"చెప్పు"

    "నాఫ్రెండ్ ఒక అమ్మాయి చాలా సంవత్సరల్నుంచి ప్రెగ్నెంట్ అవలేదు అవలేదు. డాక్టర్  విశాల్  క్లినిక్ కి వెళ్ళింది. వాళ్ళు 13, 14 ,15 తేదీల్లో రామ్మన్నారుట. మొన్న  వెళ్ళింది. డి అండ్ సి చేసారు. నాకిక్కడ అనుమానాలు వచ్చాయి. ఒకటి: ఆ ఆపరేషన్ సాధారణంగా పీరియడ్స్ పూర్తయిన మొదటిరోజు చేస్తారు కదా. మరి 13.. 14.. 15 తేదీల్లో ఎందుకు రమ్మన్నారు?ఇదొక ప్రశ్న రెండోది: డి అండ్ సికి గర్భధారణకీ ఏమిటి సంబంధం? అసలేమైనా వుందా?"

    దానికి డైరెక్టుగా సమాధానం చెప్పకుండా డాక్టర్ ప్రహసిత్ నవ్వేడు. "మీ పత్రిక తరపున నాతో  ఇంటర్వ్యూకి వచ్చినపుడు  కూడా ఈ 13, 14, 15తేదిల గురించి అడిగావు. మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నావు. నీకూ, పదమూడు, పధ్నాలుగు పదిహేనుకీ ఏదో అవినాభావ సంబంధం వున్నట్టుందే......."

    "అది పత్రికకి సంబంధించిది. ఇది నా ఫ్రెండ్ కి సంబంధించింది. రేపు ఏ  వెయ్యో, రెండువేలో వసూలు చేసి మరో నాలుగుసార్లు డి అండ్ సీ చేస్తామని ప్రలోభపెడితే? అందుకే అడుగుతున్నాను."

    "తమకు పిలల్లు పుట్టటం లేదని దంపతులు రాగానే డాక్టరు ఇద్దర్నీ..... ఇద్దర్నీ అన్నది  అండర్ లైన్.....పరీక్ష చేయాలి. అవి ముఖ్యంగా, రక్త పరీక్ష, రక్తం గ్రూపింగ్, బ్లడ్, షుగర్ టెస్ట్, టి.బి ఇన్ ఫెక్షన్, సుఖ వ్యాధుల నిర్ధారణ.....'ఇద్దరికీ జరిపి, అసలు అవకరం ఎక్కడుందో కనుక్కోవాలి! ఆ తరువాత ట్రీట్ మెంట్ మొదలుపెట్టాలి. పురుషుడిలో సంతానోత్పత్తి శక్తి లేకపోతే  అతడినీ, అండంలో డిఫెక్ట్ వుంటే స్త్రీని ట్రీట్ చేయాలి. పురుషుడి సంబంధించినంత వరకు TESTOSTERON, FSH, LH....స్త్రీకి సంబంధించినంత వరకూ PROLOCTIN ESTRODIOL, PROGESTEROS అని హర్మోనల్ ఎస్సీస్  వుంటాయి. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి. సంతానం కలగకపోవటానికి ఇద్దరూ  సగంసగం కారణభూతులే. ట్రీట్ మెంట్ పూర్తయ్యాక సంతానం  కలగటానికి కేవలం చెరొక 20 శాతం ఛాన్సు మాత్రమే వుంది. ఈ పరీక్షలూ, ట్రీట్ మెంట్లూ ఎనిమిది నెలలపాటు జరగాలి. అంత చేసినా కూడా అయిదుగురు దంపతుల్లో ఒకరికి మాత్రమే పిల్లలు పుట్టే ఛాన్సు వుంది."

    "మైగాడ్! మరీ విషయం డాక్టర్లు ఆ దంపతులకి చెప్తారా?"

    "తెలీదు, నేనెప్పుడూ సంతానోత్పత్తి కేంద్రానికి వెళ్ళాలేదు. బహుశా చెప్పరేమో. ముందు నమ్మకం కలిగించటం ముఖ్యం కదా" నవ్వేడు.

    "మరి ఈ డి అండ్ సి?"

    "అది కేవలం చీకట్లో బాణం వేయడం లాంటిది. ఉదాహరణకి "అజూస్సెర్నియా" అన్నది వున్నదనుకుందాం."

    "అంటే?"

    "మొగవాడి వీర్యకణాల్లో సంతానోత్పత్తి చేసే కౌంట్ శూన్యంగా వుండటం.....భర్త  అలాటి వాడైతే ఆ విషయంలో బ్రహ్మ కూడా ఏమీ చేయలేడు. మొట్టమొదట ఈ పరీక్ష చేయాలి. సంతానం కలగకపోతే దురదృష్టశాత్తు మొదట 'స్త్రీ' నే బాధ్యురాల్ని  చేస్తుందీ సమాజం. అంతేకాదు. భర్త తాగుబోతు అయినా, నైట్ డ్యూటీలు ఎక్కువ వున్నవాడయినా కూడా సంతానోత్పత్తికి అది అడ్డంకి అవ్వొచ్చు. ఇంకో చిత్రమైన విషయం చెప్పనా! ఇద్దరూ బాగా చదువుకున్న  దంపతుల్లో ఇది జరుగుతుంది. మొదటిరాత్రి నొప్పికి భార్య కళ్ళవెంబటి నీళ్ళు పెట్టుకుంటే చాలా మంచిమనసుతో, "మనమధ్య ఇక ఇది వద్దు! స్నేహితుల్లా వుందాం" అనుకుని రాజీపడే దంపతులు కూడా వున్నారు. నమ్మలేని నిజం ఇది. దీన్నీ "హనీమూన్ డిసీజ్" అంటారు..."

    అంతలో పోస్ట్ వచ్చింది. అతడింకా చెప్పబోతుంటే "ముందు పోస్ట్ చూడండి. మనం తరువాత మాట్లాడుకోవచ్చు" అది మధూహ. అతడు వుత్తరాలు చదవటం ప్రారంభించాడు. చాలావరకు అతడు టెన్నీస్ నుంచి వైదొలవలసి వచ్చినందుకు సానుభూతి తెలుపుతూ వ్రాసిన వుత్తరాలే.

    చివర్లో ఒక వుత్తరం మిగిలింది. చిన్న కవరు. చింపి, లోపల్నుంచి చిన్న కాగితాన్ని బయటకు తీసాడు. నాలుగే లైన్లు వున్నాయి అంత చిన్న వుత్తరం సంభోదన లేకుండా వ్రాసిందెవరా అని ఆశ్చర్యపడుతూ చదవటం ప్రారంభించాడు.

    అతడి భ్రుకటి ముడిపడింది! పెదవులు బిగుసుకున్నాయి. ఉత్తరం చూడగానే. అతడిలో వస్తూన్న పరిణామాన్ని గమనించి మధూహ "ఏమైంది?" అని అడిగింది ఆత్రంగా.

    అతడు సమాధానం చెప్పలేదు. దానివంకే  పరీక్షగా, ఆందోళనగా చూస్తూండిపోయాడు. ఆమె అతడి చేతుల్లోంచి ఆ వుత్తరాన్ని తీసుకొని చదివింది.

    రెండు వాక్యాలున్నాయి.

    "భర్త లేకుండా చూసి ఒంటరి పరాయి ఆడదాని దగ్గిరకి అర్థరాత్రి వెళ్ళటం ఆరోగ్యానికి భంగం! భవిష్యత్తులో మళ్ళీ ఇలా ఇంకొకసారి జరిగితే దాని పరిణామం చాలా దారుణంగా వుంటుందని ఇది హెచ్చరిక."

    అని వుంది అందులో   

    సందిగ్ధం సర్వసేనాని అయి, నిశ్శబ్దాన్ని కరవాలంగా  పట్టుకుని 'సమయాన్ని' ఛిద్రం చేస్తున్నట్టు, వారిద్దరూ ఆ వుత్తరాన్ని చూస్తూ చాలాసేపు మౌనంగా వుండిపోయారు.

    ఆ నిశ్శబ్దాన్ని ముందు మధూహ బ్రద్దలు చేసింది. ".......మీరీ మధ్య లక్ష్మిని కలిసారా?"

    అతడు తలదించుకున్నాడు. అంతకుముందు చెప్పక పోవటానికి కారణం వేరు. లక్ష్మి వివాహిత అని తెలిసాక ఆమె గురించి 'బయట' మాట్లాడటం సబబుకాదని  అతడి వుద్దేశ్యం. కానీ ఇప్పుడీ వుత్తరం కొత్త ఉపద్రవాన్ని తెచ్చిపెట్టింది.

    భయం తనగురించి కాదు. తను ప్రేమించిన అమ్మాయి గూర్చి. ఈ వుత్తరం ఎవరు  వ్రాసివుంటారు? అతడు చికాగ్గా నుదురు చిట్లించాడు. ఈ లోపులో మధూహ మళ్ళీ అడిగింది. "మీరు లక్ష్మిని ఎక్కడ కలిసారు?"

    "వాళ్ళ ఇంట్లోనే"

    "వ్యాట్?" కీచుమంది మధుహ గొంతు. "లక్ష్మి ఇంట్లోనా?"

    "అవును" అంటూ జరిగినదంతా చెప్పాడు. "అంత అర్థరాత్రి తనెందుకు ఫోన్ చేసిందో అర్థం కాలేదు. నేనక్కడ రెండునిముషాలకన్నా ఎక్కువసేపు వుండలేదు...."

    "భర్త ఆరోగ్యం బవోలేదోమో. ఆమెకు భర్తంటే చాలా అభిమానం ఎప్పుడూ తనగురించే చెప్తూవుంటుంది."

    ప్రహసిత్ ఆశ్చర్యంగా "ఆమె నీకు బాగా తెలుసా?" అని అడిగాడు. ఈసారి గిల్టీగా ఫీలవటం మధూహ వంతయింది.

    "ఆమె నా స్నేహితురాలు" అంది కనులు దించుకుని. "ఏదో ఒక లక్ష్మి పేరు చెప్తేకానీ మీరు  ఇంటర్వ్యూ ఇవ్వరని నా స్నేహితురాలి ఫోన్ నెంబర్ చెప్పాను. తనే ఆ రచయిత్రి అని అప్పటికి నాకు తెలీదు."

    "ఏది ఏమైనా ఆమె జీవితం ఇప్పుడు ప్రమాదంలో పడింది" అన్నాడు ప్రహసిత్. "......ఇది ఆమె భర్తకు తెలిస్తే ఇంకేమయినా వుందా? మైగాడ్!......నావల్ల ఆమె జీవితం పాడవుతే?.......అంతకన్నా  నరకం నాకు మరొకటి వుండదు."

    మధూహ ఆ వుత్తరాన్ని మరోసారి  పరిశీలించి చూసి, "ఇది ఆమె భర్త చేతివ్రాత కాదు. నాకు ఆయన హండ్రైటింగ్ బాగా తెలుసు" అంది. "ఇలాంటి వుత్తరం ఆమెకి కూడా ఒకటి వచ్చిందేమో"

    వస్తే ఆత్మహత్య చేసుకుంటుంది. అంత భయస్తురాలు. మనమే ఇంత కంగారు పడుతున్నామంటే, ఇక తనయితే అసలు తట్టుకోలేదు" అంది మధూహ.

    "నువ్వు తనని కలుసుకో. మాటల్లో పెట్టి, ఇటువంటి వుత్తరం తనకీ వచ్చిందేమో కనుక్కో వస్తే ధైర్యం చెప్పు. మేము  మళ్ళీ కలుసుకునే ప్రసక్తిలేదు. కాబట్టి, భవిష్యత్తులో ఏ గొడవా జరగదనే నా వుద్దేశ్యం. ఒకవేళ అలాటి వుత్తరమేదీ రాకపోతే మాత్రం ఈ విషయం చెప్పకు. అనవసరంగా తననీ కంగారు పెట్టటం దేనికి!"

    "నేనీ సాయంత్రమే వెళ్ళి కలుసుకుంటాను" అంటూ లేచింది.

    "నాకూ క్లినిక్ మూసేసే టైమైంది. నిన్ను మీ ఇంటిదగ్గర దింపి వెళ్తాను. అదే దారికదా" అంటూ ప్రహసిత్ కూడా లేచాడు.

    ఇద్దరూ కార్లో కూర్చున్నాక, అతడు మౌనంగా డ్రయివు చేయటం చూసి, "ఏమిటలావున్నారు?" అని అడిగింది.

    "ఆ వుత్తరం.....దాని గురించే ఆలోచిస్తున్నాను"

    ఆమె మాట్లాడకుండా, రోడ్డువంక చూడసాగింది. కారు నెమ్మదిగా కదుల్తోంది. తనలో తను అనుకుంటున్నట్టుగా అతను అన్నాడు. "ఈ బ్లాక్  మెయిలర్ ఎవరు? అంత అర్థరాత్రివేళ ఎవరు నన్ను గమనించి వుంటారు? గమనించినా ఎలా గుర్తుపట్టి వుంటారా? పక్కింటి వాళ్ళెవరయినా చూసి వుంటారా? లేక ఆమె భర్తా?"

    "నిశ్చయంగా ఆమె భర్త కాదు" దృఢంగా చెప్పింది మధూహ. "......విష్ణు గురించి నాకు బాగా తెలుసు. అతడిని మొదటిసారి చూసిన వాళ్ళు పెద్ద స్వార్థపరుడు అనుకుంటారు. కానీ అతడిది స్వార్థం కాదు. మెటీరియలిజం. నూరుశాతం మెటీరియలిజం! అతడెవరికీ హాని తలపెట్టడు. అలా అని తన సంతోషం కోసం దేన్నీ వదిలిపెట్టడు. బాధ్యతనీ సంతోషాన్నీ రెండుగా విడగొట్టి, రెండుపనులూ వేర్వేరుగా చేసుకుపోతాడు. చాలామందిలా, ఒకలా ప్రవర్తిస్తూ మరోలా  కబుర్లు చెప్పడు. తన కోసం తను బ్రతుకుతాడు. దానికి ఎవరు  అడ్డుచెప్పినా వినడు. అడ్డొస్తే నిర్దాక్షిణ్యంగా పక్కకి తోసేస్తాడు."

    ప్రహిసిత్ ఆమెవైపు ఆశ్చర్యంగా చూస్తూమ్ "సైకాలజీ బాగా చదివినట్టున్నావే నువ్వు" అన్నాడు.

    "మనతో మెసిలే వ్యక్తి గురించి విశ్లేషించటానికి మానసిక  శాస్త్రాలే చదవనవసరం లేదుగా. ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే, అతడికున్న మనస్తత్వానికి అతడిలాటి వుత్తరాలు వ్రాయుడు. డైరెక్టుగా వచ్చి మీతో మాట్లాడతాడు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే, "నా భార్యకూ నీకూ ఒకరిమీద ఒకరికి అంత ఇష్టముంటే మీరిద్దరూ కలిసి వుండండి. నాకభ్యంతరంలేదు" అని చెప్తాడు. కావాలంటే విడాకులు ఇస్తాడు. అలా ఇచ్చిన మరుక్షణం భార్యని.....పేరుతో సహా మర్చిపోయి మరో ఫ్రేమ్ లోకి వెళ్ళి ఆనందం వెతుక్కుంటాడు. అప్పటివరకూ వారిది ఎంత అన్యోన్యమైన దాంపత్యమైనా సరే....."

    "డిటాచ్ మెంట్?"

    "కాదు. సెల్ఫ్...సెంటర్డ్ నెస్" అంది మధూహ. "....ఒక వుదాహరణ చెప్తాను. ఒకరోజు మధ్యహ్నం వాళ్ళింటికి వెళ్ళాను. లోపల ఇద్దరూ భోజనానికి కూర్చోబోతున్నారు. నన్ను చూసి లక్ష్మి "భోజనం చేసావా?" అని అడిగింది. లేదన్నాను. భర్త భోజనం అయ్యాక ఇద్దరం కలిసి చేద్దామని నాతోచేప్పి లోపలికి వెళ్ళింది. పడి నిముషాల వరకూ బయటికి రాలేదు. తరువాత విష్ణు వక్కపొడి వేసుకుని ఆఫీసుకి వెళ్ళిపోయాడు. లక్ష్మి బాగా అప్ సెట్  అయింది. వంటింట్లో పొయ్యిమీద ఎసరు పెట్టివుంది. కల్సి భోజనం చెయ్యమని భర్త బలవంతపెట్టాడని, పూర్తిగా తినేవరకూ వదల్లేదనీ బాధపడుతూ చెప్పింది. అప్పుడు అతడిమీద చాలా  కోపం వచ్చింది. నిజంగా అంత సాడిస్టులు వుంటారా అనుకున్నాను. పదినిముషాల్లో వండి నాకూ  పెట్టిందనుకోండి. అది వేరే సంగతి. కానీ ఆ తరువాత  అలాటిదే మా  ఇంట్లో మరో సంఘటన  జరిగింది. భోజనం టైమ్ కి వూరునుంచి సోమం వచ్చాడు. నేను కంచం ముందు నుంచి లేచి అతడికి పెట్టాను. కానీ ఆ తరువాత బియ్యం లేవు. సాయంత్రానికి గానీ అప్పు దొరకలేదు. ఆ ఆకలి నాకో గొప్ప సత్యాన్ని చెప్పింది. వెళ్ళకూడాని టైమ్ లో వెళ్ళినప్పుడు మనని ఆహ్వానించేవారి నవ్వు వెనుక ఒక కష్టం కూడా వుంటుందని! అప్పటివరకూ విష్ణుని సాడిస్టు అనుకున్నాను. కానీ  ఆ క్షణం అనిపించింది అతనో రియలిస్టు అని.  అలాటి వ్యక్తులు అవతలివారి మీద  ప్రేమ కారిపోయేలా ప్రవర్తించరు. తమేమిటో తమ చర్యల ద్వారా స్పష్టంగా చెప్తారు. తమ అభిప్రాయాలు అవతలి వారికి నచ్చకపోయినా, అవతలివారి ప్రవర్తన తమకు నచ్చకపోయినా  కామ్ గా వారినుంచి దూరమవుతారు తప్ప చాలామందిలాగా ఆప్యాయతల్ని పై పూతలుగా పూసుకోరు."

    "నిజమేనేమో. అంత అర్థం చేసుకుంది కాబట్టే బహుశ లక్ష్మికి భర్త అంటే అంత ఇష్టమై వుంటుంది" కారు వీధిలోకి తిప్పుతూ అన్నాడు ప్రహసిత్.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra