" ఇది ఊరో, వల్లకాడో తెలుసుకోడానికి నాదే ఊరో చెప్పాల్సిన అగత్యం లేదనుకుంటాను."
" మనిషే కాదు మాటా పొంకంగానే ఉంది"
"అంటే ..ప్రాధమిక హక్కుని ఉపయోగించుకుంటున్నవన్న మాట..."
" మరేం!"
"లాయరువా?"
"కాదు"
"మరి?"
"స్టూడెంట్ ని."
"అనిపించింది."
"ఏమని?"
"నువ్వు తప్పకుండా రాడికల్ వై ఉంటావని"
" న్యాయం విషయంలో నిలదీసే వాళ్ళని మీరలా పిలుస్తారనుకుంటాను"
చుట్టూ చూస్తున్న జనం, జనం మధ్య ఓ ఆడపిల్ల నిలదీయడం రమణ అహాన్ని ఎంత గాయపరచిందీ అంటే, తన స్వాతిశయాన్ని కాపాడుకుంటే తప్ప ఇంక లాభం లదేనుకున్నాడు... " నీ పేరు?"
" లక్ష్మి"
" బావుంది.ఊరు ఝాన్సీ అనుకుంటాను.ఏమంటావు ఝూన్సీ లక్ష్మీ?" పకాలున నవ్వేశాడు ఎగతాళిగా "ఓసారి చూడనిస్తావా?" ఆపాదమస్తకం పరిశీలిస్తూ- "అదే.... నీచేతిలో ఉన్న సూట్ కేసుని" అన్నాడు.
" ఎందుకు?"
" సోదా చేద్దామని."
" ఏమిటీ?"
" నీ దగ్గరున్న సరుకు."
ఆమె జవాబు చెప్పలేకపోయింది.
"అద్గదీ." అమాంతం ఆమె భుజం పట్టుకున్నడు . "నువ్విప్పుడు వణికిపోతున్నావంటే అందులో ఏముందో అర్ధమైపోయింది.అర్జెంటుగా తెరిచెయ్. బాంబులూ గట్రా ఉంటే..."
"డేమిట్!" రేషేవివు ప్రదర్సుస్తూ దూరం జరిగింది. "సభ్యత లేకుండా నన్నిలా తాకిన నేరానికి నీమీద డిఫేమేషన్ సూట్ వేస్తాను."
" అలాగా?" వ్యంగ్యంగా నవ్వాడు "అయితే టేషన్ కి నడువ్. నిన్ను మొత్తం చెక్ చేసేస్తాను.అప్పుడు ఏం చేస్తావో, నువ్వే తేల్చుకుందువుగాని..." తన సహజధోరణిలో అసభ్యతనిప్రదర్సిస్తూ సారి ఆమె జుట్టు పట్టుకున్నాడు.
అక్కడ హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది.
" సింబాద్రీ!- "దీన్ని వెంటనే ఇదే ఆటోమీద స్టేషన్ కి తీసుకుపో.ఇది తప్పుకుండా మన డిపార్టుమెంట్ గాలిస్తున్న "ఆ గ్రూప్ దనిపిస్తూంది కాబట్టి, తీసుకెళ్ళి సెల్ లోకాదు. చీకటికొట్లో వేసెయ్..." అన్నాడు.
వృద్ధుడు సింహాద్రి తటపటాయిస్తుంటే ఆమెతో పాటు ఆటోలో కూర్చున్నాడు.
వెంట తనూజీవ్ లో అనుసరించేవాడే... అప్పుడు ముందుకొచ్చింది మల్లి.
ఇంతసేపూ చూసిన ఓ చిన్న సంఘటన ఎంత జీవితాన్ని తెలియచెప్పిందో కళ్ళు తుడుచుకుంటూ నెమ్మదిగా అంది- "అయ్యా, ఈ రోజు నాకేమీ అన్మేయం జరగలేదు. అసలు నన్నెవరూ పాడు చెయ్యలేదు.ఇప్పటికైనా మా అయ్యని వొదిలేయండి."
ఉత్సాహంగా చూశాడు రమణ సమస్య ఇంత సులభంగా పరిష్కారం కావడంతో "శభాష్!"
అక్కడ దూరంగా తనకారు దగ్గర నిలబడ్డ రణధీర్ ని రెండంగల్లో సమీపించాడు."బాబూ...గుంట దారికొచ్చేసింది.ఇక కోర్టులూ లేవు, కేసులూ ఉండవు.అలాగని దాని మాటమీద మనం వదిలేయగూడదు. మనం రాజయ్యతోబాటు ఈగుంటనీ గెస్ట్ హౌస్ కి వాక్కెళ్ళి కొన్ని సంతకాలు తీసుకుందాం మరేం లేదు. ఫ్యూచర్ భద్రతకోసం."
వెనువెంటనే చుట్టూ ఉన్న జనాన్ని ఆవేశంగా చూసిన రమణ "ఏంట్రా... కొడకల్లారా! ఇక్కడేదో . సినిమా షూటింగువుతున్నట్టు అలాగనిలబడ్డారేంటి? పొండి నా కొడకల్లారా!" జనాన్ని వెంట తరిమి ఇప్పుడు రాజయ్యనీ, మల్లినీ వెంటేసుకుని గెస్ట్ హవుస్ కేసి బయలుదేరారు.
సరిగ్గా ఇదే సమయంలో ...పోలీస్ స్టేషన్ ముందు ఆగిన ఆటోలోంచి దిగిన సింహాద్రి రెప్పలార్పకుండా చూశాడామెని.
" అమ్మా!" జనసత్వాలుడిగిన సింహాద్రిగొంతులో తండ్రి గొంతులోని లాలిత్యం....ఇంత సౌహార్థృతని ఆమె సైతం ఊహించలేదు. "ఇప్పటికీ ఆలస్యం కాలేదు తల్లీ... వెళ్లిపో."
నిర్వీణ్నురాలైంది- " నన్ను ఇంటరా గేట్ చేస్తానన్నాడుగా?"
"అదంతా వట్టి నాటకమమ్మా. "మూడు దశాబ్దాల అనుభవంలో అతనెన్ని జీవితాలు చూశాడని! "అయినా ఎవరోఏదో అవుతున్నారని నువ్వెందుకు జోక్యం చేసుకున్నావు తల్లీ?"
ఆ క్షణంలో ఒకనాడు బాగ్ పేటలో పోలీసులకి ఆహుతైన మాయాత్యాగే గుర్తుకొచ్చిందో, పోరాటంలో అవలిసి అన్యాయమైన జర్నలిస్ట్ భార్య బాబీరాణి జ్ఞప్తి కొచ్చిందో- భాధగా అన్నాడు. " ఏ ఊరిదానివో,ఏ తల్లిబిడ్డవో... ఎంత తొందరపడ్డావో నీకు తెలీదమ్మా."
"అదికాదు తాతా. నేనేం తప్పుచేశానని? అసలు..."
"నా మాట విను లక్ష్మమ్మా. ఇక్కడ ఆడపిల్లల బ్రతుకులు తెల్లారిపోడానికి తప్పే చేయాల్సిన పనిలేదు.ఆడదైతే చాలు..." అంతకు మించి స్పష్టంగా ఎలా చెప్పాలో ఆ వృద్ధుడికి తోచక, వ్యవధి లేనట్టు రొప్పుతూ అన్నాడు. "గడులు మించిపోతుందమ్మా, నా మాట విని పారిపో. నేనేదో చెప్పుకుంటానులే చెప్పుకుంటనులే తల్లీ, అంతే కాని నువ్వు అన్యాయమై పోకు."
"నీ అభిమానానికి కృతజ్ఞతలు తాతయ్యా. కాని నేను ఆడదాన్నై నా చదువుకున్నాదాన్ని."
"నీ చదువు చట్డుబండలుకాను! అర్థం చేసుకోవేం!"
"క్షమించు తాతా. పిరికిదానిలా నేను పోరాపోను"ఖండితంగా చెప్పి బ్రీఫ్ కేస్ తోపాటు స్టేషన్ లోకి నడిచింది.
అవాక్కయి క్షణం చూసిన సింహాద్రి ఆమెను అనుసరించి సెల్ నికాక చీకటిగా ఉన్న మరో గదిని చూపించాడు.
అదే.... ఎందరో ఆడపిల్లల శీలాన్ని పొట్టన పెట్టుకున్న మృత్యుగహ్వరం.
* * * *