Home » Vasundhara » ఆడపడుచు

    "నేను మహాత్ముడిని కాదు-" అన్నాడు భానుప్రకాష్.
    "ముక్తకు నీతులు చెప్పే అర్హతనాకు లేదని తెలుసు. మిమ్మల్నామె తప్పుపడుతూంటే నిజం చెప్పకపోవడం తప్పనీ నాకు తెలుసు. కానీ మీ మాట పాటించాను. అందుకే కనీసం పాదాభివందనం..."
    "భార్యాభర్తలమధ్య పాదాభివందనాలు సంప్రదాయంకావచ్చు. కానీ నాకవినచ్చవు. నేను సంప్రదాయానికి వ్యతిరేకిని..."
    "ఆ విషయం నాకు తెలుసు..." అంది సంధ్య. ఇప్పటికీ ఆమె మరచిపోలేని నిజం కళ్ళముందు కదలాడుతూనే ఉంది.
                                       *    *    *    *
    ఎంబియ్యే చదువుతూ వాళ్ళింట్లో అద్దెకుండే వాడు భానుప్రకాష్. అతడు వారికి బాగా దూరపు బంధువు. తన మానాన తనుమసిలేవాడు తప్ప సంధ్యవంక కన్నెత్తి కూడా చూసే
    సంధ్యకో బావ ఉన్నాడు. అతడికి చదువురాలేదు, వృత్తి పనులు నేర్చుకుందు కిండస్ట్రియల్ ట్రయినింగ్ ఇన్ స్టిట్యూట్ వెళ్ళివస్తూండేవాడు. గొప్ప ఇండస్ట్రియలిస్టు కావాలన్నదతడికల. జీవితంలో అతడుపైకి రాలేడన్నది తల్లిదండ్రులక్కూడా తెలిసిన నిజం. అతడు సంధ్యను ప్రేమిస్తున్నాననేవాడు. ఏకాంతంలో ఆమెకు ప్రేమకబుర్లు చెప్పేవాడు. ఆకబుర్లలో తననో సినిమా హీరోలా అభివర్ణించుకునేవాడు.
    సంధ్య మనసు పరిపక్వత చెందలేదు. ఆమె అతడి మాటలు నమ్మింది. అతడి పట్లజాలితో తనూ ప్రేమిస్తూన్నాననే అనుకుంది.
    వారి చనువునింట్లో ఎవరూ అనుమానించే వారు కాదు. ఆయింట్లో వారికే కాంత మసాధ్యమూకాదు.
    ఆఏకాంతాన్ని సంధ్యను వశపర్చుకొనేందుకుపయోగించుకున్నాడు.
    ఆ లేత వయసులో సంధ్యకు అతడి మాటలు నచ్చేవి.
    చూసే సినిమాలు, చదివే నవలలు - ఆమె కతడిలో హీరోని చూపించేవి.
    అతడే తన భర్త అవుతాడనుకుందామె.
    కానీ ఆమె సంప్రదాయాన్ని నమ్మింది. అందుకే అతన్ని తనకు దూరంగానే ఉంచేది.
    బావ ఆమెనెన్నోవిధాల ప్రోత్సహించి విఫలుడయ్యాడు.
    "ముందు మన పెళ్ళికావాలి-" అందామె అతడితో.
    "మీ వాళ్ళకు నువ్వు చెప్పు..." అన్నాడతడు.
    సంధ్య యింట్లో చెప్పాలనే అనుకుంది. కానీ అతడి గురించి అంతా పనికిరానివాడని అనుకుంటూంటే చెప్పలేకపోయింది.
    "నువ్వేచెప్పు-" అంది సంధ్య.
    "చెబుతాను-" అన్నాడతడు.
    రోజులు గడుస్తున్నా చెప్పేధైర్యమతడికీ రాలేదు.
    "మన పెళ్ళి జరగాలంటే నాకు ధైర్యం కావాలి. నా ధైర్యం నీమీద ఆధారపడి ఉంది. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలిస్తే ధైర్యం వస్తుంది-" అన్నాడతడు.
    "నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను...." అంది సంధ్య.
    "అంటే చాలదు. ఋజువుండాలి. ఋజువుంటేనే ధైర్యం..."
    "భగవంతుడు స్త్రీని ప్రేమమయిని చేశాడు. సృష్టిలో స్త్రీ స్వార్ధపరురాలే కావచ్చు. కానీ ఆమె స్వార్ధం తనగురించి కాదు. తనవారి గురించి...."
    స్త్రీ తనకంటే ఎక్కువగా తనవారిని ప్రేమిస్తుంది.
    బావ తనవాడనే సంధ్య అనుకుంది. ఋజువుకోసం ఆమె అతనికి లొంగిపోయింది. ఒక కన్నెపిల్ల లేత హృదయపు తొలివలపునామె బావ అందుకున్నాడు.
    అయినా అతడికి ధైర్యం చాలలేదు.
    ఇంకా ధైర్యం కావాలన్నాడతడు.
    మొదటిసారి ఉన్న ప్రతిఘటన భావం కూడా లేదు సంధ్యలో రెండోసారి. అయితే ఈసారి దొంగలు పట్టుబడిపోయారు.
    "ఎన్నాళ్ళనుంచి జరుగుతోందిది!" అంటూ తల్లి సంధ్యనూ, తండ్రి సంధ్య బావనూ నిలదీశారు.
     సంద్య హడలిపోయింది.
    సంధ్య బావ ఇంట్లోంచి పారిపోయాడు.
    ఇంట్లో సంధ్య పెళ్ళిగురించి హడావుడి ప్రారంభమైంది.
    సంప్రదాయాన్ని నమ్మిన సంధ్యకు తనపెళ్ళి బావతో జరగాలని ఉంది. కానీ "ఆ త్రాష్టుడితో దీని పెళ్ళి చేయను-" అన్నాడు తండ్రి.
    సంధ్య మనసు వికలమై పోయింది.
    ఒకరోజామె ఆత్మహత్య చేసుకోబోయింది దొడ్లో బావిలో దూకి....
    ఆ దృశ్యం భానుప్రకాష్ కంటబడింది. అతడామెను రక్షించాడు. ఆ విషయం ఎవరికీ తెలియదు.
    భానుప్రకాష్ కు చూచాయగా ఇంట్లో జరిగింది తెలుసు. అతడు సంధ్యను నిలదీసి అడిగి నిజం తెలుసుకున్నాడు.
    సంధ్య తను బ్రతకనని ఏడ్చింది. అతడామెను మందలించి - "నువ్వతన్ని ప్రేమిస్తున్నావా?" అనడిగాడు.
  "నన్నతడు ప్రేమిస్తున్నాడు-" అని చెప్పింది సంధ్య.
    పారిపోయిన ఆమె బావను భానుప్రకాష్ కలుసుకొని సంధ్యను పెళ్ళిచేసుకోమని చెప్పాడు.
    "దాని శీలం మంచిది కాదు-" అన్నాడు సంధ్య బావ - ఆమెను పెద్దలకు తెలియకుండా పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేక.
    భానుప్రకాష్ సంధ్యకీవిషయం చెప్పి -"అతడు నిన్ను ప్రేమించడం లేదు జరిగింది మర్చిపో-" అన్నాడు.
    "జరిగింది మర్చిపోలేను. వేరే వ్యక్తిని వివాహమాడి అతడి జీవితాన్ని నరకం చేయలేను-" అంది సంధ్య.
    "మన సంప్రదాయం ఆడదాన్ని అన్నింటికీ దోషిని చేస్తుంది. జరిగిందానికి దోషం నీతోపాటు నీబావకు సమంగా అంటుతుంది. నేనీ సంప్రదాయానికి వ్యతిరేకిని ఒక చిన్న పొరపాటు వల్ల కోల్పోయే పవిత్రత పవిత్రత అనిపించుకోదు. నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను. జాలితో కాదు - ప్రేమతో! అందువల్ల లాభమేమిటంటే - నీ కథ పూర్తిగా నాకు తెలుసు కాబట్టి మున్ముందు నీ బావ కూడా నిన్ను బ్లాక్ మెయిల్ చేయలేడు...."
    సంధ్య ఈపెళ్ళికి అన్యమనస్కంగానే ఒప్పుకుంది. ఆమె తల్లిదండ్రులు మహదానందంతో అంగీకరించారు.
    పెళ్లైనా సంధ్య మామూలు మనిషి కాలేక పోయింది.
    "నా ప్రవర్తనలో ఏదో లోపముంది. నేను కులటను. బావ నన్ను ప్రోత్సహించినా - అందుకు నాసహకారము ఉంది -" అనేదామె తరచుగా.
    "పరిస్థితులు తోడైతే పతివ్రతలు కూడా తప్పు చేస్తారు..." అనేవాడు, భానుప్రకాష్ ఆమెతో
    సంధ్య నమ్మాలనే అనుకుంది.
    మనచుట్టూ సమాజం, అందులో ముఖ్యంగా ఆడవాళ్ళు-ఆమెకు తప్పు చేసిందన్న భావాన్ని కలిగిస్తూండేవారు. పావనివంటి స్త్రీలనందరూ, ముఖ్యంగా స్త్రీలు నిరసిస్తూంటే ఆ నిరసన నామె తనకే అన్నట్లు ఫీలయ్యేది.
    "మీరు పవిత్రురాలైన మరో యువతిని పెళ్ళాడండి. నేను అనుమతినిస్తాను. మీ సంతానానికి తల్లినయ్యే అర్హత నాకులేదు-" అందామె భర్తతో.
    "పురుషస్పర్శ నెరుగని నీకు, లేతవయసులో - ఒకస్వార్ధపరుడి ప్రోత్సాహంతో - అతడికి దగ్గరై తప్పు చేశాననుకుంటున్నావు, అదేతప్పు - కేవళం డబ్బు కోసం, పదవికోసం - వివాహితురాలైన ఆడది - తన యిష్టం మీదనే చేయగలదని నేను ఋజువు చేస్తాను. అప్పుడైన నువ్వు నీ - గిల్టీ కాన్షస్ వదిలి పెట్టాలి..." అన్నాడు భానుప్రకాష్.
    ఆ ఎన్నికను కూడా అతడు భార్యకే వదిలి పెట్టాడు.
    ఆమె ముక్తనెన్నుకుంది. ముక్త చేత భర్త తప్పుచేయించ గలిగితే - తన తప్పు సాధారణమైనదే అనిపించుకుంటుందని ఆమె ఒప్పుకుంది.
    భానుప్రకాష్ తన ప్రయత్నాలు ప్రారంభించాడు.
                                         *    *    *    *
    "ముక్త నాకు నీ అంతదగ్గరగానూ వచ్చింది. కానీ నిజం చెబుతున్నాను. నేను నీ మీద ప్రేమతో నటిస్తున్నాను తప్ప - ఆమెపై నాకెప్పుడూ కూడా దురూహ కలుగలేదు. అదీ నాగొప్పతనం....ముక్త నాకు-ఎప్పటికీ ఆడపడుచే!" అన్నాడు భానుప్రకాష్.
    "మిమ్మల్ని నేనెప్పుడూ నమ్ముతాను..." అంది సంధ్య.
    సంధ్య భానుప్రకాష్ ని నమ్మింది. కానీ మగాళ్ళందరూ భానుప్రకాష్ లు కారు.
    ఆడపడుచు పదాలనుండి ఆడపడుచన్న పవిత్ర పదాన్ని సృష్టించిన మన సంప్రదాయాన్ని పాటించలేక పోయిన ఆడపడుచుల పట్ల సానుభూతినీ జతపరచమన్న విన్నపమూ పురుషులందరూ భానుప్రకాష్ లు కాదన్న హెచ్చరికా - ముఖ్యంగా, ఆడపడుచులందరికీ ఈకధద్వారా అందితే - ఈ రచన ప్రయోజనం నెరవేరినట్లే!

                                           (అయిపోయింది)

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra