Home » Yandamuri veerendranath » అతడు ఆమె ప్రియుడు


    సిరిచందన ప్రసక్తి వచ్చేసరికి మహర్షి నెమ్మదిగా తల తిప్పి చూశాడు. చలమయ్య కొనసాగించాడు. "ఎంత అల్లరి చేసే వారని! ఆ అమ్మగారు వచ్చారంటే ఈ ఇంటికే పెళ్ళిసంబంధం వచ్చినంత హడావుడిగా వుండేది. అలాటిది ఎత్ట్టా సిక్కిపోయిందో!"

    అతడు మౌనంగా కాస్తదూరంగా వున్న యూకలిప్టస్ బార్ లని  గమనిస్తూ కూర్చున్నాడు. చలమయ్య గొంతులో తొణికిసలాడే విషాదాన్ని తాముకూడా  గమనించినట్టు సానుభూతిగా చూస్తున్నాయి చెట్లు.

    ఉండుండి ఏదో గుర్తుకు వచ్చినట్లు చలమయ్య అతని దగ్గరగా  కూర్చుని  ఏదో రహస్యం చెపుతున్నట్లు అన్నాడు. "బాబుగారూ, మీరు అమ్మాయిగారు స్నేహితులంటకదా? ఆయమ్మభర్త కళ్ళు చక్కబడాలంటే నేనోమాట చెబుతాను వింటారా?"

    చప్పున మహర్షి అతనివైపు తిరిగాడు. అతను చెప్పబోయే దేమిటో మొదట్లో ఒక అనుమానం వచ్చింది కానీ, ఆ అమాయకమైన నౌకరుకి ఏ చెడు  ఆలోచనా ఆపాదించలేక "చెప్పు తాతా, సిరిచందన నా ఆప్తమిత్రురాలు. జీవితం చక్కబడుతుందంటే మనం ఏమైనా చెయ్యొచ్చు" అన్నాడు.

    "ఏం లేదు బాబూ. ఇక్కడికి దగ్గర్లో  కోయపల్లె వుంది. అక్కడ రామరాజదొర అనే పల్లె నాయకుడుంటాడు. ఆయన ఇంతకు ముందు చాలామందికి నయం చేశాడు. అంతెందుకు, నాకు ఒకసారి పక్షవాతం  వచ్చి కుడికాలు, కుడిచేయి పడిపోతే  ఆయనే ఏదో పసరు మూడు రోజులపాటు రాయమని  ఇచ్చేళ్ళాడు అది రాయగానే మూడో రోజుకల్లా మళ్ళీ మామూలు మనిషినై  పోయాను."

    మహర్షి గాఢంగా విశ్వసించాడు. అతనికి నమ్మకం లేదు.

    పక్షవాతం వచ్చిన వాళ్ళకి, విష జ్వరం తగిలిన వాళ్ళకి  నయం  చెయ్యడం  వేరు. ఈ తూర్పు కొండల్లో ఇలాంటి కోయవాళ్ళు చాలామంది ఉన్నారని వినికిడి  కానీ గుడ్డివారికి చూపు తెప్పించటం వేరు. అందులోనూ మెదడుకి దెబ్బ  తగిలి ఆప్టిక్ నర్వ్ పాడై పెద్ద పెద్ద డాక్టర్లే పెదవి విరిచిన కేసులో, మూలికల ద్వారా చేయటం అసాధ్యం.

    కానీ,

    ఏమో, ఏ పుట్టలో ఏ పాముందో!

     అతడు చలమయ్యతో "ఫలితం ఉంటుందంటావా తాతా?" అని అడిగాడు.

    "నిజమే బాబుగారూ! ఆయన పుట్టిగుడ్డివాళ్ళని కూడా  నయం చేసాడని చెప్పుకుంటారు" అన్నాడు చలమయ్య.

    మహర్షిలో ఆలోచన ప్రారంభమైంది. "రేపు ఉదయమే అక్కడికి వెళ్దామని చందనగారికి చెబుతాను తాతా! నాకు ఆ కోయపల్లె ఎటు వెళ్ళాలో చెప్పు" అన్నాడు.

    చలమయ్య చెప్పబోతూ వుండగా లోపలినుంచి "కెవ్వు" మని కేక వినిపించింది.

    ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. లేచి గెస్ట్ హౌస్ వైపు వెళ్ళబోతూ ఉండగా లోపలినుంచి సిరిచందన కేకలు వినిపించసాగాయి. అక్కడ నిశ్శబ్దంలో అవి భయంకరంగా వినిపించసాగాయి.

                                                             5

    సర్దార్ అబ్బాస్ ఆలీఖాన్ తన ఎదురుగా కూర్చున్న ఇద్దరివైపు కన్నార్పకుండా సాలోచనగా చూశాడు.

    స్మగ్లర్స్ గ్యాంగ్ లో  ఆలీఖాన్ గురించి తెలీని వారంటూ వుండరు. గోల్డ్  స్మగ్లింగ్ లో అతనిది అందెవేసిన చెయ్యి.

    "అయితే ఆ రవితేజకి మీరు హొటల్ లో ఉన్నట్లు ఎలా తెలిసిందో ఊహించలేమంటారు" అన్నాడు సర్దార్.

    అతనెందురుగా ఉన్న వాళ్ళిద్దరూ మాట్లాడలేదు. వాళ్ళలో ఒకడు ఇబ్రహీం, రెండవ వాడిపేరు శాస్త్రి.

    కొంచెం నిశ్శబ్దం తర్వాత శాస్త్రి కదిలి "సాబ్, ఆ పోలీసాఫీసరు మా దగ్గరకి వచ్చే టైమ్ కి ఆకడ గోల్డ్ బిస్కట్స్ ఉంటాయని ఊహించలేదనుకుంటాను" అన్నాడు.

    సర్దార్  అతడివైపు తీక్షణంగా చూస్తూ "ఏం ,ఎందుకలా అనిపించింది" అని అడిగాడు.

    "అతడు పోలీస్ డ్రస్ లో లేడు."

    "మప్టీలో మిమ్మల్ని వెంటాడుండొచ్చుగా."

    "కాదు సాబ్" అన్నాడు ఇబ్రహీం. "అతను లోపలికొచ్చాక మమ్మల్ని బెదిరించి మంచం కింద ఉన్న గోల్డ్ బిస్కట్స్ చూసిన తర్వాత, అప్పుడు కమీషనర్ కి  ఫోన్ చేశాడు, అట్నుంచి కమీషనర్ కూడా ఆశ్చర్యపోయాడు. దాన్ని బట్టి  పోలీసులకి ఈ విషయం తెలీదని, ఇదంతా ముందనుకున్నట్టు జరిగిన  వ్యవహారం కాదని అనిపిస్తోంది."

    సర్దార్ సిగరెట్ వెలిగించాడు. అగ్గిపుల్ల యాష్ ట్రేలో వేస్తూ  "రవితేజ  మీద  మీరు ప్లవర్ వాజ్ విసరగానే బయటికి పరిగెత్తామన్నారు కదూ?"

    ఇద్దరూ తలలూపారు. ఇబ్రహీం చెప్పాడు. "అవును. నేను పై  అంతస్తు మీదికి పారిపోయాను. శాస్త్రి కిందకి  పరుగెత్తాడు. రవితేజ  నన్ను ఫాలో  అవుతూ  పైకొచ్చాడు. అక్కడ ఇంకెవరో  వ్యక్తి ఉన్నాడు. అతడు రవితేజని కిందకి తోసేశాడు. నేను గబగబ కిందకి పరుగెత్తుకుంటూ వెళ్ళి చీకట్లో సురక్షితమైనా  స్థలానికి చేరుకున్నాను."

    సర్దార్,  ఇబ్రహీం దగ్గరకొచ్చి, చేయిసాచి బలంగా అతని చెంపమీద కొట్టాడు. "అన్ని లక్షలు విలువైన బంగారు బిస్కట్లు రూంలో పెట్టుకొని  పరుగెత్తింది చాలక సురక్షితమైన స్థలానికి చేరుకున్నానని చెబుతావా?" అన్నాడు  కోపంగా ఇబ్రహీం మాట్లాడలేదు. సర్దార్ కెదురు చెబితే ఏం జరుగుతుందో అతడికి బాగా తెలుసు.

    శాస్త్రి తన కుర్చీలో కొద్దిగా కదిలి "సాబ్!" అన్నాడు. ఏమిటో చెప్పమన్నట్లు సర్దార్ అతనివైపు కళ్ళెగరేశాడు.

    "నేను క్రిందికి పరిగెత్తి మొక్కల వెనకాల దాక్కున్నాను. నా వెనకాల రవితేజ రాలేదు. అతడు ఇబ్రహీంని వెంటాడుతూ పైకెళ్ళాడని అనుకుంటూ ఉండగా పైనుంచి రవితేజ శవంలా క్రిందపడిపోయాడు. ఇబ్రహీం తోసి  ఉంటాడనుకున్నాను. జనమంతా రవితేజ చుట్టూ మూగి ఉండగా  నేను తిరిగి ఆ రూంకి వెళ్ళాను. అయితే అది ఆటోమాటిక్ లాక్ సిస్టం అవటంవల్ల తలుపు తాళం పడిపోయింది. దాని  తాళం చెవి లోపలే ఉండిపోయింది. నాకేం చేయాలో తోచలేదు. ఈ లోపులో కమీషనర్  పోలీసులతో సహా రావటం  చూసి అక్కడే  కారిడార్ లో దాక్కుండి పోయాను. రవితేజని అంబులెన్స్ ఎక్కించిన తర్వాత కమీషనర్  హొటల్  మేనేజ్ మెంట్ దగ్గరనుంచి తాళం చెవి తీసుకొని, తలుపు తెరిచి లోపలి ప్రవేశించాడు. అతనితోపాటు బ్రీఫ్ కేస్  లు బయటికి రాలేదు. ఆ పరిస్థితుల్లో  నేను  వాళ్ళకి కనపడటం ప్రమాదకరమని చీకట్లోనే ఉండిపోయాను. అందరూ  వెళ్ళిపోయాక నేను తిరిగి మన స్థావరానికి వచ్చేశాను. పోలీసులు ఆ గది సీల్ చేసి  ఉంచారని, మా వేలిముద్రల కోసం తరువాత వస్తారని నేను అనుకున్నాను. కానీ  మరుసటిరోజు పేపర్లో ఈ వార్తేమీ పడలేదు. అసలు గోల్డ్ బిస్కట్స్ ఆ గదిలో దొరికిన సంగతే వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేయలేదు. అంటే....."

    మిగతా వాక్యం సర్దార్ పూర్తి చేశాడు. "అంటే పోలీస్ కమీషనరే తర్వాత వచ్చి ఎవరికీ తెలియకుండా ఆ బ్రీఫ్ కేసులు తీసుకొని పోయుంటాడన్నమాట."

    కరెక్ట్ అన్నట్టు ఇద్దరూ తలలూపారు. ఇబ్రహీం సిగరెట్ ని యాష్ ట్రే లో  నలిపేస్తూ "ఈ విషయాన్ని మొట్టమొదటసారి చూసిన 'రవితేజ' పై అంతస్థుమీద నుంచి పడిపోయి చచ్చిపొయింటాడని భావించి కమీషనర్ అశ్వత్థామ ఆ బంగారం  సొంతం చేసుకొని ఉండొచ్చు. కానీ ఇప్పుడు బతికి ఉన్నాడు కాబట్టి, ఇప్పటికైనా కమీషనర్ ఆ బంగారాన్ని పోలీసుల స్వాధీనం చేయాలి."

    "కానీ సాబ్ ఇంతకాలం అవి ఎందుకు స్వాధీనపరచలేదని పై అధికారులు ప్రశ్నిస్తారని కమీషనర్ భయపడుతూ ఉండి ఉండవచ్చు!"

    "అటువంటప్పుడు రవితేజ, కమీషనర్ కుమ్మక్కై ఉండాలి. ఇద్దరూ చెరిసగం బంగారం తీసుకుందామని ఒక అగ్రిమెంటుకి వచ్చి ఉండాలి. మనం బంగారం తిరిగి పొందాలంటే ఆ కమీషనర్ ని బెదిరించాలి" అన్నాడు.

    "కష్టం. ఆ కమీషనర్ చుట్టూ సెక్యూరిటీ చాలా వుంటుంది. సులభమైన పద్ధతి రవితేజని బెదిరించటం. అతన్ని చంపైనా సరే మనం తిరిగి మన బంగారాన్ని సంపాదించాలి. అసలా బంగారం సూట్ కేస్ లు ఎక్కడున్నాయో తెలియాలంటే ముందు రవితేజని పట్టుకోవాలి. అతను ప్రస్తుతం ఎక్కడ వున్నాడో, ఏ హాస్పిటల్ లో ఉన్నాడో కనుక్కోండి."

    "అతను హాస్పిటల్ లో లేడు సాబ్! ఆ విషయం నేను కనుక్కున్నాను" అన్నాడు శాస్త్రి. "అతడు శ్వాశతంగా అంధుడయ్యాడట. భార్యతో కలిసి హనీమూన్ వెళ్ళడంట."

    సర్దార్ బిగ్గరగా నవ్వాడు. "కళ్ళు పోయినోడికి హనీమూనా? సరే- మన పని  మరీ సులువవుతుంది. అతను ప్రస్తుతం ఎక్కడున్నాడో కనుక్కోండి" అంటూ ఆ మీటింగ్ ముగిసినట్టు కుర్చీలోంచి లేచాడు.



                              6


    గెస్టు హౌస్ లో నుంచి కేక వినపడగానే, మహర్షి రాతిచప్టామీంచి లేచి జువ్వలా పరిగెత్తాడు. చలమయ్య అతన్ని అనుసరించాడు. తలుపులు లోపల  గడియవేసి వున్నాయి. దబదబా వాటిని మహర్షి, రెండు నిమిషాల తర్వాత గానీ అవి తెరుచుకోలేదు. సిరిచందన నైటీలో వుంది. మనిషి వణికిపోతూ ఉంది. బెడ్ రూం వైపు చూపిస్తూ "పా.....పాము....." అంది. ఆమెని పక్కకితోసి మహర్షి లోపలి పరిగెత్తాడు. బైటకి రావటం కోసం రవితేజ. తడుముకుంటూ తలుపు వరకూ వచ్చాడు. అతడి చేతులు పట్టుకుని బయటికి లాగాడు మహర్షి. సిరిచందన భర్త దగ్గరికి వచ్చి అతనికి ఏ ప్రమాదమూ జరగలేదని నిశ్చయించుకోవటం కోసం  అన్నట్టుగా వళ్ళంతా  తడిమి చూసింది. ఈ లోపులో మహర్షి బెడ్ రూం లోకి అడుగు పెట్టబోయాడు. "మహీ, జాగ్రత్త! లోపల పాము" అంది.

    వాళ్ళు కాలేజీలో చదువుకొనే రోజుల్లో పూర్తి పేర్లతో పిలుచుకోవటం ఎప్పుడూ అలవాటు లేదు. మహర్షిని అందరూ 'మహీ' అనేవారు. ఆ ఆ క్షణం  అతడు  పనిచేసేవాడని ఆమె మర్చిపోయింది.

    మహర్షి జాగ్రత్తగా గదిలోకి ప్రవేశించి చుట్టూ చూశాడు.ఎక్కడా పాముజాడ కనపడలేదు. బాత్ రూం తలుపు వేసింది. అతడు గదంతా  పరిశీలిస్తూ, మోకాళ్ళమీద వంగి కిందకి చూశాడు. మంచంకింద కనబడింది.

    అయితే అది పాము కాదు. ఎప్పుడో కిటికీకి కట్టిన పాత కర్టెన్  తాలూకు తాడుముక్క క్రితం రోజు వర్షానికి తడిసి చీకిపోయింది. గాలికి అది  వూడి  ఆమె మీద పడి వుంటుంది. ఒక్కసారిగా ఒంటికి తడి తగలడంతో ఆమె దాన్ని  విదిలించి పాము అని భ్రమపడి వుంటుంది.

    మహర్షి దాన్ని బయిత్కి తీసి హాల్లోకి తీసుకొచ్చాడు. హాల్లో  సిరిచందన  ఇంకా భయపడుతూనే నుంచొని ఉంది. మహర్షి నవ్వుతూ "ఇది..... ఈ తాడుచూసి  మీరు పామనుకొని భయపడి వుంటారు" అంటూ తననుకున్నది చెప్పాడు. రవితేజ  బిగ్గరగా నవ్వాడు. సిరిచందనకి కూడా విషయం అర్థమైంది. కానీ , భయం పూర్తిగా పోలేదు. తన చర్యకి తనే సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయింది. రవితేజ  మహర్షితో "నువ్వు ఈ హాల్లోనే పడుకో" అంటూ తనుకూడా  లోపలికి  వెళ్ళాడు.

    మహర్షి చలమయ్యతో కలిసి గెస్ట్ హౌస్ కి వెళ్ళి పక్కబట్టలు తీసుకొని గెస్ట్ హౌస్ వైపు రాసాగాడు. ఈ లోపులో బెడ్ రూం లో రవితేజ సిరిచందనని ఆట పట్టించసాగాడు. 

    "ఐ.పి.యస్ ఆఫీసర్ని ఐడెంటిటీ కార్డు చూపించమని దబాయించటం కాదు. తాడుముక్కో, పామో తెలుసుకోకుండా హడావిడి చేసి  అక్షరాలా ఆడదానివనిపించావ్" అంటూ.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra