Previous Page Next Page 
ఋషి పేజి 17


    స్నేహితుడి అదృష్టాన్ని మనసులోనే  అభినందించెడు ప్రకాశం ఈర్ష్యపడేటంత చౌకబారు స్నేహంకాదు వాళ్ళది....

    కారు నెమ్మదిగా సాగిపోతూంది. కొద్దికొద్దిగా చల్లగాలి అలలు  అలలుగా లోపలికి వస్తూంది.

    "నాకన్నా రెండేళ్ళు పెద్దవాడివి. ల్తేఫ్ లో దాదాపు సెటిల్ అయి పోయేవు కూడా! ఇంకా పెళ్ళి చేసుకోవటాన్కి ఏమిటాలాస్యం?" స్నేహితుడ్ని అడిగేడు.

    "నా మనస్సుతోనే నాకు సత్సంబంధాలు కుదరటంలేదు. అప్పడే పెళ్ళెందుకు?" నవ్వేడు. ప్రకాశం  తలతిప్పి మిత్రుడివంక చూసేడు. కుమార్ అంత అందగాడు కాదు. కానీ ఆ కళ్ళల్లో తొణికిసలాడ్  వ్యక్తిత్వం, విజ్ఞానం... ఈ ప్రపంచంలో వుండే కుత్సితత్వాన్ని, మనుష్యుల ఆవేశాన్ని, అమాయకత్వాన్ని లౌక్యాన్ని అర్ధం చేసుకొన్నాట్టూ అతని  పెదవులమీద విరిసే చిరునవ్వూ- సాయంకాలపు నీడలా పెరిగే అతని సన్నీహితత్వంలోని ఆనందం__ అర్ధం చేసుకోగలిగితే అతని భావాల్లో ఉండే ఉదాత్తాత.

    "ఏమిటి ఆలోచిస్తున్నావు?"

    ప్రకాశం ఉలిక్కిపడి- "ఏవిలేదు" అన్నాడు.

    "అమరి అలా మౌనంగా వుందిపోయావెం?"

    "ఒక క్షణం ఆగి ప్రకాశం అన్నాడు__ "ఎందుకో అలాగే మౌనంగా ఆలోచిస్తూ వుండిపోవాలనిపిస్తూంది-"

    కుమార్ నవ్వి "దేని గురించీ?" అన్నాడు.

    ప్రకాశం మాట్లాడలేదు.

    "హుషారుగా ఉండేవాళ్ళే సునిశితంగా ప్రతివిషయన్ని పరిశిలిస్తారు. గంభిర్యంగా  వుండేవాళ్ళు కొద్దిగా కుత్సితమ్తెనా స్వభావం కలిగి వుంటారు ప్రకాశం_"

    నిజమేనేమో అనిపించింది.

    మళ్ళి కుమార్ అన్నాడు- "కానీ కుత్సితమూ, రిజర్వ్డ్ డ్ నేన్సూ గర్వమూ, ఆత్మాభిమానమూ -భావుకత్వమూ, విటిమధ్య తేడా కనుక్కోవటం కష్టం."

    ప్రకాశానికో అనుమానం వచ్చింది. ప్రతి చిన్న విషయానికి రెండు  ఎక్స్ట్ ట్రిమిటినూ ఆలోచించి_ ఏ పాలసి ఎన్నుకోవాలో తెలియక అను  క్షణం  సంఘర్షణలో నలిగిపోయే సుజాత, కుమార్ లాటి వాళ్ళ జీవితాల్లో  ఆనందం వుందా? లేదు.

    పోనీ తనలాటి వాళ్ళ జీవితాల్లో-?

    చిత్రమేమిటంటే- తనలాటి వాళ్ళ జీవితాల్లోనూ లేదు.

    అతని ఆలోచన్లను తేంపెస్తూ  కారు ఆగింది.

    "ఇక్కడికా " అడిగాడు ఆశ్చర్యంగా ప్రకాశం.

    "నువ్వు కాఫియే తాగుదువుగాన్లె" అన్నాడు కుమార్ నవ్వి డోర్ లాక్ చేస్తూ.

    ఇద్దరూ  లోపలికి ప్రవేశించేరు. ఉదారంగు గోడలమీదనీలి సబ్  డ్యూడ్  ల్తేటింగ్  వింత కాంతి నిస్తుంది. ట్రాన్స్ పేరెంట్     ఆద్దా ల్లోంచి  రకరకాల ఆకృతుల్ని ఆపాదించుకొన్న సిసాలూ- 'బిచేస్' లా  వాటిలోరకరకాల ద్రవాల వర్ణవిశ్లేషణమూ- స్టిరియోగ్రాంలోంచి పితిల్స్  గిటార్ల సంకీర్ణ ధ్వనులూ- వాల్- టు-వాల్ కార్పెట్  మీద నిశ్శబ్దంగా  నడుస్తూ, మనుషుల మానసిక బలహీనతల్ని, అల్లారని  చిరునవ్వుతో  స్వీకరించగలిగితే శాంతి దూతల్లా తెల్లటి బట్టల్లో వెయిటర్ లు - నిభావరి ముగ్గుమీద, నిశిధి నిరవంలో కడుపులో ఆగలేని ద్రవం నిజంలా బయట  కోచ్చేస్తే మ్తేకపు సోఫాలోకి జారిపోయిన మనుషులూ__ పేరుకొన్న నికృష్టత..


    "యిలా కూర్చో__"

    ఇద్దరూ కూర్చున్నారు. "మొదటిసారా నువ్వు బార్  కి రావటం ?" అడిగేడు కుమార్. తలూపేడు ప్రకాశం.

    "ఎలా వుంది?"

    ఒక క్షణం మాట్లాడలేదు ప్రకాశం తరువాత చెప్పేడు "చాలా అసహ్యంగా  వుంది."

    "జాగ్రత్తగా ఆలోచించి  చెప్పు. భయంగా వుందేమో దానికి, 'అసహ్యం' అని పేరు పెట్టుకుంటే అది ఆత్మవంచన."

    "భయంకాదు, అసహ్యంవె -నీచం!- మనుష్యులు ఇలా ఎస్కేపిస్టులు ఎందుకవుతున్నారో అర్ధంకాదు" చెప్పాడు ప్రకాశం .

    ఇంతలో వెయిటర్ వచ్చాడు.

    "అరస్టోక్రాట్ ఒక పెగ్గు -సోడా - చిప్సూ" అని ఆర్డరిచ్చి__"నీకు" అని అడిగేడు.

    "కోకో కోలా."

    వెయిటర్ వెళ్ళిపోయాడు.

    "చెడిపోతున్నాననే  భయవేలేని పక్షంలో ఈ మనుష్యుల గురించీ కొంచెం ఆలోచించు. అంత తొందరగా  డెసిషన్ కి  వచ్చేయ్యకు. పోతే ఎస్కేపిస్టులన్నావె- ఆ విషయం నేనోప్పకోను. ఎందుకంటే దాదాపు ఈ బార్లో సగంమదిం నాకు తెలుసు."

    "డబ్బూ, ఆరోగ్యవూ అన్ని పాడేగా."

    కుమార్ నవ్వాడు. "అదిగో- ఆ సోఫాలో నల్లకోటు తోసుక్కున్న ఆయన్ని చూడు  'న్యూక్లియర్ ప్యూయల్  కాంప్లేక్స్ లో ఒక ప్రోపేసరు ఆయన. పగలంతా ఆయన ఎంత కాం స్టేషన్  తో పనిచేస్తాడంటే  సాయంత్రం అయ్యేసరికి యిలా రిలాక్సు అవని పక్షంలో ఆయన  మెదడులో రక్తనాళాలు బ్రద్దలాయి చచ్చిపోతాడు. యిదే ఉదాహరణ పగలంతా రిక్షాలాగి అలసిపోయిన రిక్షావాడికి కూడా వర్తిస్తుంది_____"

    "కానీ...." అంటూ ఏదో  చెప్పబోయేడు ప్రకాశం. 

 Previous Page Next Page