Kalagnanam- 22

 

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం - 22

Potuluri Veerabrahmendra Swamy Kalagnanam- 22

 

నేను చనిపోయేలోగానే హరిహరరాయలు మొదలు రామరాయలవరకు చరిత్ర అంతమవుతుంది. తరువాత కాలంలో ఈ ఖండం మహ్మదీయుల పరమవుతుంది. శ్వేతముఖులు (తెల్లవాళ్ళు) భారత రాజ్యాన్ని ఏలతారు.

 

పల్నాటి సీమలో నరులు వచ్చి ఆకులు తిని జీవిస్తారు. మొగలాయి రాజ్యాన ఒక నది పొంగి చేలు నాశనమయిన రీతిగా, జనాన్ని నశింపచేస్తుంది.

 

వ్యభిచార వృత్తి అంతరించిపోతుంది. ఆ వృత్తిలోని వారు, వివాహాలు చేసుకుని కాపురాలు చేస్తారు. గురువులు ఆడంబరంగా బతుకుతారు.

 

కుటుంబంలో సఖ్యత వుండదు. తల్లీ, తండ్రీ, పిల్లల మధ్య వాత్సల్యాలు వుండవు. ఒకరిమీద మరొకరికి నమ్మకం నశిస్తుంది. నా రాకకు ముందుగా, నా భక్తులు వారి శక్త్యానుసారము నా ధర్మ పరిపాలనకు అంకురార్పణలు చేస్తారు’’ అని సిద్ధయ్యకు వివిరించారు బ్రహ్మేద్రస్వామి.

 

కర్నూలు నవాబుకు స్వామివారు కాలజ్ఞానము బోధించుట క్రోధ నామ సంవత్సరంలో మార్గశిర శుద్ధ పంచమి, సోమవారంలో పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో వీర భోగ వసంతరాయుడిగా నేను వచ్చే సమయంలో దక్షిణాన వినాశకరమైన ఒక గొప్ప నక్షత్రం ఉద్భవించి, అందరికీ కనిపిస్తుంది.

 

చండి పర్వతం, ఆలంపూర్ మొదలైన స్థాలములలో ఉత్పాతాలు పుడతాయి. ఈ ప్రాంతంలో పాలెగాళ్ళు, తమలో తాము ఘర్ఘణ పడి, చెడి అడవుల పాలై భ్రష్టులై పోతారు. నలు దిక్కుల యందు దివ్యమైన నక్షత్రాలు పుట్టి కంటికి కనిపించి రాలిపోతాయి.

 

అమావాస్య రోజున పూర్ణచంద్రుని చూసి జనులు నశిస్తారు. కార్తీకం నిజమని నా మహిమను తలచుకుంటారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాటికి విష్ణుభక్తి పుడుతుంది. అప్పటికి సామవేద ఘోష వినిపిస్తుంది. తూర్పున శిరస్సు, పడమర తోకగా, తోక వెడల్పుగా ఇరువది బారల పొడవుగల నల్లని ధూమకేతువనే నక్షత్రం పుడుతుంది. పుట్టిన ముప్పై రోజులకు అందరికీ కన్పిస్తుంది. ఆకాశం ఎర్రబడి, ఆవులు పైకి చూసి అరుస్తాయి. ఆకాశంలో శబ్దాలు పుడతాయి.

 

ఈశ్వరమ్మను. రంగరాజునకిచ్చి వివాహం చేసేనాటికి కందిమల్లయ్య పల్లె నవరత్న మండపాలతో పన్నెండు ఆమడల పట్నమవుతుంది. నా భక్తులు యావన్మంది యిక్కడకు వచ్చి కళ్యాణం చూస్తారు. అదే మీకు నిదర్శనం’’

 

ఈ కాల జ్ఞానం విన్న తరువాత నవాబు, స్వామివారికి అనేక బహుమతులను అందజేశాడు. ఆ బహుమతులను బ్రహ్మగారి మఠంలోనే వుంచారు.

 

కొన్ని రోజుల తరువాత కొంతమంది దొంగలు ఈ వస్తువులను ఏ విధంగా అయినా దోచుకోవాలని అక్కడికి వచ్చారు. ఆ రాత్రి మఠంలో ప్రవేశించి ఆ వస్తువులను పట్టుకున్నారు. అంతే! వారికి కండరములు స్వాధీనంలో లేకుండా అయిపోయాయి. ఎంత ప్రయత్నించినా మాట కూడా మాట్లాడలేకపోయారు. భయంతో అలాగే నిలబడి చూడటం తప్ప వేరే ఏమీ చేయలేకపోయారు.

 

వారిని పట్టుకున్నారు ఆశ్రమవాసులు. ఇది తెలిసి అక్కడికి వచ్చారు వీరబ్రహ్మేంద్ర స్వామి. వారిని చూసినా, ఆయన కోపం తెచ్చుకోలేదు. పైగా వారికి తగిన బోధ చేయాలని నిర్ణయించుకుని, వారికీ సైతం కాలజ్ఞానాన్ని ఉపదేశించారు.

 

దొంగలకు చెప్పిన కాలజ్ఞానం

“దేశానికి ఆపదలు తప్పవు. ప్రళయానికి సూచనగా ఆకాశం ఎర్రగా మారుతుంది. ఆరు మతాలూ ఒక్కటవుతాయి. నిప్పుల వాన కురుస్తుంది. నెల్లూరు జలమయం అవుతుంది. నెత్తురు ఏరులై పారుతుంది. ఏడు గ్రామాలకు ఒక గ్రామం, ఏడిళ్ళకు ఒక ఇల్లు మిగులుతాయి. ప్రజలు కత్తులతో పోట్లాడుకుంటారు. పార్వతి, బసవేశ్వరుల కంట నీరు కారుతుంది. కప్పలు కోడికూతలు కూస్తాయి. భూమి కంపిస్తుంది. అప్పుడు నేను సమాధిలో నుంచి వీర భోగ వసంతరాయులుగా మరల జన్మిస్తాను’’ అని వివరించారు.

 

సమాధి పొందే సమయం ....

కొన్ని సంవత్సరములు పూర్తయిన తర్వాత వీరబ్రహ్మేంద్రస్వామి ఇక తాను సమాధి పొందే సమయం దగ్గర పడిందని తెలుసుకున్నారు. తన వారసుడిగా పెద్ద కుమారుడు గోవిందాచార్య స్వామికి పట్టాభిషేకము చేయదలిచి, ఈ విషయమై తన భక్తులందరికీ కాల జ్ఞాన సౌజన్య పత్రికను పంపారు.

 

కాలజ్ఞాన సౌజన్య పత్రికలో ఈ విధంగా వుంది...

“మేం ఈ వైశాఖ శుద్ధ దశమి ఆదివారం 2.30 గంటలకు ఈ భౌతిక దేహాన్ని వదిలి జీవ సమాధి సిద్ధిని పొందదలచుకున్నాము. కనుక ఈ పీఠాధిపత్యం నా పెద్ద కుమారుడైన గోవిందాచార్య వారికి అప్పగించుకోదలిచాను. అది తిలకించి నా దగ్గర మూడు రోజులుండి, నేను సమాధిగతుడనగుట చూడవలెనని ఆహ్వానము. నేను వివరించబోవు కాలజ్ఞాన విశేషాలను విని తరించవచ్చును. అలా స్వయముగా వచ్చి కాలజ్ఞానాద్వైత తత్త్వబోధ వినలేని వారి కోసం ఈ పత్రికతో కొన్ని కాలజ్ఞాన విశేషాలను వివరించి యున్నాము. ఈ పత్రికనే వారు దీపారాధన, నైవేద్యములతో పూజించిన వారికి సకల శుభములు కలుగును.

 

నేను ఈ వీరబ్రహ్మేంద్రస్వామి అను పేరు ధరించి ఇప్పటికి 175 సంవత్సరములు గడిచాయి. ఇప్పుడు నేను సమాధి, నిష్టలో వుండాలని నిర్ణయించుకున్నాను. తిరిగి భూమి మీదకు వీరభోగవసంతరాయులుగా రాబోతున్నాను.

 

నేను వచ్చే సమయానికి ఈ కలి లోకంలో, ఎర్ర బొయీలు – శ్వేత ద్వీప వాసులు వస్తారు. శాలివాహన శకమునందే, వీరు మహ్మదీయులతో స్నేహం పొంది, భరతఖండం పాలిస్తారు.

 

హరిహరాదుల గుళ్ళల్లో పూజలు హరించి పోతాయి. ధనమధాందతచే సాధువులను, జ్ఞానులను, దూషణ చేస్తారు. భూమిపై వర్షములు కురిసినట్లుగానే వుంటాయి. కానీ పంటలు పండవు. పైరులు పండినట్లుగానే వుంటాయి. కానీ నిలవవు. బహు ధాన్య నామ సంవత్సరంలో, కనకదుర్గ మొదలయిన శక్తులు భూమి మీదకు వస్తాయి.

 

Veerabrahmendra swamy life story, Potuluri predictions, Potuluri Veerabrahmendra Swamy Biography, Brahmamgari Kalagnanam, predictions about world