Previous Page Next Page 
ఒక తీయని మాట పేజి 17

                                       10
    "నిర్మలా ! వెళ్ళి సాగర్ గది శుభ్రం చేసిరా - అడ్డంలా ఉండాలి గది..." అంది మాణిక్యాంబ.
    సాగర్ ఆమె కప్పుడు  ఎదురుగా ఉన్నాడు. నిర్మల డైనింగ్ టేబుల్ శుభ్రం చేస్తోంది.
    నిర్మల చీపురు తీసుకుని  సాగర్ గదిలోనికి వెళ్ళింది.
    అక్కడ  సాగర్ తెచ్చివేసుకున్న అందమైన మంచం మంచంమీద పోంబెడ్! మచానికి కాస్తా దూరంగా ఒటేబిల్! దాని మీద స్టీలు కారియర్!
    నిర్మల గదితలుపులు వేసింది.
    క్యారియర్ విప్పింది.
    మొత్తం  నాలుగుగిన్నెలున్నాయందులో.  పైగిన్నెల్లో మూడుగిన్నెలున్నాయి. ఒకదాంట్లో చట్ని, మరోదాంట్లో కారప్పొడి, ఇంకోదాంట్లోనెయ్యి.
    తరువాతి రెండు గిన్నేల్లోనూ  ఇడ్లిలున్నాయి. మొత్తం పదహారిడ్లిలు.
    నిర్మలకు కడుపులో కరకర ఆకలి. చపాతీలను తల్చుకుని సగానికి చచ్చిపోయిన ఆకలిప్పుడు  రెట్టింప్తె విజృంభించింది. తిని కొద్దినెలలు దాటినా ఇడ్లిలంటే వున్న  మోజు కూడా ఆ ఆకలికి జతపడింది.
    అయిదునిముషాల్లో  పదహారిడ్లిలుతినే సెక నిర్మలకు కడుపునిండింది. మనసుకు తృప్తి అనిపించింది.
    అప్పడామే ఆఖారి  గిన్నెల్లో ఏముందోనని చూసింది. అంతవరకూ ఆమె ఆ గిన్నెల్లో ఏముందోనని  ఆలోచించనుకూడా లేదు.
    ఆ గిన్నేలో మడిచిన కాగితమొకటిఉంది. పక్కనే చిన్న పెన్సిలుంది.
    "నిర్మల కాగితం విప్పింది.
    "నా ఆతిధ్యం మీకు నచ్చితే  నన్నభినందించవద్దు. రేపు మధ్యాహ్నం మనిమిద్దరంకలసి భోంచేద్దాం మీకేంకావాలో ఈకాగితం వెనుకవైపున ఇందులో వున్న పెన్సిల్ తో వ్రాయండి మీరేమి రాయకపోతే నా ఆతిధ్యం మీకు నచ్చలేదని అనుకుంటాను...."
    నిర్మల సందేహించకుండా కాగితంవెనుక తనకిష్టమైనవి కొన్ని రాసి గది తుడవకుండానే అక్కడ్నించి బయటపడింది.
    "ఇల్లు శుభ్రంగా తుదిచావా? అంది మాణిక్యాంబ.
    నిర్మల తలూపింది.
    "వెళ్ళి చాపాతిలు తిను...."
    అప్పుడు సాగర్ నిర్మలవంకచూశాడు అతడికళ్ళలో ఆతృతఉంది. అయితే ఆ ఆతృతక్రమంగా సంతృప్తిగా మారిపోయింది. ఎందుకంటే నిర్మల ముఖంలో అతడాశించిన కృతజ్ఞత కనబడింది.
    నిర్మల చపాతిల తినేపరిస్దితిలో లేదని అతడికితెలుసు అందుకే మరి కాసేపు మాణిక్యాంబనతడు కబుర్లలో ఉంచాడు. నిర్మల తనచపాతిలు దొడ్డిగుమ్మంలోంచి బయట పారేసింది మరుక్షణంలోనే విధి కుక్కలు వాటికోసం కట్లాడుకున్నాయి.
                                                                                   11
    "చాలా హుషారుగా కనిపిస్తున్నావ్?" అన్నాడు చంచల్రావు సాగర్ వంక అనుమానంగా చూస్తూ.
    "నువ్వు వారాలతరబడి ప్రయత్నించి సాధించలేనిది- ఒక్కరోజులో నేను సాధించాను హుషారుకాక ఇంకేమిటి?" అన్నాడు సాగర్ .
    "అదేలా?"
    "ఆమెకిష్టమ్తెన తిఫినేమిటో నిన్న తెలుసుకుని ఇచ్చాను. ఇష్టమైన భోజనం ఈరోజేర్పాటు చేస్తున్నాను..."
    "అంటే తిండికి ముఖంవాచీవున్న పిల్లని తిండి పెట్టి మంచి చేసుకుంటున్నావంనమాట. ఇదినాకు తెలియనేలేదు..." అన్నాడు చంచల్రావు.
    "నువ్వు మొత్తమంతా భౌతికంగానే ఆలోచిస్తున్నావు" అన్నాడు సాగర్ కాస్తచిరాగ్గా.
    "భౌతికంగా కాకపోతే నువ్వుమాత్రం నిర్మలను మనసారా ప్రేమిస్తున్నావా?" అంటూ ఎదురుప్రశ్న వేశాడు చంచల్రావు.
    "అక్కడే నీకూ నాకూ తేడా- ఆకలేస్తోంది ఓ ముద్దా వేయండమ్మా అని యాచించే సామాన్య బిచ్చగాడిని ఈసడించి పోమ్మంటాం హుందాగా చేయెత్తి దీవించే కాషాయంబరదారిని వెతికి మరి ఇంటికి తెచ్చుకుని పంచభక్ష్యపరమన్నాలూ పెడతాం. యఛకుడయినా, సంయసయినా వేశం వేసుకున్నది తిండికోసమే! వారి వేషాన్నిబట్టి మనంవాళ్ళను తేడాగా చూస్తాం. మన విషయంలోనూ అంతే! నీకు నిర్మలకావాలి ఆమెనుతిన్నగావెళ్ళి నువ్వుకావాలని అడిగావు ఆమె ఈసడించిపొమ్మంది నాకూనిర్మలకావాలి వెతుక్కుంటూ తనే ఆమె నాదగ్గరకు వచ్చే పరిస్ధితులు కల్పిస్తున్నాను..."
    చంచల్రావుఆశ్చర్యంగా "నువ్వు చాలాలోతుగా ఆలోచిస్తావు" అన్నాడు ఇలాంటి ఆలోచన తనకు తట్టనందుకతడు బాధపడినా- తట్టినా ఆచరణలో తనుకది విలుపడదని గ్రహించాడు.
    "ప్రయత్నిస్తే ఎవరైనా లోతుగా ఆలోచించవచ్చు. నువ్వు నగలిస్తానని ఆశపెట్టినా నీ దగ్గరకు రాణి నిర్మల నేనుతేచ్చిన ఇడ్లీలు ఆప్యాయంగా తింది. ఎందుకంటే నాపిలుపు ఆమె మనసుకు హత్తుకునేలా వుంది. నేనుకోరే దామె శరీరాన్నేఅయినా మనసునించి ఆ శరీరాన్ని వేరుచేసి చూడను...." అన్నాడు సాగర్.
    "ఒకవేళ ఆమెనిన్ను పూర్తిగా నమ్మి ప్రేమించిందనుకో! అప్పుడు కూడా నువ్వు  ఆమెను అవసరంతిరిపోగానే పోమ్మంటావా?"
    "ఆఫ్ కోర్స్!" అన్నాడు సాగర్.
    "మరి ఏ సెంటిమెంట్లకూ ఆతితంగా ఉండాలి. అవతలివాళ్ళలో విపరితంగా సెంటిమెంటు పెంచాలి అప్పడే మనం జాల్సా గానూ, సుఖంగానూ బ్రతగ్గలం. గుర్తుంచుకో ఈ పాయింటు...." అన్నాడు.
    "ఆచరణలో ఇదంత సులభం కాదు...." అన్నాడు చంచల్రావు.
    "పందెంకాస్తావా?" అన్నాడు సాగర్.
    "కాస్తాను నువ్వు నిర్మలను వశపరచుకోలేవని నువ్వుచెప్పినట్లేపందెం పదివేలు...." అన్నాడు చంచల్ర్రావు.
    "అప్పడోప్పకోలేదుమరి?" అన్నాడు సాగర్ ఆశ్చర్యంగా.

 Previous Page Next Page