గురు నానక్ జయంతి (Guru Nanak Dev Birthday)

 

గురు నానక్ జయంతి

  (Guru Nanak Dev Birthday)

 సిక్కుల మత గురువు గురు నానక్ పుట్టినరోజు కార్తీక పౌర్ణమి. మామూలుగానే విశిష్ట దినంగా భావించే కార్తీక పౌర్ణమి గురు నానక్ జన్మదినం కూడా కావడాన ఈరోజు పంజాబీలకి మహా పర్వదినం. గురు నానక్ జయంతిని పంజాబీలు ''గురుపూరబ్'' అంటారు. గురు నానక్ జయంతిని భారత ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది.

1469లో ప్రస్తుత పాకిస్తాన్ లోని లాహోర్ సమీపంలో ఉన్న నన్కానా సాహిబ్ లో గురు నానక్ జన్మించారు. ఆయన పుట్టింది ముస్లిం కుటుంబంలో. నానక్ హిందూ, ఇస్లామిక్ మత గ్రంధాలను అధ్యయనం చేశారు. అయితే, ఈ రెండు మతాలకు భిన్నమైన సిక్కు మతాన్ని స్థాపించి ఆరాధ్య గురువయ్యారు. మొత్తం పదిమంది సిక్కు మత గురువులలో గురు నానక్ తొలి గురువు. లాహోర్లో గురు నానక్ పుట్టిన పవిత్ర ప్రదేశం ''గురుద్వారా జనం ఆస్థాన్'' అయింది.

గురు నానక్ ఏప్రిల్ 15న పుట్టారని చెప్పేవారూ ఉన్నారు. కానీ కార్తీక పౌర్ణమినే నానక్ జన్మదినంగా నమ్మి వేడుక చేసుకేనేవారే అత్యధికశాతం ఉన్నారు. కేవలం పంజాబీలు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేకమంది గురు నానక్ ను ఆరాధిస్తూ ''గురుపూరబ్''ను పండుగ చేసుకుంటున్నారు.

సిక్కులు ఏకేశ్వరోపాసన చేస్తారు. ఓంకారాన్ని ఏకైక దేవునిగా పూజిస్తారు. గురు నానక్ జయంతి సందర్భంగా గురుద్వారాల్లో సిక్కులు పవిత్ర మత గ్రంధంగా భావించే ''గురు గ్రంధ సాహిబ్'' ను 48 గంటల పాటు నిరంతరంగా పఠిస్తారు. ఇలా చదవడాన్ని ''అఖండ పఠనం'' అంటారు. ఈ గురు గ్రంధ సాహిబ్ అఖండ పఠనం నానక్ జయంతి కంటే ముందురోజు ముగుస్తుంది. ఇక జయంతి నాడు ఉదయానే ''ప్రభాత్ ఫేరిస్'' పేరుతో ఊరేగింపు జరుపుతారు. ఈ ఊరేగింపు గురుద్వారా వద్ద మొదలై వాడవాడకూ వెళ్తుంది. ''నిషాన్ సాహిబ్'' అనే సిక్కు జండాలను పట్టుకుని ఊరేగింపు జరుపుతారు. ''గురు గ్రంథ సాహిబ్''ను పల్కీలో చుట్టి పూలతో అలంకరిస్తారు. భక్తులు సింగ్ షాబాద్ తదితర భక్తి గీతాలు ఆలపిస్తూ నడుస్తారు. వాయిద్యకారులు అందుకు అనుగుణంగా వాయిద్యం అందిస్తారు. కథా కాలక్షేపం ముగిసిన తర్వాత భక్తులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేస్తారు.

 

Guru Nanak Birthday, Sikh Guru Guru Nanak Dev, Karthika Pournami Guru Nanak Birthday, Auspicious Day Guru Nanak Birthday, Guru Nanak Jayanti Holiday