Home » Mainanpati bhaskar » వేగు చుక్క


    సాగర్ అంటే క్రమశిక్షణకి మారు పేరు.

    షిప్పు మీది అధికారం అతని చేతిలోనుంచీ జారిపోయి, చాంగ్ కి చిక్కగానే షిప్పులో డిసిప్లిన్ నీళ్ళు కారిపోయింది.

    రాకాసి మూకలు రాజ్యాని కొచ్చినట్లు అల్లరి పేట్రేగిపోయింది.

    విచ్చలవిడిగా తాగుతూ, పెద్దగా పాటలు  పాడుతూ షిప్పంతా తిరుగుతున్నారు చాంగ్  అనుచరులు. నమ్మకస్తులైన సాగర్ మనుషులని బెదిరిస్తూ, బానిసల్లా పనులు చేయించుకుంటున్నారు.

    సింగ్ కేబిన్ లో-

    సుందోపసుందుల్లాంటి పాల్సన్, జాన్సన్ ఇద్దరూ వంతులు వేసుకుని, బాటిలుమీద బాటిలు ఖాళీ చేస్తున్నారు.

    మైనం నసాళానికంటాక, పెద్దగా గొంతెత్తి మోటుగా, అసభ్యంగా ఉన్న పాట ఒకటి లంకించుకున్నాడు పాల్సన్. ఒక అమ్మాయిని గురించి పాట అది. ఆ అమ్మాయి అందాలని అంగాంగ వర్ణన చేస్తూ పాల్సన్ పాడుతుంటే, ప్రతి చరణం చివర్నా "ఎట్లా వదిలేద్దునూ?" అని వంత పాడుతున్నాడు జాన్సన్.

    "చేరడేసి కళ్ళదాన్ని ......"

    "ఎట్లా వదిలేద్దునూ?"

    "తెల్ల తెల్ల పల్లదాన్ని......"

    "పెద్ద పెద్ద .... ....."

    పెద్దగా నవ్వి, "ఎట్లా వదిలేద్దునూ?" అన్నాడు జాన్సన్.

    పాట ఆపాడు పాల్సన్ "ఏది? నా గర్ల్ ఫ్రెండు ఏదీ?" అన్నాడు గట్టిగా  అరుస్తూ.

    మాట్లాడకుండా మిర్రి మిర్రి చూస్తున్నాడు జాన్సన్.

    తూలుతూ లేచాడు పాల్సన్! "ఇదిగో ఎక్కడ  దాక్కున్నావ్?" అంటూ గావుకేక పెట్టి, తడబడుతూ ఇంకో కేబిన్లోకి నడిచాడు.

    పిల్లిలా అతని వెనకే వెళ్ళాడు జాన్సన్.

    కప్ బోర్డులో నుంచీ దేన్నో తీశాడు పాల్సన్. దాన్ని నోటి దగ్గర పెట్టుకుని, బుగ్గలనిండా గాలి పూరించి ఊదడం మొదలెట్టాడు.

    అతని చేతిలోని వస్తువునెమ్మదిగా గాలి పోసుకుని పెద్దదవుతోంది. మెల్లిమెల్లిగా అయిదడుగుల అయిదంగుళాల ఎత్తుకి పెరిగింది.

    అది పోలీయురేథిన్ తో చేసిన బెలూన్లాంటి బొమ్మ! అందమైన అమ్మాయి రూపంలో ఉంది! బంగారపు రంగు కేశాలు ఉన్నాయి దానికి. నీలి రంగు కళ్ళు, ఎర్రటి పెదిమలు. పుష్టిగా ఉన్న అవయవాలు.

    రతి పారవశ్యంతో కళ్ళు అరమెడ్పుగా  పెట్టినట్లు ఉంది ఆ మొహంలోని ఎక్స్ ప్రెషన్!

    అలాంటి బొమ్మలు వెస్టర్న్ కంట్రీస్ లో  విరివిగా దొరుకుతాయి. సోల్జర్సూ, సెయిలర్సూ లాంటి వాళ్ళు వాటిని కొనుక్కోవడం చాలా మామూల.

    దాన్ని మంచం మీద పడుకోబెట్టి, ఆక్రమించుకున్నాడు పాల్సన్.

    జాన్సన్ విస్కీ చప్పరిస్తూ, అర్థనిమీలిత నేత్రాలలో చూస్తున్నాడు.

    పాల్సన్ శరీరపు ఒత్తిడికి గాలి కొంచెం బయటికి పోయినప్పుడల్లా, ఆడపిల్ల హర్షతరేకంతో వేసిన కేకల్లా  శబ్దం చేస్తోంది, ఆ బెలూన్లాంటి, బొమ్మ.

    పావుగంట తర్వాత లేచాడతను. బెలూన్లోంచి గాలి తీసేసి, బాత్ రూంలోకి వెళ్ళబోయాడు.

    "పాల్సర్! అది నాకోసారి కావాలి!" అన్నాడు జాన్సన్.

    తేలు కుట్టినట్లు చూశాడు పాల్సన్. "ఫోరాఫో! నీ డబ్బుతో నువ్వూ ఒక పిల్లదాన్ని బొమ్మని కొనుక్కోలేక పోయావూ? నీ సొమ్మంతా పేకాట్లో, తగలేసి ఇప్పుడు దీనిలో షేర్ కావాలంటావా? చిన్నప్పట్నుంచి ఇంతేరా నువ్వు!"

    "పాల్సన్ ! ఒక్కసారి! ప్లీజ్!"

    "ఒక్కసారి!" అని వెక్కిరింపుగా అని ఎగతాళిగా నవ్వాడు పాల్సన్. "రేయ్! సముద్రం మీద ఉన్నన్ని రోజులూ ఇదే నా పెళ్ళాంరా! అన్న పెళ్ళాం నీకు వదినవుతుందని తెలీదూ? ఇది నీకు తల్లితో సమానంరా!" 

    తాగిన మైకంలో ఉన్న జాన్సన్ కి ఒళ్ళు భగ్గున మండినట్లయింది. తూలుతూలేచి నిల్చున్నాడు.

    "అది నా వదినా? అన్న చచ్చి వదినె విధవయితే తమ్ముడు దానికి తాళ్ళిగట్టోచ్చు. ఒక్క నిమిషంలో వదినెను విధవని చేసేస్తా చూడ్రా, చూడ్రు!"

    అంటూ చేతిలోని విస్కీ బాటిల్ ని గోడ కేసి కొట్టి, దాని మూతి పగలకొట్టాడు.

    పాల్సన్ అది గమనించి, దాడిని ఎదుర్కునేందుకు సిద్దపడేలోగానే పగిలిన బాటిలు మొన అతని కడుపులో దిగబడింది.

    "మ్మా!" అంటూ విరుచుకు పడిపోయాడు పాల్సన్.

    మోతాదు మించి తాగిన జాన్సన్ కి కసి ఇంకా తీరలేదు.

    సీసాలో మిగిలిన ద్రవాన్ని పాల్సన్ మీద పోసి, అగ్గిపుల్లతో గీసి అంటించాడు.

    భగ్గున లేచాయి మంటలు, బతికి ఉండగానే తగలబడిపోవడం మొదలెట్టాడు పాల్సన్.

    వై రాగ్యంగా నవ్వి దూరంగా పడిపోయిన బొమ్మని అందుకుని బాత్ రూంలోకి నడిచాడు జాన్సన్.

    పాల్సన్ శరీరంమీద ఎగసిన మంటలు నాలుకలు చాస్తూ వేగంగా కేబిన్, కర్టెన్లని సమీపించడం అతను చూడలేదు.

    మంటలు త్వరత్వరగా వ్యాపిస్తూ, కేబిన్ గోడలని కాల్చేస్తున్నాయి.

    కేబిన్స్ ఎక్కువభాగం కొయ్యతో చేసినవి కావడం వల్ల మంటలకి అడ్డూ అదుపూలేకుండా పోతోంది.

    ఆ సమయంలో, నట్ట నడి సముద్రంలో ఉంది షిప్పు.


                                        9

    కేబిన్ తాలూకు కర్టేన్లూ, చెక్కగోడలూ చప్పున అంటుకుని భగభగ మండటం మొదలెట్టాయి.

    నేలమీద అక్కడక్కడ ఒలికి ఉన్న ఆయిలు అగ్నికి అజ్యమయి దోహదం చేసింది డాగులుగా పడిఉన్న ఆ ఆయిలు దారి చూపిస్తున్నట్లు కాగా మంటలు ఉరుకులెత్తి షిప్పంతా వ్యాపించాయి.

    ఊహించని ఈ పరిణామానికి దిమ్మెరపోయాడు చాంగ్. కొద్ది క్షణాల సేపు కర్తవ్యవిమూఢుడై నిలబడిపోయాడు.

    కొంచెం తేరుకున్న తర్వాత అటూ ఇటూ చూశాడు. షిప్పులో అక్కడక్కడ ఉన్న "ఫైర్ ఎక్సిటింగ్విషర్సు" కనబడ్డాయి. కానీ వాటితో ఆ మంటలను అదుపులోకి తెచ్చే స్థితి దాటిపోయింది.

    "అయ్యో దేవుడా! ఇదేమిటి ఇలా ముందుకొచ్చింది?" అంది, స్వరూప భయకంపితురాలై. "చాంగ్! రేడియోలో s.o.s. మెసేజ్ పంపు. త్వరగా....." అంటూ సగంలోనే ఆగిపోయింది.

    ఇద్దరూ ఒకళ్ళ మొహంలోకి ఒకళ్ళ చూసుకుంటూ నిశ్చేష్టులై నిలబడిపోయారు.

    రాడార్ నీ. రేడియోనీ తను ధ్వంసం చేసెయ్యడం ఎంత పొరపాటై పోయిందో అర్ధమయింది చాంగ్ కి.

    "ఏం చేద్దాం?" అంది స్వరూప వణుకుతూ.

    తన చిరాకునంతా ఆమె మీద కోపంగా మార్చి "షటప్! బ్లడీ బీచ్! ఆలోచించుకోనివ్వు నన్ను!" అన్నాడు రౌద్రంగా.

    కుక్కినపేనులా ఉండిపోయింది స్వరూప.

    కింద పడి ఉన్న సాగర్ ని ఒకసారి చూశాడు చాంగ్. షిప్పు తాలుకు- బావిలో అనూహ్యని దింపి, పైకి వస్తున్నప్పుడు అతని తలమీద బరువైన రెంచ్ తో కొట్టింది చాంగే.

    "నువ్విక్కడే నిలబడు!" అని స్వరూపతో చెప్పి, స్పృహ తప్పిపడి ఉన్న సాగర్ ని ఒక మూలకు లాగేసి, తాడు పట్టుకుని వెల్ లోకి జారాడు.

    అతను రావడం చూశాడు ఫకర్ . సాగర్  తనకిచ్చిన రివాల్వర్ ని గురి చూసి పేల్చాడు. కానీ ఆయుధాలు ఉపయోగించడంలో అతనికి అట్టే సామర్ధ్యం లేకపోవడంవల్ల గుండు గురి తప్పి, వెల్ గోడని తాకింది.

    షిప్పు గర్భంలో పెద్దగా ప్రతిధ్వనించింది రివాల్వర్ ప్రేలుడు.

    చాంగ్ అపహాస్యంగా నవ్వి ఫకర్ ని ఎడం చేతితో చులాగ్గా పక్కకి నెట్టేశాడు. విసురుగా పదడుగులు వెనక్కి వెళ్ళి బస్తాలమీద పడ్డాడు ఫకర్.

    నిర్ఘాంతపోయి ఇదంతా చూస్తోంది అనూహ్య, ఆమె చేతులు ఇంకా మఫ్లర్ తో కట్టేసే ఉన్నాయి. ఆ చేతులని తన తల మీదగా వేసుకున్నాడు చాంగ్ ఆమెని వీపుమీద వేసుకుని సులభంగా  తాటిని పట్టుకుని ఎగబాకుతూ పైకి వచ్చేశాడు.

    చాంగ్ వీపుమీద పెనుగులాడుతున్న అనూహ్యని చూడగానే స్వరూపకి జెలసీ, కోపమూ రెండూ కలిగాయి అతికష్టంమీద అణుచుకుంది.

    చాంగ్ దృష్టి ఒక వైపు ఎత్తుగా, స్టాండు లాంటి దానికి అమర్చి ఉన్న లైఫ్ బోటుమీద పడింది. అత్యవసర పరిస్ధితిలో ఉపయోగించడానికి గానూ ప్రతి షిప్పులో అలాంటి లైఫ్ బోట్లు రెండు, మూడు ఉంటాయి. అవి కాకుండా, టైర్లలా ఉండే "లైఫ్ బాయ్" లు చాలా చోట్ల తగిలించి ఉంటాయి షిప్పులో. షిప్పు మునిగిపోయే ప్రమాదం వస్తే లైఫ్ బోట్లను కిందకి దింపి కొందరు ప్రాణాలు రక్షించుకోవచ్చు, లైఫ్ బాయ్ లను నడుముకి తగిలించుకుని నీళ్ళలో తేలుతూ మరికొంతమంది ప్రాణాలను రక్షించుకోవచ్చు.

    లైఫ్ బోటుని దింపి జాగ్రత్తగా నీళ్ళలోకి వదిలాడు చాంగ్. తర్వాత అనూహ్యని ఒక చేతితో మహేంద్ర తలని మరొకచేతితో పట్టుకొని దాన్లోకి దూకేశాడు.

    ప్రమాదకరమైన కోణంలోకి ఒరిగిపోయి, మళ్ళీ సరియైన పొజిషన్ కి వచ్చింది లైఫ్ బోటు.

    గింజుకుంటోంది అనూహ్య.

    నిర్దాక్షిణ్యంగా ఆమెని కింద పడేశాడు చాంగ్. అందమైన చిత్తరువుని మేకుకొట్టి గోడకి బిగించినట్లు ఆమె మీద కాలు వేసి పట్టాడు.

    ఆ బరువుకి గుండెల్లోని ఊపిరంతా బయటికి వచ్చేసినట్లు అనిపించింది అనూహ్యకి.

    తల పైకెత్తి స్వరూపరాణివైపు చూశాడు చాంగ్. "చూస్తావేం! దూకెయ్!" అన్నాడు కసురుకుంటూ.

    సందిగ్ధంలో పడింది స్వరూప. ఆ అల్పమైన బోటు ముగ్గురి బరువును భరించగలదా? భరించినా దీన్ని నమ్ముకుని ఎంత దూరం పోగలరు తాము? నిదిమాట దేముడెరుగును! బతికుంటే బలుసాకు తినొచ్చు! ఈ షిప్పు వదలిపోదు తను!

    ఆమె ధైర్యానికి కారణం వుంది. కేప్టేన్స్ క్వార్టర్సుని రీమోడలు చేయిస్తున్నప్పుడు దాన్ని దుర్భేద్యంగా తయారు చేయించాడు సింగ్ అది పైర్ ప్రూవ్ నిప్పులో కాలేదు, షాక్ ప్రూవ్ ఒక మోస్తరు బాంబు వేసినా పగలదు.

    దానికితోడు మరొక ఏర్పాటు కూడా ఉంది. ఆ కేబిన్ లో ఒక మీటను నొక్కితే, ఆ క్వార్టరు ఉన్న భాగం మొత్తం ఆ పళంగా షిప్పు నుంచీ విడివిడి, నీళ్ళలో పడిపోతుంది. అది మునగదు, పడవలా తెలుతూనే ఉంటుంది. దానికి కింద సెపరేట్ గా చిన్న ఇంజన్ ఒకటి అమర్చి ఉంది. దాన్ని సునాయాసంగా నడపడానికి కంప్యూటరైజ్ డ్ నేవిగేషన్ సిస్టమ్ ఉంది.

    "దూకు! అన్నాడు చాంగ్, ఆమెని పట్టుకోవడానికి సిద్దంగా నిలుచుని.

    "గుడ్ బై డ్రాకులా చాంగ్?" అంది స్వరూప నిర్లప్తంగా.

    ఆశ్చర్యంగా చూసి, తర్వాత బండబూతులు లంకించుకున్నాడు చాంగ్ తెడ్డు వేస్తూ పడవని ముందుకు పోనిచ్చాడు.

    నివశురాలై వెక్కిళ్ళు పెడుతోంది అనూహ్య.

    "నీ......! చెవికోసిన మేకలా అరవకు!" అంటూ తెడ్డుతో ఆమె తలమీద చిన్నగా దెబ్బ వేశాడు చాంగ్.

    కళ్ళు తిరిగినట్లయి సోలిపోయింది అనూహ్య.

    షిప్పులో____

    రెయిలింగ్స్ దగ్గరనుంచి వెనక్కి తిరిగి సింగ్ కేబిన్ వైపు శర వేగంగా పరిగెత్తింది స్వరూప.

    రొప్పుతూ లోపలికి వచ్చిన స్వరూపని నీరసంగా తలెత్తి చూశాడు సింగ్. అతను సి సిక్ నెస్ తో కేబిన్ కదలి బయటికి రాకపోవడంవల్ల జరుగుతున్న ప్రమాదం అర్ధం కాలేదు.

    "షిప్పు తగలబడిపోతోందండి! మనం బయటపడాలి!" అంది గబగబ.

    నిస్సత్తువుగా తాళం చెవుల గుత్తితీసి ఇచ్చాడు సింగ్. కప్ బోర్డు తెరిచి, ఒక మీటరు నొక్కింది స్వరూప.

    వెంటనే పెద్ద కుదుపు. మరుక్షణంలో వేగంగా నీళ్ళలోకి విసిరెయ్యబడింది ఆ కేబిన్ దానికి అమర్చి ఉన్న మోటారు తక్షణం మేల్కొని రోదచెయ్యడం మొదలెట్టింది. సినిమా హాళ్ళలో కరెంటుపోతే, వెంటనే జనరేటరు అందుకున్నట్లు.

    నీళ్ళలో సెటిల్ అయ్యాక, చిన్న లాంచిళా ముందుకు సాగింది కేబిన్. దానితో ఉన్న కంప్యూటరయిజ్ డ్ నావిగేషన్ సిస్టమ్ ముందే నిర్ణయించబడిన మార్గంలో దాన్ని తీసుకువెళుతోంది.

    "ఎలా ఉంది మీ వంట్లో?" అంది స్వరూప లేని అభిమానం ఒలకబోస్తూ.

    అస్పష్టంగా ఏదో గొణిగాడు సింగ్.

    నీళ్ళు నిండిన కళ్ళతో అతన్ని ఆరాధనగా చూస్తూ, మెడలోని మంగళసూత్రాలని తీసి నాటకీయంగా కళ్ళకద్దుకుంది స్వరూపరాణి. "ఈ వెధవ సి సిక్ నెస్ నా కన్నా వచ్చింది కాదు! మీ బాధని నేను చూడలేక పోతున్నాను" అంది గొంతు వణికిస్తూ.

    బలహీనంగా చిరునవ్వు నవ్వాడు సింగ్. 'నీలాంటి భార్య దొరకడం కేవలం నా అదృష్టం డియర్!' అనుకున్నాడు మనసులోనే.

 
                                *    *    *

    చాంగ్ పైకి వెళ్ళిపోగానే చెంగున లేచాడు ఫకర్. కోతిపిల్లలా ఆ తాడు పట్టుకొని జరజర పైకి వచ్చాడు. అతనికి తనమీద తనకే చెప్పలేనంత కోపంగా ఉంది.

    ఏం చేశాడు తను? కేప్టెన్ సాబ్ మేడమ్ అనూహ్యని కంటికి రెప్పలా కాపాడమని తనను అప్పగించి వెళితే, పప్పులో కాలేసి ఆమెను చాంగ్ కి స్వాధీనమయ్యేలా చేశాడు.

    ఇంక కేప్టెన్ సాబ్ మొహం ఎలా చూస్తాడు తను?

    'ఒరే ఫకర్! నీకన్నా వాజమ్మ ముల్లోకాలూ వెతకినా ఉంటాడుట్రా? ఉండడు! ఉండడు!'

    తనని తాను తిట్టుకుంటూ సాగర్ కోసం వెదుకుతున్నాడు ఫకర్.

    కానీ సాగర్  వెల్ కి దగ్గరలోనే ఒక డ్రమ్ము వెనుక స్పృహ లేకుండా పడి ఉన్నాడని అతనికి తెలియదు.

    వెదుకుతూ షిప్పంతా తిరిగి చివరకి గేలీవైపు పరిగెత్తాడు.

    మంటలు నాలుకలు చాస్తూ ఆకాశాన్ని అందుకోవాలని చూస్తున్నాయి. షిప్పంతా వేడెక్కిపోతోంది.

    "ఇదిగో ఫకర్! ఆగు! ఆగు!" అని ఏడుపు గొంతులో కేక వినబడింది.

    ఫకర్ ఆగకుండా పరిగెడుతూనే వెనక్కి తిరిగి చూశాడు.

    ప్రోఫెసర్ ఆనందరావు కంగారుగా పరుగెత్తి వస్తున్నాడు "చూడు భాయ్! లైఫ్ బాయ్ లు మిగిలి ఉన్నాయా? ఒక్కటుంటే ఇవ్వు? లేకపోతే మునిగిపోయి ఛస్తాను నేను. నాకు ఈతరాదు దేవుడోయ్!"

    సమాధానం చెప్పకుండా  గెలీలోకి  చొచ్చుకుపోయి.  ?"కేప్టెన్ ఉన్నారా?" అన్నాడు ఫకర్ రొప్పుతూ.

    "లేరే. ఆయనకోసమే చూస్తున్నాను నేను" అన్నాడు ఇబూకా. అక్కడే కిందపడి ఉన్నాడు తంగవేలు.

    అంత గాభరాలోనూ ఇబూకావైపు ప్రశంసాపూర్వకంగా చూశాడు ఫకర్.

    స్వామిభక్తి అంటే ఇది! మంటలు చుట్టుముట్టేస్తూ ఉన్నా, తంగవేలుని కంట్రోలు చేసే బాధ్యత తనకి వప్పగించబడింది కాబట్టి అక్కడే కదలకుండా ఉండిపోయాడు ఇబూకా!

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra