Home » Kommuri venugopala rao » Vugave Uyyaala


    తండ్రి ఒంటరితనం అతనికి తెలుసు. ఆయన ఎంత దయామయుడో, తామంటే ఎంత ప్రాణమో అతనికి తెలుసు.

 

    "డాడీ! నాకేం ఫర్వాలేదు. నేను బాగానే వున్నాను."

 

    ఆయన తల ఊపాడు.

 

    "ఇహ నాకేం ప్రమాదంలేదు డాడీ. అక్కడ మీకు చాలాపనులు వుంటాయి."

 

    "ఇట్సాల్ రైట్ మై బాయ్! డోన్ట్ వర్రీ ఎబౌట్ ఆల్ దోజ్ థింగ్స్" అన్నాడాయన. ఆయన కామర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్.

 

    విద్యార్థులు వస్తూనేవున్నారు, పోతూనే వున్నారు. కానీ అతనికి కావల్సిన మనిషికోసం కనులు అస్థిమితంగా కదుల్తూ నిరీక్షిస్తూనే వున్నాయి.

 

    మూడో రోజు వచ్చింది మాధవి. ప్రక్కన కళ్యాణికూడా వుంది. అతని మొహం వికసించింది.

 

    "మీరు రారనుకున్నాను" అన్నాడు సంతోషంగా.

 

    "కానీ వస్తానని మీకు తెలుసు" అంది మాధవి.

 

    "తెలీదు. కానీ ఆశ పడ్డాను."

 

    "అనుకోనివిధంగా ఈ పరిణామం జరిగింది సార్!" అంది మాధవి.

 

    "కానీ నాకు సంతోషంగా వుంది."

 

    "దేనికి?"

 

    "పందెం గెలిచినందుకు"

 

    మాధవి ఏమీ మాట్లాడలేదు. చాలా కష్టపడి అతనీ పందెం గెలుచుకున్నాడు. అతనెంత ప్రయాసపడ్డాడో ఆమెకు తెలుసు. ఆమె ముఖం కొద్దిగా ఎరుపెక్కింది కానీ అంతలోనే మళ్లీ మామూలు మనిషయింది.  

 

    "రెండో పరీక్షకు నేను రెడీగా వున్నాను"

 

    "మీకు స్వస్థత చేకూరనివ్వండి"

 

    కళ్యాణికి వారిద్దరి సంభాషణ ఆశ్చర్యంగా వుంది. ఒకరు జీవస్మరణ సమస్యనుండి బయటపడ్డారు. ఆ జీవస్మరణ సమస్యకు కారణభూతమయ్యారు. అయినా ఇద్దరూ అది చాలా సామాన్యమైన విషయమైనట్లుగా మాట్లాడుకుంటున్నారు.

 

    "కళ్యాణిగారూ! కులాసాగా వున్నారా?"

 

    ఆమె తల ఊపింది.

 

    "నన్ను క్షమించారా?"

 

    ఏమి చెప్పాలో తెలీక ఆమె బిక్కచచ్చిపోయి చూస్తోంది.

 

    "నిజంగా...నన్ను నమ్మండి. ఆనాటి సంఘటనకు నేను బాధ్యుడ్నికాదు. నాకు దాన్నిగురించేమీ తెలీదు. నన్ను గురించి మీరలా అనుకుంటున్నందుకు సిగ్గుతో కుమిలిపోతున్నాను" అతని ముఖంలో అంత వేదనా కనిపిస్తోంది. మౌనంగా వుండటం మినహాయించి ఏమీ జవాబివ్వలేకపోయింది.

 

    మరో అయిదునిముషాలు కూర్చుని ఇద్దరూ బయటకు వచ్చేశారు.

 

    ఎదురుగా సీతారామారావుగారు కనిపించారు. ఎందుకో ఆయన్ని చూస్తుంటే ఎనలేని గౌరవభావం కలుగుతోంది.

 

    "నమస్కారమండీ!" అన్నది మాధవి అప్రయత్నంగా.

 

    "ఏవమ్మా! మీరు మా అబ్బాయి క్లాస్ మేట్సా?" అన్నాడాయన.

 

    "జూనియర్స్ మండీ. మీ రాజా మాకు బాగా తెలుసు"

 

    "ఏం జరుగుతుందోనని భయపడ్డానమ్మా! కానీ ఏ అదృష్టమో వాడ్ని కాపాడింది. మళ్ళీ తలకు బలమైన గాయమేమీ తగలకూడదన్నారు డాక్టర్లు."

 

    మాధవి ఏమీ మాట్లాడలేదు.

 

    "మీదే ఊరమ్మా?"

 

    "విజయవాడండీ!"

 

    "మీ నాన్నగారేం చేస్తారు?"

 

    "మా నాన్నగారు లేరండీ. చిన్నప్పుడే పోయారు."

 

    "అయ్యో!"

 

    "మా అమ్మగారు కూడా లేరండీ. అక్కా, బావలదగ్గరే వుంటున్నాను"

 

    "ఎవరమ్మా మీ బావగారు?"

 

    "ఆయన పేరు ప్రతాప్ అండీ. సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వుంది."

 

    "వీలున్నప్పుడల్లా వస్తూండమ్మా. తెలిసిన నలుగురూ కనిపిస్తూవుంటే వాడికి కాస్త ధైర్యంగా వుంటుంది."

 

    "అలాగేనండి" అని ఇద్దరూ కదిలారు.

 

    "మాధవీ! ఇప్పుడు నీ మనసులో ఏముంది?" అనడిగింది కళ్యాణి దారిలో.  

 

    "ఏమీలేదు"

 

    "రాజా గురించి?"

 

    "అవును రాజా గురించే!"

 

    "ఇంత జరిగాక?"

 

    "ఎంత జరిగింది?"

 

    "అదే, నీకోసం... నీ ప్రేమకోసం అతను మృత్యుముఖంలోకి వెళ్ళి వచ్చాక..."

 

    "అది కాకతాళీయం. అలా జరుగుతుందని ఎవరూ అనుకోలేదు."

 

    "అంతేనా?" అంది కళ్యాణి నిరాశగా. ఆమె అనుకున్న జవాబు లభించలేదు.

 

    "మరి?"

 

    ఇంతలో దివాకర్ ఎదురుగా వచ్చాడు.

 

    "హలో! ఎలా వుంది మన తడాఖా?" అన్నాడు హుషారుగా.

 

    "ఏడిసినట్లుగా వుంది" అంది మాధవి. ఆమెకు నిజంగా అతనంటే అసహ్యంగా వుంది.

 

    దెబ్బతిన్నాడు "అదేం?"

 

    "ఓడించమన్నాను గానీ- తల పగలకొట్టమన్నానా?"

 

    బిక్క మొహం వేశాడు "నేనూ అనుకోలేదు. థాంమ్సన్ లా విజృంభించాడు. ఫలితం యిలా అయింది."

 

    "సరే" అంటూ మాధవి ముందుకు కదిలింది.

 

    "మీరెక్కడినుంచి వస్తున్నారు?"

 

    "రాజాని చూసి"

 

    "మీరు వాడ్ని చూడడానికి వెళ్లారా?"

 

    "ఏం వెళ్ళకూడదా?"

 

    తడబడ్డాడు "అదికాదు, మీరు వాడ్ని పరామర్శించడానికి వెళితే, వాడికి అలుసైపోతారేమోనని...."

 

    "అవును. దేనికదే."

 

    "మీరొచ్చినందుకు వాడు హీరో అనుకుంటే?"

 

    "అనుకోనియ్! నాకేం నష్టంలేదు."

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra