"నిర్మలను వశపర్చుకునేటందుకు నువ్వవలభించిన పద్ధతి చూసి గ్రహించాను- నిర్మల విషయంలో నీ ఓటమి తప్పదని!"
"అయితే సరే- మాటతప్పకూడదు...
"మాట నాకు తల్లి...."అన్నాడు చంచల్రావు.
సాగర్ అతడివంక ఆశ్చర్యంగా చూశాడు.
12
గుత్తివంకాయకూర, కొబ్బరిపచ్చడి, సాంబారు, గడ్డపెరుగు...
నిర్మల ఎంతో తృప్తిగా భోంచేసింది. చెప్పాలంటే ఆమె తన ఎదురుగా ఉన్న సాగర్ని పట్టించుకోలేదు ఆ భోజనం చూడగానే ఆమెకు మతిపోయింది మనసు నిగ్రహం తప్పింది.
భోజనమైపోయాక ఆమె సాగర్ వంక చూసింది.
సాగర్ అప్పుడు భోజనం ప్రారంభించాడు.
"మనంకలిసిభోంచేయాలనుకున్నంకదూ-" అందినిర్మలసిగ్గుపడుతూ
"అవును కానీ యిందులో మీ తప్పేమి లేదు కావాలని నేనేఆగాను-
"ఎందుకు?
"మీరుతినగా మిగిలినవే నేను తినాలని...."
నిర్మల సిగ్గుపడుతూ- "ఆడపిల్లను ముందు మీకు వడ్డించి తర్వాత నేను తినల్సింది...."అంది.
"కానీ-ఇలాంటి భోజనం నేను రోజూ తింటున్నాను అందుకే మీ కోసం ఆగాను అదే న్యాయం కూడా!"
"మీకు చాలా చాల థాంక్స్ -ఇలాంటి భోజనం ఈమధ్యకాలంలో ఎప్పడూ తినలేదు. భోంచేశాక ఇంతతృప్తి నేను చదివాను దాంతోనే నాకు కడుపు నిండి పోయింది- "అన్నాడు సాగర్.
"అలాకాదు మీరూ భోంచేయాలి లేకుంటే నాకుతృప్తిగా ఉండదు-" అన్నాది నిర్మల కంగారుగా.
"మీ తృప్తి కోసం నేనేమైనా చేస్తాను అయితే ఒక్క షరతు...." అన్నాడు సాగర్- "తృప్తిగా భోంచేస్తే భుక్తాయాసంగా ఉంటుంది. ఒక్క నిమిషం మీరు వెళ్ళి నడ్డివాల్చండి నా భోజనమయ్యాక నేనే మీ దగ్గరకు వస్తాను-"
నిర్మల వెంటనే ఒప్పుకోలేదు అతడేంతో బలవంతపెట్టగా చివరకు వెళ్ళిందామె ఆమె వెళ్ళగానే సాగర్ చకచకా భోంచేశాడు క్యారియరుసర్ది- రెండుప్లేట్లూ ఒకదాంట్లో ఒకటి పెట్టి వంటింట్లోకి వెళ్ళాడు. నిర్మలఅక్కడలేదు.
ప్లేట్లూ కారియారు అక్కడే వదిలి నిర్మలకోసం వెతకసాగాడతడు. ఓ గదిలో నెలమీద చవపరుచుకుని నిద్రపోతోంది నిర్మల.
సాగర్ ఆమె వంకనే పరిక్షగా చూశాడు.
మట్టిలో మాణిక్యంలా ఉన్నదామె. మాసిన అతుకులబట్టల్లో ఆమె పాతగుడ్డల్లో చుట్టిన బంగారంలా ఉంది
ఆదమరిచి నిద్రపోతోందామే.
ఆమె వంటికింద పరుపులేదు. తలకింద దిండులేదు ప్తెనతిరిగే ఫాన్ లేదు గదిలోకాస్త ఉక్కగా కూడావుంది. ఉక్కకు నిద్ర జతకాగా ఆమెవంటి మీద ముత్యాలు పొదిగిన బంగారంలా ఉంది.
ముగ్దుడై ఆమెను చూశాడు సాగర్.
"ఈమె అపురూప సుందరి!" అనుకున్నడతడు మనసులో.
అలా కొద్దిసేపు ఆగకుండా ఆమెను చూసేక అతడికి నిర్మలపనుల విషయం గుర్తుకొచ్చింది. అప్పడున్న పరిస్ధితుల్లో ఆమెను నిద్రలేపడాని కతడికి మనస్కరించలేదు.
సాగర్ క్షణంకూడా ఆలస్యం చేయలేదు వంటగదిలో అంటగిన్నెలూ స్నానాలగదిలో బట్టలు- రెండిటిని చకచకా శుభ్రంచేశాడు అలాంటి పనులు అతడేప్పడూ చేసిఎరుగడు కానీ నిర్మల ను తలచుకుంటూంటే ఏమని అతడికి శ్రమ అనిపించడంలేదు.
పనులన్నీ అయ్యాక అతడు నిర్మల వద్దకువెళ్ళాడు. ఆమె ఇంకాఅలాగే నిద్రపోతోంది. ముందతడామేను తట్టిలేపాలనుకున్నాడు. తర్వాత నిర్మలా అని పిలవాలనుకున్నాడు కాని ఆమెకు నిద్రభంగం కలిగించడానికతడికి మనస్కరించలేదు.
అక్కడే కూర్చుని ఆమెని చూడసాగాడు.
నిద్రలో ఆమెముఖం ఎంతో అమాయమ్కగా వుంది. ఆమె ముఖం చూస్తుంటే అందమైన పసిపాపను చూస్తున్నట్లుంది.
సాగర్ కి వంగి ఆమె ముఖాన్ని ముద్దు పెట్టుకోవాలనిపించింది. అతి కష్టంమీద అతడాకోరికను నిగ్రహించుకున్నాడు
సాగర్ ఆలోచనల నిండా నిర్మల
ఆమె చాలా దురదృష్టవంతురాలు అంత దురదృష్టానికామే తగదు ఉన్న దురదృష్టంచాలనట్లు తనామేను వంచింఛబోతున్నాడు. అప్పడామెకు ఏమవుంతుంది?
తనవంచనకు గురయ్యాక మళ్ళి ఆమె యింత ప్రశాంతంగా నిద్ర పోగాలదా?
కోరిక భౌతికమె అయినా మనసును తట్టి పిలవాలని అతడికితెలుసు కానీ ఆ ప్రయత్నంలో తన మనసు గురించి అతడాలోచించలేదు.
అతడి మసు నిర్మలనభీమానిస్తోంది. ప్రేమిస్తోంది.
చంచల్రావుతో అతడు పదివేలు పందెంకట్టాడు సాధారణంగా సాగర్ పందెం కట్టాడు. కట్టిన ఏపందేమూ అతడోడలేదు.
"ఏ సెంటిమెంటూ నిన్నుబాదించదా?" అన్నాడు చంచల్రావు.
బాదించదని చెప్పాడు సాగర్.
ఇప్పుడు నిర్మల ముఖం చూస్తూంటే చంచల్రావు ప్రశాం మళ్ళి అతడికి గుర్తుకోస్తోంది కానీ తనబదులతడికి నచ్చడంలేదు.
నిర్మలను పెళ్ళిచేసుకుంటావా?" అన్నాడు చంచల్రావు.
అదెలా కుదుర్తుంది? తనపెళ్ళి నిర్మలతో జరుగడం అసాధ్యం...
సాగర్ ఆలోచిస్తూనే ఉన్నాడు. విధి తలుపు చప్పడయింది.
"నిర్మలా!" అన్నాడు సాగర్.
నిర్మల కదలలేదు.
"నిర్మలా!" అన్నాడు సాగర్ మరికాస్త గట్టిగా.