హనుమంతుడి ప్రసిద్ద ఆలయాలు.. ఏ సమస్యకు ఏ ఆలయాన్ని సందర్శించాలంటే..!

 

హనుమంతుడి ప్రసిద్ద ఆలయాలు.. ఏ సమస్యకు ఏ ఆలయాన్ని సందర్శించాలంటే..!

పురాణాలలో హనుమంతుడికి చాలా ప్రాధాన్యత ఉంది.  ఆయన అష్టసిద్దులు పొందినవాడు, వాక్యకోవిదుడు,  కార్యసాధకుడు,  గొప్ప రక్షకుడు.. అన్నింటికి మించి రామ భక్తుడు కూడా.  ఆయనను పూజించే ఎంతో గొప్ప ఆత్మవిశ్వాసం లభిస్తుందని చెబుతారు.  హనుమంతుడు చాలా శక్తివంతమైనవాడు.  జీవితాలలో ఏర్పడిన కష్టాలను తొలగిస్తాడు.  ఆయనను సంకటమోచనుడు అని కూడా అంటారు. హనుమంతుడి ఆలయాలు ఎన్నో ఉన్నాయి.  వాటిలో కొన్ని ఆలయాలు కొన్ని సమస్యలను పరిష్కరించడంలో ప్రసిద్ధి చెందాయి.  ఏ ఆలయాన్ని సందర్శిస్తే ఏ సమస్యలు పరిష్కారం అవుతాయో తెలుసుకుంటే..

వారణాసి, సంకటమోచన దేవాలయం..

వారణాసిలో సంకటమోచన ఆలయం  ఉంది. ఇక్కడి హనుమంతుడిని దర్శించుకుని కష్టాలను చెప్పుకుంటే ఆ కష్టాలను హనుమంతుడు తొలగిస్తాడని చెబుతారు. ఇక్కడి హనుమంతుడి అనుగ్రహం వల్ల  కష్టాలు తొలగి జీవితంలో వెలుగులాంటి దారి కనిపిస్తుంది,  జీవితంలో పాజిటివ్ వస్తుంది,  మానసిక స్థితి మెరుగ్గా మారుతుందని చెబుతారు.

జఖు ఆలయం.. సిమ్లా..

సిమ్లాలోని ఎత్తైన కొండపైన జఖు ఆలయం ఉంది. ఇక్కడ  108 అడుగుల ఎత్తైన హనుమంతుడు ఎరుపు రంగులో ఉంటాడు. పరీక్షల ముందు, లేదంటే కొత్త ఉద్యోగం రావాలని అనుకునేవారు, కొత్త ఉద్యోగం వచ్చినవారు ఇక్కడి హనుమంతుడిని సందర్శించుకుంటే సక్సెస్ అవుతారని నమ్ముతారు.

మహావీర్ మందిరం.. పాట్నా..

కుటుంబ సమస్యలు,  పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన ఉన్నవారు పాట్నాలోని మహావీర్ ఆలయాన్ని సందర్శించవచ్చు. ఇలాంటి సమస్యలకు ఇక్కడి హనుమంతుడి దర్శనం ఎంతో గొప్ప ఊరట ఇస్తుంది ఇక్కడి భక్తులు హనుమంతుడికి స్వీట్లు నైవేద్యంగా పెడతారు. అలాగే నూనె దీపాలు ఎక్కువగా వెలిగిస్తుంటారు.

మెహందీపూర్ బాలాజీ.. రాజస్థాన్..

రాజస్థాన్ లోని మెహందీపూర్ లోని బాలాజీ ఆలయం చాలా ప్రత్యేకం. ఇక్కడి ఆలయంలో చాలా ఆచారాలు ఉన్నాయి.  పాత భయాలు,  మానసిక సమస్యలు, జరిగిపోయిన భయానక సంఘటనల తాలూకు భయాలు వంటి సమస్యల నుండి ఉపశమనం పొందడానికి ఇక్కడి హనుమంతుడిని పూజిస్తారు.  ఇక్కడి హనుమంతుడు బాల్య రూపంలో పూజలు అందుకుంటాడు.

నమక్కల్ హనుమాన్ దేవాలయం.. తమిళనాడు..

చెడు అలవాట్లు, వ్యసనాలతో ఇబ్బంది పడేవారు తమిళనాడులోని నమక్కల్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించవచ్చు.  ఇక్కడి హనుమంతుడి శక్తి ఎవరినైనా వ్యసనాల నుండి దూరం చేస్తందట. ఇక్కడ స్వామి రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ ధ్యాన భంగిమలో ఉంటారు.

కర్మఘాట్ హనుమాన్ ఆలయం,  హెదరాబాద్..

హైదరాబాద్ లోని కర్మఘాట్ హనుమాన్ ఆలయం ఉద్యోగ సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో చాలా ప్రసిద్ధి చెందిందట. ఇక్కడి హనుమంతుడికి పువ్వులను సమర్పించి, నూనె దీపాలను వెలిగిస్తుంటారు.  కేరీర్ లో విజయం కోసం హనుమంతుడిని వేడుకుంటారు.

సాలాసర్ బాలాజీ ఆలయం.. రాజస్థాన్..

రాజస్థాన్ లోని మరొక ఆలయం సాలాసర్ బాలాజీ ఆలయం. భారతదేశంలోని ప్రముఖ హనుమాన్ ఆలయాలలో ఇది ఒకటి. తమ కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఈ ఆలయానికి చాలామంది వస్తుంటారు. కోరికలు  తీరగానే కొబ్బరికాయ సమర్పించి నైవేద్యాన్ని సమర్పిస్తారు.  ఇది మాత్రమే కాకుండా ఎర్రటి దారాన్ని ఇక్కడ కడతారు.

హనుమాన్ గిరి.. అయోధ్య..

అయోధ్యలో హనుమాన్ గిరి ఆలయం కుటుంబ సమస్యలు పరిష్కారానికి చాలా ప్రసిద్ధి చెందింది. స్వామికి ఎర్రటి సింధూరాన్ని సమర్పించి, నూనె దీపాలు వెలిగిస్తారు. కోరికలు నెరవేరడం కోసం ఎర్రటి దారాన్ని కూడా కట్టుకుంటారు.

                                  *రూపశ్రీ.