మాణిక్యాంబ నిస్సంకోచంగా బయటకు వెళ్ళిపోతుంది. నిర్మల ఒంటరి ఆడదన్న బెంగ ఆమెకులేదు. ఆమెకేదైనా అన్యాయం జరిగితే సాధించడానికి తనకమరో అవకాశామన్న సంతోషమే ఆమె కెక్కువ అంతరంతరాలలో నిర్మల కలాంటి అన్యాయం జరిగి ఆమెబ్రతుకు నడిబజారూపాలవాలన్నకోరిక మాణిక్యాంబకుంది.
ఆవిషయం నిర్మలకు రమణయ్య వచ్చినపుడు తెలిసింది.
రమణయ్య మాణిక్యాంబకు తమ్ముడు ఏదోపనిమీద వచ్చి పదిరోజులున్నాడక్కడ. అతడు నిర్మలవంక వెలికిచూపులుచూసేవాడు రేండర్ధాలలో ఆమెకు వినిపించేలా మాట్లాడి తన తెలివితేటలకు మురిసిపోయేవాడు ఇంటికి వచ్చిన రెండోరోజునే అతడామె చేయిపట్టుకున్నాడు. నిర్మల వెంటనే విడిపించుకుని పరుగున మాణిక్యాంబ వద్దకు వెళ్ళింది. విషయం విని మాణిక్యాంబ-"వాడిదగ్గర ఎప్పడూ వల్లి ఉంటుంది దానితో ఎంతో బుద్దిగా ఉంటున్నాడు నిన్ను చూస్తేనే వదిలా ఎందుకుంటాడు? నువ్వే వాణ్ణి రెచ్చగొట్టి ఉంటావు" అని తిట్టింది.
తర్వాత మాణిక్యాంబ వల్లిని తమ్ముడి దగ్గరకు వెళ్ళనివ్వలేదు.
రమణయ్యకు నిర్మల అసహాయత తెలుసు అందుకే అతడు మళ్ళి మళ్ళి ఆమె కోసం ప్రయత్నాలు చేయసాగాడు.
మరోసారి నిర్మల మాణిక్యాంబకు చెప్పుకుంది.
"నా తమ్ముడికి పెళ్ళయిపోయింది వాణ్ని వలల్లో వేసుకోవాలని చూడకు" అంది మాణిక్యాంబ
నిర్మలకు సిగ్గుతో వళ్ళంతా చచ్సినట్ల్తేపోయింది.
తమ్ముడిమీద అభిమానమో నిర్మలమీద ద్వేషమో తెలియదుగాని- ఆ తర్వాత రెండురోజులు వరుసగా వాళ్ళిద్దరిని ఒంటరిగా వదిలి ఇంట్లోంచి బయటకు వెళ్ళింది మాణిక్యాంబ.
మొదటిరోజు నిర్మల- మాణిక్యంబ ఇలా వెళ్ళగానే అలా రమణయ్య గడికి బయటనుంచి గొళ్ళెంపెట్టింది. మాణిక్యాంబ తిరిగివచ్చి తమున్ని గది లోంచి విడిపించగలిగింది. నిర్మలను బాగా చివాట్లు పెట్టింది.
రెండో రోజున రమణయ్య హాల్లోనే కూర్చున్నాడు.
నిర్మలకు బోలెడు పనులున్నాయి అందువల్ల ఆమెకు తన్నుతా గదిలో బందించుకునే అవకాశంలేదు.
ఎఅమనయ్య మంచి కసిమీదఉన్నాడు. తన దౌష్ట్యానికతడు ప్రతికారం అని పేరు పెట్టుకున్నాడు అక్క అలా వెళ్ళగానే అతడు వెళ్ళి బట్టలు తుకుతున్న నిర్మలముందు నిలబడి" ఇక నువ్వు నన్ను తప్పించుకాలేవు" అన్నాడు.
"దయుంచి నన్ను బాధపెట్టకు" అంది నిర్మల.
"నిన్ను బాధపెట్టాను సుఖపెడతాను...."అన్నాడు రమణయ్య.
"నాకు సుఖంవద్దు వెళ్ళు...."అంది నిర్మల.
"నువ్వమయకురాలివి నీకు చాలవేర్పాలి. ముందక్కన్నించిలేచిరా అన్నాడు రమణయ్య.
"రాను-"అంది నిర్మల.
"రాకపోతే ఏంచేస్తానో తెలుసా?" అన్నాడు రమణయ్య.
నిర్మల మాట్లాడకుండా బట్టలపని చూసుకోసాగింది.
రమణయ్య ఆమె వెనక్కు వచ్చాడు రెండుచేతులతో ఆమెను ఎత్తుకున్నాడు. అక్కడ్నించి గిలగిలా తన్నుకుంటున్న ఆమెను బలబంతంగా గదిలోకి తీసుకుని వెళ్ళి మంచం మీదకు జారవిడిచి గదితలుపులు వేశాడు.
"నన్ను వెళ్ళని...."అంది నిర్మల.
"వెళ్ళనిస్తాను. అప్పడే కాదు...." అన్నాడు రమణయ్య.
"ప్లీజ్...."అంది నిర్మల.
"నేను ప్లీజ్ అంటాను నువ్వు నామాటవిను...." అన్నాడురమణయ
నిర్మల లేచి నిలబడి "నన్ను వెళ్ళని.....అంది.
రమణయ్య ఆమెను బలంగా కౌగలించుకుని "కాసేపిక్కడే వుంటే అప్పుడు నువ్వే వెళ్ళనంటావు"అన్నాడు.
నిర్మల అతడిని బలంగా ఒక్క తోపుతోసింది. అయినా రమణయ్య నిలదొక్కుకుని నిలబడ్డాడు పట్టరాని ఉద్రేకంతో నిర్మల తన రెండు చేతుల తూనూ అతడి రెండు చేపంలూ టపటపా వాయించింది. అతడు తేరుకునేలోగా గడితలుపులు తీసింది.
అప్పుడు రమణయ్య లో రేగిన పగ, ప్రతికారజ్వాల ఉద్రేకం- ఇంతా అంతాకాదు.
"ఈరోజు నిన్నింకెవ్వరూ రక్షించలేరు" అన్నాడతను వెనక్కుతిరిగి.
నిర్మల అక్కడ్నించి పరుగెత్తింది. రమణయ్య ఆమెను తరిమాడు. ఇద్దరూ ఇంట్లో పరుగులు పెట్టారు. చివరికామే రమణయ్య మళ్ళి దొరికిపోయింది.
ఇప్పడామే పూర్తిగా అలసిపోయింది. వంట్లో ప్రతిఘటించె శక్తి కూడాలేదు. ఏమీచేయలేక ఎదుస్తోందామే. రమణయ్య ఉత్సాహంగాఉన్నాడు.
"అనవసరంగా భయపడకు .నీకేమి ప్రమాదంలేదు. దిన్నె ప్రేమంటారు. మనం ప్రేమికులం. ప్రేమికులకిలాంటి ఏకాంతం అరుద్తేన వరం...." అంటూ అతడామె శరిరాన్నిఒ తడమడం మొదలు పెట్టాడు.
"నా జీవితం ఈ విధంగాకూఒడా నాశనం కాబోతోంది" అనుకుంది నిర్మల అప్పడామే నిస్సహాయస్ధితి ఆమెలో నిర్లిప్తతను పెంచింది.
రమణయ్య మళ్ళి ఆమెను గదిలోకి నడిపించాడు. ఆమె ముఖాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకుని- "నీ అందం నీకు తెలియదు నాకు సహకరించావంటే నీకు మంచి బహుమతి యిస్తాను అన్నాడు.
"ఏమిటది?" అని నిర్మల అడగలేదు సహకరించడమంటే మాత్రం ఆమెకు కొద్దికొద్దిగా అర్ధం అవుతోంది ఆ సమయంలో ప్రతిఘటించకపోవడం కూడా సహకరించడమే అవుతుందని ఆమెకు తెలుస్తోంది.
తానెందుకు ప్రతిఘటించలేకపోతున్నది ఆమెకు అర్ధంకావాడంలేదు.
గొడవచేస్తే తల్లి తిడుతుందని భయపడుతోందా? రోడ్దేక్కితే తన జీవితం రోడ్డుపాలేఅవుతోందని నమ్ముతోందా? పరుగెత్తి పరుగెత్తి శారీరకంగా అలసిపోయిందా? ఆలోచించి ఆలోచించి మానసికంగా అలసిపోయిందా?
ఇవన్ని నిర్మలకు బాధకలిగించడంలేదు. కానీ....
తను పురుష స్పర్శకు లొంగిపోయిందా ? ఏ మూలనుంచో తనలో వాంచరేగిందా? కోతూహలం తనను బలహినురాలిని చేసిందా?
"దీన్ని ప్రేమంటారు మనం ప్రేమికులం ప్రేమికులకిలాంటి ఏకాంతం అరుదైనవరం"అన్న రమణయ్య మాటలామే చేవుల్లోగింగురుమటున్నాయి.