నువ్వే ఆదిపరాశక్తివి
నువ్వే ఆదిపరాశక్తివి
చిన్నప్పటి నుంచి రామాయణ, మహా భారతాలని వింటూ పెరిగాం. పురాణ కథలూ విన్నాం. సీత, సావిత్రి, సతి, అనసూయ... ఇలా ఎందరో మనల్ని, మన ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసారు. సీత కష్టాన్ని సైతం ఎంత నిబ్బరంగా ఎదుర్కోవాలో నేర్పిస్తే, సావిత్రి ఎదుట వున్నది ఎంతటి వారైనా ఎదుర్కోవటానికి జంకవద్దని చెబుతుంది. అనసూయ అయితే సాక్షాత్తూ త్రిమూర్తులే తన ఎదుట నిలిచినా బెదరక లౌక్యంతో ఆ పరీక్షలో నెగ్గింది. ఇలా పురాణాలు స్త్రీ శక్తికి పట్టం కట్టి... నువ్వు తలచుకుంటే ఏమన్నా సాధించగలవ్ అని చెప్తున్నాయి. ఆదిపరాశక్తివి నువ్వే, లాలించి సేద తీర్చగల అమ్మవి నువ్వే. అంతర్గతంగా సమస్త విశ్వాన్ని శాసించే శక్తి నీ స్వంతం. ఆ శక్తిని గుర్తించి దూసుకు వెళ్ళాల్సిన బాధ్యత మాత్రం నీదే అని ఎలుగెత్తి చాటుతున్నాయి.
ప్రామాణికంగా నిలిచే ఆ స్త్రీ మూర్తుల గురించి ఈసారి చదివినప్పుడు... ఒక్కసారి వారి వ్యక్తిత్వ పరిశీలన చేయండి. ఎంత స్ఫూర్తి పొందుతారో చూడండి.
ఓ స్త్రీ నువ్వే ఆది పరాశక్తివి...
ఓ స్త్రీ నువ్వే జగజ్జననివి...
నీకు నమస్సులు...
-రమ