అది ఒక్కటి ఉంటే చాలు
అది ఒక్కటి ఉంటే చాలు
ధైర్యేణ యుక్తం సతతం శరీరం న విశీర్యతే।
విశోకతా సుఖం ధత్తే ధత్తే చారోగ్యముత్తమమ్॥
జీవితంలో ఏది ఉన్నా లేకున్నా ధైర్యాన్ని కోల్పోకూడదు. ధైర్యాన్నే కోల్పోతే అన్నీ కోల్పోయినట్లే! అదే ధైర్యాన్ని నిలుపుకొని ఉంటే శరీరం శుష్కించిపోకుండా ఉంటుంది; శోకం దరిచేరదు; సుఖాన్ని అనుభవించగలుగుతాం; ఆరోగ్యమూ పదిలంగా ఉంటుంది.