Previous Page Next Page 
హనీమూన్ పేజి 10


    "మనం  ఇప్పుడు ఆ గోపాల్ ఎక్కాడున్నాడో వెతికి పట్టుకుని 'క్యూ'లో కెళ్ళి టికెట్ కొనకుమడా వేరేవిధంగా ఏర్పాటు చేస్తాడేమో కనుక్కుందాం!"

    "బెస్ట్ అయిడియా! ర్తేల్వేలో చాలావరకూ ఇంలాటి రికమేండేషన్ వ్యవహారాలే జరుగుతుంటాయని అంటారు."

    ఇద్దరం ప్లాట్ ఫారం వెళ్ళే గేటుదగ్గర ఆగి టికెట్ కలెక్టర్ నీ  గోపాలన్ గుంరిచి ఆడిగాము.

    "గోపాలన్ గారు మీ బంధువా సార్?" హఠాత్తుగా ఎక్కడలేని మర్యాదా కురిపిస్తూ అడిగాడతను.

    "బంధువు కాదుగాని ఫామిలి ప్రెండు" అన్నాడు కొంచెం దర్జాగా.

    "అలాగా ! అయితే పదండి  సార్! నేనే స్వయంగా  తిసుకెళ్తను ఆయన దగ్గరకు-" అంటూ మా ఇద్దరినీ వెంబడి పెట్టుకుని బయలుదేరాడు.

    "మనాడికి చాలా పెద్ద పరువున్నట్లుందే స్టేషన్ లి?" అన్నాడు సారధి నెమ్మదిగా.
   
    "బహుశా  వీళ్ళ 'బాస్' అయుంటాడు" అన్నాన్నేను.

    "మరి ఎప్పడూ  ఆ వెధవ  డ్రెస్  వేసుకుని తిరుగుతాడెందుకు?" మా ముందు  నడుస్తున్న టి.సి హఠాత్తుగా  ఆగిపోయాడు.

    "సార్! నాకో హెల్ప్ చేస్తారా?" అన్నాడు మా వేపు తిరిగి.

    "ఏమిటిది?"

    "ఈ మధ్య నా యింక్రిమెంట్ ఆపేశారు సార్! గోపాలన్ గారు తలచుకుంటే అయిదునిమిషాల్లో వచ్చే స్తుందది" దినంగా సారధి.

    "పోనిలేపాపం-ఇతను ఇంత ఇదిగా అడుగుతున్నాడు కదా చెప్దాం!" అన్నాను.

    "ధాంక్యూ సార్" అంటూ మళ్ళి నడవసాగాడు.

    అందరం  స్టేషన్లోని ఓ పెద్దగదిలోకి వెళ్ళాం లోపల తెల్లరంగు సూట్ వేసుకున ఓ వ్యక్తి ఫాన్ కింద కూర్చుని ఎవరితోనో పోన్లో మాట్లాడుతున్నాడు. మమ్మల్నిచూసి మాట్లాడటం ఆపి మావంక ప్రశ్నార్ధకంగా చూశాడు.

    "మీ పామిలిప్రేండ్సు ఆటసార్ వీళ్ళు మీకోసం పాపం ప్లాట్ పారమంతా  వెతుకుతోంతే తీసుకొచ్చాను" అన్నాడు టి.సి. సగర్వంగా.

    నేనూ, సారధి ఆశ్చర్యపోయం మా విధిలో ఉన్న గోపాలన్ కి  సూట్  వాలాకి ఏ మాత్రం పోలికలులేవు. మరి టి.సి. అలా అంటాడేమిటి? ఎక్కాడో ఏదో పొరబాటు జరిగిందని తెలిసిపోయింది మాకు.

    "యస్! వాద్దూయూవాంట్ ?" మా వేపు అనుమానంగా చూస్తూ అడిగాడు ఆపిసర్.

    "ఏమీ  ఆఖ్ఖర్లేదండి! అసలు మాక్కావలసినాతను  మీరు  కాదు!" అన్నాడు సారధి.

    సూట్ వాలాకి కోపం ముంచుకొచ్చింది. నిప్పులు కక్కుతూ టి.సి. వేపు చూశాడు  టి .సి . మొహం వాడిపోయింది.

    "అదికాద్సార్ - గోపాలన్ గారు కావాలని స్పష్టంగా అన్నారు__" అంటూ ఏదో చెప్పబోయాడు గాని అతను వినిపించుకోలేదు.

    "ఒక యింక్రిమెంట్ కట్ చేసినా నీ పద్ధతి మార్పుకోలేదన్న మాట!"

    "అదికావ్సార్ -వీళ్ళు  మీ ఫామిలి ప్రేంద్సు అని-"

    "వివరాలు సరిగ్గా తెలుసుకోకుండా అడ్డమ్తెన వాళ్ళనూ నా దగ్గరకు తీసుకోచ్చావంటే ఇంకో  వార్జిషిట్ ఇస్తాను."

    "నేను చెప్పేది కొంచెం."

    "దట్సాల్ ర్తేట్ -యూకేన్ గో నౌ-"

    టి.సి.తో పాటు మేమూ బయటికోచ్చము.

    "మీకు గోపాలన్  కావాలని  ఎందుకు  చెప్పారు నాతో?" కోపంగా అరిచాడు టి.సి.

    "మాకేం తెలుసు-మీ ర్తేల్వే లో ఎక్కడ చూసినా ఓ గోపాలన్  వుంటాడని" ఎదురుతిరిగాడు సారధి.

    "మీ మూలాన నా పరుపు పోయింది."

    "బాగుంది! మీరు  చేసిన తప్పుకి మమ్మల్నంటారెం?"

    "ఏమిటి తప్పనాదా? మాటలు తిన్నగా రానిండి!" అన్నాడతను రెచ్చిపోతూ.

    "నువ్వే తిన్నగా మాట్లాడు." ఆన్నాడు సారధి ప్తేటింగ్ కి  రడి అయిపోతూ.

    పరిస్ధితి క్షణక్షణానికి క్షిణించి పోతోందని పసిగట్టి నేను రంగంలోకిదిగాను.

    "సారధి గోడవెందుకులే పోనీ! జరిగింది" అంటూ సారధికి సర్దిచేప్పాను.

    "అసలు మీకు ప్లాట్ ఫారం టికేట్టుందా?" కొత్తవివాదం లేవదీశాడు టి.సి.

    మేము కొంచెం జమ్కాము ఎందుకంటే మాతాతయ్యా, అమ్మమ్మా ఎప్పడూ  చెప్తూండేవారు పోలిసుల చేతిలోనూ, టికెట్ కలెక్టర్ల చేతి లోనూ పడకూడదని.

    "లేదు!" అన్నాడు సారధి మొండిగా.

    "ఎందుక్కోనలేదు?"

    "నువ్వేఅగా కొన్నికుండా మమ్మల్ని తిన్నగా లోపలకు తీసుకెళ్ళావ్?"

    "అయితే ఆ తప్పు నాదన్నమాట!"

    "ముమ్మాటికి  నిదే?"

    "అయితే చార్జికట్టండి!"

 Previous Page Next Page