Previous Page Next Page 
మరో ముందడుగు పేజి 14

 

    భరించలేకపోతున్నాడు అతడు . విధిలేక ఇంటికి వచ్చాడు. త్రాగి త్రాగి ఎర్రబడ్డ కళ్ళతో - కళ తప్పిన ముఖంతో కొడుకును చూడగానే , కమలకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. "రా నాయనా! ముఖం కడుక్కున్నావా! కాఫీ తాగుతావా?" అంది. ప్రభాకర్ కొడుకును పలకరించలేదు. వేణు ఆకృతి చూస్తే అతడికి మనసు ముక్కలవుతోంది. ఇతడిని మంచి మాటలతో మార్గంలో పెట్టగలడా? లేక మందలించింతే ప్రయోజనం వుంటుందా? మయూర కొంచెం సహకరించ గలిగితే ......
    "అమ్మా! మయూరా - " అని పిలిచాడు.
    మయూర వచ్చింది. చాలా రోజుల తరువాత మయూర , వేణు ఒకరినొకరు చూసుకున్నారు. అతన్ని చూడగానే ఆమె కళ్ళలోకి రక్తం వుబికింది. ఆ చూపులు కాల్చేసేలా వున్నాయి. వాటికి తట్టుకోలేక బాత్ రూంలోకి పారిపోయాడు వేణు. ప్రభాకర్ మనసు ఊసురుమంది. ప్రభాకర్ ముఖంలోకి చూసిన మయూర అతని మనసు అర్ధం చేసుకుంది. "నన్ను క్షమించండి!" అంది గొణుగుతున్నట్లు " కొంచెం స్థిమిత పడ్డాడు ప్రభాకర్ - "నేను కాదమ్మా నువ్వే క్షమించడానికి ప్రయత్నించు" అన్నాడు.
    వేణు బాత్ రూంలో స్నానం చేస్తున్నాడు.
    ఆ పక్కనే వరండాలో గోడ కానుకొని నిలబడి పోయింది- చాలాసేపు అలా నిలబడ్డాక లేచి గదిలోకి వెళ్ళి అతడి పెట్టె తెరిచింది. బ్రాందీ సీసాలూ, బూతు బొమ్మల పుస్తకాలూ...... వెలపరంతో పెట్టి మూట దభాలున వేసేసింది. మళ్ళీ ఆ పెట్టె తెరవటానికి మనస్కరించలేదు. తను ఆరేసి మడత పెట్టిన ప్రభాకర్ లుంగీ తీసుకుని బాత్ రూమ్ దగ్గిర నిలబడింది. టవల్ చుట్టుకొని వేణు బయటికి రాగానే లుంగీ అందించింది. నివ్వెరపోయి చూసాడు వేణు - ఆ చూపులను ధైర్యంగా ఎదుర్కొంది మయూర. ఆమె చూపులలో ఏ భావమూ లేదు - వేణు లుంగీ అందుకున్నాడు. ఆ తరువాత అతడికి కాఫీ మయూరే అందించింది. కమలా, ప్రభాకర్ లూ అతనితో మాట్లాడుతోంటే తనూ అక్కడే కూచుంది. భోజనం కూడా వడ్డించింది. మయూర ప్రవర్తనకు కమల ఆనందించింది. కానీ మయూర శరీరం ,మాత్రమే అక్కడ వుందని అర్ధం చేసుకున్నవాడు ప్రభాకర్ ఒక్కడే.
    పడక గదిని ప్రత్యేకించి అలంకరించడానికి ఎవరూ ప్రయత్నించలేదు.' భోజనం చేసివచ్చి మంచం మీద పడుకున్నాడు వేణు. అతడికి మంటల మీద వున్నట్లుగా వుంది. అత్తగారికి సాయం చేసి తనూ గదిలోకి వచ్చింది మయూర. ఆమెలో ఏ వికారమూ లేదు. శిలలా వుంది. వేణును చూస్తూ నిలబడింది. అలాంటి మయూరను చూస్తే , వేణుకి భయంగా వుంది. కోపంగా వుంది. కసిగా వుంది. మయూర ముఖంలోకి చూసి "నిన్ను ఆ వెధవ లిద్దరూ కూడా అనుభవించారు" అన్నాడు.
    మయూర నవ్వింది. అది కృత్రిమమైన నవ్వు కాదు.  గెలిచినట్లున్న నవ్వు. అతడి క్షోభను గేలి చేస్తున్నట్లున్న నవ్వు - వేణుకి కోపం అవధులు దాటుతోంది. ఏం మాట్లాడుతున్నాడో తెలియటం లేదు.
    "నా పెళ్ళాన్నయ్యావని మురిసి పోతున్నావేమో! నువ్వు ఒక్కనాటికీ నా పెళ్ళానివి కావు. నీలాంటి చెడిపోయింది నా పెళ్ళాం కాదు-"
    కిలకిల నవ్వింది మయూర. ఆమె అలా నవ్వి ఎన్ని రోజులయిందో? బయటి నుంచి ఆ నవ్వు విన్న కమలా, ప్రభాకర్ లు స్థిమిత పడ్డారు. ఆ నవ్వుతో మరింత రగిలిపోయిన వాడు వేణు మాత్రమే.
    మయూర తన మంచం మీదకు పోయి పడుకుంది. ఆమె మనసుకు చాలా ప్రశాంతంగా వుంది. ఏరోజుని తలుచుకుని ఇటివల ఆమె రాత్రింబవళ్ళు హడాలిపోయిందో , ఆ రోజు తన మనసు ఇంత సంతృప్తిగా , ప్రశాంతంగా వుండటం ఆమెకే ఆశ్చర్యంగా వుంది. కొద్ది సేపట్లోనే మయూర సుఖంగా నిశ్చింతగా నిద్రపోయింది.  వేణుకు నిద్ర రాలేదు. పక్కనే పడుకున్న మయూరను చూస్తోంటే , అతనిలో కోరికలు కలగకపోగా ఆనాటి తన స్నేహితుల కిరాతక దృశ్యాలు గుర్తుకొచ్చి ఏదో అసహ్యం కలుగుతోంది. ఇది తన భార్య కాదు. తన భార్య స్థానంలో వుండటానికి వీల్లేదు. కానీ ఎలా ? ఏం చెయ్యగలడు? ఈ నాన్న.....పళ్ళు కొరుక్కున్నాడు. జుట్టు పీక్కున్నాడు. అంతకంటే ఏం చెయ్యలేకపోయాడు.
    తెల్లవారింది. మయూర కళ్ళు తెరవగానే ఎర్రబడ్డ కళ్ళతో వేణు కనబడ్డాడు. అతడు రాత్రంతా నిద్రపోలేదని ఆ కళ్ళను చూస్తేనే అర్ధమయింది. మయూర తను మంచం మీద నుంచి లేచి "ఇప్పుడయినా కొంచం సేపు నిద్రపోండి" అంది దయగా.
    ఈడ్చి చెంప మీద కొట్టినట్టుగా అయింది వేణుకి. ఆ రోజు చూసేవాళ్ళకి మాములుగానే వుంది. మయూర వేణుకి కావలసినవన్నీ తనే చేస్తోంది. వేణు మనసులో మంటలు అతడి నోక్కడినే కాల్చేస్తున్నాయి. ఎలాగయినా మయూరను ఎడిపించాలని వుంది అతనికి. రమణమ్మ కూతురు లక్ష్మి - పద్నాలుగేళ్ళది . పసితనపు అమాయకత్వం కొంత - వెర్రి బాగులతనం కొంతా, కావాలని మయూర చూస్తుండగా దానితో సరసాలాడడం ప్రారంభించాడు. ఆ పసిదాని జీవితం ఏమయిపొతుందోననే భయం మయూర కళ్ళల్లో కదిలింది. అది మరో రకంగా అర్ధం చేసుకుని మరింత విజ్రుంభించాడు అతను.
    "నువ్వెంత బాగుంటావ్?" అన్నాడు.
    "బాగుంటానా! ఇహిహి! అమ్మగారి కంటేనా?" అంది అది.
    "ఛా! నీ ముందు అమ్మగారేం బాగుంటుందీ?" అది పడిపోయింది.
    "ఇది తీసుకో " వంద రూపాయలు నోటు అందించాడు.
    "హమ్మో!" గుండె బాదుకుంది అది.
    "ఫరవాలేదులే! ఉంచుకో!"
    "ఎక్కడికి రాను?"
    "ఏమిటీ?"
     భలేవారే? ఎక్కడికి రావాలో చెప్పరే? వంద రూపాయలు వట్టి పుణ్యానికే ఇచ్చారా? మొన్న సుబ్బారావుగారి అబ్బాయి యాభై రూపాయ్యలె యిచ్చి అల్ల కారు షెడ్లోకి రమ్మన్నాడు."
    తెల్లబోయి చూసాడు వేణు. మయూర నవ్వు ఆపుకోలేకపోయింది. అంతలో కమల కూడా అక్కడికి వచ్చి మయూర చూస్తున్న వైపుకి చూసింది. ఆవిడా మనసు కలుక్కు మంది. అత్తా కోడళ్ళు ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇద్దరిలో ఏ ఒక్కరూ మాట్లాడలేదు. ఇంతలో రమణమ్మ బారలు జాచుకొంటూ పోట్లాటకి వచ్చింది.
    ఏందమ్మా! మీ అబ్బాయి మా పిల్లదానికి వంద రూపాయలు ఆశ చూపి పడు చెయ్యాలని చూస్తున్నాడంట! మా ఇంతా వంటా లేవు ఇట్టాంటి బుద్దులు."
    రమణమ్మ అరుస్తోందే గాని, వందరూపాయలు తిరిగి ఇయ్యలేదు. అది అంతగా పోట్లడక పోను- కానీ, వేణు తన కూతురికి వందరూపాయలు లివ్వటం అత్తా కోడళ్ళు ఇద్దరూ చూసారని దానికి తెలిసిపోయింది.
    "ధూ! ఇట్టాంటిళ్ళల్లో పని కొప్పుకోవటమే బుద్ది తక్కువ" అని అరుచుకుంటూ వెళ్ళిపోయింది.
    "దాని నోరు మంచిది కాదు. చుట్టుపక్కల ఇళ్ళలో ఏం బాగుతుందో , ఏమిటో?" దిగులుగా అంది కమల. మయూర సమాధానం చెప్పలేదు. ఆ రోజు అర్ధరాత్రి ఇంటికి తప్పతాగి వచ్చాడు వేణు. ప్రభాకర్ మనసు రగిలి పోతున్నా, ఏం చెయ్యలేక పోతున్నాడు. ప్రభాకర్ మాటలు వినిపించుకునే స్థితిలో కూడా లేడు వేణు. ఏం తింటున్నాడో కూడా తెలియకుండా తిండి తిన్నాడు. గదిలో ప్రవేశించాడు. నిద్రపోతున్న మయూర మీద పడ్డాడు. బ్రాందీ వాసన - మొరటు చేతులు - కెవ్వున కేక వేసింది మయూర. ఆమె తప్పించుకోవటానికి వీలు లేకుండా అస్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు వేణు. మయూర మరింతగా అరవసాగింది. ప్రభాకర్ నిద్రలోంచి లేచి వచ్చి తలుపులు బాదుతూ "వేణూ! తలుపు తెరు!" అన్నాడు. వేణు ఒక్కసారిగా చప్పబడిపోయాడు. మయూర తనే తలుపు తెరచి బయటికి వచ్చేసింది. అప్పటికే వణికిపోతున్న మయూర చుట్టూ ఓదార్పుగా చేయి వేసి "భయం లేదమ్మా, భయం లేదు.' అన్నాడు. వేణును కోపంగా చూస్తూ "నా ఎదుట ఈ అమాయకురాలిని బలాత్కారం చేస్తే మాత్రం సహించను" అన్నాడు.
    వేణు ముద్దముద్దగా "నా భార్య! బలాత్కారం ఏమిటి?" అన్నాడు.
    "దుర్మార్గుడా! భార్యా అయినంత మాత్రాన ఇష్టం వున్నా ఇష్టం లేకపోయినా పశువులా మీదపడే అధికారం వుందనుకున్నావా? భార్యనయినా సరే,  ఇష్టం లేని ఆడదాన్ని మొగవాడు బలవంతం చేస్తే అది బలాత్కారమే! బయటి నడు!" అని వేణుని చెయ్యి పట్టుకుని బయటకు లాక్కొచ్చి "అమ్మా గదిలో తలుపులు వేసుకుని పడుకో" అన్నాడు మయూరతో.
    త్రాగిన మైకంతో, కోపంతో, కసితో , రాత్రంతా మయూరను నోటికొచ్చినట్లు తిడుతూనే వున్నాడు వేణు. కమల కుమిలికుమిలి ఏడ్చింది. ప్రభాకర్ లేచి వేణు తల దగ్గిర కూచుని అతని తల ఆప్యాయంగా నిమరసాగాడు. ఆ స్పర్శలో ఏం ఉందొ/ ఎంతో సేపటికి వేణు నిద్రపోయాడు.
    కమల ఆ మరునాడు, మయూరను దగ్గిర కూచోబెట్టుకుని "ఇలా అయితే ఎలాగమ్మా! వాడు మరింత పాదయిపోడూ?' అంది ప్రాధేయపడుతున్నట్లు.
    మయూర కన్నీళ్ళతో "ఆ బ్రాందీ వాసన నాకు ఆనాటి సంఘటన గుర్తు తెస్తోందత్తయ్యా! మీ అబ్బాయి త్రాగకుండా వస్తే నేను ఏమీ అనను" అంది.
    వేణు తాగకుండా మయూరను సమీపించలేడు. అతనికి వంటిమీద తెలివి వున్నంతవరకూ , తన స్నేహితులు మయూరను పాడుచేసిన దృశ్యం మరిచిపోలేడు.

 Previous Page Next Page