వరూధిని ఏకాదశి ఎప్పుడు? ఈరోజు విష్ణుమూర్తిని ఆరాధిస్తే ఎంత పుణ్యమో!
వరూధిని ఏకాదశి ఎప్పుడు? ఈరోజు విష్ణుమూర్తిని ఆరాధిస్తే ఎంత పుణ్యమో!
హిందూ పంచాంగంలో ప్రతి తిథికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ తిథులు కూడా ఒక్కొక్కటి ఒక్కో దేవుడికి విశిష్టంగా పేర్కొనబడి ఉంటాయి. ముఖ్యంగా ఏకాదశి తిథికి, విష్ణుమూర్తికి చాలా ప్రత్యేక సంబంధం ఉంటుంది. మహావిష్ణువుకు ఏకాదశి తిథి చాలా ప్రీతికరమైనది. వైశాఖ మాసంలో ఏకాదశి తిథిని వరూధిని ఏకాదశి అంటారు. వరూధిని ఏకాదశిని మే 4 వ తేదీన జరుపుకుంటారు. ఈరోజు మహావిష్ణువుతో పాటూ లక్ష్మీ దేవిని పూజిస్తారు. ఉపవాసం ఉంటారు. ఆడపిల్లను కని, పెంచి, పెద్దచేసి కన్యాదానం చేసి, ఆ తరువాత తపస్సు చేస్తే ఎంత పుణ్యఫలం లభిస్తుంద.. వరూధిని ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే అంతే పుణ్యం లభిస్తుందని విశ్వాసం.
వరూధిని ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే కలిగే ఇతర ఫలితాలు..
పద్మ పురాణం ప్రకారం వరూధిని ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం పల్ల అన్ని పాపాల నుండి విముక్తి పొంది విష్ణులోకం చేరతాడని పురాణ నమ్మకం. పుత్రికను దానం చేసి కొన్నాళ్లు తపస్సు చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో, వరూధిని ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే అంతే పుణ్యం లభిస్తుందని మరొక విశ్వాసం. వరూధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల సాధకుడికి విద్యాదానం ఫలం కూడా లభిస్తుంది. ఈ ఏకాదశి అదృష్టాన్ని ఇస్తుందని, అన్ని పాపాలను నశింపజేసి, చివరికి మోక్షాన్ని ఇస్తుందని, పేదరికాన్ని నశింపజేస్తుంది, బాధల నుండి విముక్తిని ఇస్తుందని.. ఇలా చాలా ఫలితాలు ఈ ఉపవాసం వల్ల లభిస్తాయి.
పూజ ఎలా చేయాలంటే..
ఈ రోజున శంఖం, చక్రం, తామరపువ్వు, గద, పసుపు బట్టలు ధరించిన విష్ణువుకి పండ్లు, పూలు, పసుపు చందనం, అక్షతలు, పసుపు పుష్పాలు, కాలానుగుణ పండ్లు, తీపి పదార్థాలు మొదలైనవి సమర్పించాలి. 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే విష్ణు నామాన్ని ఈరోజు జపించడం వల్ల భక్తులు అపవాదు, వంచన, దురాశ, ద్వేష భావాలను జయిస్తారు. అయితే విష్ణువును మనస్సులో ఉంచుకొని భక్తితో జపం చేయాలి.
ఉదయాన్నే లేచి స్నానం చేసి, ఇంటిని శుద్ది చేసుకునే సామర్థ్యం మేరకు పూలు, పండ్లు, తీపి పదార్థాలు సమర్పించాలి. స్వామి పూజకు సువాసన గల పుష్పాలు వినియోగిస్తే మంచిది. రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజున పారయణం చేయడం వల్ల తగిన ఫలితం లభిస్తుంది. ద్వాదశి రోజున బ్రాహ్మణులకు అన్నదానం చేస్తే మంచిది.
*నిశ్శబ్ద.