మట్టి వినాయకుడినే ఎందుకు పెట్టాలి..

 

మట్టి వినాయకుడినే ఎందుకు పెట్టాలి..?

 

వినాయకచవితికి ఉపయోగించే మట్టి వినాయకుడి ప్రతిమగానీ, పత్రిగానీ ప్రకృతికి ప్రతిరూపాలే. అదేవిధంగా మట్టి వినాయకుడిని మాత్రమే పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు మనవంతు బాధ్యతను నిర్వర్తించినట్టు అవుతుంది. వినాయకుడి బొమ్మని మట్టితోనే చేయాలని శాస్త్రం చెబుతోంది. అయితే ఈమధ్యకాలంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తోనే వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే దాదాపు అది విష పదార్ధంతోనే సమానం. మనకు అన్నీ ఇస్తున్న మట్టిని పూజించడం మానేసి విష పదార్ధాన్ని పూజించడం ఎంతవరకు సమంజసం? అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కారణంగా వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. ఇంకా మట్టి వినాయకుడి గురించి తెలియాలంటే డా. అనంతలక్ష్మిగారు చెప్పే మాటల్లో మీరే వినండి.... https://www.youtube.com/watch?v=nFeV1vYJ-S0