Previous Page Next Page 
మరో ముందడుగు పేజి 13

 

    "అమ్మా! సర్వనాశనం అనే మాటకి అర్ధం లేదు. ఈ సృష్టిలో ఎప్పుడూ ఏదీ సర్వనాశనం కాదు. భగవంతుడు నీకు మానవ జన్మ ఇచ్చాడు - పద సద్వివెచనాదక్షత ఇచ్చాడు. నీ జీవితాన్ని ఉన్నత పదాలలో నడిపించుకోగలిగే సామర్ధ్యాన్ని ఇచ్చాడు - ఇంక నీకు నాశనమేముంది తల్లి! జీవితంలో సంభవించే ఒడిదుడుకులు నీకు పరీక్షలు- నీ మానవత్వానికి ఒరపిడిరాళ్ళు. ఉత్తమ విద్యార్దినిలా పరీక్షలు నేదుర్కొవాలి కాని, పోకిరీ పిల్లల్లా పరీక్షలు  వద్దని పరీక్షాదికారిని నిందించటం న్యాయమేనా?" తలెత్తి ఆశ్చర్యంగా చూసింది మయూర. ఆమెలో అంతకుముందెన్నడూ లేని గౌరవం ఆ వ్యక్తీ పట్ల కలిగినది. కానీ, అప్పటికీ భగవంతుడికి నమస్కారం చెయ్యలేదు. తిరిగి ఆమెను బలవంతం చెయ్యలేదు ప్రభాకర్. "కమలా౧" అని పిలిచాడు- లోపల నుంచి కమల వచ్చింది. కమల, మయూర ఒకరినొకరు చూసుకున్నారు. నాలుగు పదులు దాటినా ఇంకా ఎంతో అందంగా వున్న ఆవిడ ఎవరో అర్ధం కాలేదు మయూరకి. మయూరను చూడగానే ఏదో అసహన భావం కదిలింది కమలలో - అది పసికట్టినట్లు 'కమలా' అన్నాడు ప్రభాకర్ మందలింపుగా. అతని చూపులలో ఏముందో కాని, కమల ఒక్కసారిగా మారిపోయింది. మయూర చెయ్యి పట్టుకొని "రా అమ్మ! " అంది. "మీ అత్తగారు!" అని పరిచయం చేసాడు ప్రభాకర్. మరోసారి నిలువునా వణికింది మయూర. అది చూసి కమల బొమ్మలా నిలబడిపోయి ,  "లోపలికి తీసుకువెళ్ళు!" అన్న ప్రభాకర్  హెచ్చరికతో మయూర చెయ్యి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్ళి "ఇది వంటగది, ఇది హాలు, అది పూజామందిరం ...." అని పరిచయం చేస్తూ ఒక గది దగ్గిరకు వచ్చి ఆగిపోయి , చిన్న నవ్వుతో "ఇది నీ గది...." అంది. డబల్ కాట్స్ తో నీట్ గా వున్న ఆ గదిముందు నిలబడిపోయింది మయూర. "ఇది నీ గది! ఇది నీ గది!" అన్న కమల మాటలు తలలో హోరు మంటున్నాయి. డబల్ కాట్స్! ఒక మంచం మీద తనూ, మరో మంచం మీద ....బ్రాంది వాసన. మొరటు చేతులు- మృగం లాంటి ప్రవర్తన - చీదర - జుగుప్స.
    తూలి తనమీద పడిన మయూరను పొదివి పట్టుకుని "కాఫీ తాగుతావా, అమ్మా!" అంది కమల. మయూర అవస్థ నెమ్మది నెమ్మదిగా కమలకు అర్ధమవుతోంది. అసహనాన్ని తొలగించుకోంటూన్న ఆ మాతృ హృదయంలో మమత చోటు చేసుకుంటుంది.
    "ముందు ముఖం కడుక్కుంటాను" అంది మయూర. కమల "రమణమ్మా" అని పనిమనిషిని పిలిచింది. పనిమనిషి వచ్చాక "అమ్మాయి గారికేం కావాలో చూడు!" అంది.
    "రండమ్మా!" అని బాత్ రూంలోకి దారి తీసింది రమణమ్మ -  టూత్ పేస్ట్, బ్రష్ వగైరా అందించింది. అది వాగుడుకాయ. తనపని తను చూసుకొని పోయే రకం కాదు. అన్నీ కావాలి! "పొద్దున్న నర్సమ్మ మీ ముఖం కడిగించిండమ్మా! అయ్యగారే మీకు పాలు పట్టించారు. మీరు మన తెలివిలో లేరనుకోండి. పసిబిడ్డలాగా ఎవరేం చెయ్యమంటే అది చేసేవారు. ఓరి బాబాయ్! మీ మావగారు మిమ్మల్నేట్టా కనిపెట్టుకున్నారండీ! కంటికి రెప్పలా కాపాడుకున్నారండీ! ఈనాడూ మిరిట్టా తిరుగుతున్నారంటే అరి చలవేనండి!" అంది.
    ఆ మాటలన్నీ వింటూ పళ్ళు బ్రష్ చేసుకోవటం పూర్తీ చేసింది మయూర. ఆ తరువాత , నోట్లో నీళ్ళు పోసుకుని పుక్కిలించటం మొదలుపెట్టింది. ఆనాటి సంఘటన గుర్తుకొచ్చింది అకస్మాత్తుగా ....ఇక ఒకటే, నీళ్ళు పుక్కిలించి ఉయ్యటం ప్రారంభించింది. మూడు బక్కెట్ల నీళ్ళు పుక్కిలించి అక్కడితో అలసిపోయి విరమించుకుంది. రమణమ్మ గుండె బాదుకుంటూ కమల దగ్గరకు వచ్చి , హమ్మ నాయనోయ్! అమ్మాయిగారు మూడు బకెట్ల నీళ్ళు పుక్కిలించి వుమ్మేసారు!" అంది. కమల ప్రభాకర్ వైపు చూసింది. ప్రభాకర్ నిట్టూర్చి "మంచిదే! ఏ ఆలోచనా లేకుండా మరబొమ్మలా పడి వుండటం కంటే ఆలోచనలతో సతమతమవుతూ మనిషిలా బ్రతకడమే మంచిది!" అన్నాడు.
    రమణమ్మ తెచ్చిన కాఫీ తాగి కూచోలేక పడుకోబోయింది మయూర. కాని, ఆ గదిలోకి వెళ్ళటానికి కాని, ఆ మంచం మీద పడుకోవటానికి కాని ఆమె శరీరమూ, మనస్సూ ఎదురు తిరగ్గా , గిర్రున వెనక్కు తిరిగింది. ఎదురుగా నిలబడి వున్నాడు ప్రభాకర్. "వెళ్ళి పడుకోమ్మా!" మెత్తగా లాలిస్తున్నట్లు అన్నాడు - ఆ స్వరంలో ఏముందో కాని, దానికి ఎదురు తిరగగలిగే శక్తి మయూరలో లేకపోయింది. వెళ్ళి కళ్ళు మూసుకుని పడుకుంది. ఒక కుర్చీ మయూర మంచం దగ్గిరగా లాక్కుని కూచున్నాడు ప్రభాకర్ - అమ్మా! నీకు చాలా ఘోరమైన అవమానం జరిగింది - నాకు తెలుసు. కానీ , దానికి పరిహారం కూడా జరిగిపోయింది. నిన్నెవడు పాడుచేసాడో వాడికే నిన్నిచ్చి పెళ్ళి చేసాను!"
    ఈ మాటలు శూలాల్లా తగిలాయి మయూరకి. ఒక దుర్మార్గుడు తన బ్రతుకు పాడు చేసాడు. అందుకు పరిహారం ఏమిటి? వాడితోనే జీవితాంతం బ్రతుకు ముడి వేసుకోవటమా? ఆ దుర్మార్గాన్ని జీవితాంతం భరించటమా! భగవంతుడా! ఇదెక్కడి న్యాయం.
    కుమిలిపోతున్న మయూర హృదయం కన్నీరుగా స్రవించింది. ఆ కన్నీటిని తుడవగలిగే శక్తి ప్రభాకర్ కి కూడా లేకపోయింది.
    "అమ్మా! గతాన్ని తుడిచి వేయలేను. కానీ, ఇక ముందు మాత్రం నీ కోసం - నీ ఆనందం కోసం - ఏం చెయ్యటానికయినా సిద్దంగా వుంటాను. నా కొడుకు నీకు చేసిన అన్యాయానికి ఏ పరిహరమయినా చెల్లించుకుంటాను." ఉద్రేకంగా అన్నాడు ప్రభాకర్. చెమ్మగిల్లిన కళ్ళతో వింతగా చూసింది. అంతటి అల్లకల్లోలం లోనూ , ఆ మాటలు ఏదో ఊరట కలిగించాయి. పైట కొంగుతో కళ్ళు తుడుచుకుంది.


                                                         11

    ఆ టౌన్ లో ఆ కాలేజిలో చదవలేక వేణు టి.సి. తీసుకున్నాడు. ప్రభాకర్ ప్రయత్నం వల్ల అతనికి మరో కాలేజిలో సీట్ దొరికింది. ఈసారి వేణు అల్లరి వేషాలను క్షమించవద్దని ప్రిన్సిపాల్ తో చెప్పాడు ప్రభాకర్ . వార్తలు ఎలా ప్రచారమవుతాయో , వేణు చేసిన ఘనకార్యం అందరికీ తెలిసిపోయింది . ఆడపిల్లలు, మొగపిల్లలూ అందరూ అతణ్ణి పురుగులా చూడసాగారు. వేణు డబ్బు కూడా అతడికి స్నేహితులను కొనిపెట్టలేక పోయింది. అదీ కాక, అతడికి ఇదివరకు లాగ కోరినంత డబ్బు అందటం లేదు. జరిగిన దానికి బెదిరిపోయి, కమల తండ్రి కూడా ప్రభాకర్ కి తెలియకుండా మనవుడికి డబ్బియ్యటం మానేశాడు. తన తోటివాళ్ల నిరసననూ, చీదరనూ భరించటం అతని శక్తికి మించిపోయింది. మానసికమైన అశాంతి భరించ లేక అతడు త్రాగుడును ఆశ్రయించాడు. చిత్తుగా తాగటం - ఒళ్ళేరక్కుండా పడుకోవటం- ఇలా దొర్లిపోతున్నాయి అతనికి రోజులు! ఆ మైకంలో పడి వున్నంత వరకే అతనికి సుఖంగా వుంటుంది. ఈ పరిస్థితుల్లో అతనికి తండ్రి దగ్గిర నుంచి ఉత్తరం వచ్చింది. మయూరకు బాగు పడిందనీ, వెంటనే రమ్మని- వేణుకు మండిపోయింది. ఇన్నాళ్ళూ అతని మనసులో ఒక ఆశ వుండేది. మయూర పిచ్చిదయి పోతుంది. పిచ్చిదని మయూరను వదిలేసి, మరొకరిని పెళ్ళి చేసుకోవచ్చును. కానీ, మయూర బాగుపడిందనే సరికి , అతనిలో ఆ ఆశ కూడా హరించుకుపోయింది. తన కళ్ళ ముందే తన ఇద్దరు స్నేహిరులు అనుభవించిన స్త్రీ  తన భార్య - యెంత మరిచి పోదామన్నా ఆ దృశ్యం అతడికి మరపు రావటం లేదు. వాళ్ళు మయూర మీద పడి ముద్దాడటం - మయూర ముఖం తిప్పుకుంటూ బాధగా కేకలు వెయ్యటం- నగ్నంగా వున్న మయూరను వాళ్ళిద్దరూ చెరో వైపు నుంచీ క్రూరంగా నలిపెయ్యటం -

 Previous Page Next Page