రామతులసి.. కృష్ణతులసి.. ఇంట్లో ఏ తులసి నాటితే మంచిదంటే..!
రామతులసి.. కృష్ణతులసి.. ఇంట్లో ఏ తులసి నాటితే మంచిదంటే..!
హిందూ మతంలో తులసి మొక్కకు చాలా పవిత్రత ఉంది. ప్రతి హిందువు ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. ప్రతి రోజూ తులసి మొక్కకు నీరు పోయడం, తులసి ముందు దీపం వెలిగించడం చేస్తుంటారు. అయితే తులసి మొక్కలో కూడా రకాలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా రామ తులసి, కృష్ణ తులసి అని రెండు రకాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. రామ తులసి ఆకుపచ్చగా ఉంటుంది. అదే కృష్ణ తులసి ఆకులు కాస్త నలుపు రంగులో ఉంటాయి. ఈ రెండిటిలో ఏ తులసి మొక్కను ఇంట్లో నాటాలి అని చాలా మంది గందరగోళ పడుతుంటారు. దీని గురించి పురాణ పండితులు సరైన సమాధానం ఇచ్చారు. అదేంటో తెలుసుకుంటే..
తులసిలో రామ తులసి, కృష్ణ తులసి రెండూ శ్రేష్టమైనవే.. ఇంట్లో ఏ తులసిని అయినా నాటవచ్చు. అయితే రెండింటిని నాటినా చాలా గొప్ప ఫలితం ఉంటుందని అంటున్నారు పండితులు.
ఇంట్లో రామ తులసి, కృష్ణతులసి రెండూ ఉండటం వల్ల ఆ ఇంటి పరిసరాలలో ఉండే ప్రతికూల వాతావరణం మొత్తం నశిస్తుందట.
అయితే హిందూ నమ్మకాల ప్రకారం ఇంట్లో రామ తులసిని నాటడం చాలా మంచిదట. లక్ష్మీదేవి రామ తులసిలో నివాసం ఉంటుందట.అందుకే రామ తులసిని నాటి ప్రతి రోజూ నీరు పోసి దీపం పెడుతూ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందట.
రామ తులసి ఆకులు లేత ఆకుపచ్చరంగులో ఉంటాయి. అంతేకాదు.. వీటి రుచి కూడా కాస్త తీపి రుచిని కలిగి ఉంటుంది. రామ తులసిని రాముడు, మహా విష్ణువు, విష్ణు అవతారాల పూజలలో ఉపయోగిస్తారు.
కృష్ణ తులసి ఆకులు ముదురు రంగులో లేదా నలుపు రంగులో ఉంటాయి. కృష్ణ తులసి శ్రీకృష్ణుడికి చాలా ప్రీతికరమైనదని చెబుతారు. అందుకే దీనికి కృష్ణ తులసి అనే పేరు వచ్చిందని చెబుతారు.
ఇంట్లో సానుకూల శక్తి పెరిగి, ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండాలంటే రామతులసి, కృష్ణ తులసి రెండింటిని నాటడం మంచిదని చెబుతారు.
వాస్తు ప్రకారం చూస్తే.. తులసిని ఈశాన్య మూలలో నాటడం చాలా మంచిది. ఇది కుటుంబ సభ్యుల జీవితాలలో పురోగతిన చేకూర్చుతుందని చెబుతారు.
*రూపశ్రీ.