వినాయకుడికి వీటిని సమర్పిస్తే చాలు దరిద్రం పోయి అదృష్టం కలిసొస్తుంది..
వినాయకుడికి వీటిని సమర్పిస్తే చాలు దరిద్రం పోయి అదృష్టం కలిసొస్తుంది..
వినాయకుడు తన భక్తుల కష్టాలన్నింటినీ తొలగిస్తాడు. అందుకే వినాయకుడిని విఘ్నేశ్వరుడు అని కూడా అంటారు. తలపెట్టిన పనులలో విఘ్నాలు తొలగిస్తాడు కాబట్టి వినాయకుడు, విఘ్నేశ్వరుడు అయ్యాడు. భాద్రపద మాసంలో శుక్ల పక్షం చతుర్థి రోజున వినాయక చవితి జరుపుకుంటారు. ఊరు వాడా మాత్రమే కాదు, దేశమంతా ఏకమై వినాయకుడి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుతారు. వినాయకుడిని షోడశోపచారాలతోనూ, పత్రితోనూ, పిండివంటలతోనూ, ఆరాధనా గీతాలతోనూ తృప్తి పరిచి ఆయన కృపను పొందుతూ ఉంటారు. అయితే జీవితంలో అర్థిక సమస్యలున్నా, అనుకున్న కోరికలు నెరవేరాలన్నా మూడు పనులు తప్పక చేయాలి. ఇవి చేస్తే మాత్రం డబ్బు విషయంలో ఇబ్బందులు ఉండవు, అనుకున్న కార్యాలు నెరవేరతాయి. అవేంటో తెలుసుకంటే..
దుర్వా తో పరిహారం..
దుర్వా అంటే గరిక. వినాయకుడికి గరిక చాలా ఇష్టమైనది. ఏమి సమర్పించినా సమర్పించకపోయినా వినాయకుడికి కాసింత గరిక తలమీద పెడితే చాలా సంతోషిస్తాడు. ఈ గరిక సహాయంతో పరిహారం చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా చేయవచ్చు. దీనికోసం 11 గరిక ఆకులు తీసుకుని వాటికి పసుపు రాయాలి. దీన్ని పసుపు రంగు వస్త్రంలో వేసి వినాయక చవితి రోజు నుండి అనంత చతుర్థశివరకు పూజించాలి. ఆ తరువాత ఈ వస్త్రాన్నిభద్రంగా తీసుకెళ్లి ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచాలి. దీనివల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదట.
డబ్బు కలసిరావాలంటే..
వినాయక చవితి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత, వినాయకుడికి దేశీ నెయ్యి కలిపిన బెల్లం సమర్పించాలి. దీని తర్వాత ఈ నెయ్యి బెల్లాన్ని ఆవుకు తినిపించాలి. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తికి సంపద పెరగడం మొదలవుతుంది. వినాయక చవితి రోజున బెల్లం నుండి 21 చిన్న ముద్దలను తయారు చేసి, వినాయకుడి ఆలయంలో గరికతో పాటు ఈ బెల్లం ముద్దలను సమర్పించడం ద్వారా కోరుకున్న కోరిక నెరవేరుతుంది.
ఇంటిల్లిపాదికి మంచి జరగాలంటే..
ఇంటిల్లిపాదికీ మంచి జరగాలంటే వినాయకచవితి రోజున వినాయకుడి యంత్రాన్ని ఇంట్లో పూజగదిలో ఏర్పాటుచేసుకోవాలి. వినాయక చవితి మొదలు ప్రతిరోజూ ఈ యంత్రాన్ని పూజించాలి. దీనివల్ల ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా వినాయకుడి నిత్యం అభిషేకాలు చేస్తుండాలి. ఇలా చేస్తే విషేశ ఫలితాలు పొందుతారు. అలాగే గణపతి అథర్వశీర్ష పారాయణ చేయడం ఎంతో మంచిది.
*నిశ్శబ్ద.