తీస్తే తెలిసింది.

 

    అనుకోకుండా మాటా, మాటా పెరిగి పౌరుషం ప్రదర్శించుకోటానికి, పరువు దక్కించుకోవటానికి కొంటే ఫర్వాలేదు. కాని నిన్ను వెర్రిబాగులవాడ్ని చేయటానికే ఆ ప్రయత్నం జరిగిందని, దానివెనుక మహతి వుందని తెలిసాక నీపట్ల బాధపడ్డాను. అసలు ఏమయింది? మీ ఇద్దరి మధ్య అంతటి శతృత్వం ఎలా నెలకొంది!"

 

    మధుకర్ ఫ్రెండ్ ఒకరు కేజువల్ గా అన్నా, ఆ మాటలు మధుకర్ లో పెనుతుఫానునే లేపాయి.

 

    ఏ క్షణంలోనైనా బ్రద్ధలవ్వబోయే అగ్నిపర్వతంలా అయిపోయాడు మధుకర్.

 

    అతని రక్తనాళాలు ఉద్రిక్తతను భరించలేని టెన్షన్ కి గురయ్యాయి.

 

    పౌరుషం, కోపం, పగ, ప్రతీకారాలతో అతనూగిపోతున్నాడు.

 

    బార్ ని ముప్ఫై లక్షలకు కొన్నప్పుడు తనలోని అహం సంతృప్తి పడింది- తనలోని అభిజాత్యం శాంతించింది. అదేదో పెద్ద విజయమన్నట్లుగా తను గర్వపడ్డాడు.

 

    తీరా ఇప్పుడిది- తనని మరో షాక్ కి గురి చేసింది.  

 

    తెర వెనుక ఉండి కథ నడిపింది- తనెంతగానో ప్రేమిస్తున్న మహతి అని తెలీగానే ఆమెను కోపగించుకోవాలో, తనని అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకోవాలో తెలీక ఒక విచిత్రమైన సంక్లిష్ట భావోద్వేగానికి గురయ్యాడు.

 

    ఏమిటి తను చేసిన తప్పు?

 

    ఏమిటి తను చేసిన ద్రోహం?

 

    ఎందుకిలా చేసింది? ఎందుకలా చేస్తోంది? మధ్యలో ఎవరైనా గిట్టని వాళ్ళు తన గురించేమన్నా చెడుగా చెప్పారా? అంత త్వరగా నమ్మేది కాదే ...

 

    అయినా ఆమెకు తెలీకుండా తను చేసిన చెడ్డ పనేముంది?

 

    తను ఇరవై లక్షలు నష్టపోయినందుకు బాధగా లేదు.

 

    తను తాగి పౌరుషానికి పోయి బార్ ని కొన్నందుకు బాధలేదు. కాని తనని అందుకు పురికొల్పి, ఆ దిశకు డ్రైవ్ చేసినందుకు అవమానంగా వుంది.

 

    కొద్ది క్షణాల మీమాంస తరువాత మధుకర్ విసురుగా లేచాడు.

 

    ప్రక్కనున్న వాళ్ళు రియాక్టు అయ్యే లోపే మహతి వున్న దిశకేసి వేగంగా దూసుకుపోయాడు.

 

                            *    *    *    *    *

 

    "అరెరె... మీరెందుకు సార్ వచ్చారు? కబురు చేస్తే నేనే వచ్చేవాడిని గదా?" అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మెన్ రాఘవేంద్ర నాయుడ్ని చూసి లేచి నించుని అన్నాడు.

 

    రాఘవేంద్రనాయుడు మృదువుగా నవ్వి- కూర్చోమన్నట్లుగా సంజ్ఞ చేసి తనూ కూర్చున్నాడు.

 

    "చెప్పండి సార్! వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ ?" గౌరవాభిమానాల్ని వ్యక్తం చేస్తూ అన్నాడు ఛైర్ మెన్.

 

    "క్రా ఫోర్డ్ సెంటర్ డెవలప్ మెంట్ మీద ఏదయినా ప్రాజెక్ట్ మీ దృష్టిలో వుందా?" రాఘవేంద్రనాయుడు సూటిగా విషయంలోకి వచ్చాడు.

 

    "అదంత పెద్దగా డెవలప్ అయ్యే ఏరియా కాదని మా స్టాఫ్ అభిప్రాయం సార్" ఛైర్మెన్ మెల్లిగా అన్నాడు.

 

    "మనం తలుచుకుంటే కాదా?"

 

    "ఎంతమాట! కాదని ఎవరంటారు?"

 

    "మరి డెవలప్ చేద్దామా?"

 

    "ష్యూర్! ష్యూర్! బట్..."

 

    "ఫర్వాలేదు చెప్పండి."

 

    "గవర్నమెంట్ పాలసీని దృష్టిలో వుంచుకోవాలి. చట్టపరమైన నిబంధనల్ని పాటిస్తూ డెవలప్ మెంట్ చూసుకోవాలి. ఫండ్స్ ప్రాబ్లమ్ కూడా వుంది."

 

    "మీ పెట్టుబడి పైసా లేకుండా మీ సంస్థకు నెలకు కొన్ని లక్షలు లాభం వచ్చే పథకమొకటి నేను చెబుతాను. ఇష్టపడతారా?"

 

    "అప్పుడు రూల్స్ ని ప్రక్కన పెట్టమన్నా పెడతాను. లిటరల్ గా చెప్పాలంటే మా సిబ్బందికి మేం జీతాలివ్వలేని స్థితిలో వున్నాం. పెట్టుబడి లేకుండా నెల నెలా ఆదాయం వస్తుందంటే ఎవరయినా కాదనగలరా?"

 

    అయితే పదండి. మీ సర్వేయర్ ని పిలిపించండి. ఆ ప్రాంతపు ఆర్.డి.ఓ.ని పిలిపించండి" అన్నాడు రాఘవేంద్రనాయుడు వెళ్ళేందుకు ఉద్యుక్తుడవుతూ.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra