రాత్రి పదిగంటలయింది.
పోలిస్ స్టేషన్ ఆవరణలో జీప్ ఆగడంతో అలర్టయి నిలబడ్డారు ఆరుగురు కానిస్టేబుల్స్.
అప్పటికే బాగా తాగినట్టు తూలుతూ నడుస్తున్నాడు యస్సైరమణ. ఎమ్మేల్యే కొంపతీయాల్సిన కేసుని తెలివిగా డీల్ చేసినందుకు అంతసేపూ పార్టి ఇచ్చిన రణధీర్ కొంతడబ్బు కూడా ముట్టచెప్పాడు.
పెళ్ళాన్ని పుట్టింటికి పంపిన రమణ, ఆ పార్టీ అయ్యాక మల్లిని తెల్లార్లు నంజుకునేవాడేకాని, ఇక్కడ మరో సెటప్ ఉందన్న విషయం గుర్తుకొచ్చి,అది అందాకా వాయిదా వేసేసుకున్నాడు.
చీర లేకుండా ఇందాకటి ఆడదెలా వుంటుందీ అన్న కోరిక తెగ అల్లరకి పెట్టేస్తుంటే ఓ మూల నిలబడ్డ సింహాద్రిని పిలిచాడు " ఏరా..ఉందా అది"?
సంగతేమిటో అప్పటికే తెలుసుకున్న మరో కానిస్టేబుల్ వెంటనే జవాబు చెప్పాడు. " సరాసరి ముసలాడా ఆ పిల్లని చీకటికొట్టులోకే పంపేశాడు సర్. ఈ మధ్య తెలివిమీరాడు."
ముఫ్ఫయ్యేళ్ళ రమణ పగలబడిన నవ్వేశాడు.
"అంతా రేడీచేశామండీ" మరో కానిస్టేబుల్ ఉత్సాహంగా చెప్పాడు.ఇలాంటి సందర్భాలలో యస్సైగారికి అవసరమయిన లిక్కరుని, ఆతడికిష్టమయిన చికెన్ బిరియానీ లాంటి ఎన్ వీనీ డిపార్ట్ మెంట్ పరపతి ఉపయోంగించి ఖర్చులేకుండా లాక్కురావడం ఆ కానిస్టెబుల్ డ్యూటీ.
" అందుచేతనండి....తమరు సరేనంటే గ్లాసుసు సిద్ధం చేస్తానండి..."
"ఇప్పటికే ఎక్కువయిపోయిందిరా.ఇంకా తాగితే పీతల్ని పట్టేవాడిలాగా పాకడమేతప్ప..." కారిడార్ లోకొస్తూ పేల్చిన అతని జోక్కి అందరూ మించినంత గట్టిగా నవ్వేశారు. ఒక్కసింహాద్రి తప్ప.
" అయ్యా!" సింహాద్రి తటపటాయిస్తున్నాడు. "చదువుకున్న అమ్మాయిలా ఉంది."
" అయితే?" రమణ దవడ కండరాలు బిగుసుకున్నాయి."కొంచెం మెల్లగా వ్యవరించమంటావా?"
" అదికాదయ్యా...మంచి కుటుంబానికి చెందిన ఆడపిల్లలా ఉంది."
ఫెటేల్మన్న చప్పుడు.
రమణ చాచి కొట్టడంతో సింహాద్రి గోడకి జారగిలబడిపోయాడు. కాని అతను ఆగలేదు . నీరసంగా రమణ పాదాల్ని పట్టుకోబోయాడు.
కోపంగా రెండడుగులు వెనక్కి జరిగిన రమణ విసుగ్గా అన్నాడు. "అయినా నీకు ఇదేం పోయేకాలంరా ముసలి నాకొడకా?" ప్రతీసారీ ఈ ప్రీచింగ్ లతో నన్ను ఇబ్బంది పెట్టకురా అంటే వినవేంటి? ఫో అవతలకి!"
కాలితో నెట్టేస్తూ షర్టువిప్పి ఓ కానిస్టెబుల్ కి అందించాడు. కోరిక నిలువునా రగులుకుటుంటే కాంక్షగా చీకటిగదికేసి చూశాడు.
లోపలి అంధకారం మృత్యువు ముంగిట అలంకరించిన మామిడాకుల తోరణంలా అనిపిస్తుంది .అర్జెంట్ గా ఆమెను చూడాలని అనిపించింది.
ఒకవేళ తను ఈ ఊరితే అయితే తనవాళ్ళెవరయినా ఇక్కడే వుంటే ఈ పాటికే చాలా రభస చేసేది.అలసరానికి ఎవర్నయినారప్పించి తననుతాను కాపాడుకునేది.
ఇదే ఆలోచిన అతన్నెంత ఉద్విగ్నుడ్ని చేసిందీ అంటే ఆమె కూడా ఈ ఏర్పాటుకి సిద్ధంగా ఉందేమో అని తలపోసి గదిలోకి చొరబడ్డాడు.
అరక్షణం నిశ్శబ్దం.
తలుపు చేరవేయబోతుండగా చిన్న అలికిడి.
ఏ మూలనుండో అర్థంమయినట్లు ద్వారం చేరేశాడు.
వేడి సెగల్ని పాముబుసల్లా విడుస్తూ అతడు పేంట్ లాగబోతుండగా బలంగా తగిలింది కాళ్ళ మధ్యగా.
సన్నగా మూలుగు " అమ్మలం..."
వెనువెంటనే దబ్ మన్న చప్పుడు .ఆ చప్పుడు ఇప్పుడు ఎక్కువై హోరులా వినిపిస్తూంది.
లోపల ఏం జరుగుతున్నదీ అర్థంకాక కానిస్టెబుల్స్ ఆందోళన పడుతుండగానే మిసైల్లా బయటకి దూసుకొచ్చాడు ఎస్సై రమణ.
చెప్పుదెబ్బలతో వాచిపోయిన చెంపకన్నా చివరగా కాళ్ళమధ్య తగిలిన పాదం తాకిడికి ప్రాణం కడండిపోతుంటే " ఆ లం... ని కట్టిపడేయండి" అరిచాడు కంపించిపోతూ.
స్వామిభక్తితో కానిస్టేబుల్స్ కదిలేవారే.
అప్పుడు బయటికొచ్చిందామె.
కీచకుల గుండెమైదానాలపై నడిచే దిగంతాల వెలుగు రేఖలా వున్న ఆమె ఒంచిపైన ఇప్పుడు చీరలేదు.
ఒక యుక్తిలా, ప్రచండ శక్తిలా,పగిలిన గంళంలా , మండుతున్న జ్వాలా హలంలా చూస్తూఅంది. "యూ బచ్చా రాఫ్ ది బార్బేరియన్ సొసైటీ. ది సీజ్ మేనక ఐ.పి.యస్. అసిస్టెంట్ సూపరింటెండ్ ఆఫ్ పోలిస్."
ఆమె ఒంటిపైన ఉన్న ఖాకి యూనిఫాం ఆ వాస్తవాన్ని ధ్రువపరుస్తుంటే ఆవాక్కయి చూస్తున్నాడు యస్సై రమణ.
అక్కడ లిప్తలు గడ్డగట్టుకుపోతున్నాయి.
"చట్టాన్ని పరిరక్షించాల్సిన వ్యవస్థలో భాగస్వామివయ్యండీ నైతిక బాధ్యతని విస్మరించడమేగాక, అధికారాన్ని ఇంత దారుణంగా దుర్వినియోగం చేస్తున్న మిస్టర్ రమణా! యూ ఆర్ కాట్ రెడ్ హాండెడ్ అండ్ సస్పెండెడ్. గెటవుట్!"
కొన్ని గంటలక్రితమే అసిస్టెంట్ సూపరింటెండెంటాఫ్ పోలిసా గా ఛార్జీ తీసుకున్న మిస్ మేనక, డ్రమెటిక్ గా రంగ ప్రవేశం చేసి ఊహించిన దానికంటే ఎక్కువగానే తెలుసుకొగలిగింది. అదికాదు ఆ క్షణంలో సైతం ఆమె ఆలోచిస్తున్నది.
ఒకవేళ తను అదృష్టవశాత్తు పోలీసాఫీసరు అయ్యుండకపోతే ఈపాటికి రమణికి బలయ్యేది.ఇలా జరిగే అవకాశముందో, లేదో తెల్చుకోవాలనే ఇందాక రోడ్డుపైనరమణ సూట్ కేసు తెరవాలని పట్టుబట్టినప్పుడు నిరాకరించి తన యూనిఫారం కనిపించకుండా జాగ్రత్తపడింది.
ఇలాంటి సంఘటన్ని ఊహించని కానిస్టేబుల్స్ ఆమెను చూస్తూ కంపించిపోతుండగా, రమణ చేతులు జోడించాడు.తన రోజులు చెల్లిపోయాయని గ్రహించి చాలా పశ్చాత్తాపాన్ని ప్రకటించబోయాడు కూడా.
"అవుట్ మిస్టర్ రమణా!ఇక నువ్వు ఇవ్వాల్సిన సంజాయిషీ నీకర్మకాండలో చివరి అంశమయిన డిపార్ట్ మెంటల్ ఎంక్వయిరీ లోనే అంతవరకూ ఈ చాయలకి రాకు" సందిగ్ధంగా నిలబడ్డ రమణను చూస్తూ "గెట్ లాస్టు" అని అరిచింది.
ఇక వెనక్కి చూడలేదు రమణ.
వెంటనే ఫోన్ దగ్గరికి నడిచిన మిసి మేనక సర్కిల్ ఇన్ స్పెక్టర్ సుధాకర్ ఇంటికి రింగ్ చేసింది. పదిహేను నిముషాల్లో కచ్చితంగా స్టేషన్ లో నే ఉండాలని.