Read more!

మాట- కోపం

 

మాట- కోపం

 

 

ప్రస్తావసదృశం వాక్యం స్వభావదృశం ప్రియమ్‌।

ఆత్మశక్తిసమం కోపం యో జానాతి స పండితః॥

పరిస్థితికి అనుగుణంగా అవతలి వ్యక్తి స్వభావానికి తగినట్లుగా మాట్లాడేవాడే పండితుడు. ఎక్కడ ఎంత కోపం చెల్లుబాటు అవుతుందో గ్రహించి... అంతమేరకే కోపాన్ని ప్రదర్శించేవాడు పండితుడు. అంటే మాట, ప్రవర్తన... రెండూ కూడా సమయసందర్భాలకి అనుగుణంగా ఉండాలని చెబుతున్నారన్నమాట.