Previous Page Next Page 
మిస్ మేనక ఐ. పి. యస్. పేజి 12


    అరక్షణం నిశ్శబ్దం

 

    "ఓ  పెన్ ది డోర్!"

 

     మరోసారి ఆమె పాదాన్ని పైకెత్తింది.

 

     సరిగ్గా అదే సమయంలో డోర్ తెరుచుకోవడం. ఓ చెయ్యి ఆమెను అమాంతం లోపలికి లాక్కోపడమూ క్షణాల్లో జరిగిపోయాయి.    


    ఊహించని  ఆ సన్నివేశానికి బేలెన్స్ తప్పిన  మేనక చేతిలోని రివాల్వర్ కింద పడిపోయింది.

 

     ఆమెకు ఊపిరి ఆడడంలేదు. చాలా బలంగా దగ్గరకు లాక్కుంటున్న దెవరో....

 

    అదే....

 

     ఎంత పోలీస్ ఆఫీసరయినా తను శారీరకంగా బలహీనురాలయిన ఆడదని ఆమె తెలుసుకున్న మొదటి క్షణం.

 

     కారు స్టీరింగ్ ఆమె నడుముకు తగులుతూ లేచో అవకాశమివ్వడం లేదు.

 

    పొదిపట్టుకున్న  వ్యక్తి చేతులనుంచి విడిపించుకోడానికి మాత్రమే గాక కనీసం అతనమెవరన్నదీ చూడాలని ప్రయత్నిస్తూ విఫలురాలౌతుంది.    

 

     బోర్లా అతని గుండెపైన వాలిన ఆమె క్రమంగా ఆవ్యక్తివేపు తిరగాలనుకుంటుండగా వేడిసెలా  అతని నిశ్వాసం కంఠాన్ని తాకింది.

 

    "నన్ను వదులు!"

 

     రోషం, ఉక్రోషం ఆమెను వివశురాల్ని చేస్తున్నాయి. ఏమైంది తన ఫిజికల్ ప్రొఫిషియన్సీ?క్లిష్టమైన 'టెర్రయిన్'లో నేరస్థుల్ని ఎదుర్కొనే కళ మానసికమైన  నిబ్బరం కోల్పోకుండా అబ్ స్టకుల్ కోర్సులో తర్ఫీదుపొందిన తనలో ధైర్యం ఇలా సడలిపోతుందేమిటి?

 

     క్రమంగా శక్తిన కూడగట్టుకుంది.   'అటాక్' లో నేర్చుకున్న మెలకరువలు ఉపయోగించే పరిస్థితి కాదిది తననుచుట్టేసిన అతని చేతుల కదలికల్నైనా నిరోధించాలి.

 

     ఐ.పి.ఎస్. లో నేర్చుకున్న 'డిఫిన్సి వ్ ఎర్సర్ సైజ్ స్' ని గుర్తుచేసుకుంటూ ఇన్నర్ ఫోర్ ఆర్మ్ బ్లాక్ తో ప్రత్యర్థిని నెట్టాలనుకుంది.
    


     ఊపిరి బిగపట్చటిన ఆమె ఆ క్షణంలో కొద్దిపాటు వెసులు పాటుని గమనించింది. ఆ అవకాశాన్ని చేజార్చదలచుకోలేదు.


    
     'ఆర్మ్ అటాక్' అతి ముఖ్యమైన చేతివేళ్ళని కత్తిలా మడిచి ప్రత్యర్థి కణతలపైన బంలగా కొట్టేటెక్నిక్ కి సిద్దపడుతుడంగా నే సన్నగా నవ్వు వినిపించింది.

 

    వెనువెంటనే అంతదాకా అదుపుచేసిన పట్టుసడిలింది.


    
    అప్పుడు చూసింది.

 

     కలకదది.

 

     ఇప్పుడే చెదిరిన గాఢసుషుప్తి.

 

     మానవాకారపు అసుర సంధ్యాకాలాన్ని ఉదయసంధ్యగా మార్చుతున్న ఓ ప్రత్యు,పవనం.


    
    "మిత్రా!"

 

     నమ్మశక్యంగాక ఆమె రొప్పుతూంది.

 

     అదికూడా కాదు.

 

     అతను కనిపించని  ఒకటిన్నర సంవత్సరాలకి ఎన్ని యుగాలలో లెక్కకట్టి  చెప్పాలని విఫలయత్నం చేస్తూంది.


    
     భాష చాలదనుకుందేమో ఇప్పుడు తనే బలంగా చుట్టేసిందతన్ని. ఆమెకు తన పదవి గుర్తుకురాలేదు.తనో అధికారిణి అన్న ఆలోచనా స్ఫురించలేదు.

 

    ఒక ద్వీపకల్పాన్ని చుట్టిసాగరమై మనుసుపుటల్ని పిరమిడ్లతో రాసి చూపుతున్నట్టు అతని మొహాన్ని గుండెకు త్తుకుంటూ సన్నగా   "ఏమయ్యావు మిత్రా? ఇన్నాళ్ళూ   నువ్వు ఎందుకు దూరమయ్యావు?"

 

    "అపరసంధ్యను మధుశాల యందునుండి మోజుగలపాత్ర  భుజమును మోసికొనుచు కులుకునడకల వయ్యార మెలికిపోఅప్సర మానువు మనసుతీరా...."

 

     గొణిగాడు విశ్వామిత్ర...ఉమర్ ఖయ్యంలా.

 

    "సిగ్గులేదూ!" ఆమె గొంతు గారాలుపోయింది.

 

    "ఉంది" గుసగుసగ అన్నాడు.

 

    " అస్సల్లేదు.ఆ...."

 

    " లేకపోతే ఇందాక  నిన్ను మరో అరగంట అలా హతుకునే వాణ్ణి."

 

    "చెంప పగిలేది?"

 

    "అహమేనక విశ్వామిత్రుల సంగమంతో శకుంతల ఉద్భవించేది."

 

    "ఛీ!" బిడియంగా దూరం జరిగంది. " నేను ... ఇప్పుడు ..."

 

    "డ్యూటీలో వున్నా ఇది అఫీషియల్ ఏక్టుకిందికిరాదు"

 

    " అదెలా?"

 

    "ఇందాకనే నేను   నీ తలపైనున్న పీక్ కేప్ ని వెబ్ బెల్ట్ ని లాగేశాను కాబట్టి"

 

     అప్పుడు చూసింది కారువెనుకసీటులోని కేప్ ని, బెల్ నీ.... "దూర్మార్గుడివి!"

 

    "నువ్వుమాత్రం?"

 

    " నేనేం చేశాను ?"

 

    "గుర్తుందా!"  లాలనగాకాదు. తమకంగా ఆమెకు దగ్గరకు తీసుకున్నాడు.

 

    "ఏ... మి...టి"

 

    "అభ్యంగనా నిష్కృత త్వాదీయ వినీల శిరోజ తమస్సముద్రాలు పొంగి నీ భుజాలుదాటి  నాముఖాన్ని కప్పిననాడు నేనో స్వప్నాన్నికనాలని  రిగలే  ఒకేఒక్క  నృత్యాగ్ని కణంలాగ  నిశ్సబ్దంగా నీకళ్ళల్లోకి చూడాలని తపించేవాణ్ణిని...." మిత్రా భావుకుడిలా గుర్తుచేస్తుంటే ఆమెనేత్రాలు అర్థనిమీలితాలయ్యాయి.

 

    "ఇప్పుడైతే మాత్రం కాదన్నానా?"


    
     నిశ్శబ్దం.

 

    "చాన్సేదీ?" సీరియస్ గా అన్నాడు.

 

     హఠాత్తుగా మిత్ర గొంతులో ఆ మార్పుకి ఆశ్చర్యపోతూ చూసింది.

 

    " ఎస్ మిస్  మేనకా. మగాడిలా క్రాఫ్ చేయించుకున్నావు. వినీల శిరోజాలు లేవు, నీ భుజాలుదాటి నా ముఖాన్ని కప్పడమూలేదు."

 Previous Page Next Page