తిరుమల తిరుపతి వేంకటేశుని అత్యధిక ఆదాయం
తిరుమల తిరుపతి వేంకటేశుని అత్యధిక ఆదాయం
(Tirumala Tirupati Venkateswara Income)
జూలై 26న, తిరుమల తిరుపతి వేంకటేశుని అత్యధిక ఆదాయం 2.85 కోట్లుగా నమోదైంది.
దేవుళ్ళలో ధనవంతుడు ఎవరంటే నిస్సందేహంగా తిరుమల వెంకన్న పేరే చెప్పాలి. కానుకల రూపంలో వేంకటేశ్వరునికి నిత్యం కోట్లాది రూపాయలు, ఖరీదైన బంగారు, వెండి నగలు వస్తాయి. ఇక పండుగలు, పర్వదినాల్లో ఏడుకొండల వేంకటేశునికి లెక్కకు మిక్కిలిగా కానుకలు వస్తాయి. అయితే, ఏ విశేషమూ లేని మామూలు రోజైన జూలై 26న, 2.85 కోట్ల అత్యధిక మొత్తం కానుకగా రావడం చెప్పుకోదగ్గ విశేషం.