అంతవరకూ సస్పెన్స్!
తను టీజ్ చేస్తుండేవాడు.
"అమ్మా! ఈ సినిమాలు చూసి చూసి నువ్ కూడా సస్పెన్స్ డ్రామా మొదలుపెట్టేశావే" అంటూ.
ఆమెకు తెలీని విషయం ఒకటి తనకు తెలుసు.
డాక్టర్ చెప్పాడా విషయం.
ఆమె యెంతో కాలం బతకడు.
అప్పుడు నిర్ణయం తీసుకున్నాడతను.
ఆమె కన్ను మూసేలోగానే ఆమె కోరిక తీర్చాలి.
అదంత తెలికైనా విషయం కాదని తనకు తెలుసు. ముందు తను డబ్బు సంపాదించాలి.
అంటే ఉద్యోగం సంపాదించుకోవాలి!
ఉద్యోగాలు ఎండమావుల్లాంటివని అర్ధమయ్యాక ఆ విషయం తల్లికి తెలీటం ఇష్టం లేక ఆమెకు అబద్దం రాశాడు -- ఉద్యిగము దొరికిందని !
తనలాగానే ఆమె కూడా నిరాశ పడటం తనకిష్టం లేదు.
పోస్టాఫీసు కౌంటర్ లో కర్లీ హెయిర్ యువతి ప్రశ్నార్ధకంగా చూసింది.
"స్టాంప్ లిచ్చాను కదా - ఇంకేమిటి?"
"ఈ చిప్పలో డిపార్ట్ మెంట్ గమ్ అయిపొయింది. కొంచెం నాలుక జాపుటే స్టాంప్ లు అంటిద్దామని ."
ఆమె నాలుక జాపబోయి ఉలిక్కిపడింది.
"ఏమిటి నేను నాలుక జాపాలా?"
"మరి ప్రజాసేవలో భారత తపాలాశాఖ " అని పేపర్లో ఎందుకు వేస్తున్నారు ?'
"అంటే నాలుక జాపుతారేమిటి?"
"ప్రపంచంలో నీళ్ళకు అల్ట్రార్ నేటివ్ అదొక్కటే కదా! పోనీ మీ దగ్గరింకేమైనా ఉంటే చెప్పండి"
"మీరలా మాట్లాడితే నేను కంప్లయిట్ ఇవ్వాల్సి వస్తుంది మా బాస్ కి"
"వెల్ కామ్ ! ఆ పనేదో త్వరగా చేస్తే నాకు మీ డిపార్ట్ మెంటు లో ఉద్యోగం దొరుకుతుంది! ప్లీజ్ పదండి.
"ఉద్యోగం దొరుకుతుందా?"
"అవునండీ!"
"ఏం ఉద్యోగం?"
"మీ స్టాంపులమ్మే కౌంటర్ పక్కనే నాలుక జాపి నిలబడే ఉద్యోగం . ఎంతసేపు కావాలంటే అంతసేపు జాపగలను. మంచి ఎక్స్ పీరియన్స్ వుంది."
"హలో....."
అదిరిపడి పక్కకు చూశాడు.
రాధిక!
చిరునవ్వు నవ్వుతోంది.
"వెదకబోయిన తీగ కాళ్ళకు చుట్టుకున్నట్లుంది " ఆనందంగా అంటోంది.
"మీ కాళ్ళకు చుట్టుకునే చాన్స్ వుంటే తీగగా బ్రతకడానికి ఐడోంట్ మైండ్! బైదిబై! ఎప్పుడూ కాళ్ళకెనా కొంచెం పైన కూడా చుట్టుకోవచ్చా?"
ఆమె నవ్వాపుకోలేకపోయింది.
"ఛీ! పాడు! అన్నీ ఇలాగే సిల్లీగా మాట్లాడతారు!"
"నేను మాట్లాడితేనేమో ఛీ పాడు! అంటారు. అదే సినిమా అయితే ఒకటికి రెండు సార్లు చూస్తారు కదా!"
రాధిక తన చేతిలోని కవర్ కి స్టాంప్ అంటించడానికి నీళ్ళ స్టాక్ కోసం వెతికింది. కానీ కనిపించలేదు.
"స్టాంపులు అంటించే వసతులేమీ ప్రస్తుతానికి ఈ పెద్ద పోస్టాఫీస్ లో లేవు. అందుకని నా నాలుకను ఉపయోగించుకొండి. పోస్టల్ డిపార్ట్ మెంటువాళ్ళు నాలుకలు జాపే ప్రొవిజన్ ఏదీ లేదని ఆవిడ అంటోంది. ఎవరి నాలుక వాళ్ళే తెచ్చుకోవాలని బయట సైకిల్ స్టాండ్ దగ్గర బోర్డు పెట్టబోతున్నారట.'
రాధిక స్టాంప్ అతని నాలుక సాయంతో అంటించి కవర్ బాక్స్ లో వేసేసింది. ఇద్దరూ బయటకు నడిచారు.
"ఇందాకేమిటి తీగ కాళ్ళు అన్నారు?" అడిగాడు.
"అలా ఎక్కడయినా కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా?"
సురేష్ అదిరిపడ్డాడు.
"మీరు నాకు కాఫీ ఆఫర్ చేస్తున్నారా?"
"ఏం చేయకూడదా?"
"స్టాంప్ అంటించడానికి కూడా పక్కవాడి నాలుకను వాడేవాళ్ళు ఇంత ఉదారంగా వుండగలరా అని"
ఆమె కోపంగా చూసింది.
"నాలుక మీరే ఆఫర్ చేశారు? నేనేం కావాలని అడిగానా? నాది నాకు లేదా?"
"ఉన్నా కొంతమందికి పొరుగాడి పుల్ల నాలుకే రుచిలెండి. అయినా నేనేం ఆఫర్ చేస్తే అది వాడుకోటమేనా?"
హోటల్ చాలా బిజీగా , ఇరుగ్గా - క్రిక్కిరిసిపోయి మన దేశంలాగుంది.
ఆఖరికి ఓ మూల వన్ బై టూ సీటు దొరికింది -- పంచుకుని కూర్చున్నారు.
బేరార్ వచ్చి నిలబడ్డాడు.
"బోలో ...."
"వన్ - బై టూ కాఫీ "
ఆమె ఆర్డర్ యివ్వటం పూర్తీ కాకుండానే పగలబడి నవ్వేశాడు సురేష్.
"ఎందుకా నవ్వు?"
"వన్ బై టూ చెప్తారని ముందే అనుకున్నాను. అనుకున్నట్లే చెప్పేసరికి నవ్వొచ్చేసింది.
ఆమె ముఖంలో రోషం -----
"వన్ బై టూ చెప్తానని ముందే ఎలా అనుకున్నారు?"
"ఇంతవరకూ పదిసార్లడిగాను కాఫీ తాగించమని! ఎప్పటి కప్పుడు ఏదో వంక చెప్పి డబ్బు అదా చేసుకున్నారు. ఇంత కంజూస్ అమ్మాయి తనంతట తాను కాఫీ ఆఫర్ చేసిందంటే వన్ బై టూ కాక ఇంకే ముంటుంది ?"
ఆమె నవ్వేసింది.
"మీకు ఎదుటివాళ్ళను టీజ్ చేయటం తప్ప ఇంకేం పనిలేదా? నా ఇష్టా ఇష్టాలు నావి! కామెంట్ చేయడానికి మీరెవరు?"
బేరార్ కాఫీ తెచ్చిచ్చాడు.
"వన్ బై టూ అన్ని వేళలా అంత మంచి అలవాటు కాదు ---------ముఖ్యంగా పెళ్ళి విషయంలోనయినా అది వదిలేయండి ."
ఆమె కాఫీ తాగుతుండగా నవ్వొచ్చే సరికి ఫలమారింది.
చప్పున కర్చీఫ్ ఆమె నోటికి అడ్డు పెట్టాడు .
అతని చేతిని తోసేసింది.
"పెళ్ళి విషయంలో వన్ బై టూ ఏమిటి?" అనుమానంగా అడిగింది.
'అదే.....ఇద్దరినీ మెయింటెయిన్ చేయటం --- ఇంట్లో ఒకరూప్ బయటోకరు-"
"ఛీ! మీకసలు సిగ్గులేదు"
"మీతో పరిచయం అవకముందుండేది గానీ, ఇప్పుడు వన్ బై టూ అయి తగ్గిపోయింది "
"ఇలా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను ."
"బిల్ ఇచ్చి వెళ్ళండి! మన దగ్గర కాష్ బాలెన్స్ చాలా తక్కువగా ఉంది.