Previous Page Next Page 
చీకటి కడుపున కాంతి పేజి 14

 

    వారిజ సినిమా రంగం నుంచి విరమించిందన్న వార్త అందర్నీ దిగ్బ్రాంతుల్ని చేసింది. ఎందరెందరో వచ్చి వారిజకి ఎన్ని విధాలుగానో నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. కాని వారిజ తన పట్టినపట్టు విడవలేదు. వారిజకు ఒక పెద్ద మెడ ఉంది......దాన్ని అద్దె కిచ్చి చిన్న యింట్లోకి మారింది. పాతిక రూపాయల అద్దెకి. మేడ మీద నెల నేలా మూడు వందలు అద్దె వస్తుంది. బ్రతకాడానికి చాలు. వారిజకు చిన్నప్పట్నుంచి పుస్తకాలు చదవటం అలవాటే! ఇప్పుడు మళ్ళీ పుస్తకాల్లో మునిగిపోయింది.
    ఇదివరలోలా నవలలు మాత్రం చదవటం లేదు. దీక్షగా మెట్రిక్ కి చదువుతుంది ఇంగ్లీషు అంతగా రాదు. కనుక తెలుగులో కనిపించిన మంచి పుస్తక మళ్ళా చదువుతోంది. బలివాడ కాంతారావు గారి "గోడ మీద బొమ్మ ' చదివిన తరువాత రాత్రంతా నిద్రపట్టలేదు వారిజకీ. "దేవుడా! నాక్కూడా పెద్ద గుండె ఇయ్యి" అని ఆక్రోశించింది . రోజూ ఉదయామే పూజ చెయ్యటం అలవాటు చేసుకుంది.
    అందరూ ఈ విషయాన్ని చాలా వేళాకోళంగా చెప్పుకున్నారు. ఎవరి దాకానో ఎందుకు? వారిజకీ తన పూజ తనకే ఒక పెద్ద వెక్కిరింతలా అనిపించేది. తను పూజ ఏమిటి? యేమని ప్రార్ధిస్తుంది దేవుణ్ణి ? కానీ తర్వాత తర్వాత అర్ధమయింది వారిజకి. అన్ని రకాలయిన ఎస్కేపిజాలలో ఈ పూజా గూడా ఒకటని పరిష్కరించలేనన్ని సమస్యలు చిందర వందర చేస్తోంటే భరించలేక రామ నామం జపించుకుంటూ తనను తాను మరచిపోవటం.
    ఈ ఎస్కేపిజం వలన లాభం ఉందొ లేదో కాని నష్టం మటుకు లేదు. దారుణ వల్ల మానసిక శక్తి తప్పక పెరుగుతుంది ధారణా లేకుండా జపం సాధ్యం కాదు. ఆ రకంగా కొంత లాభం. కానీ వారిజకు పూజ పుస్తకాలు కాకా మరో మధుర ప్రపంచం ఉంది. అది ఆవిడ ఊహ ప్రపంచం. మొత్తం బ్రతుకంతా ఒక మిధ్య అయిపొయింది వారిజకి. భావనలో బ్రతకటం నేర్చేసుకుంది. అదే ఆవిడకు నిజమైన బ్రతుకయి పోయింది. భావనలో ఎప్పుడూ రామచంద్ర సాన్నిద్యంలోనే వుంటుంది.
    రామచంద్రకు తనే వండుతుంది వడ్డిస్తుంది. తనకి బట్టలు సిద్దం చేస్తుంది. బూట్స్ పాలీష్ చేస్తుంది. కవిస్తుంది మురిపిస్తుంది. అతనిలో ఒక భాగంగా కరిగి పోతుంది.
    మొదట రవికి ఇంటి అద్దెలో సగం నెలనెలా ఇచ్చేదామనుకుంది. కానీ రవిది ఎంతుంటే అంతా ఖర్చు చేసే స్వభావం. అందుకని డబ్బు తన దగ్గిరే వుంచుకొని రవి అడిగి నప్పుడల్లా పదీ, పదిహేను ఇయ్యసాగింది. రెండు రోజులకోసారయినా రాక మానడు.
    ఒకనాడు అనందం కోసం వెతుక్కుంటూ ఎంతో అశాంతిని చీదరనూ , జుగుప్సనూ అనుభవించింది. ఈనాటికి అర్ధమయింది వారిజకు. అనందం వెతుక్కోవలసిన అవసరం లేనే లేదని, అది సృష్టి అంతటా నిండి వుందని.
    వెర్రి ఆనందంలో వీచే గాలి, పరవశించి ఊగే కొమ్మలూ, సంధ్య ఎర్రని అంచులతో నీలంగా మెరుస్తూ వయ్యరాలూ పోయే మబ్బులూ , మురిపిస్తూ కురిసే మంచుజల్లులూ- ఆనందం ఎక్కడ లేదు. ఒక్కొక్క సారి అర్ధరాత్రి లేచి చీకట్లోకి చూస్తూ కూర్చునేది.
    అందరూ చీకటిని ఎందుకంత భయంకరంగా వర్ణిస్తారు?
    కష్టాలకూ, దుఖాలకూ చీకటిని ఉపమానంగా తేవటం ఎలా అయింది?
    ఎంత నిండుగా గంభీరంగా ఉంటుంది చీకటి. ఈ చీకటి లేకపోతే ఆ తారలు తళతళలాడగలిగేవా? జగత్తుకి వాటి అందాలు తెలిసేనా? ఎలాంటి కష్టాలైన సహించి నిలిచే దీరోత్తుడి చిరునవులా ఉంటుంది విశాలంగా పరుచుకున్న చీకటి.
    ఈ చీకటి చూస్తే ప్రాణాలకు భయం. చీకట్లో ఏదీ తెలియదు. ఈ తెలియని తనంలోనే వుంది భయమంతా. అంతా తెలిసిపోతే? తెలియటం అంటే?
    తెలివి అంటే విజ్ఞానమని కాదు. మనసు పరిణతి పొందిన ఒక దశ. ఆశలూ, నిరాశలు కలిసిపోయిన దశ. వెల్లువలా పొంగే మమకారం ద్వేషాలన్నిటినీ మింగేయగల దశ.
    ఆత్మ తృప్తి ముందు ప్రలోభాలన్నీ తృణ ఖండికలుగా తోచే దశ. మమత మేలు కొల్పిన మానవత్వం సృష్టి సర్వంలోనూ మాధుర్యమే చూడగలిగిన దశ. ఆ దశకు చేరుకోగలిగిన ధన్యులకు చీకటి కూడా అందంగానే కనిపిస్తుంది. వెన్నెల జల్లుల్లోనూ, చీకటి చిక్క దనంలోనూ ఒకేలా పరవశించ గలుగుతారు.
    "తాను ఆ దశకు చేరుకోగలిగినట్లా?' నవుకుంది వారిజ లేదు .....చేరుకో లేదు, కానీ ఆ దశ తనకు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే చీకట్లోనూ అందం కనిపిస్తుంది. ఇంకా ఆ దశ చేరుకోలేదు. అందుకే చీకట్లోకి వెళ్ళలేదు. నిర్భయంగా - హృదయ బలహీనలతో , ప్రభావాలతో సందడిస్తోనే వుంది.
    మనసు ఏవేవో ఆశలను అల్లు కుంటూనే వుంది. క్షణిక భావోదేగాలకు శరీరం సాధీనమవుతూనే వుంది. చికాకు , కోపం , అసహ్యం,  కసి యింక  క్షణికంగా తనకింకా చీకటి కడుపున దాగిన కాంతి దర్శనం లభ్యం కావడం లేదు.
    మెట్రిక్ పరిక్షలు రాసిన వాడు మంచం మీద పడుకుని రామచంద్రను ధ్యానించు కొంటున్న వారిజ రవి రాకతో విసుగ్గా లేచి కూచుంది. "ఒక్కసారి ముందు గదిలోకి రా, వారిజా! నీకోసం ఎవరో వచ్చారు" అన్నాడు.
    "నాకోసం ఎవరొస్తారు? పంపెయ్యి."
    "అలా కాదు. ఒక్కసారి వచ్చి చూడు. నిన్ను చూడందే వెళ్ళనంటున్నారు. అంత వరకూ రామచంద్రనే ధ్యానిస్తోన్న వారిజకు అతడు "రామచంద్రా!" అని అనుమానం కలిగింది. ఆశతో ముందు గదిలోకి వచ్చింది వుసురుమంది. అతడెవరో అపరిచిత వ్యక్తీ . రామచంద్ర తన యింటికి వచ్చే అదృష్టం కూడానా! ఎంత ఆశ, బేల మనసుకి!
    ముభావంగా నమస్కారం చేసి కూర్చుంది. అతడు గొంతు సర్దుకుని ప్రారంభించాడు.
    "నేను బొత్తిగా సినిమా తియ్యబోతున్నాను. మీ కోసం....."
    "క్షమించండి.....నేనింక సినిమాల్లో వెయ్యను..." మొండిగా అంది వారిజ.
    "అమ్మమ్మ! అలా అనకండి. మీ కెంత కావాలంటే అంత యిస్తాను. మీరు సినిమాల్లో వేషం ..."
    "మీరు ఎంత యిచ్చినా నాకక్కర్లేదు వెళ్ళండి. గుమ్మం వైపు వేలు చూపిస్తూ తీక్షణంగా అంది పాలిపోయిన ముఖంతో, అతడు వెళ్ళిపోయాడు.
    "ఏమిటి వారిజా! గుమ్మంలో కొచ్చిన అదృష్టాన్ని మూర్ఖంగా  కాలు దన్నుకుంటావ్?" నిష్టూరంగా అన్నాడు రవి, వారిజ భగ్గుమంది.   

 Previous Page Next Page