యజ్ఞవరాహా వతారము
పూర్వముమొకప్పుడు బ్రహ్మ సృష్టి చేయవలెనని సంకల్పించి స్వాయంభువమనువును మానసికంగా సృజించెను .అతనిని సృష్టి కొనసాగింపుమని ఆదేశించెను. మనువు ''తండ్రి !భూమి యంతయు జలములో మునిగియున్నది .దానిపై సృష్టి చేయుటేట్లనని ''యడిగెను .బ్రహ్మ,కుమార !శ్రీమహా విష్ణువు సర్వ శక్తి సంపన్నుడు .
అతని వలననే భూమి ఉద్ధరణకు జరుగవలెను ''అని పలికి ,యిట్లాలోచించేను .''మొదటజలమును సృజించి తరువాత భూమిని సృష్టి౦చినాను .అ దిప్పుడు నీటిలో మునిగియున్నది .దానిని బయటకు దేచ్చుటేట్లు?''అని శ్రీ మహా విష్ణువును ధ్యానించుచుండగా అతని ముక్కురంధ్రములనుండి బొటనవ్రేలంత రూపముతో యజ్ఞవరాహమూర్తి ఆవిర్భవించేను . పుట్టగానే ఏనుగంత శరీరము కలవాడై దిక్కులు పగులునట్లు ఘూర్జర ధ్వని చేసెను .
ఆ మూర్తి జూచి బ్రహ్మయానందించేను .మునులు వేదమంత్రాములతో స్తుతించిరి.వరాహమూర్తి సముద్రాలను కలచివేయుచు భూమిని ఎత్తుదమనుకొన్నసమయములో హిరణ్యాక్షుడు వచ్చి అడ్డుపడెను . హిరణ్యాక్షుడు గదచేత బూని వరాహమూర్తి నెదిరించగా ,అతడు వానిని తన వజ్రసమమైన దంష్ట్ర(కోర) తో చీల్చి వేసి ఆ కొరమీదనే భూమిని నిలుపుకుని సముద్రమునుండి పైకివచెను . దేవతలు,మునులు ఆ వరాహ మూర్తిని యజ్ఞపురుషునిగా తెలుసుకొని అనేక విధములుగా స్తుతించిరి .