వరలక్ష్మీ వ్రతం
వరలక్ష్మీ వ్రతం
సకలసంపదలను కురిపించే లక్ష్మీదేవిని ఆదిలక్ష్మి, సంతాన లక్ష్మి, వీరలక్ష్మి, గజలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, విజయలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్ములుగా, అష్టమూర్తులుగా భావించి అందరూ పూజిస్తారు. సంపదకు, సామ్రాజ్యాలకు, విద్యలకు, కీర్తిప్రతిష్ఠలకు, సర్వశాంతులకు, తుష్టికి, పుష్టికి, యశస్సులకు మూలకారణంగా సర్వులచేత ఆ తల్లియే పూజించబడుతోంది. ఈ తల్లినే ప్రతిఏటా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్ల్మీగా భావించి పూజిస్తున్నాం. శ్రవణ నక్షత్రం పౌర్ణమినాడు ఉన్న మాసమే శ్రావణమాసము. ఈమాసంలో ఆ తల్లిని పూజిస్తే సర్వసౌభాగ్యాలు కలుగుతాయని స్వయంగా శివుడు పార్వతిదేవికి చెప్పాడట. ‘‘ధవళతరాంశుక గంధమూల్య శోభే’’అంటూ వరలక్ష్మీదేవికి ఇష్టమైన శ్వేత వస్త్రాలని కట్టి, శ్వేతవర్ణ పుష్పాలతో, శ్వేత శ్రీగంధంతో, పాలు, పాయసంతో, అధికంగా తెలుపు రంగుకు ప్రాధాన్యతనిస్తూ ఈ వ్రతాన్ని స్ర్తిలంతా అత్యంత ఉత్సాహంతో జరుపుతారు. మంగళప్రదయైన ఆ తల్లి తనను కొలిచిన వారికి కొంగుబంగారం అవుతుంది. ఇహలోక సంపదలతో పాటుగాపరలోక ఐశ్వర్యాలను కూడా కలిగించే ఈ తల్లిని ఈ మాసంలో కొలవడానికో ప్రత్యేకత ఉంది.
పూర్వం మగధ దేశంలో ‘కుండిన’ అనే పట్టణంలో సకల శాస్త్రాలు పఠించిన ప్రతిభావంతురాలైన చారుమతీదేవి అనే పుణ్యస్ర్తికి శ్రావణమాసంలో వరలక్ష్మీదేవి స్వప్నంలో కనబడి ‘‘వరలక్ష్మీ వ్రతం’’ ఆచరించమని ఆదేశించింది. ఆ చారుమతి వరలక్ష్మీదేవి ఆదేశానుసారంగా శ్రావణ పౌర్ణమినాటికి ముందు వచ్చే శుక్రవారంనాడు తోటి బంధువులతో విధి విధానంగా భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీవ్రతం ఆచరించింది. ధ్యానావాహనాది షోడశోపచార పూజలు చేసి నానావిధ ఫల, భక్ష్య భోజ్యాలను నివేదన చేసింది. ఆ తర్వాత చారుమతి శాస్త్రోక్తంగా వ్రతాన్ని నిర్వహించిన పురోహితునికి దక్షిణ తాంబూలాదులను సమర్పించి సంతృప్తిపరిచింది. ఇలా పుణ్యస్ర్తి అయిన చారుమతి ద్వారా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి లోకానికి అందించిన శ్రీ వరలక్ష్మీవ్రతాన్ని పార్వతీదేవికి ఆ పరమేశ్వరుడు తెలియజేశాడు. ఆనాటి నుంచి సర్వులూ ఈ వ్రతాన్ని క్రమం తప్పకుండా ఆచరించి శుభఫలితాలను పొందుతున్నారు. ఈ వ్రతం ఆచరించడానికి చిన్నపెద్ద, కులగ్రోతాలు లాంటి ఏవీ అడ్డుకావు.
వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం లో పౌర్ణిమ కు ముందు వోచే శుక్రవారం రోజు చేస్తారు. ఒక వేళ ఆ రోజు కుదరకుంటే, శ్రవణ మాసం లో ఏ శుక్రవారం ఐనా చేసుకోవొచ్చు. వరలక్ష్మి శుక్రవారం రోజు వరలక్ష్మి అని అమ్మవారిని కొలిచి, పూజ చేసుకుంటారు.
ఆచమనం
ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా
(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)
ఓం గోవిందాయ నమః (నీళ్ళు వదిలి వెయవలెను)
విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః
ఋషీకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః
ప్రద్యుమ్నాయ నమః అనిరుద్దాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః
అచ్యుతాయ నమః జనార్ధనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీ కృష్ణాయ నమః
ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమిభారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే ||
(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్
(కుడిచేతితో ముక్కుపట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
ఓం లక్ష్మినారాయణభ్యయం నమః శ్రీ ఉమామహేశ్వరాభ్యం నమః
శ్రీ వాణిహిరణ్యగర్భాభ్యం నమః శ్రీ శచిపురంధరాభ్యం నమః
శ్రీ అరుంధతివసిష్టాభ్యం నమః శ్రీ సీతారామాభ్యం నమః
సర్వేభ్యో దేవేభ్యో నమః మాతృభ్యో నమః, పితృభ్యో నమః
ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ మహా లక్ష్మి ప్రీత్యర్ధం అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షినములలొ ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) దక్షిణాయనే,వర్ష ఋతవ్, శ్రావణ మాసే, శుక్ల పక్షే , శుభ తిథౌ, శుక్రవాసరే, శుభనక్షత్రే (ఈరోజు నక్షత్రము) శుభయోగే, శుభకరణే. ఏవంగుణ విశేషణ విషిష్ఠాయాం, శ్రీమాన్ (మీ గొత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య దైర్య విజయ అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం థం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, సత్సంతన సౌభాగ్య శుభఫలాప్యార్ధం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మి దేవతా ముధీశ్యా వరలక్ష్మి ప్రీత్యర్ధం భవిష్యోత్తర పురాణ కల్పోక్త ప్రకారేణ యావద్బక్తి ద్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే
(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)
తదంగత్వేన కలశారాధనం కరిష్యే
శ్లో : కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుందరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడిఅరచేయినుంచి ఈ క్రిందిమంత్రము చదువవలెను.)
శ్లో : గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య
(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుచు ఈ క్రింది మంత్రము చదువవలెను.)
మం : ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్
శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి మీద అక్షతలు, గంధం పువ్వులు వేయవలెను .
ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాదిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః,ఫాలచంద్రాయ నమః,గజాననాయ నమః,వక్రతుండాయనమః,శూర్పకర్ణాయ నమః,హేరంబాయ నమః,స్కందపూర్వజాయ నమః,ఒం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాంసమ్ర్పయామి. మహాగణాదిపత్యేనమః ధూపమాఘ్రాపయామి.
ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.
శ్రీ మహాగణాధిపతి బెల్లము OR పండ్లు గానీ ప్రసాదముగ నివేదించాలి. కర్పూర నీరాజనం దర్శయామి. (కర్పూరమును వెలిగించి చూపవలెను).
వరలక్ష్మి పూజ విధానము :
అనంతరం శ్రీ వరలక్ష్మి పూజ ప్రారంభం – వరలక్ష్మి ధ్యానమ్
పద్మసనే పద్మకరే సర్వలోకైక పూజితే,
నారాయణప్రియే దేవి సుప్రితాభవ సర్వదా,
క్షిరోదర్నవ సంభుతే కమలే కమలాలయే
సుస్థిరా భవమే దేహి సురాసుర నమస్త్రుతే ||
శ్రీ వరలక్ష్మి దేవతాయే నమః || ద్యయామి
(అక్షింతలు వేయండి)
శ్లో: సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్తలాలయే ,
ఆవాహయామి దేవీత్వాం సుప్రీతాభవ సర్వదా.
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః ఆవాహయామి.
(నీళ్ళు చల్లండి )
శ్లో: ఏహి దేవి గృహాణేదం రత్నసింహాసనం శుభం,
చంద్రకాంత మణిస్థంభ సౌవర్ణం సర్వసుందరం.
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః రత్న సింహాసనం సమర్పయామి.
(అక్షింతలు చల్లండి )
శ్లో: ఈశాది దేవ సంసేవ్యే భవే పాద్యం శుభప్రదే,
గంగాది సరితానీతం సంగృహాణ సురేశ్వరీ.
ఓం శ్శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః పాదయో పాద్యం సమర్పయామి.
(నీళ్ళు చల్లండి )
శ్లో: వాణీంద్రాణీ ముఖాసేవ్యే దేవదేవేశ వందితే,
గృహాణఅర్ఘ్యం మయాదత్తం విష్ణు పత్నీ నమోస్తుతే.
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి.
(నీళ్ళు చల్లండి )
శ్లో: శ్రీ మూర్తిశ్రితమందారే సర్వభాక్తాభి వందితే,
గృహాణ ఆచమనీయం దేవీ మయా దత్తం మహేశ్వరి.
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
(నీళ్ళు చల్లండి )
శ్లో: వయోదధి ఘ్రుతోపేతం శర్కరా మధుసంయుతం
పంచామృత స్థానమిదం గృహాణ కమలాలాయే
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః పంచామృత స్థానం సమర్పయామి.
(పంచామృతం చల్లండి )
గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితం
శుదోద్దక స్నాన మిదం గృహాణ విధు సోదరి
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః శుదోద్దక స్నానం సమర్పయామి.
(నీళ్ళు చల్లండి )
సురార్చితాగ్నియుగలే పవన ప్రియే
వస్త్రయుగ్యం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః వస్త్రయుగ్యం సమర్పయామి.
( కొత్త బట్టలు లేదా పత్తి సమర్పించండి)
కేయూర కంకణే దివ్యహర నూపుర మేఖలా
విభూషణముల్యని గృహాణ ఋషి పూజితే
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః ఆభరణాని సమర్పయామి.
(కొత్త ఆభరణాలు ఉంటె లేదా అమ్మవారికి వేయండి)
తప్తహేమకృత దేవి మాంగల్యం మంగళప్రదం
మయా సమర్పితం దేవి గృహాణ త్వం శుభప్రదే
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః మాంగల్యం సమర్పయామి.
(అమ్మవారికి మాంగల్యం సమర్పించండి)
శ్లో: కర్పూరాగరు సంయుక్తం, కస్తూరి రోచనాన్వితం.
గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్ధం ప్రతి గృహ్యాతాం.
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః శ్రీ గంధం సమర్పయామి.
(అమ్మవారికి శ్రీ గంధం, కుంకుమ సమర్పించండి)
శ్లో: అక్షతాన్ దవలాన్ దివ్యాన్ శాలియాన్ తండులాన్ శుభాన్
హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యాతా మబ్ది పుత్రికే.
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి.
(అమ్మవారికి అక్షింతలు, పసుపు,కుంకుమ చల్లండి)
మల్లికా జాజి కుసుమచ్యకైరపిర్వకులైస్తధ
శతపత్రాయిచ్చ కలార్వై: పూజయామి పూజితే
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః పుష్పాణి సమర్పయామి.
(అమ్మవారికి పుష్పములు చల్లండి)
అధాంగ పూజ:
ఓం చంచలాయై నమః - పాదౌ పూజయామి
ఓం చపలాయై నమః - జానునీ పూజయామి
ఓం పీతాంబరధరాయై నమః - ఊరూం పూజయామి
ఓం కమలవాసిన్యై నమః - కటిం పూజయామి
ఓం పద్మాలయాయై నమః - నాభిం పూజయామి
ఓం మదనమాత్రే నమః - స్తనౌ పూజయామి
ఓం లలితాయై నమః - భుజాన్ పూజయామి
ఓం కంభుకంట్ట్యై నమః – కన్ట్టం పూజయామి
ఓం సుముఖాయై నమః - ముఖం పూజయామి
ఓం శ్రియై నమః - ఓష్టౌ పూజయామి
ఓం సునాసికాయై నమః - నాసికాం పూజయామి
ఓం సునేత్ర్యై నమః - నేత్రే పూజయామి
ఓం రమాయై నమః – కర్ణౌ పూజయామి
ఓం కమలాలయాయై నమః - శిరః పూజయామి
ఓం శ్రీ వరలక్ష్మ్యే దేవ్యై నమః - సర్వాణ్యంగాని పూజయామి.
తరువాత శ్రీ వరలక్ష్మి అష్టోత్తర నామములు ( శ్రీ లక్ష్మి అస్తోతరములు) చదవండి ..
లక్ష్మీ అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి .
శ్లో: దశాంగం గగ్గులో పేతం సుగంధం సుమనోహరం
ధూపం దాస్యామి తే దేవి వరలక్ష్మి గృహాణ త్వం
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః ధూపం సమర్పయామి.
(అగరు వత్తులను వెలిగించి దూపమును దేవికి చూపించవలెను. సాంబ్రాణి పొగను కూడా వేయవచ్చును )
శ్లో: ఘ్రుతావర్తి సంయుక్తం మంధకార వినాశకం
దీపం దాస్యామి తేదేవి గృహాణ ముదితా భవ.
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః దీపం సమర్పయామి.
(దీపమును దేవికి చూపించ వలెను )
నైవేద్యం షడ్రసోపేతం దధి మద్వాజ్య సంయుతం,
నానా భక్ష్య ఫలోపేతం గృహాణ హరి వల్లభే .
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నైవేద్యం సమర్పయామి
దేవికి ప్రత్యేకించి చేసిన పిండి వంటలు దేవికి సమర్పించి నమస్కరించ వలెను.
ఘన సార సుగందేన మిశ్రితం పుష్ప వాసితం
పానీయం గృహ్యాతాం దేవి శీతలం సుమనోహరం .
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః పానీయం సమర్పయామి.
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పానీయం సమర్పయామి అని భోజనం అయిన తరువాత త్రాగుటకు నీరు ఇచ్చినట్లు భావించి కుడి చేత్తో నీటిని చూపుతూ ఎడమ చేత్తో గంట వాయించ వలెను.
పూగీ ఫల సమాయుక్తం నాగ వల్లీ దళైర్యుతం
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతి గృహ్యాతాం .
ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః తాంబూలం సమర్పయామి
( తమలపాకులు ,రెండు పోక చెక్కలు వేసి అమ్మవారికి వద్ద ఉంచాలి).
తరువాత కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి
నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం
తుభ్యం దాస్యా మ్యహం దేవీ గృహ్యాతాం విష్ణు వల్లభే ||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నీరాజనం సమర్పయామి.
(కర్పూర హారతిని వెలిగించి హారతి పాటలు పాడ వచ్చును. )
పద్మాసనే పద్మ కరే సర్వ లోకైక పూజితే ,
నారాయణ ప్రియే దేవి సుప్రీతో భవ సర్వదా ||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః మంత్ర పుష్పం సమర్పయామి.
(పువ్వులు ,అక్షతలు చేతిలోనికి తీసుకుని ,లేచి నిలబడి నమస్కరించి ఈ పువ్వులు ,అక్షతలు దేవిపై వేసి కూర్చోన వలెను.)
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ,
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే.
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ప్రదక్షిణం సమర్పయామి
( అక్షతలు ,పువ్వులు తీసుకుని లేచి నిలబడి మూడు సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షతలు పువ్వులు దేవిపై వేయవలెను )
తోర బంధన మంత్రము :
బద్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రా పౌత్రాభి వృదించ సౌభాగ్యం దేహిమే రమే
ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః పునః పూజాంచ కరిష్యే అని చెప్పుకుని, పంచ పాత్రలోని నీటిని చేతితో తాకి ,అక్షతలు దేవిపై చల్లుతూ ఈ క్రింది మంత్రములు చదువు కొనవలెను .
ఛత్రం ఆచ్చాదయామి ,చామరం వీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి .సమస్త రాజోపచార ,శక్త్యోప చార ,భక్త్యోపచార పూజాం సమర్పయామి. అనుకొని ,నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకమును చదువు కొనవలెను .
ఏతత్ఫలం శ్రీ వరలక్ష్మీ మాతార్పణ మస్తు అంటూ అక్షతలు నీటితో పాటు అరవేణంలో వదలవలెను . పిమ్మట ‘ శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రసాదం శిరసాగృహ్ణామి.’ అనుకుని దేవి వద్ద అక్షతలు తీసుకుని తమ తమ తలలపై వేసుకొనవలెను.
అక్షింతలు చేతిలో వేసుకొని వరలక్ష్మీ వ్రత కధ చదవండి లేక వినండి ;
వరలక్ష్మీ వ్రత కధ
ఆ పిదప పసుపు గణపతి ఉన్న పళ్ళెము నొకసారి పైకి ఎత్తి తిరిగి క్రింద ఉంచి పళ్ళెము లో ఉన్న పసుపు గణపతిని తీసి దేవుని పీటము పై ఉంచ వలెను. దీనిని ఉద్వాసన చెప్పటం అంటారు.
యస్య స్మృత్యాచ నోమోక్త్యాత పః పూజా క్రియాది షు,
న్యూనం సంపూర్ణ తాం యాతి సద్యో వందే తమచ్యుతం ,
మంత్ర హీనం క్రియాహీనం భక్తి హీనం జనార్ధన ,
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే.
అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్సర్వాత్మకః
శ్రీ వరలక్ష్మీ దేవతా స్సుప్రీతో వరదో భవతు ,శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి .
ఇతి పూజా విధానమ్ సంపూర్ణమ్
శ్రీ వరలక్ష్మీ వాయనదానము:
ఇచ్చేవారు : ఇందిరా ప్రతిగృహ్ణాతు
పుచ్చుకునేవారు : ఇందిరావై దదాతిచ
ఇద్దరు : ఇందిరాతారకోభాభ్యా ఇందిరాయై నమోనమః
ఇచ్చేవారు : ఇస్తినమ్మవాయణం
పుచ్చుకునేవారు : పుచ్చుకున్తినమ్మ వాయనం
వాయనమిచ్చినవారు, పుచ్చుకున్నవారికి నమస్కరించాలి.
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః వాయన దానం సమర్పయామి అనుకుని శనగలు (నాన బెట్టినవి ),తాంబూలం (మూడు ఆకులు ,వక్క , అరటి పండు ), రవికల (జాకెట్టు) గుడ్డ, పువ్వులు మరియు తయారు చేసిన పిండి వంటలను ఒక పళ్ళెము లోనికి 9 రకములు రకమునకు 9 వంతున గాని (లేదా ఎవరి శక్తి అనుసారముగా వారు ) తీసుకుని మరొక పళ్ళెముతో మూసి పైన కొంగును కప్పి ముత్తైదువుకు బొట్టు పెట్టి ఆమెను వరలక్ష్మీ దేవిగా భావించి ఈ వాయనమును అందిస్తూ ఇచ్చువారు ఇస్తినమ్మ వాయనం అని, పుచ్చుకున్నవారు పుచ్చు కొంటినమ్మ వాయనం అనాలి . ఈ విధంగా మూడు సార్లును ,నా వాయనం అందుకున్నదెవరు అని ఇచ్చేవారు ,నేనమ్మా వరలక్ష్మీ దేవిని అని పుచ్చుకునేవారు అనాలి . ఈ విధంగా మూడు సార్లును ,అడిగితి వరం అని ఇచ్చువారు ,ఇస్తి వరం అని పుచ్చు కొనువారు మూడు సార్లు అనాలి .ఈ విధంగా వాయనమును దేవికి సమర్పించి నమస్కరించవలెను.
ఆ రోజు సాయంత్రము ముత్తైదువులను పిలిచి పేరంటం చేసుకొన వచ్చును. (పేరంటం అనగా పసుపు ,కుంకుమ , గంధం, ముత్తైదువులకు ఇచ్చి శనగలు (నాన బెట్టినవి ), తాంబూలం (మూడు ఆకులు ,వక్క ,అరటి పండు ), రవికల (జాకెట్టు ) గుడ్డ ,పువ్వులు ఇవ్వ వలెను.