"ఎలా?"
"క్లబ్స్ కీ, హోటల్స్ కీ తీసుకెళ్ళండి. డ్రింక్స్ తీసుకోమని ఎంకరేజ్ చేయండి! నాన్ వెజ్ అలవాటు చెయ్యండి...."
పాలిపోయింది యశోద మొహం...." ఇలాంటివి నాకిష్టంలేదు!"
"తప్పదు! అతడు తన చుట్టూ అజ్ఞాతంగా అల్లుకున్న పాపపుణ్యాల గూడు నుంచి బయట పడాలి."
"కానీ ఇవన్నీ వ్యసనాలుగా తయారయ్యే ప్రమాదముంది."
"ఉంది. కానీ అసలు సమస్య పరిష్కారమైతే ఇవన్నీ తేలిగ్గా వదిలించుకోవచ్చు."
"ప్రయత్నిస్తాను. థేంక్యూ!"
లేచింది.
మన సంభాషణ అతడికి చెప్పకండి"
"చెప్పను"
"ఎప్పుడూ ఆశాజనకంగా.. ఎంకరేజింగ్ గా మాట్లాడండి."
"నాకు తెలుసు"
"యూ ఆర్.. వెరీ స్వీట్"
"థేంక్యూ! అవసరమైతే మళ్ళీ కలుస్తాను" చేతులు జోడించింది.
* * *
తలారా చన్నీళ్ళు స్నానం చేసి వచ్చింది యశోద. బిడియంగా చూశాడు వివేక్.
"అయామ్ సారీ"
"మీరలా ఫీలవకూడదు. పరిస్థితి అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి మనసు చెప్పినట్లు వినదు".
బ్రతిమాలుతున్నట్లు నచ్చజెపుతున్నట్లు. అనునయంగా అంది. తనసహనమంతా కూడదీసుకుంటూ మాట్లాడుతోంది.
పెళ్లయి నెలరోజులయింది. కానీ ప్రతి రాత్రీ పట్టరానితమకంతో యశోదని దగ్గరకి తీసుకుంటాడు వివేక్. ముద్దులతో ముంచెత్తుతాడు. గాఢంగా కౌగిలించుకుంటాడు.
నగ్నంగా చేసేసి తన పక్కన పడుకోబెట్టుకుంటాడు. శరీరంలో ప్రతీ అంగుళమూ పెదవులతో లాలిస్తాడు. యశోద రెచ్చిపోయి కోరికలతో కాగిపోతున్నప్పుడు భయంతో వణికిపోతూ వెనక్కి వాలిపోతాడు.
వివేక్ ని ఎంత ప్రేమిస్తున్నా.. అతడి పరిస్థితి పట్ల ఎంత సానుభూతి ఉన్నా రెచ్చిపోయిన శరీరాన్ని అదుపులోకి తెచ్చుకోలేకపోతుంది యశోద. వివేక్ అసలు తన జోలికి రాకుండా ఉంటే తను శారీరక సుఖం కోసం తపించేది కాదు. ఆ ఆలోచనలే లేకుండా ఉండేది. కానీ వివేక్ పిచ్చిగా రెచ్చగొట్టేసి వదిలేస్తున్నాడు.
"నిన్ను హింసిస్తున్నాను కదూ!?"
"అదేంలేదు. వివేక్! నీ స్పర్శ నాకు మతిపోగొడుతోంది అంతే"
"కానీ... కానీ!"
"లీవిట్! నేనంత కాముకిని కాదు! నీతో కలిసి ఉంటున్నాను. అది చాలు నాకు."
అపూర్వమైన తృప్తితో నిండిపోయింది వివేక్ మనసు. యశోద చేతులు కళ్ల కద్దుకున్నాడు..
"యశూ! చెప్పు. నేను నీకోసం ఏం చెయ్యగలను?"
"అడగనా?"
"ఇంకా సందేహిస్తున్నావ్!. ఏం చెయ్యమన్నా చేస్తాను."
"తీరా చెప్పాక అసహ్యించుకుంటే.....?"
జంకాడు వివేక్. అతడి ముఖం పాలిపోయింది.
"విడాకులియ్యమంటావా? ఇంకెవరినైనా పెళ్ళి చేసుకోవటానికి నిశ్చయించుకున్నావా? తప్పకుండా ఇస్తాను! ఇస్తానని ముందే చెప్పాను... ఎవరో ఆ అదృష్టవంతుడు?"
ఫక్కున నవ్వి అతడి ముక్కు పట్టుకుని ఊగించింది.
"ఒక్కసారి అద్దంలోకి చూసుకోండి! ఆ అదృష్టవంతుడెవరో తెలుస్తుంది. ఏమిటా ముఖం దివాళాతీసిన వాడిలాగా? నువ్వు నాకు విడాకులిచ్చినా నేను నీకు విడాకులివ్వను. ఈ జన్మలో నిన్నొదలను"
"ఏ జన్మలలోనో నేను చేసుకున్న పుణ్యఫలానివి నువ్వు!"
"బ్రేవ్! పుణ్యాలు, పాపాలూ, వాటి ఫలితాలూ! ఇదంతా నువ్వు నమ్ముతావా"
"నమ్మను! అలవాటుగా వచ్చిన ఎక్స్ ప్రెషన్ అది. దేవుడంటే నమ్మకం లేకపోయినా."
"ఓయ్! దేవుడా అన్నట్లు...."
"మనం "బ్లూస్టార్" హోటల్ కి వెళదాం. అదే నేను అడగాలనుకుంటూన్నది."
తెల్లబోయాడు వివేక్.
"బ్లూస్టార్ హోటల్ కా? ఇప్పుడా?"
"అదిగో! అలా అయిపోతావనే అడగనన్నాను హోటల్ కెళ్ళి కాసేపు కూర్చుంటే తప్పేముందీ? ఇప్పుడెంతయిందీ? తొమ్మిదేగా ఆ హోటల్ లో చూడవలసినవన్నీ ఇప్పుడే మొదలవుతాయి!"
యశోద మాటను కాదనగలిగే శక్తి లేదు వివేక్ లో!. నిజానికి ఆ హోటల్ కి ఆ సమయంలో యశోదతో వెళ్లటం ఇష్టంలేదు. ఆ హోటల్ లో ఏం జరుగుతుందో అతడికి తెలుసు! కానీ యశోద మాట కాదనలేకపోయాడు. సుఖపెట్టాలి! ఎలా అయినా సుఖపెట్టాలి. తనకోసం యశోద చేస్తున్నది ఎంతో..... ఆమెకోసం తనుకూడా ఏదైనా చేస్తాడు.
"వెళ్దాం పద!" అన్నాడు నవ్వు తెచ్చిపెట్టుకుంటూ.
యశోద జాలిపడింది. బాధపడింది నిజానికి ఆ హోటల్ కి వెళ్ళడమూ వివేక్ ని తీసికెళ్ళడమూ యశోదకి ఇష్టం లేదు. సైక్రియాటిస్ట్ "ట్రెడిషనల్ ఇన్ హేబిషన్స్" నుంచి వివేక్ ని బయటపడెయ్యటానికీ క్లబ్స్ కీ బార్స్ కీ తీసికెళ్లమన్నాడు. డ్రింక్స్.. నాన్ వెజ్ అలవాటు చెయ్యమన్నాడు.