Previous Page Next Page 
పార్ట్ టైమ్ హాజ్ బెండ్ పేజి 18

 

    ఇద్దరూ బయటకు నడిచారు.
    "నాకో సహాయం చేయమని మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను ....' కళ్ళల్లోకి చూస్తూ అడిగింది.
    "చెమడోచ్చి కష్టపడతానని ప్రామిస్ చేస్తున్నాను."
    "నేన్చేప్పేది వింటారా?"
    "కారీ అన్!"
    "మూడు రోజుల క్రితం నేనో ఇంటర్ వ్యూ కెళ్ళాను. వాళ్ళో కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ పూర్తీ చేస్తే నాకు ఆ ఉద్యోగం దొరుకుతుంది. లేకపోతే దొరకదు. చాలా మంచి ఉద్యోగం? నాలుగు వేలు జీతం"
    "ఏమిటా కండిషన్?"
    "పెళ్ళయిన అమ్మాయిలకే ఆ ఉద్యోగం ఇస్తారు. ఏదొక అబద్దం చెప్పేస్తే ఉద్యోగం దొరికుతుందని వాళ్ళతో పెళ్ళయిందని అబద్దం చెప్పేశాను ."
    "మైగాడ్! మీరు వన్ బై టూ అనుకున్నాను --- వన్ బై టెన్ అనుకోవచ్చు !"
    "మొన్న రిజల్ట్స్ కోసం వాళ్ళాఫీస్ కెళితే నేను సెలక్టయినట్లు చెప్పారు . కానీ ఎల్లుండి భార్యా భర్తలిద్దరూ వెళ్ళి వాళ్ళకు కనబడాలన్నారు. ఇద్దరితోనూ మాట్లాడి అన్ని విధాల సంతృప్తి కలుగుటే అప్పుడు అపాయింట్ ఆర్డర్స్ ఇస్తారంట"
    "అంటే ఎల్లుండి లోగా మీరు పెళ్ళి చేసుకోవాలి! అంతేగా?"
    "అదెలా కుదురుతుంది? ఇంత సడెన్ గా పెళ్ళంటే మాటలా?"
    'అయినా ఆ కంపెనీ వాళ్ళు కూడా అలాంటి కండిషన్స్ పెట్టటం ఏమిటి? సినిమాలు చూసి మన దేశంలోని ఇండస్త్రీలు , ఆఫీసులు అన్నీ చేదిపోతున్నాయి."
    "అదేం కాదు! పాపం వాళ్ళ ప్రాబ్లం కూడా జేన్యుయనే! పెళ్ళి కాని ఆడాళ్ళకు ఉద్యోగాలిస్తే పెళ్ళవగానే ఉద్యోగం మానేసి మొగుడెక్కడో ఉద్యోగం చేస్తుంటే అక్కడి కెళ్ళి పోతున్నారట ."
    "మరిప్పుడెం చేద్దామని?"
    "ఆ ఒక్కరోజు కి మీరు నా హజ్ బెండ్ నని చెప్పి ఇంటర్ వ్యూ కొస్తే --- నాకో ఉద్యోగం దొరుకుతుంది. అందుకే మీకోసం రెండు రోజుల్నుంచీ పోస్టాఫీస్ కేదురుగ్గా వున్న బుక్ స్టాల్ దగ్గర కాపలా కాస్తున్నాను" సురేష్ ఆగిపోయాడు.
    "ఓరి దేవుడా! నిరుద్యోగ సమస్య ఎంత దారుణమైపోయిందిరా ! ఉద్యోగం కోసం టెంపరరీ మొగుడిని సెటప్ చేసుకోడానికి కూడా భారత దేశ నారి రడీ అయిపోతోంది."
    "మరీ అలా ఎగతాళి చేయకండి! నా పొజిషన్ లో మీరుంటే మీరూ అలాగే చేస్తారు.
    "నేనెవరి పొజిషన్ లో ఉన్నా అలాగే చేస్తాననుకొండి -- కానీ అంత పెద్ద అబద్దం చెప్పాలంటే ఆలోచించుకోవాలి! కొంచెం రిస్క్ తో కూడుకున్న వ్యవహారం కదా?"
    "ఇందులో రిస్కేముంటుంది?" ఆశ్చర్యంతో అడిగింది.
    "అలా అనుకునే కె. కె. వీర్రాజు ముగ్గురికి తాళి కట్టాల్సి వచ్చింది ."
    "కె.కె. వీర్రాజెవరు?"
    "సి.హెచ్ . శోభనచలం ఫ్రెండ్"
    "ఏం జరిగిందతనికి?"
    "గుడి దగ్గర రోజూ ఓ అమ్మాయికి బీటు వేస్తుండేవాడు. ఇద్దరూ మంటపంలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే ఆ అమ్మాయి తాలుకూ వాళ్ళు బాజాలతో వచ్చి తాళి కట్టించారు. పూజారి సర్టిఫికెట్ ఇచ్చేశాడు. ఆ తరువాత వాళ్లాఫీసులో పక్క సీట్లో అమ్మాయి ప్రియుడు పారిపోయేసరికి ఆమె భోరున ఏడుస్తోంటే మరునాడు టాంక్ బండ్ కి తీసుకెళ్ళి ఓదార్చాడు. ఆమెను ఒదార్చాడానికి రెండు మూడు సార్లు వాళ్ళింటి కెళ్ళాడు. ఆమె గర్భవతి అని తెలీగానే ఆమె పోలీస్ మావయ్యా పోలీస్ వార్నింగ్ తో ఇద్దరికీ పెళ్ళి చేసేశాడు."
    ఆమె నవ్వేసింది.
    "నావల్ల మీకలాంటి ప్రాబ్లమ్స్ ఏమీరావులెండి! అయినా మనం భార్యా భర్తలమని చెప్పేది కేవలం మా బాస్ ఒక్కరికే కదా! తర్వాత మీరెవరో నేనెవరో."
    "అంటే నావల్ల మీకు నాలుగువేల రూపాయల ఉద్యోగం దొరకబోతుందన్నమాట"
    'అవును!"
    "కేవలం వన్ బై టూ కాఫీ కొట్టి నన్ను అంత లాభకరమైన వ్యవహారానికి వాడుకోబోతున్నారన్నమాట."
    ఆమె కోపంగా చూసింది. "వన్ బై టూ కాఫీ కి రమ్మంది మనం మాట్లాడుకోడానికి! మిమ్మల్ని కొంటానికికాదు."
    "అల్ రైట్ ఓ కండిషన్ మీద వప్పుకుంటాను."
    "ఏమిటది?"
    "నాకు ఉద్యోగం దొరికేవరకూ మీకొచ్చే జీతంలో టెన్ పర్సెంట్ నాకు కమీషన్ గా ఇస్తుండాలి! దాన్నే పార్ట్ టైం హజ్ బెండ్ అలవెన్స్  అని కూడా అనుకోవచ్చు. ఇందు కిష్టమైతే అయాం రడీ!"
    ఆమె తెల్లబోయింది.
    "మైగాడ్! మీలాంటి బిజినెస్ మైండేడ్ బాయ్స్ ఉంటారని నాకింత వరకూ తెలీదు ."
    "మొత్తం జీవితం వన్ బై టూ తొలగించేయవచ్చానే మీలాంటి అమ్మాయిలుంటారని నాకూ తెలీదు ."
    ఆమె కొద్ది క్షణాలు లెక్కలు వేసుకుంది.
    "అంటే మీకు నెలకు  నాలుగొందలు ఇవ్వలన్నమాట"
    "సరిగ్గా జీతం రోజున! ఒక్కరోజు ఆలస్యం అవడానిక్కూడా వీల్లేదు"
    ఆమె ఆలోచనలో పడింది.
    "అలా ఎంతకాలం ఇవ్వాలి?"
    "మీకు నిజంగా పెళ్లై సొంత మొగుడు వచ్చేవరకూ!"
    "మైగాడ్! టూ కాస్ట్ లీ ! సోమ్మోకడిది , సోకొకడిది."
    "రాంగ్ గా వాడారు! కష్టపడేదొకరు, ఫలితం అనుభవించేదొకరు"
    "ఏదొకటి! పోనీ ఓ సంవత్సరం వరకూ తీసుకుని ఆ తరువాత వదిలేయండి !'
    "ఇదిగో చూడండి మిస్! అందుకే దీనిని పార్ట్ టైమ్ హజ్ బెండ్ అలవెన్స్ అన్నాను. మీరు పుల్ టైమ్ హజ్ బెండ్ ని తెచ్చుకునే వరకూ నా అలవెన్స్ నాకివ్వాల్సిందే! ఎందుకంటే పార్ట్ టైమ్ హజ్ బెండంటే మాటలు కాదు. పుల్ టైం వాడికంటే ఎక్కువ కష్టాపడాల్సి వుంటుంది. ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సి వుంటుంది. మీకు అంతగా కావాలంటే ఇంకో కన్సెషన్ ఇస్తాను."
    "ఏమిటి?"
    "నాకు ఈలోగా ఏదయినా జాబ్ వస్తే అప్పుడింక ,మీరేం ఇవ్వక్కర్లేదు.'
    "ఇంటర్ వ్యూల్లో మీరిచ్చే సమాధానాలకు మీకు జాబ్ వస్తుందన్న నమ్మకం నాకు లేదు. సరే గత్యంతరం ఏముంది? మీ కండిషన్ కి వప్పు కుంటున్నాను. ఎల్లుండి పొద్దున్న తొమ్మిది గంటలకు ఆ బుక్ స్టాల్ దగ్గర కొస్తారా మరి?"
    "మొగుడుద్యోగం వప్పుకున్నాక తప్పకుండా మరి! ఏ డ్రస్ లో రమ్మంటారు ?"
    "నేను మెరూన్ కలర్ శారీ కట్టుకొస్తున్నాను. కనుక మీ డ్రస్ దానికి మాచ్ అయ్యే ఇంకో కలర్ లో వుంటే బాగుంటుంది ."
    "పాంట్ మీద లాల్చీ వేసుకుంటే కొంచెం మొగుడి లుక్ వస్తుందంటారా?"
    "వీలయితే కళ్ళజోడేదయినా పెట్టుకుంటే బావుటుంది. లేకపోతే ,మరీ చిల్లర మొగుడిలాగుంటారు ?'
    "మా ఫ్రెండ్ నడిగి తెచ్చుకోవాల్సి వుంటుంది. అంటే వాడి దగ్గరి కెళ్ళి రావటానికి ఐదున్నర బస్ చార్జిలవుతాయ్. ఆ డబ్బు మీరు ఇప్పుడే ఇవ్వాల్సి వుంటుంది.

 Previous Page Next Page