"మేము పనిచేసేది ల్తేఫ్ ఇన్సూరెన్స్ లో కాదు గదట్రా!"
"అఘోరించార్లె-పోండిక నాకాకలేస్తూంది. భోజనం చేయాలి!"
ఇద్దరం ఇంటికి చేరుకున్నాం.
"తర్వాత కార్యక్రమం ఏమిటి?" అడిగాను సారధినీ.
"నాకూ ఆకలేస్తోంది భోజనం చేసి కాసేపు రెస్టు తీసుకున్నాక మిగతా విషయాలూ నిర్ణయిద్దాము" అన్నాడు వాడు.
ఇద్దరం లోపలకు వెళ్ళబోతుంటే వాళ్ళ గడపలో మేము అంతకు ముందు లెక్కలు కట్టిన కాగితం ముక్కలు ముక్కలుగా చింపి పారేసికనిపించింది.
"ఇది తప్పకుండా మా చిన్నిగాడి పనే- రాస్కెల్ నీ చావాగోడతా నుండు!" అంటూ లోపలికి వెళ్ళాడు సారధి ఆ తరువాత చిన్నిగాడి గొంతు మా రెండిళ్ళూ కలసి ఎగిరిపోయేంత పెద్దగా ఏడుస్తూ వినిపించింది.
మర్నాడు మూర్తి డబ్బు వెయ్యిరూపాయలు ఇచ్చేశాడు.
ఆ రోజు సాయంత్రం మళ్ళి సమావేశామయము.
"ఇవాళ మనం వెళ్ళాల్సిన రోజు నిర్ణయించాలి!" అన్నాడు సారధి.
"మనకు ఆఫీసులు శినివారం, ఆదివారం శెలవులు కాబట్టి ఒకటో తారిఖు తర్వాత వచ్చే శుక్రవారం బయల్దేరేలా చూద్దాం!" అన్నాను నేను.
"అదేమిటి శుక్రవారం మంచిదో కాదో చూడవద్దు?" అంది సారధి భార్య.
"హనీమూన్ కెళ్ళదానికి మంచిరోజేమీటే? ఎప్పుడయినా వెళ్ళవచ్చు" అన్నాడు సారధి.
"అవువు! టూర్ కెళ్ళేప్పడు మంచిరోజు చూడఖ్ఖర్లేదు" సపోర్ట్ చేస్తూ అన్నాను.
"కదలక కదలక మొదటిసారి, ఆఖరిసారి ఇళ్లు కదులుతున్నాం! మంచిరోజు చూడకపోతే ఎలా?" అంది రాజ్యం సారధి భార్యను బలపరుస్తూ.
"అసలిలాంటి పిచ్చి చాదస్తాలన్ని ట్రాష్ ! మంచి రోజేమిటి గాడిద గుడ్డు! మూడనమ్మకాలు?" అన్నాడు సారధి.
"అవును ఇలా కొట్టిపారేసి అమాస్యనాడు ప్రయాణం పెట్టుకునే ఆ చివరింటి రామస్వామిగారు చెయ్యి కాలూ రెండూ విరగ్గొట్టుకున్నారు" అంది సారధి భార్య ఈసడింపుగా.
"అది వేరు! ఆ రోజు ఆ ర్తేలుకి యాక్సిడెంట్ అయింది! మరి మిగతా పదివేల ర్తేళ్ళూ బాగానే నడిచాయి కదా!...." వాదనలోకి దిగాడు వాడు.
"మిగతా వాటి సంగతి మనకెందుకు? వాటిల్లో బయల్దేరిన వాళ్ళందరికి ఆరోజు ఇదొక కీడు జరిగే ఉంటుంది.
"మంరి ఆ మధ్య మంచిరోజ్జూసుకుని నెల్లూరు వెళ్ళిన మీ చిన్నాయన నెత్తి ఎందుకు పగిలింది?"
"అది వేరు" అందామె ఉక్రోషంగా
"ఇది వేరు" అన్నాడు సారధి.
"ఇదివేరేలా అవుతుంది?"
"అదేలక్కడో ఇది అలాగే."
వాళ్ళనలా వదిలేస్తే రాత్రి రెండింటివరకూ మాట్లాడుతూనే ఉంటారని నేను అడ్డుపడను.
సరే- ఈ గొడవంతా ఎందుకులే, కాలెండరు తీసుకురండి మంచి రోజు చూద్దాం!" అన్నాన్నేను. అనడమే తడవుగా మా ఆవిడలోపలి కెళ్ళి కాలెండరు తీసుకొచ్చింది.
ఒకటో తారిఖు తర్వాత మంచిరోజు కోసం వాళ్ళిద్దరూ కలసి వెతికారు.
"ఆ !శుక్రవారంచాలా మంచిరోజే!" అంది సారధి భార్య!
నేనూ సారధి మొఖాలు చూసుకున్నాం.
"మేము వెళ్ళాలని మొత్తుకుంటోంది శుక్రవారమే కదా!" అన్నాడు సారధి చిరాకుగా.
"అవును! కాని అది మంచి రోజని ఇప్పడేగా తెలిసింది?"
"తెలీకుండా ఇంత వాదన ఎవరు పెట్టుకొమన్నారు?"
"వాదన పెట్టుకుంది మా అక్కకాదు మీరే" అంది మా అఆవిడ సారధిని డబాయిస్తూ.
"సరే- అయిన పెళ్ళికి బాజాలేందుకు! శుక్రవారంనాడు బయల్దేరు తున్నాం! అంతేకదా!" అన్నాను నేను మళ్ళి సర్దేస్తూ.
"అవును !" అంది సారధి భార్య.
"అయితే రేపే వెళ్ళి రిజర్వేషన్స్ చేసి వద్దాం!" అన్నాడు సారధి.
మర్నాడు పొద్దున్నే లేచి రిజర్వేషన్ కోసమని ర్తేల్వేస్టేషన్ కి బయల్దేరాము.
రిజర్వేషన్ కౌంటర్ ముందు మెలికలు తిరిగ్పోయి చాలా పొడుగ్గా ఉంది క్యూ.
"ఇంత పోడుగుందేమిట్రా ర్ర్ 'క్యూ" అంటూ సారధి భుజం మీద చేయి వేశాను గాని వాదిభుజం ఎక్కడా తగలకపోయేసరికి ఆశ్చర్యంగా వాడికోసం వెదికాను. అక్కడే కింద తల పట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్నాడు.
"ఏమయిందిరా?" అడిగాను కంగారుగా.
'క్యూ' రా బాబూ ! ఇంత పెద్దక్యూ నేనెప్పుడూ చూళ్ళేదు__ అందుకని కళ్ళు తిరిగినట్లు అనిపించింది!" అన్నాడు వాడు నీరసంగా .
ర్తేల్లో ప్రయాణం అన్నక ఇంకా చాలా దారుణాలు చూడాల్సి ఉంటుంది మరి!"
"అవుననుకో! కాని ఈ క్యూలో నిలబడితే తిరిగి ఎప్పటికయినా మనింటికి చేరుకోగలమంటావా?" అనుమానంగా అడిగాడు.
"అన్నట్లు మన విధిలో పంపు దగ్గర ఇంట్లో గోపాలన్ ర్తేల్వేలోనే ఏదోఉద్యోగం చేస్తున్నానని చెప్పాడుకదా!" గుర్తుతెచ్చుకుంటూ అన్నాన్ను.
సారదికి కూడా గుర్తుకొచ్చేసింది.
అవును! ఓసారి ర్తేల్వే మినిస్టర్ ఇక్కడి కొచ్చినప్పదు అతని పనితనం చూసి చెయ్యి విరిగేట్లు షేక్ హ్యండ్ ఇచ్చాడని చెప్తూండేవాడు."