"నేను దేవతను కాను నువ్వు నాకు పెళ్ళిచేసుకోను. దేవతను పెళ్ళి చేసుకున్నాక పూజచేయకుండా మన ఉండలేను...."
"మాటలు నేర్చావులేకానీ మన పెళ్ళేప్పడో చెప్పు...."
"ఏం-నీకు తొందరగా ఉందా?"
"ఊ"
"ఎందుకత తొందర?"
"నేను వెయ్యిళ్ళపూజారినికాదుగా -అందుకు!"
"అంటే!"
"నువ్వు వెయ్యిళ్ళ పూజారివి. వెయ్యిళ్ళలో వెయ్యిమంది దేవతలుంటారు. ఏ దేవత నిన్ను మాయంచేస్తుందోనని నా భయం. ఒకసారి మన పెళ్ళి జరిగితే నాకాభయముండదు...."
"నేనంటే నీ కెందుకింతయిష్టం?" అన్నాడు సాగర్.
"పెద్దలు చిన్నప్పుడే నిర్ణయి చిన పెళ్ళి మనది. అందుచేత చిన్నప్పట్నించి నిన్నుతప్ప వేరెవర్నీ మనసుతో ఊహించుకోలేదు నేను...." అంది అరవింద.
"అరవిందా! కోటిళ్ళలో కోటిదేవతలుండవచ్చు. కానీ ఎప్పటికీ నా దేవతవు నువ్వే! ప్రస్తుతం కొంతకాలంపాటు నేను బిజీగా ఉంటాను. నిన్ను కలుసుకోలకపోతే ఏమీ అనుకోకు. నేను నిన్నుతప్ప ఇంకెవరినీ పెళ్ళి చేసుకోను.... అన్నాడు సాగర్.
"నీ మాటలు నమ్మమంటావా?"
"నీకు అందముంది. సోగసుంది. నీవెనుకడబ్బుంది. నీకు నామీద కొండంత అభిమానముంది. చిన్నతనం నుంచీ కలిసిమెలిసి ఒకరినొకరు బాగా అర్ధంచేసుకున్నాం. నా పెద్దలకు, నీ పెద్దలకు మన పెళ్ళి అంగీకారమైంది. నిన్నుకాక వేరేవరిని నేను పెళ్ళి చేసుకుంటాను?" అన్నాడు.
"నువ్వు మాట్లాడుతుంటే నిజం చేనుతున్నావో, వేళాకోళంచేస్తున్నావో తెలియడంలేదు...."
"నీకు నమ్మకం కలిగించాలంటే ఏం చేయను?"
అరవింద చేయిజాపి- "ఒట్టువేయి-" అంది.
"ఒట్టు వేస్తే నీకు నమ్మకమా?" అన్నాడు సాగర్.
"ఊఁ"
"అయితే నీ మీద ఒట్టు...." అంటూ ఆమెచేతిలో చేయివేశాడతాడు.
అరవింద అతడిచేయి గట్టిగాపట్టుకుని- "ఇప్పుడు నేను నిన్ను నమ్ముతున్నాను" అంది.
"నిన్ను నమ్మించే ఉపాయం చెప్పావు. పెళ్ళయ్యాక ఇది నాకు బాగా ఉపయోగపడుతుంది-" అన్నాడు సాగర్.
"అదంత సులభం కాదు. చిన్నప్పుజోసారి నామీద ఒట్టేసి అబద్దం చెప్పావు. అప్పుడు నాకు ఫెళ్ళున జ్వరం కాసింది. ఆ తర్వాత నువ్వెప్పుడూ ఒట్టేసి నన్ను మోసంచేయలేదు...." అంది అరవింద.
"అరవిందా! నిన్నే కాదు. ఒట్టేసి ఎవర్నీ మోసంచేయలేదు నేను. చిన్ననాటి ఆ సంగటన నా మనసులో గాఢంగా నాటుకుపోయింది. ఒట్లంటే నమ్మకం ఏర్పడింది!"
అప్పుడు అరవింద సాగర్ కనులలో నిజాయితీని చూసింది.
14
"ఇప్పుడెందుకూ యివి?" అంది నిర్మల.
ఆమె ఎదురుగా నీలంరంగు పరికిణీ, ఆకాశంరంగు వోణి, అదే రంగు జాకెట్టు ఉన్నాయి, ఆ బట్టలకు కాస్త దూరంగా సాగర్ ఉన్నాడు.
"మొదటిసారి చంచల్రావు మిమ్మల్నీ దుస్తుల్లో చూశాడు. ఆ తర్వాత మిమ్మల్ని వర్ణించాడు. వాడు వర్ణిస్తే కోతిని ఎలుగుబంతిగా ఊహించుకుంటాం. అంత పాడుగా వర్ణిస్తాడు వాడు. అసలు వాడికి వర్ణించాలన్న కోరికే సాధారణంగా పుట్టదు. అడక్కుండా మిమ్మల్ని వర్ణించాడంటే- మీలో ఏదో విశేషముందనిపించింది. ఆ దుస్తుల్లో మిమ్మల్ని చూడాలన్న కోరిక నాలో బలంగా ఉంది....." అన్నాడు సాగర్.
నిర్మల తటపటాయించింది.
"మీరు నా అభిమానాన్ని శంకిస్తున్నారు. మీ మనసుకు సంతోషం కలిగే ఏ పని జరిగినా నా కెంతో సంతోషాన్నిస్తుంది. ఒక్కసారి నాకోసం ఈ దుస్తులు ధరించరూ?" జాలిగా అడిగాడు సాగర్.
నిర్మల చటుక్కున ఆ బట్టలు అందుకుంది.
"పదినిముషాలు ఇక్కడే వేచివుంటాను. ఈ దుస్తులతో మీరిక్కడకు రావాలి!" అన్నాడు సాగర్.
"పదినిముషాల్లో రాకపోతే?"
"మళ్ళీ రేపటిదాకా నన్ను చూడలేరు....." అన్నాడు సాగర్.
అంటే పది నిముషాల్లో తను రాకపోతే అతడు లోనికి వచ్చేయడు. తనే బయటకు వెళ్ళిపోతాడు.
అటువంటి ఉదాత్త హృదయుడిననుమానించడం తనదేతప్పని అనుకుంది నిర్మల అయినా ఆమె సంకోచంగా- ఇప్పుడే వేసుకుంటే ఇంటి పనులన్నీ చేయాలిగదా! పనులయ్యేక వేసుకుంటే కాసేపు వంటిమీద ఉంచుకోవచ్చు-" అంది.
"అందుకుపాయం నేను చెబుతాను. ముందు మీరు బట్టలు వేసుకుని రండి-" అన్నాడు సాగర్.
అతడిని నొప్పించడం ఇష్టంలేక నిర్మల వెంటనే అక్కడ్నించి వెళ్ళిపోయి చకచకా బట్టలుమార్చుకుని అయిదునిముషాల్లోనే తిరిగి వచ్చింది.
సాగర్ ఆమెను చూస్తూ మ్రాన్పడిపోయాడు.
ఆమె అతడి ఎదురుగా అలాగే కాసేపు నిలబడి- "మీరు మాట్లాడడం లేదు-" అంది.
అప్పుడు సాగర్ ఉలిక్కిపడి- "ఏంమాట్లాడను? నావద్ద పూలులేవు. పత్రిలేదు మంత్రోచ్చారణకు నోరెలావిప్పేది?" అన్నాడు.
"పూలు, పత్రి ఎందుకు?" అంది నిర్మల.
"అనిలేనిదే ఈ దేవతనెలా పూజించను?"
నిర్మల సిగ్గుపడుతూ- "దేవత ఎవరు?" అంది.
"మీరే!" అన్నాడు సాగర్.
నిర్మల అతడి ఎదురుగా కూర్చుని- "నేను దేవతనుకాననినాకుతెలుసు. కానీ నన్ను దేవతన్నందుకు మీకు థాంక్స్ చెప్పుకోవాలి....." అంది.