"అన్నట్టూ సోమాజీ గిఇదాలో కొత్తగా రెస్టారెంట్ ఓపెన్ చేశారు.బ్లాక్ క్యాట్ అని... మీరు వెళ్ళారా?" అడిగింది సత్యవతి.
"లేదు సత్యా."
"హయ్యో! మీరు వెళ్ళనే లేదా? అది ఓపెన్ చేసి నెల కూడా కాలేదు. కానీ అప్పుడే మేం దానికి రెండుసార్లు వెళ్ళాం.... వాడమ్మాకడుపుమాడా.... ఆ రెస్టారెంట్ లో అన్నీ చాలా రుచిగా చేస్తాడోయ్! అదేంటో మా అయన పిచ్చిగానీ ఎక్కడ ఏ కొత్త రెస్టారెంటు ఓపెన్ అయినా, ఇస్ క్రీమ్ పార్లర్ ఓపెన్ అయినా నన్ను వెంటనే అక్కడకి తీసుకెళ్ళి ఏం కావాలంటే అది తినిపించేస్తారు" అంది కళ్ళు తిప్పూతూ.
మీ అయన అమ్మాకడుపు మాడా.... అని కసిగా మనసులో అనుకుంది. రాజీ.
"మీ అయన అలా ఎక్కడికీ తీసుకెళ్ళారనుకుంటానేం?" అడిగింది సత్యవతి.
ఆ ప్రశ్నకి రాజీకి భగ్గున మండింది.
"పాపం... ఆయనకి నన్ను అక్కడికీ ఇక్కడికీ తీసుకెళ్లాలనే వుంటుంది.గానీ నాకే అక్కాడా ఇక్కాడా గానా గడ్డీ తినడం యిష్టం ఉన్నా మా అయన బేకార్ మనిషెంకాదు... పాపం ఎప్పుడూ ఎన్నో పనులతో అయన బీజీగా వుంటారు.... అయన పనులు చెడగొట్టడం కూడా యిష్టం లేదు. ఎక్కడికైనా వెళ్దామంటే నేను వద్దని అంటాను" అంది రాజీ కసిగా.
"హ్యా నా అమ్మాకడుపు మాడా... అసలు సంగతి మర్చిపోయి ఇక్కడ కూర్చుండిపోయా.... నేనొస్తా..." మొహంలో రంగులు మారిపోతూ వుంటే లేచి నిలబడింది సత్యవతి.
"అదేంటి? ఇప్పుడే వచ్చి ఇప్పుడే వెళ్ళిపోతున్నావేం? కూర్చో!" అంది రాజీ కూడా లేచి నిలబడుతూ.
"లేదు... నేను వెళ్ళాలి..! ఇంట్లో బియ్యం నిండుకున్నాయ్....కొనడానికి వెళ్తూ నువ్వేం చేస్తున్నావో అని ఓ సారి తొంగి చూద్దామని వచ్చా."
"అదేంటీ?బియ్యం నువ్వు కొనడం ఏంటీ? బియ్యం, పప్పులూ అన్నీ మీ పొలాల్లో పండినవి మీ ఊర్నుండి వస్తాయని అప్పుడెప్పుడో చెప్పినట్టున్నావు?" కొంటెగా చూస్తూ అడిగింది రాజీ.
"ఓహొ....! అదా...?!" అంటూ పకాల్మని నవ్వేసి రాజీ వీపు మీద ఓ చరుపు చరిచింది.సత్యవతి. "అయితే నువ్వా విషయాన్ని గుర్తు పెట్టుకున్నావన్నమాట.... మొన్నా మా అమ్మా ఉత్తరం రాసిమ్దిలే. నీ అమ్మాకడుపుమాడా నువ్వు పప్పులూ ఉప్పులూ అన్నీ అ పట్నంలో అంతంత రేటు పెట్టి ఎక్కడ కొనుక్కుంటావులే... అన్నీ నేను నాన్నగారితో పంపిస్తానులే అని! నేను వద్దులే, ఈ వయసులో నాన్నగారిని ఎందుకు కష్ట పెడతావు.... నేను అవన్నీ కొనుక్కుంటాలే అని రాశాను.... మరి నేను వస్తానేం?" అంటూ బయటకి పరుగుదీసింది సత్యవతి. ఇంకా వుంటే రాజీ ఇంకేం పాయింట్లు పీకుతుమ్దావు అని.
"నీ అమ్మా కడుపు మాడా!" సత్యవతి వెళ్ళిన వైపే చూస్తూ కసిగా అనుకుంది రాజీ.
* * * *
"పండూ..." మెల్లగా పిలిచింది రాజీ.
"ఊ..." అన్నాడు రాంపండు రాజీ నడుం చుట్టూ చేయ్యేస్తూ.
"సత్యవతి ఎలా వుంటుంది?" అడిగింది.
"సత్యవతా? అదేవరు?"
"అదే పండూ! మన పక్కింట్లో వుండదూ..."
"దాని పేరు సంగతేందుకు? రోజూ చెబుతుంటాను కదా.... వాళ్ళ పేర్లు నీ కసలు గుర్తే వుండవేం?" చికాకు ప్రదర్శిస్తూ అంది రాజీ. "గుర్తుంచుకుని ఏం చేయాలంటా?"
"సరేగానీ ఈ సంగతి చెప్పండి... అ సత్యవతి ఎలా వుంటుంది?"
"ఏదీ పక్కింటి సత్యవతేనే...? అచ్చు కోతిల వుంటుంది..." అన్నాడు రాంపండు.
"మరి నేను?" అతని మీద కాలేస్తూ అడిగింది ఆమె.
"నీకేం... బంగారం! ఎంచక్కా వుంటావు... అసలు దానికీ నీకూ పోలికేంటి?" అన్నాడు రాంపండు ఆమెని దగ్గరకు లాక్కుంటూ.
"కానీ ఈ రోజుల్లో అల ఉన్నవాళ్ళేకే అన్నీ జరుగుతాయిలెండి" అంది ఆమె దీర్ఘాలు తీస్తూ.
అతని గుండెల్లో చిన్న దడ. ఆమెని దగ్గరకు లాక్కుంటున్న వాడల్లా సందేహంగా ఆగిపోయాడు.
"దాని మొగుడు దాన్ని ఎంత ప్రేమగా చూస్కుంటాడనీ.... చక్కగా అక్కడికీ ఇక్కడికీ తిప్పుతాడు."
"అయినా ఇప్పుడా విషయాలన్నీ ఎందుకులే" అన్నాడు రాంపండు అయిష్టంగా. అతని చెయ్యి ఆమె నడుం మీద ఇంకా అలానే వుంది. కానీ కాస్సేపటికి ముందుల పట్టుకుని లేదు. ఊర్కే నడుం మీద పెట్టి వుంది. అంతే!
"అవున్లే... నీ కేమైనా మంచి విషయాలు చేస్తే పనికిమాలిన విషయాల్లనే కనిపిపిస్తాయ్... మొన్నీ మధ్యనే సోమాజీగూడలో బ్లాక్ క్యాట్ అనే రెస్టారెంట్ ఓపెన్ చేశారట కదా.. వాళ్ళిద్దరూ ఆ రెస్టారెంటుకి అప్పుడే ఛాలాసార్లు వెళ్ళారట! అక్కడ డిసేష్ చాలా రుచుగా వున్నాయంట. నువ్వెప్పుడైనా బయటకి తీసుకెళ్ళి నాకలా తినిపిస్తవా అసలు?" సీరియస్ గా అడిగింది ఆమె.
"ఎందుకు తినిపించలేదు.... నీకు నేను చేసినవేమీ గుర్తుండవులే" అతను ఆమె నడుం మీది నుండి చెయ్యి తీసేశాడు.
"నువ్వు కూడా నన్ను బ్లాక్ క్యాట్ రెస్టారెంట్ కి తీసుకేళ్ళాల్సిందే."
"ఎలా తీసుకెళ్ళాను? అసలు ఈ ప్రపంచం మొత్తం మీద 'బ్లాక్ క్యాట్' అనే రెస్టారెంట్ లేదు. ఆ సత్యవతి నీ దగ్గర కోతలు కోసింది" విస్సుగా అన్నాడతను.
"బ్లాక్ క్యాట్ కాకపోతే మరో రెడ్ క్యాట్ రెస్టారెంట్! ఏదో ఒక రెస్టారెంట్ కి మీరు తీసుకెళ్ళాల్సిందే."
"అలాగే చూద్దాం..."
ఆమె వైపు తిరిగి పడుకున్నాను కాస్త వెల్లకిలా తిరిగి పడుకుంటూ అన్నాడు.
"చూద్దాం అంటే కాదు... మనం రేపే సాయత్రం బయటకెళ్ళి అలా ఇలా తిరిగి ఏదైనా రెస్టారెంట్ లో తింటున్నాం."
"అలాగే!"
"చక్కగా ఆ సత్యవతి మొగుడ్ని చూసి నేర్చుకో పెళ్ళాన్ని ఎలా సుఖపెట్టాలో."
"అలాగే అంటున్నా కదా... ఇంకా అపవా? వాడితో వీడితోనన్ను అనవసరంగా కంపేర్ చేయకు...."
ఈసారి అటు తిరిగి పడుకున్నడతాను.
"ఏదైనా మంచి విషయాలు మాట్లాడితే నీకు కోపం... అతన్ని చూసి నేర్చుకోమన్నాను... తప్పా?"
"అతన్ని చూసి కాదు... మా ఆఫీసులలో భీమరావ్ అని వున్నాడ్లే.... వాడిని చూసి నేర్చుకుంటా."
"అతనేం చేస్తాడు?"
"తప్పతాగి పెళ్ళాన్ని చితకబాదుతాడు."
"అలా చేస్తే నేనూ చితకబదుతా..... నీ లాంటి వాళ్ళ ప్రతాపం అంత పెళ్ళాం మీదేగానీ యిటు తిరుగు."
"ఊ ఎందుకూ... రేపు సెంట్ పర్సెంట్ బయటకి తీసుకెళ్తానంటున్నాగా.... నన్నిక వదిలేయ్... నేను పడుకుంటా..."
"ఆ సంగతి సరేలే.... ఇలా తిరగరా పండూ..."
రాంపండు బనీను పట్టి లాగింది. బనీను సర్రుమని శబ్దం చేసింది.
"ఉండు.... మొత్తం చింపెయ్యకు.... తిరుగుతున్నాను" రాంపండు ఆమె వైపు తిరిగాడు.